Purushottama
-
పుట్టపర్తిలో టీడీపీకి భారీ దెబ్బ
పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీకి భారీ దెబ్బ తగిలింది. 2009 నుంచి ఆ పార్టీలో గట్టి పట్టున్న అమడగూరు మండల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పుట్టా పురుషోత్తమరెడ్డి, ఆయన సోదరుడు మల్లికార్జునరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన రిటైర్డ్ డీఎస్పీ వేణుగోపాల్‌తో పాటు పలువురు వడ్డెర సామాజికవర్గ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. సోమవారం వారు పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డితో కలిసి బత్తలపల్లి మండలం సంజీవపురం వద్ద ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర శిబిరంలో సీఎం జగన్మోహన్రెడ్డిని కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అమడగూరు మండలంలో పురుషోత్తమరెడ్డికి మంచి సంబంధాలున్నాయి. ఆయన చేరికతో టీడీపీ బలమైన ఓటు బ్యాంకును కోల్పోయినట్లయింది. రిటైర్డు డీఎస్పీ వేణుగోపాల్.. చంద్రబాబు మాటలు నమ్మి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే టికెట్ వస్తుందనే నమ్మకంతో నియోజకవర్గం మొత్తం కలియదిరిగారు. తనను దారుణంగా మోసగించిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని వేణుగోపాల్ ప్రకటించారు. కొత్తచెరువు మండలం వడ్డెర కులానికి చెందిన పెద్దన్న, వెంకటస్వామి, జనసేన నాయకుడు తిరుపతేంద్ర తదితరులు కూడా సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీలోకి హిందూపురం నేతలు హిందూపురం: హిందూపురం టీడీపీ కీలకనేతలు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో లేపాక్షి మండల టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వి.హనోక్, చంద్రదండు వైస్ ప్రెసిడెంట్ అన్సార్ అహమ్మద్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ తదితరులు పాల్గొన్నారు. -
దేశ విభజనని శపించిన రాజర్షి
‘దుర్బలతే, నిస్పృహే ఇక మీకు దిక్కని ఈ తీర్మానం చెబుతోంది. ముస్లింలీగ్ ప్రదర్శించిన భీతావహ వ్యూహాలకి నెహ్రూ ప్రభుత్వం మోకరిల్లింది. దేశ విభజనకు అంగీకరించడమంటే దగా చేయడమే, లొంగిపోవడమే. భారతదేశాన్ని ఐక్యంగా ఉంచుకోవాలన్న ఆ కలను త్యాగం చేయడం కంటే, బ్రిటిష్ పరిపాలనలోనే మనం ఇంకొంత కాలం కడగండ్లు పడడం ఉత్తమం. భవిష్యత్తులో సింహాల్లా పోరాడేందుకు సిద్ధమవుదాం. బ్రిటిష్ వారితో పాటు ముస్లింలీగ్‌తో కూడా పోరాడి, దేశ సమగ్రతకు రక్షణ కవచాల్లా నిలబడదాం! ఈ విభజన ఏ వర్గానికి మేలు చేసేది మాత్రం కాదు. పాకిస్తాన్‌లోని హిందువులు గానీ, భారత్‌లోని ముస్లింలు గాని భయం భయంగానే బతకవలసి ఉంటుంది.’ జూన్ 14/15, 1947న ఢిల్లీలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రత్యేక సమావేశాలలో ఒక గళం నుంచి అనంతమైన బాధతో, క్షోభతో, ఆవేశంతో వెలువడిన మాటలివి. ఆ జూన్ 3నే భారతదేశాన్ని భారత్, పాకిస్తాన్ దేశాలుగా విభజిస్తూ, ఇంకొక పక్క స్వదేశీ సంస్థానాలకు స్వేచ్ఛనిస్తూ ఆఖరి ఆంగ్ల వైస్రాయ్ మౌంట్‌బాటన్ ప్రణాళికను ప్రకటించాడు. దీనికి జాతీయ కాంగ్రెస్ తరఫున నెహ్రూ, సర్దార్ పటేల్, జెబి కృపలానీ (నాటి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు) ఆమోదం తెలిపి వచ్చారు. ఆ ఆగస్టు 15కే స్వాతంత్య్రం ఇస్తున్నట్టు మౌంట్‌బాటన్ చెప్పడం విజ్ఞతతో కూడినదని నెహ్రూ వ్యాఖ్యానించారు కూడా. ఇంతటి కీలక సమావేశంలో పాల్గొనే బృందంలో గాంధీజీకి జాతీయ కాంగ్రెస్ చోటు కల్పించలేదు. ఇదొక గొప్ప చారిత్రక వైచిత్రి. మౌంట్‌బాటన్ విభజన ప్రణాళికను ఆమోదిస్తున్నట్టు తీర్మానం చేయడానికే జాతీయ కాంగ్రెస్ ఆ రెండు రోజుల సమావేశాలను ఏర్పాటు చేసింది. స్వాతంత్య్రోద్యమంలో అగ్రభాగాన నిలిచిన పార్టీ పెద్దలకు కూడా విభజన ప్రణాళిక గురించి సరైన సమాచారం లేదని అర్థమవుతుంది. అలాంటి కీలక సమావేశంలో పురుషోత్తమదాస్ టాండన్ పలికిన ఆ మాటలే అవి. సమావేశంలో పాల్గొన్న సభ్యులలో అత్యధికులు కరతాళ ధ్వనులతో టాండన్ వాదనకు సంఘీభావం తెలియచేశారు. సిం«ద్‌కు చెందిన చోతరామ్ గిద్వానీ కూడా ఇంతే ఉద్విగ్నంగా మాట్లాడుతూ విభజన గురించి తీవ్ర స్థాయిలో నెహ్రూ, పటేల్‌ల నిర్ణయాన్ని విమర్శించారు. టాండన్ ఆవేదన ఒకరకమైనది. గిద్వానీ వాదన అస్తిత్వానికి సంబంధించినది. ఆయన స్వస్థలం సిం«ద్ పాకిస్తాన్లో అంతర్భాగం కాబోతోంది. గాంధీ, నెహ్రూ, పటేల్, అబుల్ కలాం ఆజాద్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, రామ్మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్ వంటి ఎందరో చరిత్ర పురుషులు ఆ రెండు రోజుల సమావేశాలలో పాల్గొన్నారు. అధ్యక్షస్థానంలో జెబి డీలా పడిన వానిలా కూర్చుని ఉన్నారు. దేశ విభజనకు ఆనాడు ఎక్కువమంది వ్యతిరేకమన్నది చారిత్రక సత్యం. కేవలం జాతీయ కాంగ్రెస్ నాయకులే కాదు, కొందరు ముస్లింలు కూడా విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. విభజన ప్రణాళిక గురించి తనకు తెలియదనే గాంధీజీ చెప్పారు. మేం ఆయనకి చెప్పాం అన్నారు నెహ్రూ, పటేల్. మీరు చెప్పలేదని రెట్టించారు జాతిపిత. మీరు నౌఖాలీలో ఉండిపోతే విషయాలు ఎలా తెలుస్తాయి అన్నారు చివరికి నెహ్రూ. జయప్రకాశ్ నారాయణ్, లోహియా, అబ్దుల్ గఫూర్‌ఖాన్, అబుల్ కలాం– అంతా ఇలా జరగపోతే బాగుండేది అనే రీతిలోనే మాట్లాడారు. అంటే దేశాన్ని ముక్కలు చేయడం దారుణమనే. ఇన్ని గుండెల క్షోభ టాండన్ గొంతులోనే పలికిందంటే అతిశయోక్తి కాదు. \ పురుషోత్తమదాస్ టాండన్ (ఆగస్టు 1, 1882–జూలై 1, 1961) అలహాబాద్‌లో జన్మించారు. ప్రాథమిక విద్య ఇంటిలోనే సాగింది. ఆ పట్టణంలోనే ముయిర్ సెంట్రల్ కళాశాలలో పట్టభద్రులయ్యారు. ఆ కళాశాలలోనే న్యాయశాస్త్రం చదివారు. చరిత్ర అంశంతో ఎంఎ చేశారు. పురుషోత్తమదాస్‌కు స్వాతంత్య్రోద్యమ కాలం నాటి రాజకీయాలలోనే ‘రాజర్షి’ అన్న గౌరవం ఉండేది. మొదట గాంధీజీయే ఆయనను అలా సగౌరవంగా సంబోధించేవారు. 1960లో ప్రజలే ఆయనను సత్కరించి అదే బిరుదు ఇచ్చారు. టాండన్ అవిశ్రాంత దేశ సేవకుడు. స్వాతంత్య్ర పోరాట యోధుడు. పత్రికా రచయిత. హిందీని రాజభాషను చేయాలన్న ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. నెహ్రూతో, ఆయన సిద్ధాంతాలతో, భారతదేశంలో అమలవుతున్న లౌకికవాదం మీద ఆయనకు పేచీలు ఉన్నాయి. అయినప్పటికి 1961లో ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది. టాండన్ 1899లోనే భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. వందేమాతరం ఉద్యమం సమయానికి సంస్థలో ఒక స్థాయి గుర్తింపు తెచ్చుకోగలిగారు. 1906 నాటికే ఆయన జాతీయ కాంగ్రెస్ కార్యవర్గంలో అలహాబాద్ ప్రతినిధిగా స్థానం పొందారు. అప్పటికి జవహర్లాల్ నెహ్రూ రాజకీయాలలోకి రాలేదు. కానీ మోతీలాల్ వంటి ఉద్దండుడు అలహాబాద్ కేంద్రంగా జరుగుతున్న జాతీయోద్యమంలో కీలకంగా ఉన్న కాలమది. 