Problem drinking water
-
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
సదుం: సదుం పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి, సర్పంచ్ సయ్యద్‌బాషాకు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి సూచిం చారు. ఎర్రాతివారిపల్లెలోని స్వగృహంలో ఉన్న ఆయన్ను శనివారం పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు కలిశారు. సదుంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీ పలు సూచనలు చేశారు. ఆర్టీసీ బస్టాండు నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నా రు. షాదీమహల్ పునర్నిర్మాణ పనుల పై అధికారులతో ఫోన్లో చర్చించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.1.30 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. ఆ నిధులతో పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. నూతన తాగునీటి ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటుపై చర్చించారు. ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ఆరా తీశారు. అభివృద్ధిలో సదుం పంచాయతీని ఆదర్శంగా నిలపడమే తన ధ్యేయమని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఖాజాపీర్, రమేష్, ఖమ్రుద్దీన్, విద్యార్థి విభాగం నాయకులు బావాజీ, మదన్, వంశీ, పీలేరు కో-ఆప్షన్ మెంబరు హబీబ్, పులిచర్ల వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ మురళీరెడ్డి, ధనశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ మారుతున్నది స్వార్థ నాయకులే..
మొయిద(నెల్లిమర్ల రూరల్) : పార్టీ మారుతున్నది స్వార్థ నాయకులే తప్ప కార్యకర్తలు కాదని వైఎస్ఆర్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు అన్నారు. తాగునీటి సమస్యపై సోమవారం మండల కేంద్రంలో భారీ ఎత్తున ఆందోళన చేపడుతున్నామని చెప్పారు. మండలస్థాయి పార్టీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర నాయకులతో మొయిదలోని తన స్వగృహంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ పార్టీ మండల అధ్యక్షుడు చనుమళ్లు వెంకటరమణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పెనుమత్స మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు రాజ్యమేలుతోందని, గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు హాహాకారాలు చేస్తున్నారని.. ఇవేవీ పట్టని చంద్రబాబు అక్రమ సంపాదనతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తీరుపై యువకులు, మహిళలు, రైతులు.. ఇలా అన్ని వర్గాలవారూ అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. వైఎస్ఆర్సీపీకి ప్రజల్లో ఆదరాభిమానాలు ఉన్నాయని, కొంతమంది స్వార్థపూరిత ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. తాగునీటి సమస్యపై పార్టీ అధిష్టానం పిలుపుమేరకు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున మహిళలు ఖాళీ బిందెలతో ర్యాలీగా వెళ్లి, తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టనున్నట్లు వివరించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల సమస్యలను విస్మరించి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే పరమావధిగా పని చేస్తున్నారని, అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. తామంతా సాంబశివరాాజు వెంట పనిచే సి పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తామన్నారు. చనమళ్లు వెంకటరమణ మాట్లాడుతూ మంచినీటి సమస్యపై చేపట్టిన ధర్నా కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, పార్టీ కార్యవర్గ సభ్యులు యడ్ల గోవిందరావు, సంగంరెడ్డి సాంబ, నాఫెడ్ డెరైక్టర్ కె.వి.సూర్యనారాయణరాజు, మొయిద సూరిబాబు, రెడ్డి రామారావు, గుడివాడ గణపతిరావు, నక్కాన వెంకటరావు, రాయి విభీషణరావు, రేగాన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రూ.42.5 లక్షల ఎంపీ నిధులతో తాగునీటి పథకాలు
► ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు: ఆత్మకూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యను శాస్వతంగా పరిష్కరించే నిమిత్తం నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రూ.42.50 లక్షల ఎంపీ లాడ్స్ నిధులను మంజూరు చేశారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం ఆత్మకూరు క్యాంప్ కార్యాలయంలో ఈ వివరాలను విలేకరులకు అందజేశారు. 1000లీ సామర్థ్యం గల ఆర్వో ప్లాంటును ఏర్పాటుచేయటం, ఇందుకు సంబంధించిన షెడ్డు బోర్ వెల్ మోటారు విద్యుత్ కనెక్షన్ కోసం మొత్తం రూ.