Progress card
-
ధైర్యముంటే రిపోర్టు కార్డు విడుదల చెయ్యండి.. అమిత్ షా
భోపాల్: త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ మధ్యప్రదేశ్‌లో దూకుడును పెంచింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన గరీబ్ కళ్యాణ్ మహా అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2003 నుండి 2023 వరకు పరిపాలనకు సంబంధించి రిపోర్టు కార్డును విడుదల చేశారు. ధైర్యముంటే కాంగ్రెస్ పార్టీ కూడా తమ 53 ఏళ్ల పరిపాలన తాలూకు ప్రగతి నివేదిక సమర్పించాలని సవాల్ విసిరారు. గరీబ్ కళ్యాణ్ మహా అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్, బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ సమక్షంలో 20 ఏళ్ల ప్రగతి నివేదికను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాటలాడుతూ మధ్యప్రదేశ్ ప్రజలు 2003లో కాంగ్రెస్ పార్టీని, వేర్పాటుదారుడు దిగ్విజయ్ సింగ్ ను సాగనంపి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. గడిచిన 20 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ధైర్యముంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఐదు దశాబ్దాల పరిపాలనలో మధ్య ప్రదేశ్ కు ఏమి చేసిందో నివేదిక విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. 1956లో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2003 వరకు ఐదారేళ్లు మినహాయిస్తే మిగతా సమయమంతా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని ఆ సమయంలో ఇక్కడ అభివృద్ధి కరువై BIMARU(ఆరోగ్యం నశించి)గా మారిందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్రాభివవృద్ధికి కృషి చేసిందని.. మధ్యలో డిసెంబరు 2018 నుండి మార్చి 2002 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపివేసి అభివృద్ధిని కుంటుపడేలా చేసిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం అన్ని విభాగాల్లోనూ దూసుకుపోతోందని.. 45 శాతంతో గోధుమల ఎగుమతిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని.. ప్రభుత్వ ఆరోగ్య పథకానికి సంబంధించి ఆయుష్మాన్ కార్డులు జారీ చేయడంలోనూ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద గ్రామీణ రోడ్డులను మెరుగుపరచడంలోనూ దేశానికే తలమానికంగా నిలిచిందని అన్నారు. వ్యవసాయ రంగానికి మౌలిక నిధుల పథకం కింద రూ. 4300 కోట్ల నిధులు సమకూర్చి దేశంలో నెంబర్ వన్ స్థానంలోనూ.. స్వచ్ఛతలో ఇండోర్ ఎప్పటినుంచో మొదటి స్థానంలోనూ కొనసాగుతున్నాయని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పేదలకు ఇల్లు కట్టించడంలో రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో నిలిచిందని.. సుమారు 44 లక్షల పేద కుటుంబాలు ఈ పథకం కింద గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ పక్కా ఇళ్లు సొంతం చేసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో జరిగిన సంక్షేమాభివృద్ధి గురించి వివరిస్తూ రాష్ట్రంలోని సుమారు 1.36 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని 2003లో రూ.12000 గా ఉన్న తలసరి ఆదాయం ఇప్పుడు రూ.1.4 లక్షలకు చేరిందని అన్నారు. ఒకప్పుడు విభజనలు పాలైన రాష్ట్రంగా పిలవబడిన మధ్య ప్రదేశ్ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు, రోడ్లు, మంచినీరు, విద్య విభాగాల్లో ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు. చివరిగా ఆయన మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రస్తావన తీసుకొస్తూ 2014లో 29 ఎంపీ సీట్లకు గాను 27 సీట్లలో బీజేపీ పార్టీని గెలిపించగా 2019లో 28 సీట్లలోనూ గెలిపించారని.. ఈసారి జరగబోయే ఎన్నికల్లో మిగిలిన ఆ ఒక్క సీట్లో కూడా ప్రజలు గెలిపిస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన ఖర్గే.. తెలంగాణకు మొండిచేయి -
