Public court
-
ప్రజా కోర్టులో చంద్రబాబు దోషి
- ఎన్నికల హామీలను విస్మరించిన సీఎంకు గుణపాఠం తప్పదు - రాజధాని అభివృద్ధి అంటూ ప్రజా ధనం దుర్వినియోగం - కాటసాని రామిరెడ్డికి ప్రజాదరణ పెరుగుతోంది - బనగానపల్లె ప్లీనరీలో గౌరు వెంకటరెడ్డి బనగానపల్లె: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా కోర్టులో దోషిగా నిలబడాల్సి వస్తుందని జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చేందుకు 600 అబద్దపు హామీలు ఇచ్చి విస్మరించిన సీఎంకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బనగానపల్లె హరిహర జూనియర్ కళాశాల సమీపంలో శుక్రవారం బనగానపల్లె నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన ప్లీనరీని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గౌరు మాట్లాడుతూ 2014లో జిల్లాలో వైఎస్సార్సీపీ 11 సీట్లతో పట్టు సాధించిందన్నారు. 2019 ఎన్నికల్లో పత్తికొండ నుంచి చెరకులపాడు నారాయణరెడ్డి, బనగానపల్లె నియోజకవర్గం నుంచి కాటసాని రామిరెడ్డిలు భారీ మెజార్టీతో గెలుపొందుతారనే ఇంటెలిజెన్స్ నివేదికలు ప్రభుత్వానికి చేరాయని చెప్పారు. దీంతో రాజకీయంగా ఎదుర్కోలేకనే పత్తికొండ నియోజకవర్గ నాయకుడు చెరకులపాడు నారాయణరెడ్డిని హత్య చేయించారని ఆరోపించారు. టీడీపీ పాలనలో ప్రజా సంక్షేమం కనుమరుగైందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లులు మంజూరు కాగా, టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీల ద్వారా తెలుగుతమ్ముళ్లకే ఇళ్లు కేటాయిస్తుందని విమర్శించారు. బనగానపల్లె నియోజకవర్గంలో కాటసాని కుటుంబం 30 సంవత్సరాలుగా ప్రజలకు అండగా ఉంటుందన్నారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా బనగానపల్లె ప్లీనరీకి భారీ స్థాయిలో కార్యకర్తలు తరలిరావడం చూస్తే వచ్చే ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం తథ్యమన్నారు. కుట్రలతో అడ్డుకోలేరు: బీవై రామయ్య, రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి కుట్రలు, కుతంత్రాలతో వైఎస్ఆర్సీపీని అడ్డుకోలేరు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ కార్యకర్తల నుంచి నాయకుల వరకు దోచుకోవడం, దాచుకోవడం, అధికారులను బెదిరించడం, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం తప్ప చేసేందేమి లేదు. రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, ముస్లిం మైనార్టీల మధ్య చిచ్చు పెడుతూ నిధులు మంజూరు చేయడం లేదు. ముస్లిం మైనార్టీ శాసనసభ్యులు ఉన్నప్పటికి ఒక్క ముస్లిం ఎమ్మెల్యేకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. రాష్ట్రంలో రామరాజ్యం రావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. టీడీపీపై అసంతృప్తికి ఇదే నిదర్శనం : బుడ్డా శేషారెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి అవినీతి ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైఎస్ పాలనలో అమలుపరిచిన అభివృద్ధి పథకాలను నేడు చంద్రబాబు ప్రభుత్వం పేర్లు మార్చినా విజయవంతంగా అమలు చేయలేకపోయారు. టీడీపీపై రోజురోజుకు ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ప్లీనరీకి భారీగా తరలివచ్చిన కార్యకర్తలే ఇందుకు నిదర్శనం. లోకేష్ మంత్రిగా అనర్హుడు : రాజగోపాల్‌రెడ్డి , నంద్యాల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే లోకేష్ ఓటమి చెందుతాడన్న భయంతోనే ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రి పదవి కట్టబెట్టారు. వర్ధంతికి, జయంతికి తేడా తెలియని లోకేష్ మంత్రిగా అనర్హుడు. ప్రజాదరణ ఉన్న నాయకుడు ప్రజల్లో నుంచి వస్తారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో సార్లు తన పదవులకు రాజీనామా చేసి అఖండ మెజార్టీతో గెలిచారు. -
ప్రజా కోర్టులో మోదీని శిక్షించాలి
