provided
-
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
పంజగుట్ట: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణకు చట్ట బద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ శనివారమిక్కడ డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఆదివారం నుంచి సమావేశాలు పూర్తయ్యే 22 వరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. 3న జాతీయ స్థాయిలో అన్ని జిల్లా కేంద్రాల్లో ముఖ్య నేతల సమావేశాలు, 4, 5 తేదీల్లో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వినతిపత్రాలు సమర్పించడం, 6న జాతీయస్థాయిలో అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు, 7న అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన, 8న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహారదీక్షలు, 9న అన్ని మండలాల కేంద్రాల్లో నిరాహారదీక్షలు, 18న ఢిల్లీలో మాదిగ ఉద్యోగుల నిరాహార దీక్ష, 19న ఢిల్లీలో మాదిగ మేధావులు, విద్యావంతుల దీక్ష, 20న మాదిగ జర్నలిస్టుల దీక్ష, 21న మాదిగ కళామండలి దీక్ష, 22న మాదిగ లాయర్ల దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పిస్తాం
కోటబొమ్మాళి: రాష్ట్రంలోని 27 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఈ మేరకు రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అసైన్డ్ భూములు పేదలకు చెందేలా... జిరాయితీ భూముల మాదిరిగానే పేదలు అన్ని హక్కులు పొందేలా ఆర్డినెన్స్ తెస్తామని ఆయన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం రేగులపాడులో రూ.80 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్లను శుక్రవారం మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ అనుకున్న పనిని ఎలాగైనా సాధించగలిగే ధీరుడు సీఎం వైఎస్ జగన్ అని, ఎలాంటి వాగ్దానాన్ని అయినా ఆయన అమలు చేయగలరని ప్రశంసించారు. అమరావతిలో ఒకేసారి 50వేల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు మంజూరుచేసి సీఎం జగన్ తన మానవత్వాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. అమరావతిలో పేదలకు నివేశన స్థలాలు, ఇళ్లు ఇస్తే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట... అని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే చంద్రబాబు అండ్‌కో ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని పార్టీలు ఏకమైనా రానున్న ఎన్నికల్లో వైఎస్ జగనే మళ్లీ సీఎం అవుతారని ధర్మాన స్పష్టంచేశారు. సచివాలయ వ్యవస్థతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమూల మార్పులు తెచ్చామన్నారు. కరోనా సమయంలో వలంటీర్లు అందించిన సేవలు మరువలేనివని తెలిపారు. -
ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు మరోమారు అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం
-
15కోట్లతో సౌకర్యాలు మెరుగుపరుస్తాం
-
ఇక పట్టణాల్లోనూ పీహెచ్‌సీలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ) తరహాలో ఇక పట్టణాల్లోనూ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో వైద్యులు, సిబ్బంది సంఖ్యతో పాటు సౌకర్యాలు కూడా మెరుగుపడనున్నాయి. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ మాదిరి కేంద్ర ప్రభుత్వం జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాలో ప్రస్తుతం పట్టణాల్లో నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటిని అర్బన్ పీహెచ్‌సీలుగా మార్చడంతో పాటు, మరో మూడు మున్సిపాలిటీల్లో కొత్తగా అర్బన్ పీహెచ్‌సీలు నెలకొల్పుతారు. ప్రస్తుతం సంగారెడ్డి, సిద్దిపేట మున్సిపాలిటీల్లో రెండేసి చొప్పున మొత్తం నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటిని అర్బన్ పీహెచ్‌సీలుగా మార్చడంతో పాటు మెదక్, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో కొత్తగా అర్బన్ పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తారు. అర్బన్ పీహెచ్‌సీల నిర్వహణకు 2013-14లో రాష్ట్రంలో రూ.210 కోట్లు బడ్జెట్ అవసరమవుతుందని ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు మొదటి ఆరు నెలల్లో రూ.6 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. ఒక్కో అర్బన్ పీహెచ్సీలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టు, ట్రెయినీ అసిస్టెంటు, కంటింజెంట్ వర్కర్ ఒక్కరు చొప్పున ఉంటారు. 50 వేలకు పైబడి జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో ఐదుగురు ఎఎన్ఎంలు, ప్రతీ రెండు వేల మంది మురికివాడల జనాభాకు ఒకరు చొప్పున ఆశా వర్కర్ ఉంటారు. ఇతర రాష్ట్రాల్లో జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ కార్యకలాపాలు ఇప్పటికే ప్రారంభమైనందున త్వరలో రాష్ట్రంలోనూ యూపీహెచ్‌సీలు పనిచేయడం ప్రారంభిస్తాయని ఎన్ఆర్హెచ్ఎం అధికారులు వెల్లడించారు.