వర్షపు నీటి సంరక్షణకు చర్యలు తీసుకోండి
అనంతపురం అర్బన్: ‘‘ముఖ్యమంత్రి అనుమతితో త్వరలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాము. శాఖలవారీగా రెండంకెలవృద్ధి నివేదికలను, పవర్ పాయింట్ ప్రజంటేషన్ స్లైడ్లను సిద్ధం చేయండి.’’ అని కలెక్టర్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్ ఆదేశించారు. అనంతపురం జిల్లాలో భూగర్భ జలాల పెంపునకు వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోన శశిధర్ని ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరువుని అధిగమించేందుకు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ, ఉద్యన పంటల సాగుని అభివృద్ధి చేయాలని రాయలసీమ కలెక్టర్లకు సూచించారు.