తిరుపతి (అలిపిరి) : ఆర్థిక ఎమర్జెన్సీకి కారణమైన ప్రధాని నరేంద్ర మోదీ ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కును కోల్పోయారని, ప్రజా కోర్టులో ఆయనను శిక్షించాలని సీపీఐ జాతీ య కార్యదర్శి నారాయణ అన్నారు. నోట్ల రద్దుకు నిరసనగా ఆయన మంగళవారం కార్యకర్తలతో కలిసి తిరుపతిలోని ఎస్బీఐ పరిపాలన భవనం ఎదుట ధర్నా చేశారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నారాయణ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుతో ప్రజా జీవనం అస్తవ్యస్తమైందన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పెద్దనోట్లను రద్దు చేసి, సామాన్యులను కష్టాల పాలు చేసిన మోదీ శిక్షార్హుడని అన్నారు. కరెన్సీ కష్టాలతో 50 మందికిపైగా మృత్యువాతపడినా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మోదీ తక్షణం పదవికి రాజీనామా చేసి వెంటనే జాయింట్ పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సిన ఆర్బీఐ గవర్నర్ ప్రజా అవసరాల దృష్ట్యా రూ.50, రూ.100 నోట్లను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నారాయణ అరెస్ట్‌తో ఉద్రిక్తత.. ఎస్బీఐ పరిపాలన భవనం ఎదుట ధర్నా అనంతరం సీపీఐ నారాయణ కార్యకర్తలతో కలిసి అక్కడున్న ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈస్ట్ పోలీసులు అక్కడికి చేరుకుని నారాయణతో పాటు పార్టీ జిల్లా నాయకులను అరెస్ట్ చేసి, వాహనంలో తరలించే ప్రయత్నం చేశారు. ఆగ్రహించిన కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకుని నిరసనకు దిగారు. వారిని తోసుకుంటూ పోలీసులు నారాయణను ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అరెస్ట్ అయిన వారిలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకయ్య, జయమ్మ, పెంచులయ్య, రవి, రాధాకృష్ణ, చంద్రశేఖర్ నాయుడు, శివారెడ్డి, సత్తి, కత్తి రవి ఉన్నారు. -
ప్రజా కోర్టులో బాబు ఖైదీ
- ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు - ప్రత్యేక హోదా కావాలో.. వద్దో టీడీపీ ఎంపీలు, మంత్రులు తేల్చి చెప్పాలి - 29న రాష్ట్ర బంద్‌కు అందరూ మద్దతు ఇవ్వాలి - వైఎస్ఆర్సీపీ జిల్లా విస్తృత సమావేశంలో పరిశీలకుడు మేరుగ నాగార్జున కడప కార్పొరేషన్ : ఇచ్చిన హామీలన్నీ మాఫీ చేసి, ప్రత్యేక హోదాపై డ్రామాలాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా కోర్టులో ఖైదీగా నిలబడక తప్పదని వైఎస్ఆర్సీపీ జిల్లా పరిశీలకుడు మేరుగ నాగార్జున హెచ్చరించారు. కడపలోని అపూర్వ కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించిన ఆ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలు విస్మరిస్తున్న టీడీపీ ప్రభుత్వాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటాడుతున్నారన్నారు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా మోసం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజ వనరులను ఆ పార్టీ నేతలు దోచుకుంటున్నారని, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. విద్యా వ్యవస్థను నాశనం చేశారని, పరిపాలన గాలి కొదిలేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కావాలా.. వద్దా అనేది టీడీపీ ఎంపీలు, మంత్రులు తేల్చి చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా అంటే తనకు తెలీదని ఒక ఎంపీ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఈ నెల 29వ తేదీన కనీ, వినీ ఎరుగని రీతిలో బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. మరో పరిశీలకుడు, నగర మేయర్ కె.సురేష్‌బాబు మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తే కేంద్ర నిధులన్నీ గ్రాంటు రూపంలో వస్తాయన్నారు. ఆ నిధులను తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్‌ను కాదని, బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.1.25 లక్షల కోట్లు ఇస్తామని ప్రకటించడం దారుణం అన్నారు. జెడ్పీ చైర్మన్ గూడూరు రవి మాట్లాడుతూ పచ్చచొక్కాలు వేసుకొన్నవారికే ఈ ప్రభుత్వంలో పనులు జరుగుతున్నాయన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదన్నారు. శవ రాజకీయాలు చేసింది ఎవరు? గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన బెట్టుకొని శవ రాజకీయాలు చేసిందెవరని రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును జైల్లో పెడతారనే ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలు, మంత్రులు మాట్లాడటం లేదన్నారు. ప్రధాని న రేంద్ర మోదీ తీరు చంద్రబాబును మరిపిస్తోందని దుయ్యబట్టారు. కడప శాసన