Public colleges
-
మిథ్యా బోధన !
సమాజాన్ని ప్రభావితం చేసే సత్తా ఒక గురువుకే ఉంది. తన జీవిత కాలంలో వేల మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దగల నేర్పు, ఓర్పు వీరి సొంతం. అటువంటి మహోన్నతమైన వృత్తిలోకి రాబోతున్న వారికి గుడ్డి శిక్షణ నిచ్చే కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తరగతులకు డుమ్మా కొట్టే చక్కని అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఫీజుల రూపంలో వేల రూపాయలు పిండుతూ నిబంధనలకు తిలోదకాలిస్తున్నాయి. జిల్లాలో ప్రైవేట్ బీఈడీ, డీఈడీ కళాశాలల తీరు ఇది. ఆళ్లగడ్డ టౌన్ : ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలంటే కచ్చితంగా డీఈడీ (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) లేదంటే బీఈడీ(బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్) చదివి ఉండాలి. ఈ కోర్సులకు డిమాండ్ బాగా ఉంది. దీంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. రికార్డుల పరంగా ఉన్న మార్కులను వీరు వజ్రాయుధంగా వాడుకుంటున్నారు. విద్యార్థుల నుంచి వేల రూపాయల్లో అక్రమంగా ఫీజులను దండుకుంటున్నారు. జిల్లాలో 63 సీట్లు ఉన్న ప్రైవేటు డీఎడ్ కళాశాలలు 50, వంద సీట్లు ఉన్న కళాశాలలు నాలుగు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ బీఎడ్ కళాశాలలు 41 ఉన్నాయి. డైట్, ఎడ్ సెట్ అర్హత పరీక్ష రాసి కౌన్సెలింగ్‌లో సీటు సాధించిన వారికే ప్రవేశాలు ఉంటాయి. ప్రభుత్వ కళాశాలో రూ.230, ప్రైవేటు కళాశాలకు అయితే ఏడాదికి రూ. 12500 చొప్పున ఫీజు చెల్లించాలి అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ వసూలు చేయకూడదని నిబంధనలున్నాయి. అయితే ప్రైవేట్ కళాశాలల్లో ఈ నిబంధనలు అమలు కావడం లేదు. ఇవీ నిబంధనలు.. ► నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం ప్రతి కళాశాలలలో పది గదులకు తక్కువ కాకుండా ఉండాలి. ► {పథమ సంవత్సరం పది, ద్వితీయ సంవత్సరం పది సబ్జెక్టులు ఉంటాయి. వీటిని బోధించేందుకు ఎంఎడ్ అర్హత కలిగిన ఒక ప్రిన్సిపాల్ సహా 14 మంది లెక్చరర్లు ఉండాలి. ► అర్హత కల్గిని లైబ్రేరియన్, ఫిజికల్ డెరైక్టర్, కంప్యూటర్ ఫ్యాకల్లీ, ల్యాబ్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరిండెంట్, స్వీపర్, వాచ్మెన్ తదితర సిబ్బంది ఉండాలి. అమలు ఇలా.. ► జిల్లాలోని దాదాపు అన్ని ప్రైవేట్ బీఈడీ, డీఈడీ కళాశాలల్లో ఎక్కడా వసతులు లేవు. ► ఒక్కో కళాశాలలో ఇద్దరు లేక ము గ్గురు మాత్రమే సిబ్బంది ఉంటూ అన్ని తామై విధులు దులు నిర్వహిస్తున్నారు. ► కొన్ని చోట్ల అటెండర్ నుంచి మొదులుకుని క్లర్క్, ప్రిన్సిపాల్, లెక్చరర్ అన్నీ వారే అవుతున్నారు. ► ఆళ్లగడ్డ పట్టణంలో ఒకేచోట ఉన్న ఒక బీఈడీ, రెండు డీఈడీ కళాశాల్లో మొత్తం మూడు కళాశాలలకు కలిపి ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ► మరో చోట ఉన్న బీఈడీ, డీఈడీ రెండు కళాశాలకు కలుపుకొని ఒక్క రే ప్యూన్ నుంచి ప్రిన్సిపాల్ వరకు వ్యవహరిస్తున్నారు. ► కొన్ని కళాశాలల్లో కనీసం విద్యార్థులు కూర్చునేందుకు అవసరమైన బెంచీలు కూడా లేవు. ఇవీ ఆఫర్లు ► తరగతులకు రానవసరం లేదు. రికార్డులు రాయనవసరం లేదు. ప్రయోగ పరీక్షలు మేమే చేస్తాం. అయితే ఒక్కో విద్యార్థి రూ. 40 వేల నుంచి రూ. 60 వేలు చెల్లిస్తే చాలు అంటూ కొన్ని కళాశాలలు ఆఫర్లు ఇస్తున్నాయి. ► తరగతులకు రెగ్యులర్‌గా హాజరయ్యేవారు రూ. 100 కూడా చేయని రికార్డులను రూ. 6 వేల నుంచి రూ. 8 వేల వరకు వెచ్చించి కచ్చితంగా కొనుగోలు చేయాల్సిందే. -
