Public life
-
ప్రజా సేవలో 23 ఏళ్లు
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్యం సాకారమయ్యే వరకు మరింత దీక్షతో, అవిశ్రాంతంగా కృషి చేస్తానని ప్రధాని మోదీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎంతో సాధించినా చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా ప్రజా ప్రస్థానంలో సోమవారంతో 23 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న మోదీ సోమవారం ఈ మేరకు ‘ఎక్స్’లో పలు పోస్టులు పెట్టారు. ప్రభుత్వాధిపతిగా తనకు బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా, 23 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న మోదీని బీజేపీ ప్రశంసల్లో ముంచెత్తింది. ‘ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా ప్రధాని మోదీ ప్రజా జీవితానికి నేటితో 23 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ ప్రజా సేవ ప్రయాణం ఒక వ్యక్తి తన జీవితాంతం దేశం, ప్రజల సంక్షేమం కోసం ఎలా అంకితం చేయగలడనే అపూర్వ అంకితభావానికి, సజీవ చిహ్నం’అని హోం మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో పేర్కొన్నారు. 2001 అక్టోబర్ 7న మోదీ మొట్టమొదటిసారిగా గుజరాత్ సీఎంగా ప్రమాణం చేశారు. 2014లో ప్రధానిగా పగ్గాలు చేపట్టక మునుపు సీఎం పోస్టులో 13 ఏళ్లపాటు కొనసాగారు. ఈ ఏడాది జూన్‌లో మూడో విడత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. -
16 ఏళ్ల ప్రస్థానాన్ని సెప్టెంబర్ గుర్తు చేసింది: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ‘ప్రజా జీవితంలో నేను 16 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న తీరును ఈ సెప్టెంబర్ గుర్తు చేస్తోంది. ఎనిమిదేళ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత మరో ఎనిమిదేళ్లు ప్రభుత్వంలో అనేక జ్ఞాపకాలు. మారు ఆలోచన లేకుండా తెలంగాణ ప్రజలు నాతో మొదలుకుని టీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయి నాయకుల వరకు ఇస్తున్న మద్దతుకు ధన్యవాదాలు. 2006 సెప్టెంబర్‌లో జరిగిన కరీంనగర్ ఉపఎన్నిక తెలంగాణ ఉద్యమంలోకి, టీఆర్ఎస్లోకి వచ్చేందుకు నాకు మార్గం చూపింది’ అని మంత్రి కేటీ రామారావు ట్వీట్ చేశారు. This September marks completion of 16 years in public life for me😊 Lots of memories from #Telangana agitation for 8 years followed by 8 plus years in Govt Grateful to people of Telangana for their unstinting support & all the hardworking @trspartyonline grassroots leaders 🙏 pic.twitter.com/cSptDWZ3jY — KTR (@KTRTRS) September 30, 2022 -
న్యూసెన్స్‌కు 112 రోజుల జైలు
