PSLV C25
-
ఆ పది నిముషాల్లో ఏం జరిగింది?
-
మ.. మ.. మార్స్
-
పీఎస్ఎల్వీ సీ25 ప్రయోగం విజయవంతం ఫొటో గ్యాలరీ
సూళ్లూరుపేట: అంతరిక్ష రంగంలో భారత్ విజయకేతనం ఎగురవేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ సీ25 ప్రయోగం విజయవంతమైంది. ఈ మధ్యాహ్నం 2.38 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి బయలుదేరిన పీఎస్ఎల్వీ ఉపగ్రహ వాహకనౌక 44 నిమిషాల తర్వాత లక్ష్యాన్ని చేరుకుంది. మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహాన్నినిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతం కావడంతో షార్‌లో సంబరాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తలు పరస్పర అభినందనలు తెలుపుకున్నారు. -
పీఎస్ఎల్వీ సీ25 ప్రయోగం విజయవంతం
-
పీఎస్ఎల్వీ సీ25 ప్రయోగం విజయవంతం
సూళ్లూరుపేట: అంతరిక్ష రంగంలో భారత్ విజయకేతనం ఎగురవేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ సీ25 ప్రయోగం విజయవంతమైంది. ఈ మధ్యాహ్నం 2.38 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి బయలుదేరిన పీఎస్ఎల్వీ ఉపగ్రహ వాహకనౌక 44 నిమిషాల తర్వాత లక్ష్యాన్ని చేరుకుంది. మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహాన్నినిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతం కావడంతో షార్‌లో సంబరాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తలు పరస్పర అభినందనలు తెలుపుకున్నారు. షార్ శాస్తవేత్తలకు ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ అభినందనలు తెలిపారు. ప్రయోగంలో పాలుపంచుకున్న సీనియర్ శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. తొలి ప్రయత్నంలోనే మంగళయాన్ విజయవంతం కావడం పట్ల హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో మార్స్ మిషన్ కీలకమైనది మిషన్ డైరెక్టర్ కున్హికృష్ణన్ అన్నారు. ఈ విజయం తొలి అడుగు అని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్ రామకృష్ణన్ అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల సమిష్టి విజయమిదని షార్ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రయోగంలో పాలుపంచుకున్న వారందరికీ ఇస్రో శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ శివకుమార్ ధన్యవాదాలు తెలిపారు. -
వివాదాస్పదమవుతున్న అంగాకర యాత్ర!
-
వివాదాస్పదమవుతున్న అంగాకర యాత్ర!
హైదరాబాద్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా జరపనున్న అంగారక యాత్ర వివాదాస్పదం అవుతోంది. కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న పనికి నిర్ణయించిన ముహూర్తంపై జ్యోతిష్యులు పెదవి విరుస్తున్నారు. జ్యోతిషశాస్త్రంలో అమంగళానికి చిహ్నమైన మంగళవారం ప్రయోగం జరపడం అంత సమంజసం కాదని ప్రముఖ జ్యోతిష, వాస్తు సిద్ధాంతి పుల్లెల సత్యనారాయణ వాదిస్తున్నారు. అనుకూలమైన శుభ ముహుర్తంలో ప్రయోగం జరిపితే మరిన్ని ఫలితాలు వస్తాయని ఆయన చెబుతున్నారు. మరోవైపు అంగారక యాత్రకు సర్వం సిద్ధమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మంగా చేపడుతున్న మార్స్ మిషన్ కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. 44.5 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ 25 ఉపగ్రహ వాహకనౌక, 1337 కిలోల బరువున్న మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను మోసుకుంటూ ఈ మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగంతో గ్రహాంతర ప్రయోగాలకు భారత్ శ్రీకారం చుట్టనుంది. ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ మాటల్లో చెప్పాలంటే మన సాంకేతిక పరిజ్ఞాన సమార్ధ్యాన్ని ప్రపంచడానికి చాటడమే ప్రధాన లక్ష్యం. అమెరికా, రష్యా, చైనా, యూరప్ తదితరాలు ఇప్పటికే అంగారకుడిపై పరిశోధనలు చేపట్టిన నేపధ్యంలో మనకూ ఆ సామర్ధ్యముందని నిరూపించేందుకు ఈ అంగారకయాత్ర. చేపడుతున్నారు. సుమారు 445కోట్ల వ్యయంతో ఈ అంగారకయాత్ర కోసం చేపట్టారు. ఈ యాత్రను అక్టోబర్ 28నే నిర్వహించాలని ముందుగా నిర్ణయించినా రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ ఇబ్బందికరంగా మారడంతో నవంబర్ 5కు వాయిదావేశారు. అంగారకుడిపైకి వెళ్లాలంటే 30 కోట్ల నుంచి 35 కోట్ల కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంది. దాంతో రాకెట్ గమనాన్ని నిర్ధేశించే రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ కోసం బెంగళూరు ఇస్ట్రాక్ సెంటర్లో 32 డీప్ స్పేష్ నెట్వర్క్, అండమాన్ దీవుల్లోని మరో నెట్వర్క్, స్పెయిన్, ఆస్ట్రేలియా, అమెరికాల్లోని మూడు డీప్ స్పేస్ నెట్‌వర్క్‌లతో పాటు మరో నాలుగు నెట్‌వర్క్‌ల సాయం తీసుకున్నారు. నాలుగో దశలో రాకెట్ గమనాన్ని తెలిపేందుకు దక్షిణ ఫసిపిక్ మహాసముద్రంలో రెండు నౌకలపై తాత్కాలి రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. -
నేడు ‘మార్స్ మిషన్’ రిహార్సల్
శ్రీహరికోట నుంచి సాక్షి ప్రతినిధి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మార్స్ ఆర్బిటర్ మిషన్(ఎంవోఎం) ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఉపగ్రహాన్ని అంగారక గ్రహానికి మోసుకెళ్లేందుకు పీఎస్ఎల్వీ-సీ 25 రెడీ అయ్యింది. ఉపగ్రహ వాహక నౌకను మొదటి లాంచింగ్ ప్యాడ్‌లో సిద్ధం చేశారు. పీఎస్ఎల్వీ -సీ25 ప్రయోగానికి సంబంధించి లాంచ్ రిహార్సల్ గురువారం ఉదయం ప్రారంభం కానుంది. నవంబర్ 3వ తేదీ ఉదయం 6.08 నిమిషాలకు కౌంట్‌డౌన్ మొదలుకానుంది. యాభై ఆరున్నర గంటలపాటు ఈ కౌంట్‌డౌన్ కొనసాగుతుంది. నవంబర్ 5 మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ25 నింగిలోకి దూసుకెళుతుంది. పీఎస్ఎల్వీ-సీ25 ప్రయోగానికి సంబంధించిన వివరాలను ‘సాక్షి’ ప్రత్యేకంగా సేకరించింది. గురువారం లాంచ్ రిహార్సల్ జరగనుండగా.. 2వ తేదీన కౌంట్‌డౌన్‌కు ముందు వ్యవహారాలను ఇస్రో శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తారు. మొత్తం ఐదు దశల్లో భూమి చుట్టూ తిప్పిన తర్వాత ఉపగ్రహాన్ని అంగారకుని వైపు పంపుతారు. డిసెంబర్ 1 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇది అంగారకుని కక్ష్యలోకి చేరుకోవడానికి 300 రోజుల సమయం పడుతుందని అంచనా. 2014 సెప్టెంబర్ నాటికి ఉపగ్రహం అంగారక కక్ష్యలోకి చేరుకునే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. అంగారక వాతావరణంలో మిథేన్ వాయువు ఉనికిని గుర్తించడం, క్యుటీరియం.. హెచ్3వో నిష్పత్తిని అంచనా వేయడం, మార్స్ ఫొటోలు తీయడం రూ. 