Private Travelers
-
దసరా సీజన్: ఇదో రకం దోపిడి, కానీ తప్పట్లేదు!
బెంగళూరు: దసరా పండుగ కావడంతో బెంగళూరు నుంచి వేలాది మంది సొంతూళ్లకు పయనమయ్యారు. వరుస సెలవులు రాగా ఐటీ బీటీ, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు విరామం కోసం బయటి ప్రాంతాలకు వెళ్లడానికి ఉరుకులు పరుగుల మీద ఉన్నారు. ఇదే చాన్సని ప్రైవేటు బస్సులు ప్రయాణికుల నుంచి దోపిడీకీ పాల్పడుతున్నాయి. బెంగళూరు నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు బస్సులు టికెట్ రేట్లు విపరీతంగా పెంచేశారు. గౌరీ–గణేశ్ పండుగ సమయంలో అధిక చార్జీలను వసూలు చేయరాదని, చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో రవాణా శాఖ హెచ్చరించింది. అధికారులు దాడులు చేసి అధిక టికెట్ వసూలు చేస్తున్న వారికి జరిమానా విధించారు. కానీ ఏమాత్రం మార్పులేని బస్సుల యజమానులు దసరాకు కూడా అదే దందాను అమలు చేశాయి. టికెట్లు అందుబాటు ధరల్లోనే ఉంటాయనుకున్న ప్రయాణికుల ఆశలు నీరుకారాయి. పండుగ, సెలవులతో ఊళ్లకు అక్టోబరు 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు వరుసగా సెలవులు ఉండటంతో శుక్రవారం సాయంత్రం నుంచి టెక్కీలు తదితరులు పెద్దసంఖ్యలో బెంగళూరు నుంచి ఊళ్లకు పయనమయ్యారు. ప్రైవేటు బస్సుల వెబ్సైట్, బస్‌బుకింగ్ యాప్ సమాచారం ప్రకారం మంగళవారం రాత్రి వరకు బెంగళూరు నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సంచరించే ప్రైవేటు బస్సులు చార్జీలు మామూలు కంటే మూడు రెట్లు పెరిగాయి. తాజా టికెట్ ధరలు ఎంతంటే ► బెంగళూరు నుంచి ఉడుపికి సాధారణ రోజుల్లో ఏసీ స్లీపర్, క్లబ్క్లాస్ టికెట్ ధర రూ.700 –750 ఉంటుంది. కానీ గత నెల 30 తేదీ నుంచి అక్టోబరు 04 తేదీ వరకు రూ.1,400 నుంచి రూ.1,800 కు ఎగబాకింది. ► బెళగావికి రూ.800– 900 ఉంటే ఇప్పుడు రూ.1,100– 1,500 కి రేటు పెరిగింది. ► హుబ్లీకి రూ.750–800 ఉండగా ప్రస్తుతం రూ.1,200 నుంచి 1,500 టికెట్ ధర పెరిగింది. ► కలబుర్గికి రూ.800–900 ఉండగా రూ.1,200 –1,500 ధర పెంచేశారు. ► ప్రైవేటు బస్సుల టికెట్లు బుకింగ్ అయిపోయిందని సమాచారం. డిమాండ్‌ను సొమ్ము చేసుకోవడానికి అదనపు బస్సులను ఆరంభించారు. మెజెస్టిక్ బస్టాండు రద్దీ బెంగళూరులోని ప్రధాన మెజెస్టిక్ బస్టాండు శనివారం రాత్రి నుంచి ప్రయాణికులతో కాలు అడుగుపెట్టలేనంతగా కిక్కిరిసిపోయింది. వేలాది మంది తరలివచ్చారు. ఎటుచూసినా బస్సులు, జనంతో బస్టాండు ప్రాంగణం జాతరను తలపించింది. -
వారి దోపిడీకి.. తెల్ల బోవాల్సిందే..!!