సాక్షి, హైదరాబాద్: ప్రజా జీవనానికి ఇబ్బందులు కలిగిస్తూ పదేపదే న్యూసెన్స్‌కు పాల్పడుతున్న వ్యక్తులపై నమోదయ్యే పెట్టీ కేసులను న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఇలాంటి ఓ వ్యక్తికి 13వ స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఏకంగా 112 రోజుల జైలు శిక్ష విధించింది. పెట్టీ కేసులో ఈ స్థాయిలో జైలు పడటం ఇదే తొలిసారి. కార్ఖానా బస్తీలో నివసించే మహ్మద్ సలీం పేరు చెప్తే ఆ ప్రాంత వాసులకు హడల్. అనునిత్యం మద్యం తాగి రోడ్డుపై హంగామా సృష్టిస్తుంటాడు. తన కుటుంబీకుల పైనే దాడులు చేస్తూ అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిని దుర్భాషలాడతాడు. అప్పుడప్పుడు నగ్నంగా రోడ్లపైకి వచ్చి పబ్లిక్ న్యూసెన్స్ చేస్తుంటాడు. దీనికి సంబంధించి ఫిర్యాదు అందిన ప్రతిసారీ కార్ఖానా పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించే వారు. పోలీసుస్టేషన్‌లోనూ ఇతడితో అధికారులకు తలనొప్పే. గోడకు తల కొట్టుకోవడం, చేతులు కోసుకోవడం వంటివి చేస్తూ ఇబ్బందులు కలిగించే ప్రవర్తిస్తుంటాడు. సలీంపై ఇప్పటికే పలుమార్లు పోలీసులు పెట్టీ కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆదివారం మరోసారి బస్తీలో రాద్ధాంతం చేశాడు. మద్యం మత్తులో తల్లిదండ్రులపై దాడికి దిగాడు. అడ్డుకున్న స్థానికులనూ దుర్భాషలాడాడు. పోలీసులపైనా విరుచుకుపడి.. డయల్–100కు ఫిర్యాదు రావడంతో కార్ఖానా పోలీసుస్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు ఘటనాస్థలికి చేరుకున్నారు. వీరిపైనా విరుచుకుపడిన సలీం అభ్యంతరకరంగా ప్రవర్తించి, వారి విధి నిర్వహణకు అడ్డు తగిలాడు. బస్తీ వాసులకు పదేపదే ఇబ్బందులు సృష్టిస్తున్న సలీం విషయాన్ని కార్ఖానా ఇన్స్పెక్టర్ బి.రవీందర్ తీవ్రంగా పరిగణించారు. ఇతడికి వైద్య పరీక్షలు చేయించడంతో పాటు నగర పోలీసు యాక్ట్, ఐపీసీలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అవసరమైన ఆధారాలతో సోమవారం కోర్టులో సలీంను హాజరుపరిచి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అభియోగపత్రాల్లో పొందుపరిచిన ఇతడి వ్యవహారశైలి, గత చరిత్ర తదితరాలను గమనించిన న్యాయమూర్తి 112 రోజులు జైలు శిక్ష విధించారు. చట్టాన్ని అతిక్రమించినా, పబ్లిక్ న్యూసెన్స్‌కు పాల్పడినా ఇలాంటి చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ బి.రవీందర్ స్పష్టం చేశారు. (చదవండి: యువ గాయని అపహరణ.. ఆపై దారుణ హత్య!) -
మావోయిస్టుల్లారా.. లొంగిపోండి: డీజీపీ పిలుపు
జయపురం: ఉద్యమం వీడి జనస్రవంతిలో కలిసిపోవాలని రాష్ట్ర డీజీపీ అభయ్ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా అవిభక్త కొరాపుట్ జిల్లాలో ఆదివారం పర్యటించిన ఆయన నవరంగపూర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో నెలకొన్న శాంతిభద్రతలపై సు«దీర్ఘ చర్చలు జరిపారు. ముఖ్యంగా ఒడిశా–ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల చర్యలు లేకుండా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. అలాగే మావోయిస్టుల దుశ్చర్యల కట్టడికి చేపట్టాల్సిన పలు వ్యూహాలను