Privatizing
-
ప్రైవేటీకరణకు ఎయిరిండియా అనుబంధ సంస్థలు!
నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను కేంద్రం రూ.18వేల కోట్లకు టాటా గ్రూప్‌కు అమ్మిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టాటా గ్రూప్‌కు విక్రయించడానికి ముందే ఎయిరిండియాకు ఎయిరిండియా ఎయిపోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, ఎయిరియిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్, అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్, హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుమబంధ సంస్థలున్నాయి. వాటిని ఇప్పుడు ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడులు, ప్రబుత్వ ఆస్తుల నిర్వహణ చూసే దీపం..ఎయిరండియా అనుంబంధ సంస్థల్ని కొనుగులో చేసే పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరుపుతుంది. -
సింగరేణి ప్రైవేటీకరణ అసాధ్యం
సాక్షి, హైదరాబాద్: నల్ల బంగారానికి నెలవైన సింగరేణి సంస్థను కేంద్రం ప్రైవేటీకరిస్తోందంటూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు విష ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సింగరేణి ఎన్నికలు వస్తుండటంతోనే కార్మికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రచారంలో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు తాను కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషికి లేఖ రాశానని.. సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోమని ఆయన స్పష్టమైన వివరణ ఇచ్చారని తెలిపారు. కేంద్రమంత్రి ఇచ్చిన వివరణ లేఖను బండి సంజయ్ ఆదివారం విడుదల చేసి మాట్లాడారు. ‘సింగరేణిలో అత్యధికంగా 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదేనని.. కేంద్ర వాటా 49 శాతం మాత్రమేనని ప్రహ్లాద్‌జోషి వివరించారు. 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా సింగరేణిని ప్రైవేటీకరించడం అసాధ్యమని చెప్పారు. కేంద్రం మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్–2015 ప్రకారం కోల్‌బ్లాకులను పారదర్శకంగా వేలం వేయాలని చట్టం చేసిందని.. దాని ప్రకారం యాక్షన్ వేలం ద్వారా కేటాయించాలనే నిబంధన ఉందని వివరించారు. 2020లో కమర్షియల్ మైనింగ్ అనే అంశాన్ని చట్టంలో చేర్చడం వల్ల నాటి నుండి వేలం ద్వారా మాత్రమే బొగ్గు బ్లాకులను కేటాయిస్తున్నారని.. సింగరేణికి చెందిన 4 బ్లాకు లను వేలం వేస్తే ఎవరూ బిడ్లు వేయలేదని వివరించారు. ఆ బ్లాకుల కోసం దరఖాస్తు చేసుకుంటే వేలం ద్వారా సింగరేణి సంస్థ పొందవచ్చు’ అని సంజయ్ తెలిపారు. -
ఆ ఆలోచన సరికాదు: ఎంపీ ఎంవీవీ
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విశాఖ ప్రజల ఆకాంక్షలను ప్రధానికి రాసిన లేఖలో తెలిపారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుంటామనే నమ్మకం కుదిరిందన్నారు. ఎంతో కాలం లాభాల్లో నడిచిన స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయం దురదృష్టకరమని చెప్పారు. సమస్య ఉంటే పరిష్కరించాలి తప్ప విక్రయించే ఆలోచన సరికాదన్నారు.(చదవండి: డ్రామా : ఫిరాయించిన ‘పిల్లి’ దంపతులు) ‘‘విశాఖ ఉక్కుకు తెలుగు ప్రజలతో ఉన్న అనుబంధం అందరికీ తెలుసు. ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత గల ఫ్యాక్టరీల్లో విశాఖ ఉక్కు ఒకటి.కొన్నేళ్లు నష్టాలు వచ్చినా మళ్లీ కోలుకునే సామర్థ్యం ఉంది. స్వంత గనులు లేకనే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నష్టాలు వస్తున్నాయి. విస్తరణకు రుణాలు తీసుకున్నందున వడ్డీభారం కూడా అధికంగా ఉంది. రూ.22 వేలకోట్ల రుణభారాన్ని ఈక్విటీగా మార్చి సొంత గనులు ఇస్తే విశాఖ ఉక్కు లాభాలు సాధిస్తుందని’’ ఆయన సూచించారు.