సభ్యుడు ఎస్బి అంజద్‌బాషా మాట్లాడుతూ విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం బుట్టదాఖలు చేస్తోందన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన వాగ్దానాలు, చేసిన బాసలు మర్చిపోయాయని, కర్రు కాల్చి వాత పెడితేనే వాటిలో చలనం వస్తుందన్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ బంద్‌ను నిర్వీర్యం చేయాలనే కుట్రలను తిప్పికొట్టాలన్నారు. డిప్యూటీ మేయర్ బి. అరీఫుల్లా మాట్లాడుతూ పక్కా ప్రణాళికతో బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ నెల 29న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలనే పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశం ప్రారంభంలో ఇటీవల నారాయణ కళాశాలలో నందిని, మనీషాల మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. సమావేశంలో వైఎస్ఆర్సీసీ సీనియర్ నాయకులు నవనీశ్వర్‌రెడ్డి, గౌసులాజం, జిల్లా అధికార ప్రతినిధులు టీకే అఫ్జల్ఖాన్, జి. రాజేంద్రరెడ్డి, నగర అధ్యక్షుడు నిత్యానందరెడ్డి, అనుబంధ విభాగాల అధ్యక్షులు పులిసునీల్, వేణుగోపాల్‌నాయక్, నాగేంద్రారెడ్డి, బంగారు నాగయ్య, కరిముల్లా, చల్లా రాజశేఖర్, షఫీ, ఖాజా, ఏ. సుబ్బరాయుడు, త్యాగరాజు, ఆదిత్య, సాయిచరణ్, టీపీ వెంకట సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. బంద్‌ను విజయవంతం చేయాలి తుపాకులు ఎక్కుపెట్టినా, బుల్లెట్ల వర్షం కురిసినా ఈ నెల 29న బంద్‌ను విజయవంతం చేయాలి. రాష్ట్ర విభజనకు మూల కారణం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలే. ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నాడు ప్రధాని ప్రకటిస్తే, ఐదేళ్లు సరిపోదు.. పదేళ్లు కావాలని అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు పట్టుబట్టారు. నేడు వారు కేంద్ర మంత్రులై ఉండీ ప్రత్యేక హోదాపై నోరుమెదపడం లే దు. గట్టిగా మాట్లాడితే జైలుకు పంపుతారేమోనని చంద్రబాబు మౌనం విహ స్తూ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. - ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు -
ఓసీటీఎల్ కార్మికులకు అన్యాయం చేస్తే
* ప్రజాకోర్టులో శిక్ష తప్పదు * మంత్రులు నాయిని, హరీశ్‌లకు మావోయిస్టు పార్టీ హెచ్చరిక సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆంధ్రప్రాంత పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ తెలంగాణ కార్మికులను రోడ్డున పడేస్తున్నారని సీపీఐ మావోయిస్టు తెలంగాణ కమిటీ, విప్లవ కార్మిక సమాఖ్య (వికాస)లు ఆరోపించాయి. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి సమీపంలో ఉన్న ఓసీటీఎల్ సంస్థ యాజమాన్యం మోచేతి నీళ్లు తాగి 500 మంది కార్మికుల కుటుంబాలకు నిలువ నీడ లేకుండా చేస్తున్న ట్రేడ్ యూనియన్లు, ప్రజాసంఘాల కార్మిక వైఖరిని ఖండిస్తున్నామని వికాస రాష్ట్ర కార్యదర్శి ఆజాద్ పేరుతో కరపత్రాలు వెలువడ్డాయి. ఈ కరపత్రాలను బుధవారం ‘సాక్షి’ కార్యాలయానికి పంపారు. గత 28 ఏళ్లుగా ఓసీటీఎల్‌లో పనిచేస్తున్న కార్మికులకు నెలకు రూ.8 వేల కనీస వేతనం కూడా ఇవ్వడం లేదంటూ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంలకు ఎన్నిసార్లు కార్మికులు మొరపెట్టుకున్నా వారి సమస్యలను పరిష్కరించలేదని ఆ కరప్రతంలో పేర్కొన్నారు. ఓసీటీఎల్ యాజమాన్యంతో కుమ్మక్కయి కార్మికులకు ద్రోహం తలపెడుతున్న ఈ కార్మిక ద్రోహులను ఎండగట్టాలని పిలుపునిస్తున్నామని, కార్మికులకు అన్యాయం చేస్తే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఓసీటీఎల్ సీఎండీ కామినేని సూర్యనారాయణ, మేనేజర్ వేణుబాబు తమ పద్ధతులు మార్చుకోకపోతే కార్మిక ద్రోహులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. -
ఢిల్లీ అబ్ బహుత్ దూర్ హై!!