450 కోట్ల విలువైన ఎంవోఎం ఉపగ్రహ ప్రయోగం ముఖ్య లక్ష్యాలు. ఇందుకోసం ఉపగ్రహంలో ఐదు శాస్త్రీయ పరికరాలను ఇస్త్రో శాస్త్రవేత్తలు ఏర్పాటు చేశారు. మనకున్న పరిమితుల్లో ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఇస్రో చైర్మన్ కె. రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సందర్భంగా బుధవారం ‘షార్’లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపగ్రహం కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆరు రౌండ్ స్టేషన్లను వినియోగిస్తున్నామని, వీటిలో రెండు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని రెండు నౌకల్లో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎస్సీఐ నలంద, ఎస్సీఐ యమునా నౌకలు దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఉపగ్రహాన్ని పర్యవేక్షిస్తాయని చెప్పారు. చంద్రయాన్ 2 గురించి రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగంలో ఉపయోగించే ల్యాండర్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో సొంతంగా తయారు చేసుకోవాలని నిర్ణయించామని, ఇందుకోసం అదనపు నిధులు సమకూర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో చంద్రుడిపైకి మానవసహిత యాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ‘షార్’లో మూడో ప్రయోగ వేదిక నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. సమావేశంలో ఆయనతో పాటు ‘షార్’ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, అసోసియేట్ డెరైక్టర్ వి.శేషగిరిరావు, డెరైక్టర్ కున్ని కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. పది నిమిషాలు గాయబ్ పీఎస్ఎల్వీ-సీ25 శ్రీహరికోట నుంచి ప్రయోగించిన అనంతరం మూడో దశ ముగిసిన తర్వాత ఒక పది నిమిషాల సేపు శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉండదు. ఉపగ్రహం కదలికలను పర్యవేక్షించే గ్రౌం డ్ నెట్‌వర్క్‌ల మధ్య ఇది కదులుతుండటమే దీనికి కారణం. నాలుగో దశ ప్రయోగం మొదలయ్యే కొద్ది సెకన్ల ముందు దక్షిణ పసిఫిక్‌లోని మొదటి కేంద్రం ఉపగ్రహం సంకేతాలను అందుకుంటుంది. -
రజతోత్సవానికి సిద్ధమైన పీఎస్ఎల్వీ సిరీస్
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఐదు దశాబ్దాల్లో ఎన్నో శ్లాఘనీయమైన విజయాలను సాధించింది. ఇందులో పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)దే అగ్రస్థానం. నవంబర్ ఐదున మార్స్ ఆర్బిట్ మిషన్‌ను పీఎస్ఎల్వీ - సీ25 ద్వారా ప్రయోగించనున్నారు. దీంతో పీఎస్ఎల్వీ 25 ప్రయోగాలను పూర్తిచేసుకోనుంది. అంగారక గ్రహం మీద పరిశోధనకు ఉపగ్రహం పంపటం ద్వారా పీఎస్ఎల్వీ సిరీస్ రాకెట్ రజతోత్సవాన్ని జరుపుకోనుండటం ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 1963లో ప్రయోగాలకు శ్రీకారం కేరళలోని తుంబా ఈక్విటోరియల్ రాకెట్ కేంద్రం నుంచి 1963లో ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. 1975లో రష్యా నుంచి మొదటి ఆర్యభట్ట ఉపగ్రహంతో మన ప్రయోగాల పరంపర మొదలైంది. శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి 1979 ఆగస్ట్ 10న ఎస్ఎల్వీ - 3 ఈ1 పేరుతో రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. 1979 నుంచి ఇప్పటివరకు చేపట్టిన 39 ప్రయోగాల్లో ఎనిమిది మినహా, మిగిలినవి విజయవంతమయ్యాయి. ఇటీవల ప్రయోగించ తలపెట్టిన జీఎస్ఎల్వీ- డీ5ను సాంకేతిక లోపంతో ఆపేసిన విషయం తెలిసిందే. ఇస్రో ప్రయోగించిన ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ ఉపగ్రహ వాహకనౌకల్లో పీఎస్ఎల్వీ మాత్రమే తిరుగులేనిదిగా నిలిచింది. 1993లో పీఎస్ఎల్వీ - డీ1 ప్రయోగాలకు శ్రీకారం 1993 సెప్టెంబర్ 20న మొదటిసారిగా పీఎస్ఎల్వీ - డీ1 పేరుతో రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 24 ప్రయోగాలు చేశారు. మొదటి ప్రయోగం మినహా మిగిలినవి విజయవంతమయ్యాయి. 