Proactive attitude
-
చైనాకి వంతపాడుతున్న రష్యా! ముమ్మాటికి రెచ్చగొట్టే చర్యే!
Russia On Nancy Pelosi's Taiwan Visit: అగ్రరాజ్యం సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటిస్తున్నారని వస్తున్న వార్తలు పెను వివాదానికి దారితీశాయి. ఒక పక్క తైవాన్‌లో అడుగుపెడితే ఊరుకునేదే లేదంటూ అమెరికాకు పదే పదే చైనా హెచ్చరిస్తోంది. పైగా దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇదిలా ఉంటే మరోవైపు రష్యా కూడా అమెరికా తీరుని తప్పుపట్టింది. చైనాకి వత్తాసు పలుకుతూ...అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇది ముమ్మాటికి రెచ్చగొట్టే చర్యని తేల్చి చెప్పారు మాస్కో ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్. యూఎస్ సెనెట్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్‌ని సందర్శించడం వల్ల చైనాతో యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. అయినా తైవాన్ తమది అని నొక్కి చెబుతూ పదేపదే హెచ్చరించినా... అమెరికా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పైగా వాషింగ్టన్ వన్ చైనా సూత్రానికి కట్టుబడి ఉంటానంటూ ప్రతిజ్ఞ చేసి మరీ ఇలా యూఎస్ పెలోసి తైవాన్ పర్యటన ఖరారు చేయడం అంటే బీజింగ్‌కి విరుద్ధంగా వ్యవహరించడమేని నొక్కి చెప్పారు. మరోవైపు ఈ పెలోసీ పర్యటనను సీరియస్‌గా తీసుకున్న చైనా ఇప్పటికే తైవాన్‌కి సంబంధించిన సుమారు 35 ఆహర ఎగుమతులను నిషేధించింది. (చదవండి: చైనా వార్నింగ్‌తో అలర్ట్.. తైవాన్ చుట్టూ అమెరికా యుద్ధ నౌకల మోహరింపు) -
నాపై ఆంక్షలు లేవు
ప్రధాని క్రియాశీలంగా ఉండడం సమస్య కాదు: సుష్మ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తనపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, ఆయన క్రియాశీలక వైఖరి తనకు ఏమాత్రం సమస్య కాదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టంచేశారు. తమ బృందంలో నంబర్ 1, నంబర్ 2 స్థానాల కోసం పోటీ లేదని, అందరం కలసికట్టుగా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఆదివారమిక్కడ ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏడాది కాలంలో తమ ప్రభుత్వం విదేశాంగ విధానంలో సాధించిన ప్రగతిని వివరించారు. ప్రధాని క్రియాశీలకంగా ఉండడం సమస్యగా భావిస్తున్నారా అని కొందరు విలేకరులు అడగ్గా.. సుష్మ పైవిధంగా సమాధానమిచ్చారు. బయటకు పెద్దగా కనిపించడం లేదని ప్రశ్నించగా.. ‘‘నా వైఖరికి తగ్గట్టుగానే ఉంటా. నా ప్రస్తుత ప్రొఫైల్.. లో ప్రొఫైల్‌కే సరిపోతుంది. నేను లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతీరోజూ మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పుడు విదేశాంగ మంత్రిగా ఆ అవసరం పెద్దగా ఉండదు. విదేశాంగ మంత్రి మాట్లాడితే అది వ్యక్తిగత అభిప్రాయమో, పార్టీ అభిప్రాయంగానో చూడరు. ఒక దేశ వైఖరిగా చూస్తారు’’ అని బదులిచ్చారు. కాగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చిత్తశుద్ధితో పనిచేసి, హింసాయుత కార్యక్రమాలకు మద్దతు ఉపసంహరించుకున్నప్పుడే పాకిస్తాన్‌తో చర్చలు జరుపుతామని సుష్మా స్వరాజ్ తేల్చిచెప్పారు. ముంబై దాడుల సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.