విద్యార్థుల ప్రవర్తనపై ప్రోగ్రెస్ కార్డు ఇద్దాం.. మంత్రి సత్యవతి సూచన
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల చదువుపైనే కాకుండా వారి ప్రవర్తన పట్ల కూడా ప్రోగ్రెస్ర్ కార్డు ఇవ్వాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను సూచించారు. ఈ దిశగా కార్యాచరణ రూపొందిం చాలని అధికారులకు ఆదేశించారు. వచ్చే వారం నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కా నుండటంతో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, జిల్లా సంక్షేమాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడు తూ.. గ్రామీణ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిం చాలని సూచించారు. సంక్షేమ వసతిగృహాల్లో చేరి కలు పెరిగేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే.. ‘గిరి వికాసం’ కింద గ్రామీ ణరోడ్లు, ట్రాన్స్‌పోర్టేషన్ ప్రోగ్రామ్, ట్రైకార్ క్రింద చేపట్టిన అన్ని పథకాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గిరిజన గూడేల్లో, తండాల్లో జీసీసీతో సరుకులు సరఫరా సక్రమంగా అయ్యేలా చూడాల న్నారు. గిరిజన ఆవాసాల్లో ఇంకా ఎక్కడైనా త్రీఫేజ్ విద్యుదీకరణ పనులు అవసరమైతే విద్యుత్ శాఖ సహకారంతో త్వరగా పూర్తి చేయాలన్నారు. -
చదువులో నేను టాపర్: సమంత
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత అక్కినేని తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోడానికి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అక్కినేని కోడలుగా మారిన అనంతరం ఆమెకున్న క్రేజ్ మరింత పెరిందని చెప్పవచ్చు. ఇటు వ్యక్తిగత విషయాల్లోనూ అటు సినిమాల పరంగానూ పక్కా క్లారిటీతో ఉండే సామ్ అన్నింటిలోనూ తను బెస్ట్ అని మరోసారి రుజువు చేసుకున్నారు. నటిగా, భార్యగా, కోడలిగా, తనదైన పాత్ర పోషిస్తున్న సమంతా తాజాగా చదువుల్లోనూ టాపర్ అని నిరూపించుకుంది. ఈ మేరకు చెన్నైలో చదువుకున్న రోజుల్లో 10,11వ తరగతిలోని తన ప్రోగ్రెస్ రిపోర్టును సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. (బుట్టబొమ్మ సారీ చెప్తుందా?) ‘చాలా మంచి మార్కులు సాధించింది. ఆమె పాఠశాలలో చదవడం గొప్ప విషయం’. అని టీచర్ మార్కుల ప్రోగ్రెస్‌పై రాసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. సమంతకు అన్ని మార్కులు రావడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. తాము అభిమానించే నటి అన్నింటిలోనూ టాపర్ అని మురిసిపోతున్నారు. కాగా చెన్నైలోని పల్లవారంలో జన్మించిన సమంత అక్కినేని తన పదవ తరగతి వరకు స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్లో చదువుకున్నారు. అనంతరం 11, 12 తరగతుల కోసం హోలీ ఏంజిల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చేరారు. ఇక లాక్డౌన్లో తన కలలను నెరవేర్చుకునే బాట పట్టారు సమంత. ఈ క్రమంలో భర్తతో, తన పెంపుడు కుక్క హాష్‌తో బిజీగా గడుపుతున్నారు. (నా భర్త ఎక్కడో గొయ్యి తవ్వుతున్నాడు : సమంత) -
