శాఖమూరి కవిత్వం.. భేష్ | super shakamuri poetry | Sakshi
Sakshi News home page

శాఖమూరి కవిత్వం.. భేష్

Published Mon, Dec 15 2014 4:26 AM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM

super shakamuri poetry

⇒ మూడో తరం విప్లవ కవులు వస్తున్నారు
⇒విరసం కార్యవర్గ సభ్యుడు కాశీం
⇒పాదముద్రలు కవితా సంకలనం ఆవిష్కరణ

 హన్మకొండ కల్చరల్ : శాఖమూరి రవి రాసిన కవితలు ప్రజా జీవితంలో నుం చి, మనిషిని నమ్మిన రాజకీయాల్లోంచి వచ్చాయని విరసం కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కాశీం అన్నారు.  శాఖమూరి కవిత్వం ప్రతిభావంతంగా ఉందని, విరసం కవుల్లో మూడో తరం అంకురిస్తోందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. హన్మకొండ హంటర్‌రోడ్డులోని వరంగల్ పబ్లిక్‌స్కూల్‌లో విరసం ప్రచురించిన పాదముద్రలు కవితా సంకలనం ఆవిష్కరణ  సభ ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ముఖ్యఅతిథిగా కాశీం పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఒరిగిపోతున్న అమరవీరులు.. బాధ్యతలను, నమ్మిన సిద్ధాంతాలను అప్పగించి వెళ్తారని తెలిపారు.

శాఖమూరి రవి అలాంటి పోరాట గమనంలో రాసిన కవి తలు నేటి తరానికి స్ఫూర్తిని కలిగించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వెయ్యి సంవత్సరాల దేశ సాహిత్య చరిత్రలో విప్లవ కవిత్వానికి ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. విప్లవ కవి తా ప్రక్రియ క్లిష్టమైందని, కొన్నిసార్లు పద బంధాల్లో పొరపాట్లు దొర్లితే మరో అర్థం వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. దీనిని విరసం ఆమోదించినట్లు ప్రజలు భావిస్తారన్న విషయాన్ని రచయితలు గుర్తించాలని సూచించారు. ఆకుల భూమయ్య మర ణం రాజ్యం చేయించిన హత్యగానే భావిస్తున్నామని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రజలదో, దొరలదో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. విరసం జిల్లా కన్వీనర్ పి.వీరబ్రహ్మచా రి అధ్యక్షతన జరిగిన ఆవిష్కరణసభలో మెట్టు రవీందర్ పుస్తకసమీక్షించగా పుట్ట సోంమల్లు ప్రసంగించారు. కార్యక్రమంలో అమరవీరుల బంధుమిత్రుల కమిటీ నాయకులు భారతక్క, అరుణక్క, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రమాదేవి, తం గెళ్ల సుదర్శన్, లింగారెడ్డి, బాలకుమార్, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, శ్యాంరావు, హుస్సేన్, రామస్వామి, సదయ్య, సురే ష్, రమేష్‌చందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement