promises implementations
-
వాగ్దానాలు కొంతవరకు నెరవేర్చా
న్యూఢిల్లీ: ఇచ్చిన వాగ్దానాలను కొంత వరకు నెరవేర్చగలిగానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ చెప్పారు. ఎల్లవేళలా పనిచేసే ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం, కేసుల జాబితాను క్రమబద్ధం చేసే వ్యవస్థను నెలకొల్పడం, పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడం వంటి విషయాల్లో తన వంతు కృషి చేశానని తెలిపారు. జస్టిస్ యు.యు.లలిత్ పదవీ కాలం మంగళవారం ముగియనుంది. ఆరోజు సెలవు దినం కాబట్టి సోమవారమే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ యు.యు.లలిత్ మాట్లాడారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే పెండింగ్ కేసులపై దృష్టి పెట్టానని, వేలాది కేసులు పరిష్కరించానని వివరించారు. ఈ వీడ్కోలు సభకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులు హాజరయ్యారు. నా ప్రయాణం సంతృప్తికరం సుప్రీంకోర్టులో 37 ఏళ్ల వృత్తి జీవితంలో న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ప్రతి దశను ఆనందించానని జస్టిస్ లలిత్ పేర్కొన్నారు. తన ప్రయాణం సంతృప్తికరంగా సాగిందన్నారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి, 16వ సీజేఐ జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ముందు న్యాయవాదిగా పనిచేశానని గుర్తుచేసుకున్నారు. ఇదే కోర్టులో మొదలైన తన ప్రయాణం, ఇక్కడే ముగుస్తోందంటూ భావోద్వేగానికి గురయ్యారు. పలు రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేయడం తనకు మర్చిపోలేని జ్ఞాపకమని అన్నారు. కోర్టులో ఉన్న న్యాయమూర్తులందరినీ రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యులుగా చేశానని తెలిపారు. జస్టిస్ లలిత్ ఆగస్టు 27న సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. కేవలం 74 రోజులు పదవిలో కొనసాగారు. -
పార్టీల్లేవ్!
-
నన్నెందుకు నిందిస్తారు!
మీ వరకేనా న్యూ ఇయర్ తీర్మానాలు? చెట్లను కాపాడతానని, చుక్క నీటిని వృథా చేయనని ఎందుకు ప్రతిజ్ఞ చెయ్యరు? డిసెంబరు 31, ఆ తరవాత జనవరి 1. నా కాల గతి ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాలుగా సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు. చంద్రుడు రాత్రివేళల్లోనే తన చల్లని కిరణాలను ప్రసరిస్తున్నాడు. సృష్టి ప్రారంభం నుంచి మానవులందరికీ రెండు కళ్లు, రెండు చెవులు, రెండు చేతులు, రెండుకాళ్లు.. అన్నీ మామూలే. నవమాసాలు మోసి స్త్రీలే పిల్లల్ని కంటున్నారు. నా ప్రయాణంలో ఇవి అనునిత్యం జరుగుతూనే ఉన్నాయి. ప్రకృతిలో సహజంగా ఎటువంటి మార్పు లేదు. ఇంత నిక్కచ్చిగా నేను ప్రయాణిస్తుంటే, అందరూ నన్ను నిందిస్తారెందుకో! ఏ చిన్నపాటి ప్రకృతి వైపరీత్యం వచ్చినా, ఏ మాత్రం ఆలోచించకుండా, ‘కాలమహిమ కాకపోతే...’ అంటారు. కాలంలో ఏ మార్పు వచ్చిందని ఈ మాట అంటున్నారో నాకు అర్థం కాదు. కాలచక్రం ప్రారంభమైన నాటినుంచి నేటి వరకూ సృష్టి పంచభూతాత్మకంగానే ఉంది కదా. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, జల కాలుష్యం.. ఇవన్నీ ఎవరి తప్పిదాల వల్ల జరుగుతున్నాయి? గాలి తనంతట తాను కలుషితం కాదుగా? నీరు తనంత తాను కలుషితం కాదుగా? ఇటువంటి కాలుష్యాలకు నేనేదో కారణం అయినట్లు, ‘కాలం కాకపోతే’ అని నన్ను నిందించవలసిన అవసరం ఏంటి? ఇవన్నీ పక్కన పెడదాం. నా ప్రయాణం ఒక సంవత్సరంలో నుంచి మరో సంవత్సరంలోకి అడుగు పెట్టబోయే సమయంలో.. ఈ రోజు నుంచి సిగరెట్, మందు వంటి దురలవాట్లు మానేయాలి అంటూ నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి తీసుకోవడానికి నా కాలగమనానికి సంబంధం ఏంటి? ఇవన్నీ వ్యక్తిగత నిర్ణయాలు. అసలు వీరంతా సమాజం గురించి ఆలోచించరా? ‘‘నా వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగకూడదు. సమాజానికి మేలు జరగాలి. నేను వృక్షాలను పరిరక్షిస్తాను, నేటి నుంచి ఒక్క చుక్క నీటిని కూడా వృథా చేయను, హామీలను నెరవేర్చని నాయకుడిని పదవీచ్యుతుడిని చేస్తాను’’ అని ఎందుకు ప్రతిజ్ఞ చేయరు? ఇన్ని మంచి మార్పులు జరిగితేనే కదా నేను ఆరోగ్యంగా ఉండగలుగుతాను. నాకు అనారోగ్యం చేస్తే మానవ మనుగడకు ఎంత ప్రమాదమో ఒక్కరూ ఆలోచించరే. ఒక్కో చెట్టు కొట్టేస్తుంటే నా గుండెలు ఎలా పగులుతాయో ఒక్కరైనా ఆలోచించారా? మానవ తప్పిదాల వల్ల భూమాత శరీరం ఎంత వేడెక్కిపోతోందో ఆలోచించారా? ఇప్పటికైనా ‘సొంత లాభం కొంతమానుకు, పొరుగువారికి తోడుపడవోయ్’ అనే గురజాడ మాటలను ఆచరిస్తామని సంకల్పించండి. మానవ అభివృద్ధి కోసం ప్రతినబూనండి. అప్పుడు ‘కాల మహిమ’ అనండి. నా మహిమలను కాపాడండి. స్వగతం : వైజయంతి -
హామీల అమలుకు యువతతో ఉద్యమం
నేడు గుంటూరులో ఉద్యమ కార్యాచరణ వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజా సాక్షి, రాజమహేంద్రవరం : ఎన్నికల్లో యువతకు ఎన్నో హామీలను ఇచ్చిన చంద్రబాబు వెంటనే వాటిని అమలు చేయాలని కోరుతూ ఉద్యమాన్ని నిర్వహించనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తెలియజేశారు. ఉద్యమ కార్యాచరణ కోసం శనివారం గుంటూరులో యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు శుక్రవారం ఆయన రాజమహేంద్రవరంలో విలేకరులకు తెలిపారు. గుంటూరులోని కేకేఆర్ ఫంక్షన్హాల్లో ఉదయం 8.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 13 జిల్లాలల నుంచి యువజన విభాగాల అధ్యక్షులు, నేతలు హాజరవుతున్నారని చెప్పారు. ప్రభుత్వ హామీలు–వైఫల్యాలు, పార్టీ యువజన విభాగం–సంస్థాగత నిర్మాణం అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. అనంతరం ప్రభుత్వ హామీల అమలుకు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. ‘జాబు కావాలంటే.. బాబు రావాలి’ అని ఊరూవాడా ప్రచారం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలనే పీకేస్తున్నారని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామనిహామీ ఇచ్చి ఆ ఉద్యోగాలే లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్న చంద్రబాబు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. విద్యను కార్పొరేట్ పరం చేసేందుకు చిన్న చిన్న పాఠశాలలు, కాలేజీలపై తనిఖీల పేరుతో ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆరోపించారు. తన వియ్యంకుడు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలసి నారాయణ కళాశాలల అధినేత, రాష్ట్ర మంత్రి నారాయణ ప్రభుత్వ కళాశాలలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. నారాయణ కళాశాలల్లో వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.