పట్నంబజారు (గుంటూరు తూర్పు): ఆంధ్ర ప్రదేశ్‌లోని జిల్లాలోని ప్రైవేటు ట్రావెల్స్ వ్యాపారులు కొందరు యథేచ్చగా ట్రాన్స్పోర్ట్ దందా సాగిస్తున్నారు. వైట్‌బోర్డు మాటున ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొండుతున్నారు. ఎల్లో బోర్డు నిబంధనలను తుంగలో తొక్కి పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. సొంత అవసరాల పేరుతో వాహనాలను కొనుగోలు చేసి అద్దె ట్యాక్సీలు తిప్పుతున్నారు. అనుభవం లేని డ్రైవర్లను నియమించుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చదవండి: దారుణం: చపాతీ కర్రతో అత్తను హత్యచేసిన కోడలు అధికారుల అలసత్వాన్ని ఆసరాగా తీసుకుని రోడ్డు, పర్మిట్ పన్ను ఎగ్గొట్టేస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వైట్‌బోర్డు పెట్టుకుని కమర్షియల్ వాహనాలు సంచరిస్తున్నాయి. ఎల్లో బోర్డు వాహనాల కంటే ఇవే అధికంగా తిరుగుతున్నాయి. పలువురు ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు వైట్‌బోర్డు ముసుగులో టాక్సీలు, క్యాబ్‌లను అద్దెకు తిప్పుతున్నారు. ప్రభుత్వాన్ని రూ. కోట్లలో పన్ను ఎగ్గొట్టేస్తున్నారు. దందా ఇలా...! ట్రాన్స్‌పోర్టు వినియోగానికి కొనుగోలు చేసిన వాహనాలకు రవాణా శాఖ ఎల్లో బోర్డుతో (మాక్సీక్యాబ్) రిజిస్టేషన్ నంబరు జారీ చేస్తుంది. అదే సొంతంగా కొనుగోలు చేస్తే.. వైట్ నెంబర్ ప్లేటు కేటాయిస్తారు. ఇందులో ఎల్లో బోర్డు వాహనానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. వైట్ బోర్డు వెహికల్ అయితే రిజిస్టేషన్ సమయంలో ఒకేసారి లైఫ్‌ట్యాక్స్ చెల్లిస్తే చాలు. ఈ నిబంధనను తమకు అనువుగా మలచుకున్న ట్రావెల్స్ వ్యాపారులు వైట్ బోర్డు కింద వాహనాలు తీసుకుని ట్యాక్సీలుగా అద్దెకు తిప్పుకుంటున్నారు. ప్రధానంగా 4–1 సీటింగ్ సామర్ధ్యంతో ఉన్న వైట్ బోర్డు వాహనాలు పెద్ద సంఖ్యలో ట్యాక్సీలుగా రాకపోకలు సాగిస్తున్నాయి. జిల్లాలో 40 వేలకు పైగా వాహనాలు వైట్ నంబర్ ప్లేటుతో తిరుగుతున్నాయని తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 2958 మాక్సీ క్యాబ్‌లు ఉన్నాయి. ట్యాక్స్ ఎగవేతకే.. ప్రైవేటు ట్రావెల్స్ వారు త్రైమాసిక పన్నుతో పాటు రోడ్డు టాక్స్, చెక్‌పోస్టుల్లో పర్మిట్ చార్జీలను తప్పించుకునేందుకే తమ వాహనాలను వైట్‌బోర్డు ముసుగు వేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొండుతున్నారు. మామూలుగా టూరిస్టు బోర్డు (టీ–బోర్డు) ఎల్లో బోర్డు వాహనాలు ఏటా రవాణా శాఖ నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్‌సీ) పొందాల్సి ఉంటుంది. అదే వైట్‌బోర్డు వాహనాలైతే రిజిస్టేషన్ అయిన తరువాత 15 ఏళ్ల వరకు ఎఫ్‌సీ అవసరం ఉండదు. ట్రావెల్స్ యజమానుల దందా కారణంగా ఏటా సుమారు రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుందనే తెలుస్తోంది. మొక్కుబడిగా తనిఖీలు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల వద్ద తూ తూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో వైట్ బోర్డులు తగిలించుకున్న