ఒకటే ప్రోగ్రెస్ కార్డు
పాఠశాల మారినా అదే కార్డు - 6 నుంచి 10వ తరగతి వరకు కొనసాగింపు - విద్యార్థి సమగ్ర వివరాలు అందులోనే.. మంచిర్యాల సిటీ : ప్రతీ విద్యాసంవత్సరానికో ప్రోగ్రెస్(ప్రగతి పత్రం) కార్డు విధానానికి విద్యాశాఖ స్వస్తి పలికింది. ఇకపై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒకటే ప్రోగ్రెస్ కార్డు జారీ కానుంది. గత విద్యాసంవత్సరం వరకు ప్రతీ విద్యార్థికి తరగతి వారీగా ఏడాదికో ప్రోగ్రెస్ కార్డు ప్రభుత్వ పాఠశాల నుంచి ఇచ్చేవారు. అయితే ఈ విద్యాసంవత్సరం నుంచి ఒకటే కార్డు ఇస్తున్నారు. ఈ కార్డు పేరును విద్యార్థి సంచిత సమగ్ర ప్రగతి నివేదికగా పేర్కొన్నారు. ఈ నివేదిక విద్యార్థి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉపయోగపడుతుంది. పాఠశాల మారితే విద్యార్థి తన వెంట తీసుకెళ్లి చేరిన పాఠశాలలో అప్పగించాలి. అందులో విద్యార్థి వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. ఫొటో తప్పనిసరి. నివేదికలో ప్రతీ తరగతికి ఆరు పేజీలు కేటాయించారు. తరగతి వారీగా ఆరోగ్య సమాచారం, వివరణాత్మక సూచనలు, గ్రేడ్ వివరాలు నమోదు చేసి దానిపై తల్లిదండ్రుల సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థి వివరాలు పాఠశాల పేరు, విద్యార్థి గుర్తింపు సంఖ్య, మాధ్యమం, విద్యార్థి పేరు, తల్లి, తండ్రి పేరు, తరగతి, ప్రవేశ సంఖ్య, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, చిరునామా, మొబైల్ నంబరు, మెయిల్ ఐడీ, రక్త వర్గం, ఎత్తు, బరువు (తరగతుల వారీగా) ప్రోగ్రెస్ కార్డులో నమోదు చేయాలి. వీటితో పాటు ఆరో తరగతిలో చేరిన సమయంలో తీసిన విద్యార్థి ఫొటో అతికించాలి. ఆ తర్వాత పదో తరగతిలో చేరిన ఫొటో అతికించాలి. తల్లిదండ్రులు.. ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు నిర్వహించే సమావేశానికి తల్లిదండ్రులు ఈ ప్రోగ్రెస్ కార్డుతో హాజరు కావాలి. వారితో విద్యార్థి ప్రగతిని చర్చించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశంలోనూ విద్యార్థి ప్రగతిపై చర్చించే అవకాశం ఏర్పడుతుంది. ఉపాధ్యాయులు.. ప్రతీ ఉపాధ్యాయుడు తన సబ్జెక్టులకు సంబంధించిన మార్కులు, గ్రేడులు నమోదు చేయాలి. విద్యార్థి ప్రగతిని గ్రేడుల రూపంలో మాత్రమే నమోదు చేయాలి. నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మూల్యాంకనాలను నమోదు చేసిన ప్రతీసారి తల్లిదండ్రుల సంతకాలు సేకరించి వారి అభిప్రాయాలను సైతం తీసుకోవాలి. విద్యార్థులు పాఠశాల నుంచి మరో పాఠశాలకు బదిలీ అయినప్పుడు ఇదే నివేదికను వారికి అప్పగించాలి. పనిభారం మారిన సిలబస్ ఆధారంగా బోధన, పరీక్ష , మూల్యాంకనం, విద్యార్థులను చదివించే తీరు మారింది. దీనికితోడు నివేదిక (ప్రోగ్రెస్ కార్డు)లో వివరాలు నమోదు చేయడం ద్వారా పని పెరిగింది. ఆరు సబ్జెక్టులకు సంబంధించిన మార్కులతోపాటు విద్యార్థికి సంబంధించిన వ్యక్తిగత విషయాలపై కూడా మార్కులు వేసి గ్రేడులు నమోదు చేయాల్సి ఉండడంతో పనిభారం పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
శ్రీవారూ... వాయిదాల వాదనలు!