(చదవండి: రాష్ట్రపతి పర్యటన: మంత్రి పెద్దిరెడ్డికి అనుమతి) కేంద్రం దిగిరాకపోతే రాజీనామాలకు కూడా వెనుకాడమని, విజయసాయిరెడ్డి నేతృత్వంలో త్వరలో ప్రధానిని కలుస్తామని ఆయన తెలిపారు.ప్రధాని మోదీకి ఆంధ్రుల సెంటిమెంట్‌ను వివరిస్తామని పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్ భూములు ప్రస్తుతం రూ.లక్ష కోట్లకు మించి విలువ చేస్తాయని, వాటిని బుక్ వాల్యూకు అమ్ముతామంటే ఒప్పుకోమన్నారు. నీతి ఆయోగ్ చెప్పినంత మాత్రాన అమ్మాలని లేదని.. విశాఖ ఉక్కు అమ్మకం ఆపి, ఆదుకోవాలని ప్రధానిని కోరుతున్నామని ఎంపీ ఎంవీవీ అన్నారు. -
ఉపాధిపై ప్రైవేటు
- పరిశ్రమల ప్రైవేటీకరణతో వీధిన పడుతున్న కార్మికుల కుటుంబాలు - అసంఘటిత కార్మిక సమాఖ్య మహాసభలో {పొఫెసర్ కోదండరామ్ కేయూ క్యాంపస్ : ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించటం వల్లే వివిధ పరిశ్రమలు మూతపడి అసంఘటిత కార్మికుల సంఖ్య పెరుగుతోందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ అన్నారు. వీరికి ఉపాధిపై ప్రై‘వేటు’కనీస వేతన చట్టం కూడా అమలు కావడం లేదన్నారు. హక్కుల సాధన కోసం సంఘటితంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో సోమవారం నిర్వహించిన అసంఘటిత కార్మిక సమాఖ్య రాష్ట్ర మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరంగల్‌లోని అజంజాహిమిల్, హైదరాబాద్‌లోని ఐడీపీఎల్ వంటి సంస్థలు కూడా మూతపడ్డాయని, ఆల్విన్ కంపెనీని ప్రైవేటుపరం చేశారని చెప్పారు. సింగరేణిలోనూ కొన్ని పనులను ప్రైవేటు వారికి అప్పగించారని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలను బలహీనపర్చి ప్రైవేటీకరించడంతో అసంఘటిత కార్మికుల సంఖ్య పెరగడంతో పాటు వారి ఉపాధిపై ప్రభావం పడుతోందన్నారు. విద్యుత్‌శాఖలో కాంట్రా క్ట్ పద్ధతిన పనిచేస్తున్న 27 వేల మంది ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయూం లోనే పలు ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేటీకరించారని అన్నా రు. కొన్నేళ్లుగా ప్రభుత్వాలు కూడా ప్రైవేటు పరిశ్రమల ఏర్పాటుకు అప్పనంగా భూములు ధారాదత్తం చేస్తున్నాయని, ఇలా హైదరాబాద్‌లో వందల ఎకరాల భూమి దక్కించుకుని పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా ఆ భూములతో వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఓ కంపెనీ కోసమని ప్రభుత్వమే రైతుల నుంచి ఎకరానికి రూ.5 లక్షల చొప్పున కొనుగోలు చేసి.. కొంతకాలం తర్వాత పరిశ్రమలు పెట్టకుండా రూ.45 లక్షలకు ఎకరం చొప్పున ఇతరులకు కట్టబెట్టిందని వివరించారు. తెలంగాణలోని అసంఘటిత కార్మికులతో పాటు రైతులు, బీడీ, చేనేత కార్మికులు, చిరు వ్యాపారులు, స్వర్ణకారుల సమస్యలు ఐక్య ఉద్యమాలతోనే పరిష్కారమవుతాయన్నారు. పాలకవర్గాల విధానాల వల్లే.. పాలకవర్గాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్లే అసంఘటిత కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. పలు పోరాటాలతో కార్మిక సంక్షేమ చట్టాలు వచ్చినా, అవి సక్రమంగా అమలు కావడం లేదన్నారు. కార్మికులను కనీసం మనుషులుగా కూడా గుర్తించడం లేదని విమర్శిం చారు. కాంట్రాక్ట్, పార్ట్‌టైం, ఔట్ సోర్సింగ్ కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారన్నారు. అసంఘటిత కార్మికులకు కూడా గౌరవప్రదమైన జీవనం కావాలని ఆకాంక్షించారు. ప్రజాపోరాటాలతోనే తెలంగాణ సాధించుకున్నామని, అది ఏ ఒక్క పార్టీ ఘనత కాదని చెప్పారు. మహాసభలో న్యాయవాది చిక్కుడు ప్రభాకర్, సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు బంటి శ్రీనివాస్, కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈసం నారాయణ, జిల్లా అధ్యక్షుడు నాగరాజు, బాధ్యులు నర్సాగౌడ్ మాట్లాడారు.