ట్యాక్సీలు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రభుత్వ శాఖల్లోనూ ఇదే తంతు నడుస్తోంది. కొంత మంది అధికారులు ఎల్లో నంబర్ ప్లేటును సైతం వైట్ ప్లేటుగా మార్చుకుని యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఇటీవల ఆర్డీవో, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఇటువంటి వాస్తవాలు బయట పడ్డ కనీసం, అధికారుల్లో మాత్రం చలనం కరవైందనే చెప్పాలి. ఎల్లో ప్లేట్ మొదలు ఉదాహరణకు ఏపీ 39 తరువాత ‘టీ’తో మొదలయ్యే ప్రతి వాహనం ట్యాక్సీ ప్లేట్ అని స్పష్టం చేస్తోంది. అవి సైతం వైట్ ప్లేటుగా మార్చుకుని అధికారులే నేరుగా తిరుగుతుండటం పలు విమర్శలకు తావిస్తోంది. ట్రావెల్స్తో మిలాఖత్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ట్రావెల్స్‌కు సంబంధించి వైట్ ప్లేట్ (ఓన్ప్లేట్) వాహనాలు తిరుగుతున్నాయని తెలిసినప్పటికీ అధికారులు మిన్నకుండి పోతున్నారనే విమర్శలు లేకపోలేదు. దీనికి సంబంధించి ఆయా డివిజన్ అధికారుల నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు మామూళ్లు అందుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ట్రావెల్స్ యజమానులతో పాటు, పలు బస్సుల యజమానుల నుంచి నెలవారీ మామూళ్లు అందుతున్నాయనేది సమాచారం. తనిఖీలు చేపడతాం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపడతాం. పూర్తిస్థాయిలో ట్రావెల్స్‌పై దృష్టి సారించి, ప్రైవేట్ వాహనాలు ట్రావెలింగ్కు తిరగకుండా నిరోధిస్తాం. అయితే ప్రయాణికులు సైతం ఎల్లో ప్లేటు ఉన్న వాహనాలను మాత్రమే, ప్రయాణానికి వినియోగించాలని కోరుతున్నాం. దానివలన ప్రమాదవశాత్తూ.. ఏదైనా జరిగినా ఇన్సురెన్స్ వర్తిస్తుంది. వైట్ ప్లేటులో ఇన్సూరెన్స్ ప్రయాణికులకు వర్తించదు. అధికారులకు ఎటువంటి అవినీతికి పాల్పడినా.. సహించం. కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాం. – ఇవ్వల మీరాప్రసాద్, డీటీసీ, గుంటూరు చదవండి: శీతాకాల అతిథులొచ్చేశాయ్! -
రాత్రంతా అడవిలోనే..
మహబూబ్‌నగర్: పండుగల సీజన్ వస్తే చాలు ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు గుంజే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రయాణికుల రక్షణ గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. బస్సులో సాంకేతిక సమస్య తలెత్తి మార్గమధ్యలో చెడిపోయిన ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా.. తాత్సారం చేసిన మరో ఘటన వెలుగుచూసింది. బుదవారం రాత్రి హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లె బయలుదేరిన దిప్నా ట్రావెల్స్ బస్సు(ఏపీ 04 వై 7865) అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో కొత్తకోట వద్ద చెడిపోయింది. ట్రావెల్స్ యాజమాన్యం బస్సులో ఉన్న ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో.. అడవిలోనే రాత్రంతా గడపాల్సి వచ్చింది. దసరా సెలవులు కావడంతో.. బస్సు నిండా విద్యార్థులు, మహిళలు ఉన్నారు. రాత్రంతా రోడ్డుపైనే గడిపినా ట్రావెల్స్ యాజమాన్యం కనీసం పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.