1993లో చేసిన మొదటి ప్రయోగం అపజయం కావడంతో 1994 అక్టోబర్ 15న పీఎస్ఎల్వీ - డీ2 ద్వారా ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ (దూరపరిశీలన ఉపగ్రహం)ను కక్ష్యలోకి విజయవంతంగా పంపారు. 1996 మార్చి 21న పీఎస్ఎల్వీ - డీ3లో కూడా ఐఆర్ఎస్ శాటిలైట్‌ను పంపారు. పీఎస్ఎల్వీ - సీ1 నుంచి సీ25 వరకు అన్ని ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ - 1 మిషన్‌ను పీఎస్ఎల్వీ - సీ11 రాకెట్ ద్వారానే ప్రయోగించడం విశేషం. ఈ రాకెట్ ద్వారా ఇప్పటివరకు ఎక్కువగా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ప్రయోగించారు. కల్పన ఉపగ్రహం, జీశాట్ - 12 అనే కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ను ప్రయోగించారు. పీఎస్ఎల్వీతో రెండురకాలుగా ఉపయోగం పీఎస్ఎల్వీ రాకెట్ రెండురకాల ప్రయోగాలకు ఉపయోగపడుతుంది. తక్కువ బరువున్న ఉపగ్రహాలను భూమికి దగ్గరగా ఉన్న సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లోకి మోసుకెళ్లాలంటే స్ట్రాపాన్ బూస్టర్లు లేకుండా చేస్తారు. అదే బరువైన ఉపగ్రహాలను భూమికి అతి దూరంగా ఉండే జియో సింక్రోనస్ ఆర్బిట్ (భూస్థిర కక్ష్య), భూస్థిర మధ్యం తర బదిలీ కక్ష్యలోకి తీసుకెళ్లాలంటే ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లను ఉపయోగిస్తారు. ఒకేసారి పది ఉపగ్రహాలను మోసుకెళ్లి కక్ష్యలో ప్రవేశపెట్టిన ఘనత, వాణిజ్యపరమైన ప్రయోగాలకు ఉపయోగపడే రాకెట్‌గా పీఎస్ఎల్వీ గుర్తింపు పొందింది. రాకెట్లో ఉపయోగించే కొన్ని విడిభాగాలను మళ్లీ ఉపయోగించుకోవడానికి వీలుండే స్పేస్ క్యాప్సూల్స్ రికవరీ ప్రయోగం నిర్వహించిందీ పీఎస్ఎల్వీ ద్వారానే కావడం విశేషం. విదేశాలకు చెందిన 37 ఉపగ్రహాలను ప్రయోగించి వాణిజ్యపరంగా ఇస్రో ఆదాయం తెచ్చిపెడుతోంది. నవంబర్ 5 మధ్యాహ్నం 2.36 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ - సీ25 షార్ నుంచి చేసే 40వ ప్రయోగం కాగా, పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో 25వది. ప్రస్తుతం అంగారకుడిపై పరిశోధనలు చేయడానికి మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను పంపేందుకు సర్వం సిద్ధం చేశారు. భవిష్యత్తులో చంద్రయాన్ - 2 ఉపగ్రహ ప్రయోగాన్నీ పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారానే చేయనుండటం విశేషం. -
నవంబర్ 6న పీఎస్ఎల్వీ-సీ25 ప్రయోగం?
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పీఎస్ఎల్వీ- సీ25 ప్రయోగం నవంబర్ 6న నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశంలో నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో ఇస్రోలోని పలు సెంటర్ల నుంచి వచ్చిన డెరైక్టర్లతో గురువారం షార్‌లో మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. పీఎస్ఎల్వీ-సీ25 ఉపగ్రహ వాహకనౌక ద్వారా మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహాన్ని అంగారకుడిపై పరిశోధనల నిమిత్తం ఈనెల 28న ప్రయోగించేందుకు సన్నాహాలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఉపగ్రహం అమర్చే ప్రక్రియను కూడా రెండు రోజులకు వాయిదా వేసినట్టు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇండోనేసియాకు రెండువేల కిలోమీటర్ల దూరంలో సముద్రంలోకి వెళ్లి రాడార్ ట్రాకింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సి ఉండడంతో నవంబర్ 6కు ప్రయోగాన్ని వాయిదా వేశారు. దీంతో పాటు మరికొన్ని సాంకేతిక కారణాలతో మార్స్ మిషన్ ప్రయోగాన్ని వాయిదా వేసినట్టు ఇస్రో అధికార వర్గాల ద్వారా తెలిసింది.