అధికారులకు వివరించారు. అనంతరం జిల్లాలోని ఆదర్శ పోలీస్‌స్టేషన్, రిజర్వ్ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన ఆయా ప్రాంతాల జవానులు, పోలీసుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడిన ఆయన కరోనా కష్టకాల పరిస్థితులతో భయాందోళనలో ఉన్న ప్రజలను మరింత భీతి కలిగించవద్దని మావోయిస్టులకు సూచించారు. ప్రజలంతా ప్రస్తుతం బాగానే ఉన్నారని, దీనిని అర్థం చేసుకుని స్వచ్ఛందంగా లొంగిపోవాలని మావోయిస్టులను కోరారు. తమ వద్దకు వచ్చిన మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి అందే సదుపాయాలన్నీ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. పర్యటనలో ఆయనతో పాటు నవరంగపూర్ ఎస్పీ ప్రహ్లాద్ సహాయి మీనా, విజిలెన్స్ విభాగం డైరెక్టర్ ఆర్.కె.శర్మ, నవరంగపూర్ తహసీల్దారు రవీంద్రకుమార్ రౌత్, పట్టణ పోలీస్ అధికారి తారిక్ అహ్మద్ ఉన్నారు. -
జనజీవనంలో ‘మందు’ పాతర
విశ్లేషణ విజయవాడలో ఇటీవల జరిగిన కల్తీ మద్యం దుర్ఘటన రాష్ట్రాన్ని కుదిపివేసింది. ఐదుగురు చనిపోయారు. మరికొందరు ఆస్పత్రుల పాలయ్యారు. ఇది మొదటిది కాదు. చివరిదీ కాదు. కానీ దుర్ఘటనలు సృష్టించే విషాదం ఎప్పటికీ కదలిస్తూనే ఉంటుంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధితులను పరామర్శించారు. వారి గోడుతో స్పందించి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించాలని కోరారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చేయలేకపోతే, తాము అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తామని కూడా జగన్ ప్రకటించారు. దీనితో ఈ అంశానికి మళ్లీ ప్రాధాన్యం వచ్చింది. విజయవాడ తాజా దుర్ఘటన అనేక సామాజిక అంశాలను ఎత్తి చూపింది. ప్రపంచం మొత్తం మీద భారతదేశంలో ఉన్న మానవ వనరులు విలువైనవని, 35 సంవత్సరాల లోపు యువతరం 60 శాతం ఉందని, ఈ వనరు దేశం ప్రబల ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఎంతో దోహదం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ మొదలు ఎందరో మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇది అతిశయోక్తి కాదు. కాకపోతే దేశంలో మానవ వనరులు ఏ తీరులో ఉన్నాయి? వాటిని ఏ మేరకు ఉపయోగించుకోగలుగుతున్నాం? తగిన నైపుణ్యం లేకపోవడం ఒక లోపం కాగా, మద్యపానంతో ఈ వనరులు అధికశాతం నిర్వీర్యం కావడం మరో వాస్తవం. గ్రామీణ ప్రాంతాలలో ఈ వ్యసనం కారణంగా 65 శాతం ప్రజలు పూర్తిగా ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. అమాయకత్వం, బలహీనతలను ఆసరా చేసుకుని సాగుతున్న కల్తీ మద్యం అమ్మకాలకు అధికార యంత్రాంగం మద్దతు, రాజకీయ జోక్యం తోడై పేదల రక్తాన్ని పీలుస్తున్నాయి. అందుకే ‘స్వర్ణబార్’ తరహా ఉదంతాలు ఎన్ని జరుగుతున్నా ప్రభుత్వాలు మాత్రం మద్యం ఇచ్చే ఆదాయం మత్తుకు బానిసలవుతున్నాయి. మద్యం కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 80 లక్షల కుటుంబాలు రకరకాల ఇక్కట్లకు గురి అవుతున్నాయని ‘సామాజిక సర్వే’ చెబుతున్నది. సంపాదన మొత్తం మద్యం పైనే వెచ్చించే వారు 5 శాతం ఉండగా, 50 శాతం ఆదాయాన్ని తగలేస్తున్నవారు 40 శాతం మించి ఉన్నారు. దీనికి బానిసలైన వారి సగటు ఆయుర్దాయం కూడా గణనీయంగా తగ్గిపోతున్నది. కాగా, గత రెండు దశాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే ఈ వ్యసనానికి బానిసలవుతున్న వారు 25 శాతం పెరిగిన సంగతి అర్థమవుతుంది. అసలు ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం మద్యంలో 5 శాతం మన దేశంలోనే వినియోగిస్తున్నారు. అయితే దేశంలో తాగుతున్న మొత్తం మద్యంలో 2/3 వంతు వరకు రికార్డులలోకి ఎక్కడం లేదు. అంతర్జాతీయ బెవరేజెస్ వినియోగం గురించి వివరించే ‘లాన్సెట్’ పత్రిక ఈ విషయం వెల్లడించింది. ఆరోగ్యానికి తీవ్ర హాని చేసే కల్తీ కల్లు, కాపుసారా, గుడుంబాల వినియోగం కూడా భారత్‌లో ఎక్కువేనని ఆ పత్రిక పేర్కొన్నది. దేశ ఆర్థిక వ్యవహారాల మీద తాజా నివేదికలు అందించే ‘అసోసియేట్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ నివేదిక ప్రకారం మద్యం పరిశ్రమ దేశంలో ఏటా 30 శాతం మేర విస్తరిస్తున్నది. 2015 చివరకు చూస్తే దేశంలో ఖర్చయిన మద్యం 20 బిలియన్ లీటర్లనీ, వీటి మీద ప్రజలు పెట్టిన ఖర్చు 1.5 లక్షల కోట్ల రూపాయలని కూడా ఆ నివేదిక వెల్లడించింది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్‌తో (ఐఎంఎఫ్ఎల్) పాటు, దిగుమతి చేసుకుంటున్న విదేశీ మద్యానికి కూడా డిమాండ్ పెరుగుతున్నదని పారిశ్రామిక వర్గాల అధ్యయనంలో తేలింది. మద్యం అమ్మకాలతో ఖజానాకు ఇబ్బడిముబ్బడిగా ఆదాయం వస్తున్నది. దీనితో అధికారంలోకి ఎవరు వచ్చినా, ఎన్నికల ముందు మద్య నిషేధం మీద హామీ ఇచ్చినా దీని జోలికి వెళ్లడం లేదు. గులాటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ టాక్సేషన్ (తిరువనంతపురం) వెలువరించిన నివేదిక ప్రకారం, చాలా రాష్ట్రాల ఆదాయాలలో 20 శాతం మద్యం ద్వారానే సమకూరుతున్నది. ఈ ఆదాయం రెండు దశాబ్దాల నుంచి పెరుగుతున్నది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తమిళనాడుకు సమకూరిన ఆదాయం రూ. 21,800 కోట్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004-05 నాటి మద్యం ఆదాయం రూ. 2,367 కోట్లు. ఇదే పదేళ్ల వ్యవధిలో 2013-14 నాటికి రూ. 10,923 కోట్లకు చేరుకుంది. అంటే 460 శాతం పెరుగుదలతో, సగటు సంవత్సర వృద్ధి 46 శాతమన్నమాట. ఈ పెరుగుదల మరే ఇతర వనరుల్లోను కనిపించకపోవచ్చు. రాష్ట్ర విభజన తరువాత 2014-15 ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ ఆదాయం రూ. 10,927 కోట్లు. ఆపై 2015 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు మన రాష్ట్రానికి సమకూరిన ఆదాయం రూ. 5,544 కోట్లు. అంటే 2015-16 చివరి వరకు లెక్కిస్తే మరో రూ. 3000 కోట్లు ఆదాయం ఆర్జించనున్నది. వెరసి ఈ సంవత్సరం ఆదాయం రూ. 