private part
-
మద్యం మత్తులో దారుణం.. స్నేహితుడి శరీరంలోకి గ్లాస్ చొప్పించి..!
భువనేశ్వర్: అప్పటి వరకు అంతా కలిసి సరదాగా గడిపారు. ఫూటగా మద్యం సేవించారు. మద్యం మత్తులో అందులోని ఓ స్నేహితుడి పట్ల అరాచకంగా ప్రవర్తించారు. అతడి శరీరం వెనుకభాగంలో స్టీల్ గ్లాస్‌ను చొప్పించారు. ఎవరికైనా చెబితే ఏమనుకుంటారోనని ఎవరికీ చెప్పలేదు బాధితుడు. చివరకు నొప్పి తీవ్రం కావటంతో ఆసుపత్రికి వెళ్లగా శాస్త్రచికిత్స చేసి గ్లాస్‌ను బయటకు తీశారు వైద్యులు. ఈ అరాచక చర్య గుజరాత్‌లోని సూరత్‌లో జరగగా.. ఒడిశాలోని గంజాం జిల్లా వైద్యులు బాధితుడికి ఉపశమనం కల్పించారు. ఇంతకి ఏం జరిగిందంటే? ఒడిశా, గంజాం జిల్లాలోని బుగుడ బ్లాక్ బలిపదార్ గ్రామానికి చెందిన బాధితుడు కృష్ణ చంద్రా రౌత్(45).. కొద్ది రోజుల క్రితం గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లి అక్కడి టెక్స్టైల్ మిల్లో పని చేస్తున్నాడు. దాదాపు 10 రోజుల క్రితం స్నేహితులతో కలిసి దావత్ చేసుకున్నారు. అంతా కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో బాధితుడు కృష్ణ చంద్ర శరీరం వెనుకభాగంలో స్టీల్ గ్లాస్ చొప్పించారు కీచకులు. ఆ తర్వాత రోజు నుంచి అతడికి నొప్పి మొదలైంది. కానీ, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. నొప్పి తీవ్రం కావడం వల్ల సూరత్ నుంచి అతడి సొంతూరికి వచ్చేశాడు. ఆ తర్వాత మలవిసర్జన కాకపోవటం వల్ల పొట్ట ఉబ్బిపోయింది. నొప్పి భరించలేని స్థితికి చేరటంతో బెర్హమ్పుర్లోని ఎంకేసీజీ వైద్య కళాశాల, ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అక్కడ సైతం గ్లాస్ విషయం వైద్యులకు తెలపలేదు బాధితుడు. పరీక్షలు నిర్వహించి అసలు విషయం వెల్లడించారు డాక్టర్లు. శరీరం వెనుకభాగంలో చిక్కుకుపోయిన స్టీల్ గ్లాస్‌ను ఆపరేషన్ లేకుండానే బయటకు తీసేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో సర్జరీ చేసుకోవాల్సిందిగా బాధితుడికి సూచించారు. దానికి అంగీకరించటంతో సుమారు 2.5 గంటల పాటు శ్రమించి శాస్త్ర చికిత్స పూర్తి చేసి గ్లాసును బయటకు తీశారు. బాధితుడు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపారు. మరో నాలుగైదు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: ప్లాస్టిక్‌లా మారిపోయిన యువతి చర్మం.. అదే కారణమా? -
తాగిన మత్తులో... కోసుకున్నాడు
కర్ణాటక, దొడ్డబళ్లాపురం : తాగిన మైకంలో మర్మాంగాన్ని కోసుకుని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోలదేనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తిరుమళపుర గ్రామం నివాసి నంజప్ప (48 ) శనివారం రాత్రి మద్యం తాగి వచ్చి ఇంట్లోని కూరగాయలు కోసే కత్తితో మర్మాంగాన్ని కోసుకున్నాడు. అనంతరం కేకలు వేయడంతో స్థానికులు అంబులెన్స్‌కి ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావం కావడంతో మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలిసింది. పోలదేనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
మోసం చేశాడని మగతనాన్ని కాల్చేసింది!
- మాజీ ప్రియురాలిని కలిశాడని బాయ్‌ఫ్రెండ్‌పై దాడి - అసాధారణ నేరంగా పరిగణించి యువతికి జైలుశిక్ష విధించిన కోర్టు తప్పు చేస్తే ఒకరినొకరు శిక్షించుకోవడం ఆ ప్రేమికుల ఒప్పందం. అలా చేతిలో చెయ్యేసి చేసిన బాస.. తన పాలిట శాపంగా మారుతుందని ఊహించకపోయాడు ఆ ప్రియుడు! అసాధారణ రీతిలో ప్రియురాలు చేసిన పైశాచిక దాడిలో తన మగతనాన్ని తాత్కాలికంగా కోల్పోయాడు. కేసులోని తీవ్రతను గుర్తించిన కోర్టు నిందితురాలికి జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఆస్ట్రేలియాలోని మౌంట్ బార్కర్ పట్టణంలో బ్రోన్విన్ పార్కర్ (22) అనే యువతి తన బాయ్‌ప్రెండ్‌తో కలిసి సహజీవనం చేస్తోంది. తమ మధ్య ఎలాంటి గొడవలొచ్చినా వారికివారే చిన్నిచిన్న శిక్షలు విధించుకుంటూ.. కలకాలం కలిసుండేలా రాసుకోని ఒప్పందం చేసుకున్నారిద్దరూ. కాగా, సదరు బాయ్‌ఫ్రెండ్ ఇటీవలే తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను అనుకోకుండా కలిశాడు. నాలుగు మాటల తర్వాత పాత రోజులు గుర్తుచేసుకుంటూ ఇద్దరూ మైమరచిపోయి ఒక్కటయ్యారు. ఈ సంగతికాస్తా ప్రస్తుత ప్రేయసికి తెలిసిందే. అంతే.. 'నన్ను మోసం చేశావు. మాట తప్పావు' అంటూ అంతెత్తున ఎగిరింది. చేసేదేమీ లేక ఒప్పందం ప్రకారం శిక్ష భరించడానికి సిద్ధమయ్యాడు ప్రియుడు. వేడివేడి హెయిర్ స్ట్రైటనర్తో అతని ప్రైవేట్ పార్ట్ ను కాల్చేసింది ప్రియురాలు. దాంతో లబోదిబోమంటూ అరుపులు పెట్టాడు బాధితుడు. విషయం పోలీస్ కేసు నుంచి కోర్టుకు చేరింది. 'ఏదో ఆయనకు బుద్ధి చెబుదామని సరదాగా హెయిర్ స్ట్రైటనర్ ను అంటించా. కానీ ఇంత పెద్ద గాయం అవుతుందని ఊహించలేదు' అని న్యాయస్థానంలో వాపోయింది పార్కర్. అయితే జడ్జిగారు మాత్రం ఆమె చేసింది ముమ్మాటికి నేరమేనని తేల్చిచెబుతూ తొమ్మిది నెలల జైలుశిక్ష విధించారు. బాధిత ప్రేమికుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి అవయవాలు మామూలు స్థితికి రావడానికి కనీసం రెండేళ్లు పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. -
భార్యతో గొడవపడి... కోసేసుకున్నాడు!!
భార్యతో తీవ్రంగా గొడవపడిన ఓ బీహారీ.. పట్టలేని కోపం వచ్చి పదునైన చాకు తీసుకుని తన పురుషాంగాన్ని తానే కోసేసుకున్నాడు. బీహార్‌లోని సివాన్ జిల్లా ఖోజ్వా గ్రామంలో ఈ సంఘటన గురువారం సాయంత్రం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అతడికి ఇద్దరు కూతుళ్లున్నారు. కొడుకు మాత్రం పుట్టలేదు. దాంతో అదే విషయం మీద అతడికి తన భార్యతో ఎప్పుడూ గొడవలు అవుతుండేవి. గురువారం కూడా ఇదే విషయమై భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. ఆ కోపంలోనే అతడు తన అంగాన్ని కోసేసుకున్నట్లు వాళ్ల బంధువు ఒకరు పోలీసులకు తెలిపారు. సుమారు 30 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి గల్ఫ్‌లోని ఖతార్ దేశంలో ఉద్యోగం చేసుకుంటాడు. నెల రోజుల సెలవు పెట్టి ఇటీవలే బీహార్‌లోని తన స్వస్థలానికి వచ్చాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.