public prosecutors
-
‘ప్రతీదానికి అడ్డుపడడం బాగోలేదు’
ఢిల్లీ: తమ పాలనలోని ప్రతీ నిర్ణయాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం నానాటికీ ఎక్కువ అవుతుండడంపై ఆప్ ప్రభుత్వం అసహనానికి లోనవుతోంది. తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలు బహిరంగంగా తమ అసంతృప్తిని వెల్లగక్కారు. రైతు నిరసనల ఉద్యమ కేసుకు(జనవరి 26న జరిగిన పరిణామాల కేసు) సంబంధించి పోలీసుల తరపున వాదనలు వినిపించేందుకు ఢిల్లీ గవర్నమెంట్ ఒక లాయర్ల ప్యానెల్‌ను ప్రతిపాదించింది. అయితే దానిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిన ఎల్జీ.. మరో ప్యానెల్‌ను సూచించాడు. ఇక ఈ నిర్ణయం ఢిల్లీ ప్రజలకు ఘోర అవమానమేనని కేజ్రీవాల్ ఆక్షేపించారు. ‘కేంద్రంలో బీజేపీ పాలిస్తోంది. బీజేపీని చిత్తుగా ఓడించి ఢిల్లీలో మేం(ఆప్) పాలిస్తున్నాం. మేం ప్రజానిర్ణయంతో ఎంపికయ్యాం. అలాంటిది ప్రతీదాంట్లో బీజేపీ, ఆయన(ఎల్జీని ఉద్దేశించి) జోక్యం ఎక్కువగా ఉంటోంది. ఇది ఢిల్లీ ప్రజల్ని అవమానించడమే అవుతుంది. బీజేపీ కొంచెం ప్రజాస్వామ్యాన్ని కూడా గౌరవిస్తే బాగుంటుంది’ అని హిందీలో శనివారం కేజ్రీవాల్ ట్వీట్ చేశాడు. कैबिनेट निर्णयों को इस तरह पलटना दिल्ली वालों का अपमान है। दिल्ली के लोगों ने एतिहासिक बहुमत से “आप” सरकार बनायी और भाजपा को हराया। भाजपा देश चलाये, “आप” को दिल्ली चलाने दे। आए दिन हर काम में इस तरह की दख़ल दिल्ली के लोगों का अपमान है। भाजपा जनतंत्र का सम्मान करे https://t.co/FQbQzuvMkL — Arvind Kejriwal (@ArvindKejriwal) July 24, 2021 గత సోమవారం ఢిల్లీ కేబినెట్ ప్రతిపాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పేర్లకు బదులు.. ఢిల్లీ పోలీసులు ఎంపిక చేసిన లాయర్ల ప్యానెల్‌ను ఎల్జీ అనిల్ బైజాల్ అప్రూవ్ చేయడం విశేషం. ఈ ప్యానెల్ నియామకం కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే జరగడం మరో విశేషం. దీంతో డిప్యూటీ సీఎం సిసోడియా మండిపడ్డాడు. ‘అన్నీ వాళ్లే చేసుకుంటే.. ఇక మేమేందుకు?’ అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. -
ఒక్క పోస్టూ ఖాళీగా ఉండొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పీపీ పోస్టుల ఖాళీలు భర్తీ చేయాలని ఆరు నెలల కిందటే ఆదేశించినా ఎందుకు భర్తీ చేయలేదని, ఇంకా ఎంత సమయం కావాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. ఈ కేసును తదుపరి విచారించనున్న ఏప్రిల్ 1 నాటికి రాష్ట్రంలో ఒక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేదని స్ప ష్టం చేసింది. రెండు, మూడు కోర్టులకు ఒక పీపీ ఉంటే సత్వర న్యాయం ఎలా సాధ్యమని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 414 ఖాళీలకుగాను ఇప్పటికే 212 ఖాళీలు భర్తీ చేశామని ప్రభుత్వ న్యాయవాది శ్రీకాంత్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. మిగిలిన 202 ఖాళీల భర్తీకి సంబంధించి అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులతో చర్చిస్తున్నారని తెలిపారు. అయితే, తమకు చర్చలు కాదు, ఫలితాలు కావాలని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ నాటికి అన్ని ఖాళీలు భర్తీ చేయాలని, ఒక్క ఖాళీ కూడా లేదని చెప్పాలని జీపీని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా పీపీ పోస్టులు ఖాళీగా ఉండటంతో కక్షిదారులకు