ఫలితాల్లో జూనియర్ ఇంటర్ విద్య.. మిథ్య
- డోన్ ప్రభుత్వ కళాశాలలో 125 మంది విద్యార్థులకు గాను 17 మంది మాత్రవే ఉత్తీర్ణులయ్యారు. - ఆదోని ప్రభుత్వ బాలికల కళాశాలలో 183 మంది విద్యార్థినులకు గాను 41 మంది పాసయ్యారు. - ఎమ్మిగనూరు ప్రభుత్వ బాలుర కళాశాలలో 367 మందికి 94 మంది మాత్రమే ఉత్తీర్ణతసాధించారు. - కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాల(టౌన్)లోనూ ఫలితాలు 48.90 శాతం మించని పరిస్థితి. - కాంట్రాక్టు అధ్యాపకులతోనే బోధన - జిల్లాలో 70 శాతం వారే.. - అధ్యాపకులే లేని కాలేజీలు రెండు కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లాలోని కొన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్య అగమ్యగోచరంగా మారింది. కాస్త మెరిట్ విద్యార్థులంతా ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో చేరుతుండగా.. సాధారణ విద్యార్థులు అధిక శాతం ప్రభుత్వ జూనియర్ కళాశాలల వైపే అడుగేస్తున్నారు. అయితే ప్రభుత్వ కళాశాలలపై నియంత్రణ లేకపోవడం, అధ్యాపకుల కొరత కారణంగా ఉత్తీర్ణత శాతం నేలచూపులు చూస్తోంది. రెగ్యులర్‌కు మించి కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నా.. మొత్తం 41 కాలేజీల్లో 30 చోట్ల జూనియర్ ఇంటర్ ఉత్తీర్ణత 50 శాతంలోపే ఉండటం గమనార్హం.జిల్లాలో 41 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 516 పోస్టుల్లో 180 మంది రెగ్యులర్.. 296 పోస్టుల్లో కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. గత యేడాది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కాంట్రాక్టు అధ్యాపకుల నియామకాలను సైతం నిలిపేసి.. వారి స్థానంలో ఖాళీగా ఉన్న 40 పోస్టుల్లో గంటల లెక్కన పనిచేసేందుకు రిటైర్డ్ అధ్యాపకులను నియమించాలని ఆదేశింది. అది కూడా విద్యాసంవత్సరం సగం ముగిసిన తర్వాత నవంబర్‌లో ఈ ప్రకటన చేసింది. దీంతో చాలా చోట్ల రిటైర్డ్ అధ్యాపకులను నియమించలేకపోయారు. ఈ కారణంగా ప్రస్తుతం 40 పైగా పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. దీబగుంట్ల, కర్నూలులోని మైనార్టీ కాలేజీలు మంజూరైనా పోస్టులు ఇవ్వలేదు. దీంతో ఈ రెండు కాలేజిల్లోనూ గంటల లెక్కన అధ్యాపకులను నియమించారు. అది కూడా అరకొరగా నియమించడంతో ఆశించిన ఫలితాలు నమోదు కాలేదు. ఆర్ఐవో, డీవీఈవోలూ ఇన్‌చార్జీలే.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలను పర్యవేక్షించేందుకు రీజినల్ ఇన్స్పెక్టింగ్ అధికారి(ఆర్ఐవో)లను నియమించింది. రాష్ట్రంలో కేవలం నెల్లూరు, గుంటూరు మినహా అన్ని చోట్లా ఆర్ఐఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ ప్రిన్సిపాళ్లను ఇన్‌చార్జీలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కర్నూలు ఆర్‌ఐఓగా కోడుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, జిల్లా వృత్తి విద్యాధికారిణిగా ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సాలాబాయి ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ ఫలితాలపై ప్రభావం : ఆర్ఐఓ, డీవీఈవో, నాలుగు ప్రిన్సిపాల్, భారీగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆ ప్రభావం ఇంటర్మీడియట్ ఫలితాలపై ప్రభావం చూపుతోంది. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నామని చెబుతున్నా ఆశించిన ఫలితాలు మాత్రం నమోదు కావడం లేదు. ఆర్ఐఓ కార్యాలయం పక్కనే ఉన్న టౌన్ మోడల్ కాలేజిలోనూ ఫలితాలు 50శాతం కూడా నమోదు కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.