8,544 కోట్లకు చేరుతుందని అంచనా. అంటే మద్యం ఆదాయం మత్తులో ప్రభుత్వం కూరుకుపోయిందా? ఆదేశిక సూత్రాల ప్రకారం సంక్షేమ రాజ్యస్థాపన రాజ్యాంగం ప్రధాన లక్ష్యం. పేదలకు పెద్దపీట వేసి సంక్షేమ రాజ్యాన్ని స్థాపిస్తామని అంతా ప్రకటిస్తారు. అయితే ఒక పక్క పింఛన్లు, సబ్సిడీ బియ్యం, గృహ నిర్మాణం, ఆరోగ్య పథకాలు వంటివి ఇస్తూనే, మరోవైపు ప్రజల ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీసే మద్యాన్ని యథేచ్ఛగా పంపిణీ చేయిస్తున్నారని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరలాజికల్ సెన్సైస్ కర్ణాటకలో జరిపిన అధ్యయనంతో తేల్చింది. ఇలాంటి ఆదాయాన్ని పౌర సేవలకు వినియోగించడం నేరమని గాంధీజీ ఏనాడో చెప్పారు. ఇది కొన్ని సందర్భాలలో తప్ప ప్రభుత్వాలు గుర్తుంచుకోలేదు. మద్యం మీద ప్రభుత్వానికి ఒక రూపాయి ఆదాయం వస్తే, దామాషా ప్రకారం ఒక వ్యక్తి తన ఆరోగ్యం కోసం రూ. 2 ఖర్చు చేయాలి. కాబట్టి ప్రభుత్వాలు మద్య నిషేధం విషయంలో మీనమేషాలు లెక్కించడం సరికాదు. అయినా మద్య నిషేధం సాధ్యం కాదని వాదించేవారూ ఉన్నారు. ఇదొక పలాయన వాదమే. మద్యం ఆదాయం లేకుండా మనుగడ సాగిస్తున్న, వృద్ధి చెందుతున్న రాష్ట్రాలు ఉన్నాయి. ఆ ఆదాయం లేకున్నా గుజరాత్ 10 శాతం వృద్ధిరేటు సాధిస్తున్నది. నిషేధం ప్రయత్నం ఇక్కడా జరిగింది. నెల్లూరు జిల్లాలో దూబగుంట రోశమ్మ సారా వ్యతిరేకోద్యమం ఆరంభించారు. నిషేధించడం, మళ్లీ ఎత్తివేయడం జరిగింది. 2014 ఎన్నికలలో చంద్రబాబు కూడా తన ఎన్నికల ప్రణాళికలో నిషేధం అమలును చేర్చారు. కానీ ఇంతవరకు ఏమీ చేయలేదు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. బెల్టు షాపుల ఎత్తివేతకు సంబంధించిన ఫైలు మీద తొలిరోజే ముఖ్యమంత్రి సంతకం చేసినా, క్షేత్ర స్థాయిలో వాటి సంఖ్య పెరిగిపోయింది. ప్రభుత్వమే నేరుగా మద్యం వ్యాపారానికి పూనుకున్నది. ఫోన్ చేస్తే డోర్ డెలివరీ సౌకర్యం కూడా వచ్చిందని కూడా వినికిడి. పైగా ధరలు తగ్గించి, విక్రయాలు పెంచి అధికారులకు లక్ష్యా లను కూడా నిర్దేశిస్తున్నారు. ఇదేమి సంక్షేమం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పన్నుల ద్వారా సమకూరుతున్న ఆదాయంలో ద్వితీయ స్థానం మద్యానిదే. 2014-15 సంవత్సరంలో అన్ని రకాల వస్తువుల మీద సమ కూరిన మొత్తం ఆదాయం రూ. 35,126.60 కోట్లు. అందులో మద్యం ద్వారా లభించినది రూ. 11,480 కోట్లు. కాగా 2015-16 సంవత్సరం రాబడిలో ఇందులో 15 శాతం పెరుగుదల ఉండవచ్చునని అంచనా. ‘మద్యం రాబడి పెరుగుతున్నదంటే అర్థం, పేద కుటుంబాల పిల్లలకు పోషకాహారం తగ్గిపోతున్నట్టు లెక్క’ అని సెంటర్ ఫర్ సోషియో ఎకనమిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పేర్కొంది. మద్యం అమ్మకాలు ఎంతగా పెరిగితే, అసమానతలు కూడా అంత తీవ్రంగా పెరుగుతాయని కూడా ఆ సంస్థ వెల్లడించింది. గ్రామం, పట్టణం, నగరం అనే తేడా లేకుండా జన జీవితాన్ని ‘మందు’ పాతర ధ్వంసం చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాలలో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, నేతలు పంచు తున్న ఉచిత మద్యం పాఠశాలలకు వెళ్లే బాలలను కూడా ఆ వ్యసనానికి బానిస లయ్యేటట్టు చేస్తున్నదని కొన్నేళ్ల క్రితం లోక్‌సత్తా చేపట్టిన అధ్య యనం ద్వారా వెల్లడైంది. సమాజంలో విషమ పరిస్థితులు సృష్టిస్తున్న మద్యాన్నీ, దాని మీద వచ్చే ఆదాయాన్నీ ఒక పెద్ద వనరుగా ప్రభుత్వాలు పరిగణిం చడం సమంజసం కాదు. ప్రభుత్వ ఆదాయం కన్నా, ప్రజారోగ్యమే మిన్న. - డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రి. మొ. 9989024579) -
శాఖమూరి కవిత్వం.. భేష్
⇒ మూడో తరం విప్లవ కవులు వస్తున్నారు ⇒విరసం కార్యవర్గ సభ్యుడు కాశీం ⇒పాదముద్రలు కవితా సంకలనం ఆవిష్కరణ హన్మకొండ కల్చరల్ : శాఖమూరి రవి రాసిన కవితలు ప్రజా జీవితంలో నుం చి, మనిషిని నమ్మిన రాజకీయాల్లోంచి వచ్చాయని విరసం కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కాశీం అన్నారు. శాఖమూరి కవిత్వం ప్రతిభావంతంగా ఉందని, విరసం కవుల్లో మూడో తరం అంకురిస్తోందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. హన్మకొండ హంటర్‌రోడ్డులోని వరంగల్ పబ్లిక్స్కూల్లో విరసం ప్రచురించిన పాదముద్రలు కవితా సంకలనం ఆవిష్కరణ సభ ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ముఖ్యఅతిథిగా కాశీం పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఒరిగిపోతున్న అమరవీరులు.. బాధ్యతలను, నమ్మిన సిద్ధాంతాలను అప్పగించి వెళ్తారని తెలిపారు. శాఖమూరి రవి అలాంటి పోరాట గమనంలో రాసిన కవి తలు నేటి తరానికి స్ఫూర్తిని కలిగించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వెయ్యి సంవత్సరాల దేశ సాహిత్య చరిత్రలో విప్లవ కవిత్వానికి ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. విప్లవ కవి తా ప్రక్రియ క్లిష్టమైందని, కొన్నిసార్లు పద బంధాల్లో పొరపాట్లు దొర్లితే మరో అర్థం వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. దీనిని విరసం ఆమోదించినట్లు ప్రజలు భావిస్తారన్న విషయాన్ని రచయితలు గుర్తించాలని సూచించారు. ఆకుల భూమయ్య మర ణం రాజ్యం చేయించిన హత్యగానే భావిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలదో, దొరలదో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. విరసం జిల్లా కన్వీనర్ పి.వీరబ్రహ్మచా రి అధ్యక్షతన జరిగిన ఆవిష్కరణసభలో మెట్టు రవీందర్ పుస్తకసమీక్షించగా పుట్ట సోంమల్లు ప్రసంగించారు. కార్యక్రమంలో అమరవీరుల బంధుమిత్రుల కమిటీ నాయకులు భారతక్క, అరుణక్క, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రమాదేవి, తం గెళ్ల సుదర్శన్, లింగారెడ్డి, బాలకుమార్, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, శ్యాంరావు, హుస్సేన్, రామస్వామి, సదయ్య, సురే ష్, రమేష్‌చందర్ తదితరులు పాల్గొన్నారు.