న్యాయం అందడంలో జాప్యం జరుగుతోందని, ఈ నేపథ్యంలో ఖాళీల భర్తీకి వెంటనే సత్వర చర్యలు చేపట్టాలంటూ 2018లో అప్పటి సీజే నేతృత్వంలోని ధర్మాసనం సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. పీపీ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టాలని అప్పుడు ఏజీని ఆదేశించింది. ఈ పిల్‌ను ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ‘పీపీల కొరత, నియామకాల్లో జాప్యం న్యాయ ప్రక్రియకు విఘాతం కల్గించడమే. ప్రాసిక్యూషన్ విభాగానికి పూర్తికాలం డైరెక్టర్‌ను ఎందుకు నియమించలేదు? ప్రాసిక్యూషన్ విభాగం డైరెక్టర్ పోస్టుతో పాటు 2 వారాల్లోగా అన్ని ఖాళీలను భర్తీ చేయాలి. ఈ మేరకు వచ్చే విచారణ నాటికి స్టేటస్ రిపోర్టు సమర్పించండి’ అని ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. -
అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని నగరంలో ఎక్కడ పడితే అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై అనేక మంది కోర్టులను ఆశ్రయిస్తున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదని అక్షింతలు వేసింది. ఈ అంశంపై ఇకపై పిటీషన్ల దాఖలు కాకూడదని అధికారులను హెచ్చరించింది. అధికారులు కఠిన చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించింది. ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లను కోరింది. 2019లో ఎన్ని అక్రమ నిర్మాణాలు గుర్తించారు? వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదికలో పొందుపరచాలని సూచించింది. స్టేలు తొలగించాలని ఎన్ని పిటిషన్లు వేశారో తెలపాలని కోరింది. స్టే వెకేట్ పిటిషన్లు వేయని పక్షంలో కారణాలు తెలపాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. పీపీల నియామకంలో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కొరత వల్ల కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసుల విచారణ ప్రక్రియలో పీపీల పాత్ర కీలకమని వ్యాఖ్యానించింది. పీపీల నియామకంపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. 414 పీపీ పోస్టులకు గాను 212 పోస్టులు భర్తీ అయ్యాయని, మిగిలిన పోస్టుల భర్తీ విషయమై చర్చలు జరుగుతున్నాయని వివరించారు. దీనిపై కోర్టు ఘాటుగా స్పందిస్తూ.. చర్చలు కాదు, ఫలితాలు కావాలని వ్యాఖ్యానించింది. అలాగే ప్రాసిక్యూషన్ విభాగానికి పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై రెండు వారాల్లో పూర్తి వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించి, తదుపరి విచారణను ఏప్రిల్ 14కు వాయిదా వేసింది. -
పీపీల కొరతతో విచారణకు విఘాతం
సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లోని క్రిమినల్ కోర్టుల్లో తగినంత మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (పీపీ) లేకపోవడం నేర విచారణ ప్రక్రియకు విఘాతంగా మారుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను మూడు నాలుగు కోర్టులకు ఇన్‌చార్జీలుగా నియమిస్తుండటం వల్ల పీపీలపై పనిభారం పెరిగి కేసుల విచారణపై ప్రతికూల ప్రభావం పడుతోందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల్లో ఉన్న క్రిమినల్ కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియచేయాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం గతవారం ఉత్తర్వులు జారీ చేసింది. కింది కోర్టుల్లో క్రిమినల్ కేసుల సంఖ్య పెరిగిపోవడానికి తగినంత మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లేకపోవడమేనని గుర్తించిన ప్రధాన న్యాయమూర్తి ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఈ వ్యవహారాన్ని సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా సిద్ధం చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ ఓ నోట్ పంపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కొరత వల్ల నిందితుల హక్కులను పరిరక్షించడం సాధ్యం కావడం లేదని ప్రధాన న్యాయమూర్తి తన నోట్లో పేర్కొన్నారు. నిందితుల హక్కుల ఉల్లంఘన జరగకూడదంటే కేసుల సత్వర పరిష్కారం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లేకపోవడం వల్ల పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోవడమే కాకుండా, కేసుల విచారణలో నాణ్యత కూడా దెబ్బతింటోందని ఆయన తన నోట్లో ఆందోళన వ్యక్తం చేశారు. సీజే నోట్‌తో హైకోర్టు రిజిస్ట్రీ పీపీల కొరత వ్యవహారంపై వేర్వేరుగా రెండు వ్యాజ్యాలను సిద్ధం చేసింది. ఒక దానిలో తెలంగాణ, మరొక దానిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చింది. ఈ రెండు వ్యాజ్యాలపై గత వారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లేకపోవడం వల్ల కింది కోర్టుల్లో కేసుల విచారణపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపింది. వీలైనంత త్వరగా పీపీల కొరత తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ధర్మాసనం, ఈ దిశగా ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలంటూ ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. -
శ్రీదేవి మృతి కేసు.. అనుమానాలివే!
దుబాయ్ : నటి శ్రీదేవి మృతి కేసు విచారణలో క్షణక్షణానికి పరిణామాలు మారిపోతున్నాయి. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమైపోయారు. ఈ క్రమంలో పలు అనుమానాలు వారు వ్యక్తం చేస్తున్నారు. అవి నివృత్తి అయితేనే ఆమె మృతదేహాన్ని అప్పగించాలని నిర్ణయించారు. హోటల్ గదిలో అసలేం జరిగింది? శ్రీదేవి అసలు ఎన్ని గంటలకు మరణించారు? పోలీసులకు ఆలస్యంగా సమాచారం ఎందుకు ఇచ్చారు? ఫోరెన్సిక్ నివేదిక రాకముందే గుండెపోటు అని ఎందుక ప్రకటించారు? మద్యం తాగే అలవాటు లేని శ్రీదేవి కడుపులోకి ఆల్కహాల్ ఆనవాలు ఎలా వచ్చాయి? హోటల్లోని సీసీ ఫుటేజీ ఎందుకు బయటకు రాలేదు? కుటుంబ సభ్యులు మీడియా ముందుకు ఎందుకు రాలేదు? బోనీ ఎందుకు తిరిగొచ్చారు? మార్వా పెళ్లిలో ఏమైనా గొడవ జరిగిందా? పెళ్లి 20వ తేదీన ముగిస్తే.. 24న ఆమె చనిపోయారు. ఈ నాలుగు రోజుల్లో ఏం జరిగింది? తదితర అనుమానాలను నివృత్తి చేసుకునే పనిలో పడ్డారు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ ప్రాసిక్యూషన్ అధికారుల చేతికి అందింది. దీంతోపాటు రెండో ఫోరెన్సిక్ నివేదిక వెలువడాల్సి ఉంది. వాటిని పరిశీలించాక అవసరమైతే శ్రీదేవి మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం నిర్వహించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, ఆమె పేరిట పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్.. కారణాలు అయ్యి ఉండొచ్చన్న కోణంలో సైతం విచారణ చేపట్టేందుకు సిద్ధమైపోయారు. ఇప్పటికే వివాహ వేడుక తాలుకు ఫుటేజీలను తెప్పించుకున్న అధికారులు ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు అటోప్సీ రిపోర్ట్ తోపాటు, బోనీ కపూర్ ఇచ్చిన వివరణపై ప్రాసిక్యూషన్ అధికారులు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బోనీ పాస్ పోర్టును స్వాధీనపరుచుకున్నారు. శ్రీదేవి హెల్త్ రికార్డ్స్ తేవాల్సిందిగా కుటుంబ సభ్యులను కోరిన అధికారులు.. ఆమె కాల్ డేటా మొత్తాన్ని క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. డ్రైవర్, హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. మరోవైపు శ్రీదేవి సవతి కొడుకు, నటుడు అర్జున్ కపూర్‌ను దుబాయ్ బయలుదేరటం గమనార్హం. ఇంకోపక్క మోహిత్ మార్వా కుటుంబాన్ని కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే హోటల్ గదిని సీజ్ చేసిన అధికారులు.. ఏం జరిగిందో తెలుసుకోడానికి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయపరమైన చిక్కులన్నీ వీడితేనే ఆమె మృతదేహ తరలింపునకు క్లియరెన్స్ సర్టిఫికెట్ పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతకం చేస్తారు. దీంతో ఆమె మృతదేహం తరలింపులో మరింత జాప్యమయ్యేలా కనిపిస్తోంది. ఏ విషయమన్నదానిపై ప్రాసిక్యూషన్ అధికారులు మరికాసేపట్లో ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. -
లాయర్లకు జీతాలివ్వని ఢిల్లీ సర్కారు!
ఒకరు కాదు.. ఇద్దరు కారు.. ఏకంగా 32 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఢిల్లీ ప్రభుత్వం దాదాపు ఏడాది నుంచి జీతాలు ఇవ్వడం లేదు. ఈ విషయం ఢిల్లీ హైకోర్టుకు కూడా ఈమధ్యే తెలిసింది. ఎందుకు జీతాలు ఇంత ఆలస్యం చేస్తున్నారో వివరించాలని ఢిల్లీ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖలను కోర్టు ఆదేశించింది. ప్రాసిక్యూటర్లకు ఫీజు చెల్లించకపోవడం దారుణమని, జీతాలు లేకుండా వాళ్లు తమ కార్యాలయాలను నడిపించడం, సమర్థమైన సేవలు అందించడం అసాధ్యమని జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ ఆర్కే గౌబాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయమై ఢిల్లీ ప్రభుత్వం ఓ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అయితే.. ఇదంతా కూడా లెఫ్టినెంట్ గవర్నర్‌కు, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య ఉన్న గొడవేనని తెలుస్తోంది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లేకుండానే ప్రాసిక్యూటర్ల జీతం పెంచుతూ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసిందని అంటున్నారు. అయితే.. నగర పరిపాలన విషయంలో అత్యున్నత అధికారం లెఫ్టినెంట్ గవర్నర్దేనని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రాసిక్యూటర్ల జీతాల ఫైలు పెండింగులో పడింది. తర్వాత.. ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలతో పాటు దీన్ని కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కోసం పంపారు. దానికి ఇంకా అనుమతి రావాల్సి ఉంది. అయితే, ఇలాంటి విషయాల్లో ఇలా చేయడం వల్ల సమర్థులైన ఇతర న్యాయవాదులు కూడా ప్రభుత్వం తరఫున వాదించడానికి వెనకాడతారని, దానివల్ల ప్రభుత్వానికే నష్టమని కోర్టు తెలిపింది. 2015 డిసెంబర్ నుంచి 32 మంది అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు జీతాలు చెల్లించలేదన్న విషయం తెలిసి తాము తీవ్ర అసంతృప్తికి గురైనట్లు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు జీతాలు ఇవ్వకపోవడానికి కారణం ఏమీ లేదన్న విషయాన్ని స్టాండింగ్ కౌన్సెల్ రాహుల్ మెహ్రా కోర్టుకు చెప్పారు.