ఓటుకు నోటు వ్యవహారంలో ప్రజా కోర్టు ఇప్పటికే చంద్రబాబును దోషిగా నిర్ధారించింది. ఇక కోర్టులో ఏం జరుగుతుందనేది ఒక సాంకేతిక ప్రక్రియ మాత్రమే. అక్కడ నుండి బయటపడటానికి ఉన్న సాంకేతిక రంధ్రాల కోసం వారూ, వారి న్యాయ సలహాదారులూ పగలూ రాత్రి మేధోమథనం చేస్త్తున్నారు. ప్రజాజీవితంలో బాధ్యతగల స్థానాల్లో ఉన్నవాళ్ల మీద ఆరో పణలు రావడం కొత్తకాదు. అలాంటప్పుడు వాళ్ళు రెండు పనులు చేయాలి. మొదటిది, తమను నమ్మి ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను అప్పగించి న ప్రజలకు ఘటనల పూర్వా పరాలను వివరించి, తమవల్ల ప్రత్యక్షంగానో పరోక్షంగానో జరిగిన తప్పులకు క్షమాప ణలు కోరడం. రెండోది, న్యాయప్రక్రియకు సిద్ధపడటం. తన మీద, తన పార్టీ మీద బలమైన ఆరోపణలు వచ్చిన పుడు నిర్వర్తించాల్సిన ప్రాణప్రదమైన కర్తవ్యాల్ని ఆం ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో ప్రజా కోర్టు ఇప్పటికే చంద్రబాబును దోషిగా నిర్ధారించింది. ఇక కోర్టులో ఏం జరుగుతుందనేది ఒక సాంకేతిక ప్రక్రియ మాత్రమే. అక్కడ నుండి బయటపడటానికి ఉన్న సాంకేతిక రంధ్రాల కోసం వారూ, వారి న్యాయ సలహాదారులూ పగలూ రాత్రి మేధోమథనం చేస్త్తున్నా రు. న్యాయకోవిదులు కోర్టుల్లో సకల మోళీలను, గారడీ లను ప్రదర్శించి సూది బెజ్జమంత రంధ్రంలోంచి ఏను గుల్లాంటి దోషుల్ని బయటపడేస్తుంటారు. ఈ కథను చాలా మంది చదివే ఉంటారు. మహారాణి తప్ప మరె వరూ ఏడు గుర్రాల బగ్గీని వాడకూడదని ఇంగ్లండులో ఒక చట్టం ఉండేది. ఒకడెవరో ఏడు గుర్రాల బగ్గీలో లం డన్ వీధుల్లో తిరిగితే, అరెస్టు చేసి బోనెక్కిస్తారు. తెలివైన అతని లాయరు ఏడోది గుర్రం (హార్స్) కాదనీ, ఆడ గుర్రం (మేర్) అని నిరూపించి తన కక్షిదారుడ్ని నిర్దోషి గా బయటపడేస్తాడు. చట్టంలో ఇలాంటి ఏ సాంకేతిక రంధ్రాన్నయినా కనిపెట్టి కేసు నుండి బయటపడాలని చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. లాయర్ల సలహాల మేరకు కొందరు నిందితులు బోనెక్కాక అనేక ప్రశ్నలను ‘కాదు’ ‘తెలీదు’ వంటి జవా బులతో, మౌనంతో దాటవేస్తారు. లీగల్ కోర్టులో చేసి నట్టు ప్రజాకోర్టులోనూ టెక్నికల్‌గా వ్యవహరించడమే చంద్రబాబు ప్రత్యేకత. ఆయన అచ్చమైన హైటెక్కు నేత! రేవంత్ రెడ్డి వీడియో క్లిప్పింగుల మీద, వాటిలో ప్రస్తావనకు వచ్చిన రాజకీయ, ప్రాంతీయ, కులసమీకర ణల మీద రెండు రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోంది. ఆ అంశాలపై నోరు తెరవడానికి బాబు సిద్ధంగా లేరు. మౌనం అర్థాంగీకారం అవుతుందని గుర్తించే స్థితిలోనూ లేరు. ఆ క్లిప్పింగుల పుట్టుక చట్టబద్ధంగానే సాగిందా? ఒక సీఎం మీద ఏసీబీ స్టింగ్ ఆపరేషన్లు, ఫోన్ ట్యాపిం గులు చేయడం చట్టసమ్మతమా? వగైరా సాంకేతిక అంశాల మీదనే ఉంది వారి ధ్యాసంతా. ఏపీకి రావల సిన రాయితీలు, సౌకర్యాలు, వెసులుబాటులు, జాతీయ స్థాయి విద్యా, వైద్య, సాంకేతిక సంస్థలు, మౌలికరంగ పథకాలు చాలా ఉన్నాయి. రాయలసీమను, ఉత్తరాం ధ్రలో మూడు జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా ప్రకటించాల్సి ఉంది. మొత్తంగా కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉంది. వీటి సాధనకు చంద్రబాబు పోరాటం చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా వారి పోరాటం తనను గెలిపించిన ఏపీ ప్రజల కోసం కాదు... హైదరాబాద్‌లో గవర్నర్‌కు విశేషాధికారాల సాధన కోసం. ఇదో రాజకీయ వైచిత్రి! ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఇప్పుడు రెండు విరుద్ధ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఒకైవైపు, ఏపీ సీఎం గవర్నర్ తన విశే షాధికారాలను ప్రయోగించాలని ప్రాధేయపడుతుంటే, మరోవైపు, తెలంగాణ సీఎం గవ ర్నర్‌ను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఢిల్ల్లీలోనూ దాదాపు ఇదే సీన్. ఏపీ సీఎం ఢిల్లీ వెళ్లినా జరగని పనులు తెలం గాణ సీఎం ఢిల్లీ వెళ్లకపోయినా జరిగిపోతున్నాయి. బాబు ఢిల్ల్లీ పర్యటనలో ఉండగానే తెలంగాణలోని యాదాద్రి-వరంగల్ నాలుగు లేన్ల రోడ్డు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది! ప్రధాని నరేంద్ర మోదీ అచ్చమైన గుజరాతీ వ్యాపా రి. చంద్రబాబు ఆస్థి ఖాతా అనుకుంటే ఎదురొచ్చి స్వాగ తం పలుకుతారు... వ్యయం ఖాతా అనుకుంటే పలక రించడానికీ ఆసక్తి చూపరు. ఇలాంటి విషయాలను రాష్ర్టస్థాయిలోనే పరిష్కరించుకోవాలేగానీ ఢిల్లీ వరకు తేకూడదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అనడం ఢిల్లీలోని కొత్త పరిణామాలకు ఒక సంకేతం. మోదీ ప్రభుత్వానికి ఏపీ రాయబారిగా ఉంటున్న వెంకయ్య నాయుడు కూడా ఈ కష్టకాలంలో బాబుతో అంటీ ముట్టనట్ట్టుగా ఉంటున్నారు. ఢిల్లీలో మోదీతో చంద్ర బాబు ఏం మాట్లాడారో గానీ.. హైదరాబాద్ తిరిగి రాగానే ప్రధానికి సుదీర్ఘ లేఖ రాశారు. ప్రధానితో ఎక్కు వగా మాట్లాడే అవకాశం బాబుకు దక్కలేదనే ఇది సూచి స్తోంది. చంద్రబాబుకు ఢిల్ల్లీ అబ్ బహుత్ దూర్ హై!! చంద్రబాబు లేఖ ప్రధాని కార్యాలయానికి చేరక ముందే...హైదరాబాద్‌లో ఆంధ్రులకు భద్రత లేదనడం చంద్రబాబు అపోహేనంటూ ఆ లేఖలోని ప్రధాన అం శాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి ఖండించా రు. కేసీఆర్‌తో పాటు చంద్రబాబు కూడా యోగా శిబిరా నికి వచ్చి మానసిక వత్తిడిని దూరం చేసుకోవాలని హితవు చెప్పారు. యోగముద్రలో ఉన్న జనసేన అధి నేత పవన్ కల్యాణ్ స్పందించలేదు. ఒకవేళ స్పందిం చినా అది బాబుకు ప్రతికూలంగా ఉండే అవకాశాలే ఎక్కువ. మిత్రపక్షాలు కూడా చంద్రబాబుకు దూరం అవుతున్నాయనడానికి ఇవన్నీ సంకేతాలు కావచ్చు. (రచయిత సీనియర్ పాత్రికేయుడు, సమాజ విశ్లేషకుడు) మొబైల్: 9010757776 -
చైనాలో నరహంతకులకు మరణశిక్ష
బీజింగ్: చైనాలోని ఓ రైల్వే స్టేషన్లో ప్రయాణికులపై కత్తులతో విరుచుకుపడి రక్తపాతం సష్టించిన ముగ్గురు నరహంతకులకు అక్కడి ఓ కోర్టు శుక్రవారం మరణశిక్ష ప్రకటించింది. ఇదే కేసులో మరో నిందితురాలికి జీవిత ఖైదును ఖరారు చేసింది. ఈ ఏడాది మార్చి 1న జింజియాంగ్ ప్రావిన్స్ పరిధిలోని కున్మింగ్ పట్టణ రైల్వే స్టేషన్లోకి కొందరు దుండగులు కత్తులతో చొరబడి కనిపించిన వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఆనాటి దాడిలో 31 మంది ప్రాణాలు కోల్పోగా, 141 మందికి గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలంలోనే నలుగురు నిందితులను హతమార్చగా... మరో నలుగురిని నిర్బంధంలోకి తీసుకున్నారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు శుక్రవారం కున్మింగ్ ప్రజా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. వీరికి అల్‌ఖైదా మద్దతు ఉందని నివేదించారు. విచారణ అనంతరం నిందితులు ఇస్కంద్ ఎహెట్, తుర్గున్ తోహ్తుయాంజ్, హసిన్ మొహమ్మద్‌కు మరణశిక్షను విధిస్తున్నట్లు కోర్టు తీర్పు వెలువడింది. -
‘మావో’..రేవో!
బాక్సైట్‌పై మన్యంలో మళ్లీ అలజడి బహిరంగంగా మావోయిస్టుల సభలు భారీ విధ్వంసాలకు వ్యూహం? ఆంధ్రా-ఒడిశా సరిహద్దు, విశాఖ ఏజెన్సీలో మళ్లీ యుద్ధమేఘాలు అలముకున్నాయి. బాక్సైట్‌పై చావో రేవో అన్నట్లు మావోయిస్టులు ఉద్యమాన్ని ముందుకు నడపాలని భావిస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లూ కాస్త ప్రశాంతంగా ఉన్న మన్యంలో మళ్లీ అలజడి మొదలైంది. మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని, కేవలం మిలీషియా వ్యవస్థే కొద్దిపాటిగా పని చేస్తోందని పోలీసు యంత్రాంగం భావిస్తున్న తరుణంలో.. అగ్నికి ఆజ్యం పోసినట్లు బాక్సైట్ తవ్వకాలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రశాంతమైన మన్యంలో అశాంతికి కారణమైంది. పాడేరు: గిరిజనుల్లో తమ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే లక్ష్యంతో మావోయిస్టులంతా బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రధాన అజెండాగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీలో బాకై ్సట్ తవ్వకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకూలంగా ఉండటంతో ఈ చర్యలను అడ్డుకునే ప్రయత్నంలో బాకై ్సట్ వ్యతిరేక ఉద్యమాన్ని మావోయిస్టులు ఉధృతం చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఉద్యమంతో మావోయిస్టు పార్టీ గిరిజనులతో మమేకమయ్యేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా మారుమూల పల్లెల్లో ప్రజాకోర్టుల నిర్వహణను వేగవంతం చేస్తోంది. ఏజెన్సీలోని అన్ని రాజకీయపక్షాలు, ప్రజా సంఘాలను కూడా బాకై ్సట్ ఉద్యమానికి సహకరించాలని మావోయిస్టు పార్టీ ప్రకటనలు చేస్తోంది. అలజడి మొదలైంది ఇలా..! కొద్దిరోజుల క్రితం జి.మాడుగుల మండలంలోని మారుమూల కిల్లంకోట ప్రాంతంలో పోలీసు ఇన్ఫార్మర్ పేరిట బాలకృష్ణ అనే గిరిజనుడిని మావోయిస్టులు హతమార్చి పోలీసులకు సవాల్ విసిరారు. ప్రజాకోర్టును నిర్వహించారు. తాజాగా శనివారం కొయ్యూరు, జీకేవీధి మండలాల సరిహద్దులో గాలికొండ దళ సభ్యుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాక్సైట్ వ్యతిరేక సదస్సును నిర్వహించిన విషయం విదితమే. ఈ సదస్సుకు ఆదివాసీలు అధిక సంఖ్యలో హాజరుకావడంతో మావోయిస్టు పార్టీలో నూతనోత్సాహం ఏర్పడింది. అలాగే ఒడిశాలోని మాచ్‌ఖండ్ ఏఎస్ఐ నివాస గృహంలో బాంబులు అమర్చి మరింత భయభ్రాంతులకు గురి చేశారు. ఇదే తరహాలో అన్ని మారుమూల గ్రామాల్లోనూ బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాల పేరిట సదస్సులు నిర్వహించేందుకు మావోయిస్టు పార్టీ నేతలు నిర్ణయించినట్లు సమాచారం. మావోయిస్టు పార్టీకి కొత్త క్యాడర్? ఏఓబీ, విశాఖ ఏజెన్సీలోని మావోయిస్టు కార్యకలాపాలను మరింత ముమ్మరం చేసేందుకు కొత్తక్యాడర్ రూపుదిద్దుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మావోయిస్టు అగ్రనేతలు ఇటీవల ఏఓబీలో సంచరించి కీలకమైన సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. అయితే ఛతీస్ఘడ్ రాష్ట్రంలో పని చేసిన కొంత మంది మావోయిస్టు నేతలను ఏఓబీలోకి రప్పించినట్లు తెలుస్తుంది. గాలికొండ, కోరుకొండ దళాల్లో కూడా కొత్తక్యాడర్ నియమితులైనట్లు సమాచారం. మరికొన్ని ప్రాంతాలను వేదికగా చేసుకొని కొత్త దళాల ఏర్పాటు, యువతను భాగస్వామ్యం చేసి మావోయిస్టు ఉద్యమాన్ని మరింత ఉధతం చేసే ఆలోచనలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. మారుమూల గ్రామాల్లో గ్రామస్థాయి పోరాట కమిటీలను ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నట్లు వినికిడి. పోలీసుల్లో గుబులు! మావోయిస్టుల ఉనికి లేదంటున్న పోలీసు ఉన్నతాధికారులు ఇప్పుడు బాక్సైట్ ఉద్యమ నేపథ్యంలో మళ్లీ గట్టి నిఘా పెట్టాల్సివస్తోంది. ఇందుకు ఇన్ఫార్మర్ల వ్యవస్థపైనే వారు అధికంగా దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఉలిక్కిపడిన పోలీసులు సీలేరు : మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఒకే రోజు మావోయిస్టులకు సంబంధించిన సంఘటనలు చోటు చేసుకోవడంతో ఈ ప్రాంత పోలీసులు ఉలిక్కి పడ్డారు. కొయ్యూరు, జీకేవీధి సరిహద్దు ప్రాంతాల్లో బహిరంగ సభ పెట్టడం, ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులకు, పోలీసులకు ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందడం, ఒడిశా ఒనకఢిల్లీలో ఒక పోలీసు అధికారి ఇంటిలో మావోయిస్టులు బాంబు పెట్టారన్న అంశాలు కలకలం రేపడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమై ఆదివారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. సీలేరులో ఆదివారం జరిగిన వారపుసంతలో సీఆర్పీఎఫ్ బలగాలు అణువణువూ గాలింపు చేపట్టారు. అనుమానితులను ఆరాతీసి విడిచిపెట్టారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఎవరైనా చర్యలకు ఉపక్రమిస్తే బుద్ధి చెబుతామని ప్రకటించడంతో, అధికార పార్టీ కావడంతో టీడీపీ నాయకులకు గుబులు పట్టుకుంది. -
బాలకృష్ణను 21నే చంపేశారు
కిల్లంకోటలో ప్రజాకోర్టు ఇన్ఫార్మర్గా తేల్చి ఘాతుకం పాడేరు: మావోయిస్టుల ఘాతుకానికి బలైన మరో గిరిజనుడు బాలకృష్ణ గురువారమే ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది. పోలీసు ఇన్ఫార్మర్గా వ్యవహరించారనే ఆరోపణలతోనే జి.మాడుగుల మండలం కిల్లంకోట కాలనీ గ్రామానికి చెందిన బచ్చెలి బాలకృష్ణ (40)ను మావోయిస్టులు హతమార్చిన సంగతి తెలిసిందే. ప్రజాకోర్టులో బాలకృష్ణను మావోయిస్టు దళసభ్యులు గొడ్డలితో నరికి చంపారు. బాలకృష్ణ కిల్లంకోట గ్రామంలో నివాసం ఉన్నప్పటికి పంట భూములన్నీ లువ్వాసింగి పంచాయతీ మానేపల్లి గ్రామంలో ఉండటంతో గత 2 నెలలుగా భార్య పద్మకుమారితో కలసి వ్యవసాయం చేస్తున్నాడు. బుధవారం మావోయిస్టు దళ సభ్యులు 15 మంది మానేపల్లిలో ఉన్న బాలకృష్ణను కిల్లంకోట కాలనీ వరకు తీసుకు వచ్చారు. ఆ రాత్రంతా బాలకృష్ణను విచారించిన దళ సభ్యులు మరుసటిరోజు అదే ప్రాంతంలో ప్రజా కోర్టును కూడా నిర్వహించారు. గురువారం సాయంత్రం ప్రజాకోర్టులో బాలకృష్ణను పోలీస్ ఇన్ఫార్మర్గా పేర్కొంటూ దళ సభ్యులు అనేక ఆరోపణలు చేశారు. గతంలో జి.మాడుగుల ఎస్ఐగా పని చేసిన ప్రసాద్, కిల్లంకోట ప్రాంతంలో పర్యటించిన రోజున అతనికి బాలకృష్ణ అంబలి ఇచ్చాడని, మరోసారి ఈ దారిలో కూంబింగ్‌కు వెళుతున్న ఎస్ఐకి, పోలీసులకు దారి చూపాడని ఆరోపించారు. అలాగే ప్రతివారం జి.మాడుగుల వెళ్ళి మావోయిస్టు పార్టీ సమాచారం చేరవేస్తున్నాడని బాలకృష్ణపై మావోయిస్టులు మండిపడ్డారు. బాలకృష్ణ సంజాయిషీ ఇచ్చినప్పటికి మావోయిస్టులు నమ్మలేదు. దళ సభ్యులు కాళ్లు, చేతులు కట్టి ప్రజాకోర్టులోనే గురువారం రాత్రి బాలకృష్ణ మెడపై గొడ్డలితో నరికి హతమార్చారు. దాంతో ప్రజాకోర్టుకు వచ్చిన గిరిజనులంతా పరుగులు తీశారు. మారుమూల ప్రాంతం కావడంతో ఈ హత్యా సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మృతుడికి భార్య పద్మకుమారితోపాటు ప్రభాకర్ (16), భవాని (14), విజయ్‌కుమార్ (12), సీత (07) అనే నలుగురు పిల్లలు ఉన్నారు. బాలకృష్ణను చంపేశారనే సమాచారం అందుకున్న భార్య పద్మకుమారి, పిల్లలు శుక్రవారం సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. అయితే జి.మాడుగుల పోలీసులకు ఫిర్యాదు అందలేదని తెలిసింది. పైగా మృతదేహం దగ్గరకు వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించడం లేదు. ఈ సంఘటనతో కిల్లంకోట పంచాయతీలోని అన్ని గ్రామాల్లోను భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామాలన్నీ నిశ్శబ్దంగా ఉన్నా యి. సంఘటనకు సంబంధించిన వివరాలను కూడా బైటకు చెప్పేందుకు గిరిజనులు భయపడుతున్నారు. వీఆర్వో పోలీసులకు శనివారం సమాచారం ఇవ్వడంతో బాలకృష్ణ మృతదేహాన్ని పాడేరు ఆస్పత్రికి తరలించి శవపరీక్ష జరిపేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
నిరసనల సెగ
►రుణమాఫీపై చంద్రబాబు ►తీరుపై నిప్పులు చెరిగిన అన్నదాతలు ►భీమవరంలో నమూనా ►ప్రజాకోర్టు.. గడ్డిబొమ్మకు ఉరి ►పలుచోట్ల దిష్టిబొమ్మల దహనం ఏలూరు : రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను వెంటనే మాఫీ చేయాలంటూ చేపట్టిన ఆందోళనలు జిల్లాలో మూడో రోజైన శనివారం కూడా పెద్దఎత్తున కొనసాగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు, మహిళలు కదం తొక్కారు. రుణమాఫీ విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న తీరును నిరసించారు. భీమవరం ప్రకా శం చౌక్‌లో నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నమూనా ప్రజాకోర్టు నిర్వహిం చారు. న్యాయమూర్తిగా కామన నాగేశ్వరరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా రాయప్రోలు శ్రీనివాసమూర్తి వ్యవహరించగా, రైతుగా విజ్జురోతి రాఘవులు, డ్వాక్రా సభ్యురాలిగా పాలవెల్లి మంగ, చంద్రబాబు నాయుడిగా సునిల్‌కుమార్ వ్యవహరించగా.. వినూత్నంగా నమూ నా వాదనలు జరిగాయి. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్నారని బాధితులుగా వ్యవహరించిన వారు ఆవేదన చెందారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన నమూనా ప్రజాకోర్టు న్యాయమూర్తి చంద్రబాబు నాయుడి దిష్టిబొమ్మను ఉరి తీయూలని పేర్కొన్నారు. దీంతో దిష్టిబొమ్మను ఈడ్చుకెళ్లి.. చెట్టుకు వేలాడదీసి.. అనంతరం దహనం చేశారు. దీంతోపాటు నారావారి నరకాసురుడి’ బొమ్మను దహనం చేశారు. కొయ్యలగూడెంలో ‘నరకాసుర వధ’ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. మండల వైఎస్సార్ సీపీ యూత్ కన్వీనర్ తోట జయబాబు ఆధ్వర్యంలో రైతులు, మహిళలు రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టిబొమ్మను తగులబెట్టారు. రైతులు, డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాల న్నిటినీ రద్దు చేయూలని కోరుతూ కామవరపుకోట తహసిల్దార్‌కు పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పిం చారు. కొవ్వూరులో పార్టీ నాయకుడు పరిమి హరిచరణ్ ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను ఊరేగించి నిరసన తెలిపారు. మహిళలు, పలువురు నాయకులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు మానవహారం నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. పార్టీ నాయకులు పోల్నాటి బాబ్జి, బీవీఆర్ చౌదరి, చనమాల శ్రీనివాస్ పాల్గొన్నారు. దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో రైతులు, నాయకులు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. మొగల్తూరు మండలం కేపీ పాలెం, పేరుపాలెం గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేపట్టారు. జీలుగుమిల్లి జగదాంబ సెంటర్లో నరకాసురవధ కార్యక్రమం నిర్వహించారు. తొలుత భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి, చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా మాజీ కన్వీనర్ తెల్లం బాల రాజు మాట్లాడుతూ రైతులు, డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేయూలని డిమాండ్ చేశారు. లేదంటే వారి తరఫున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