ఉత్త(మ)పురుష మా శ్రీవారి తెలివితేటలు అన్నీ ఇన్నీ కావు. కాకపోతే అవేవీ సక్రమమైన మార్గంలో ఉండవు. నేను ఏదైనా పని చెప్పగానే అప్పటికప్పుడు ఠక్కున చేయరు. ఏదో వంక పెట్టేసి దాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. ఉండబట్టలేక ఓ రోజు అడిగా... ‘‘ఎందుకండీ ఎప్పటిపని అప్పుడు చేయరు? ఎలాగైనా చేయాల్సిందే కదా. చేసేస్తే పని తీరిపోతుంది కదా. వాయిదా వేస్తే పని అలాగే మిగిలి ఒత్తిడి పెరుగుతుంది కదా?’’ అన్నది నా ప్రశ్న. ‘‘అందుకే అప్పటికప్పుడు క్లియర్ చేసేయండి’’ అన్నది నా సలహా. దానికి మా ఆయన ఇచ్చిన జవాబు బంగారు అక్షరాలతో లిఖించదగ్గది. ‘‘ఏవోయ్... వాయిదాలు లేకపోతే ప్రపంచంలో అందం లేదోయ్. నువ్వు ఓ ఫ్లాటో లేదో ఇంటిజాగానో కొనుక్కుంటావ్. బ్యాంకు వాడు నీకు లోనిచ్చి... వాయిదాల ప్రకారం నీ దగ్గర ఈఎమ్ఐలు వసూలు చేసుకుంటూ ఉంటాడు. నువ్వు అద్దె ఇంటికి చెల్లించినట్టు కాసిన్ని రోజులు వాయిదాలు చెల్లిస్తావు. ఒకనాటికి ఇల్లు నీ సొంతమవుతుంది. ఒకవేళ నీకు వాయిదాలు అన్న కాన్సెప్టే నచ్చనిదనుకో. రొక్కం మొత్తం ఒకేసారి ఇవ్వాలన్నది నీ పాలసీ అనుకో. నీకీ జన్మలో ఇల్లు సొంతం కాదు. అదీ వాయిదాల గొప్పదనం. ఇక న్యాయవ్యవస్థ మొత్తం వాయిదాల మీదే ఆధారపడి ఉంది. వాదనలన్నీ ఒకేరోజు వినాలంటే ఎంత పెద్ద జడ్జీకైనా కష్టమే. అందుకే వాయిదాల లెక్కన రోజుకు ఇన్నని కొన్ని వాదనలు విని నిస్పాక్షికంగా తీర్పిస్తారు జడ్జిగారు. అంతేనా... దేవుడికి సైతం పూజలన్నీ చేయడానికి ఒక్క రోజు సరిపోక నవరాత్రోత్సవాలంటూ వాయిదాల పద్ధతిన ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. అంతెందుకు... సముద్రం దగ్గర ఏకమొత్తంలో నీళ్లు అప్పుతీసుకున్న మబ్బులు... తడవకింతని వర్షం రూపంలో తీరుస్తాయి. అదేగానీ మబ్బులు ఒకేసారి అప్పు తీర్చేశాయనుకో... ఏ తుఫానో, వరదలో వచ్చి ఉత్పాతాల్లో ఉస్సూరమనాల్సిన ఖర్మ మనుషులది. అందుకే నేనేదైనా పని వాయిదా వేస్తున్నానంటే అందులో ఓ అంతరార్థం, ఎంతో ప్రకృతిప్రేమా, బోల్డంత దైవభక్తీ ఉన్నాయన్నమాట’’ అంటూ ఓ లెక్చర్ దంచారు మా ఆయన. ఏవండీ... ఎంత (అతి) తెలివైన వారు కాకపోతే... ఎప్పటికప్పుడు చేయాల్సిన పనులను వేసే వాయిదాకీ... చెల్లింపుల వాయిదాకీ ముడేస్తారు చెప్పండి. అందుకే ఆయన బోడిగుండుకీ, మోకాలికీ ఎక్కడ ముడేస్తారో అనే భయం కొద్దీ ఆయనకు దేవుడు జుట్టే లేకుండా బట్టతల ఉంచేశాడు. ఆయనకు ఎలా బుద్ధి చెప్పాలో అప్పటికి తెలియలేదు నాకు. ‘‘ఇందండి మన బుజ్జిగాడి ప్రోగ్రెస్ కార్డు. సంతకం పెట్టండి’’ అంటూ ఓ కార్డు అందించా. ఆ మార్కులను చూసి అద్దిరిపోయారు మావారు. ‘‘ఇవేం మార్కులోయ్. ఏవీ చదవట్లేదా వెధవ. కనీసం పాస్‌మార్కులు కూడా రాలేదు. ఇలా అయితే ఎలా? కాస్త కూర్చుని ప్రైవేటు చెప్పు వాడికి’’ అంటూ మరో పని పురమాయించారు నాకు. ‘‘చెప్పి చూశానండీ... వాడెమన్నాడో తెలుసా? నాన్నగారి అడుగుజాడల్లో నడుస్తాడట. పాస్ కావడాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేశాట్ట వెధవ. ఎంత తెలివో! అంతా అచ్చం తండ్రి పోలికే’’ అన్నాను. అంతే! దెబ్బతో మా వారికి దిమ్మ తిరిగి పోయినట్లుంది. పనులు వాయిదా వేసే పనిని నిరవధికంగా వాయిదా వేసి, ఎప్పటి పని అప్పుడు చేస్తున్నారు. ఆ మరుసటి నెలలో మావారికి బుద్ధి చెప్పడం కోసం నేను తయారు చేయించిన ప్రోగ్రెస్కార్డు మీద కాకుండా... అసలు దాని మీదే ఆయన సంతకం చేయించి మావారు తన మనశ్శాంతిని వాయిదా వేసుకోకుండా చూశా. - వై!