ఆరు లక్షలు ఎంపీ లాడ్స్ నిధులను ఒక్కొక్క ప్లాంటుకు మంజూరుచేసినట్టు తెలిపారు. ఈ ప్లాంటులను అనంతసాగరం మండలంలోని అనంతసాగరం దిగువూరు, మంచాలపల్లి, గౌరవరం, కామిరెడ్డిపాడు, పడమటి కంభంపాడు గ్రామాల్లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం దేపూరు, నల్లపరెడ్డిపల్లి, ఆరవీడు గ్రామాలకు కూడా ఈ వాటర్ ప్లాంటులను మంజూరు చేసారన్నారు. నిధులు మంజూరు చేసిన ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. సమావేసంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఇందూరు నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరపల్లి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి మర్రిపాడు : ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్‌ను ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి కోరారు. మర్రిపాడులో తహసీల్దారు కార్యాలయం తనిఖీకి వచ్చిన జేసీ ఇంతియాజ్‌ను గురువారం ఎమ్మెల్యే కలిశారు. నియోజకవర్గంలో పలు సమస్యల గురించి జేసి దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా ధాన్యానికి గిట్టుబాటు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. అంతేకాకుండా మర్రిపాడు మండలంలో భూసమస్యలు అధికంగా ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ రికార్డులను పరిశీలించారు. ఈర్లపాడు భూములకు సంబంధించిన నివేదికలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే నివేదిక తయారుచేసి ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు ఎంవీ కృష్ణారావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరపల్లి శ్రీనివాసులురెడ్డి, మందా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
జెడ్పీలో రసాభాస
- అర్ధాంతరంగా సభ రద్దు - తాగునీటికి నిధుల కేటాయించలేదని నిలదీసిన విపక్షం - తాగునీటి సమస్యే లేదన్న మంత్రి బొజ్జల - వేదిక వద్ద బైఠాయించిన విపక్షం జిల్లాలో తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు నిధుల కేటాయింపులో పాలకవర్గం వివక్ష పూరితంగా వ్యవహరించిందని నిరసిస్తూ విపక్షం ఆందోళనకు దిగడంతో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. సాక్షి,చిత్తూరు: జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం తాగునీటి సమస్యతోపాటు 29 అంశాలు అజెండాగా జెడ్పీ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ గీర్వాణి అధ్యక్షతన జరిగింది. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ విపక్షం నుంచి వైఎస్సార్సీపీకి చెందిన పలమనేరు, నగరి, పీలేరు, మదనపల్లె, గంగాధరనెల్లూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, ఆర్కే రోజా, చింతల రామచంద్రారెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, నారాయణస్వామి, సునీల్‌కుమార్, ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి యాదవ్ హాజరయ్యా రు. జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులున్న ప్రాంతాలకు నిధులు కేటాయించక వివక్ష చూపించడమేంటని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, మిగిలిన సభ్యులు నిలదీశారు. పైసా కూడా కేటాయించని ప్రాంతాలను ఉదహరిస్తూ గట్టిగా ప్రశ్నించారు. ఇదే విషయంపై గత సమావేశాల్లో ప్రశ్నిస్తే భవిష్యత్తులో అలా జరగకుండా చూస్తామంటూ సమాధానమిచ్చారని అయినా పాలక వర్గంలో మార్పులేదని ధ్వజమెత్తారు. తాగునీటి సమస్యను చివరన చర్చిస్తామని మంత్రి పదేపదే చెప్పడంతో సభ్యులు కొంతసేపు శాంతించారు. ఆ తరువాత సమాధానం చెప్పకుండా సమావేశాన్ని ముగించే ప్రయత్నానికి దిగడంతో విపక్ష ఎమ్మెల్యేలు మంత్రిని నిలదీశారు. దీంతో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య లేదని మంత్రి ప్రకటించారు. మంత్రికి దమ్ముంటే గ్రామాలకు వస్తే చూపిస్తామని విపక్ష ఎమ్మెల్యేలు సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీ సభ్యులకు నిధులిచ్చేది లేదని, లక్షలు కొల్లగొట్టినోళ్లకు నిధులెందుకని మంత్రి అనడంతో విపక్ష ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది. పట్టిసీమ పేరుతో కోట్లు కొల్లగొట్టింది మీరేనంటూ నిలదీశారు. నిధుల కేటాయింపుపై స్పష్టమైన ప్రకటన చేయాల్సిందేనని వేదిక ముందు బైఠాయించారు. దీంతో అధికారపక్షం నోరు మెదపలేదు. విపక్ష సభ్యులు సభను అడ్డకున్నందున అజెండాను ఆమోదించినట్లేనంటూ చెప్పి మంత్రి, చైర్పర్సన్ వెళ్లిపోయారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, అధికార పార్టీకి చెందిన చిత్తూరు, తిరుపతి, తంబళ్లపల్లె, సత్యవేడు ఎమ్మెల్యేలు సత్యప్రభ,సుగుణమ్మ, శంకర్, ఆదిత్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.