మావోల ప్రజాకోర్టు
26 మంది దళసభ్యుల హాజరు ఇంజరిలో ఏపీ ఆన్లైన్ సిబ్బంది నిర్బంధం పెదబయలు: విశాఖ మన్యంలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. పెదబయలు మండలం మారుమూల ఇంజరి పంచాయతీలో ఉపాధి కూలీలు, వింతంతు, వృద్ధాప్య పింఛన్‌దారుల నుంచి వేలి ముద్రల సేకరణ (బయోమెట్రిక్) కోసం వెళ్లిన ఏపీ ఆన్లైన్ సిబ్బందిని శనివారం ఉదయం నుంచి 10 గంటలపాటు ప్రజాకోర్టులో ఉంచి సాయంత్రం విడిచి పెట్టారు. వారివద్ద ఉన్న మూడు బయోమెట్రిక్ యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం వెలుగుచూసింది. ఇంజరి పంచాయతీ పరిధిలో ఈనెల 12 నుంచి 16 తేదీ వరకు బయోమెట్రిక్ నమోదు చేస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం ఉదయం ఇంజరి గ్రామానికి వచ్చిన ఏపీ ఆన్లైన్ మండల కో ఆర్డినేటర్లు వరహాలరాజు, నితిలేసి చంద్రశేఖర్, నేరుగ శివరామకృష్ణలను 26 మంది సాయుధ మావోయిస్టులు అదుపులోకి తీసుకున్నారు. దూరంగా ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి ప్రజాకోర్టు నిర్వహించారు. తాము అధికారులం కాదని, కూలీపని కోసం వచ్చామని ముగ్గురూ దళసభ్యుల ఎదుట మొరపెట్టుకున్నారు. దీంతో వారివద్ద ఉన్న మూడు బయోమెట్రిక్ యంత్రాలను స్వాధీనం చేసుకుని సాయంత్రం నాలుగు గంటలకు విడిచిపెట్టారు. ఒక్కో యంత్రం విలువ రూ.40వేలు ఉంటుంది. మన్యంలో ఉపాధి కూలీలకు చెల్లింపుల్లో అధికారులు విఫలమవుతున్నందున బయోమెట్రిక్ నమోదు వద్దని వారిని హెచ్చరించినట్టు తెలిసింది. -
గుత్తి కోయలతో గుబులు
మారణాయుధాలతో గ్రామాల్లోకి ప్రజాకోర్టుల్లో దాడులు భయపడుతున్న గిరిజనులు పాడేరు, న్యూస్‌లైన్ : గుత్తి కోయల భయంతో గిరిజనులు కలవరపడుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వీరు మావోయిస్టులకు సహకరిస్తూ ఉంటారని ప్రతీతి. వీరు ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చి ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో సంచరిస్తున్నారనే వార్తలతో జిల్లాలోని మారుమూల గూడేల్లోని గిరిజనులు భయాందోళనలు చెందుతున్నారు. ఇటీవల ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో మావోయిస్టులు ప్రజా కోర్టులు నిర్వహించిన సమయంలో గుత్తికోయలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్టు సమాచారం. బల్లాలు, కత్తులు, గొడ్డళ్ల వంటి మారణాయుధాలతో గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నవారు కొంతమంది మాజీ సర్పంచ్‌లు, గ్రామ పెద్దలపై దాడి చేసి భయపెట్టినట్టు తెలిసింది. విచక్షణ రహితంగా చావగొడుతున్నారని మారుమూల గ్రామాల్లో గిరిజనులు కొందరు చెబుతున్నారు. ఆ సమయంలో మావోయిస్టు నేతలు కూడా అడ్డుచెప్పడం లేదని ఆదివాసీలు వాపోతున్నారు. మావోయిస్టులు ఇటీవల గిన్నెలుకోట, ఇంజరి, జామిగూడ, బూసిపుట్టు సమీప ప్రాంతాల్లోని ప్రజాకోర్టులు నిర్వహించి, అనేక మంది గిరిజన నేతలపై దాడులు చేసినట్టు తెలియవచ్చింది. పోలీసులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ మావోయిస్టులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏజెన్సీలోని రోడ్ల నిర్మాణాలను కూడా అడ్డుకోవడం లేదంటూ మాజీ, ప్రస్తుత సర్పంచ్‌లపై దాడులు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారాలలో గుత్తికోయలు అధికంగా పాల్గొంటున్నారు. వారి దాడులకు గురయిన కొందరు గిరిజనులు బయటకు చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వెళ్లవద్దనే హెచ్చరికలు కూడా మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో మావోయిస్టులు గిరిజనులను హెచ్చరించి, నాలుగైదు దెబ్బలతో వదిలిపెట్టే పరిస్థితికి భిన్నంగా గుత్తికోయల చర్యలు ఉన్నాయి. సోమవారం రాత్రి బలపం సర్పంచ్‌ను మావోయిస్టులు హతమార్చిన సంఘటనలో కూడా గుత్తికోయలే ప్రధాన భూమిక పోషించినట్టు తెలుస్తోంది.