1906లోనే టాండన్ అలహాబాద్‌లో తేజ్‌బహదూర్ సప్రూ వద్ద సహాయకునిగా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. స్రపూ సయితం స్వాతంత్య్రం సమరయోధుడే. అసాధారణ న్యాయనిపుణుడు. జలియన్‌వాలా బాగ్ ఉదంతం మీద వాస్తవాలను తెలుసుకోవడానికి జాతీయ కాంగ్రెస్ నియమించిన సంఘంలో కూడా టాండన్‌కు చోటు దక్కింది. గాంధీజీ పిలుపు మేరకు టాండన్ సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని 1921లో కారాగారానికి వెళ్లారు. 1931 నాటి కరాచీ సమావేశాలలో టాండన్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు. 1932 నుంచి ఆయన కిసాన్ సభ ఆధ్వర్యంలో రైతాంగ ఉద్యమాలలో కూడా చురుకుగా పనిచేశారు. మొత్తం ఏడు పర్యాయాలు ఆయన కారాగార శిక్ష అనుభవించారు. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం మన చట్ట సభలకు ఎన్నికలు జరిగాయి. యునైటెడ్ ప్రావిన్స్ (నేటి ఉత్తరప్రదేశ్) లెజిస్టేటివ్ అసెంబ్లీకి టాండన్ ఎంపికయ్యారు. 1948 వరకు అసెంబ్లీ సభ్యునిగా ఉన్నారు. ఆ 13 సంవత్సరాలు కూడా సభాపతిగా పనిచేసి విశేషమైన సంప్రదాయాలను ప్రవేశపెట్టారు. అప్పటికే విఠల్‌భాయ్ పటేల్ (సెంట్రల్ లెఙస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. సర్దార్ పటేల్ సోదరుడు) వంటివారు స్పీకర్ స్థానానికి ఉండవలసిన విధివిధానాలను తమ వ్యవహార సరళి ద్వారా నిర్దేశించారు. అందులో స్పీకర్ పార్టీ సమావేశాలకు వెళ్లరాదనేది ఒకటి. కానీ టాండన్ జాతీయ కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరయ్యేవారు. పార్టీ సమావేశంలో ప్రస్తావించినదే సభలో కూడా చర్చించవలసి వచ్చినప్పుడు, టాండన్ సభ్యులను ఉద్దేశించి, మీలో ఏ ఒక్క సభ్యునికి అభ్యంతరం ఉన్నా, నేను ఈ స్థానం విడిచి వెళతాను అని ప్రకటించేవారు. కానీ ఏ ఒక్క సభ్యుడు ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన అరెస్టయినప్పటికీ అనారోగ్య కారణాలతో విడుదల చేశారు. ఆయన బయటకు వచ్చి, నిషేధంలో ఉన్న కాంగ్రెస్‌ను మళ్లీ సంఘటితం చేయడానికి కృషి చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా టాండన్ చిరకాలం నిర్మాణాత్మకమైన పాత్రను నిర్వహించారు. 1946 నాటి రాజ్యంగ పరిషత్‌కు ఆయన ఎన్నికయ్యారు. 1952లో తొలి లోక్‌సభలో కూడా ఆయన అడుగుపెట్టారు. 1956లో పెద్దల సభకు వెళ్లారు. 1950లో కాంగ్రెస్ చరిత్రలో చెప్పుకోదగిన ఘట్టం జరిగింది. టాండన్∙జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎంపికయ్యారు. ఆ సంవత్సరం నాగపూర్‌లో సంస్థ సమావేశాలు జరిగాయి. జెబి కృపలానీ మీద పోటీ చేసి టాండన్ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. కృపలానీకి నెహ్రూ మద్దతు, టాండన్‌కు పటేల్ మద్దతు ఉన్నట్టు చెబుతారు. కానీ భారత పార్లమెంట్ తొలి ఎన్నికల సమయంలో, అంటే 1952లో ఆ పదవికి టాండన్ ఆ పదవికి రాజీనామా చేశారు. కారణం, నెహ్రూ విభేదాలు. ఈ విభేదాల ప్రభావం ప్రభుత్వ పని తీరు మీద గాఢంగానే పడింది. అప్పటి నుంచే కాంగ్రెస్‌లో ప్రభుత్వాధినేత, పార్టీ అధినేత ఒక్కరే ఉండే అలిఖిత నియమం ప్రవేశించిందన్న మాట కూడా ఉంది. నాటి రాజకీయవేత్తలలో చాలామంది మాదిరిగానే టాండన్ రాజకీయాలకే పరిమితమైపోకుండా వివిధ క్షేత్రాలకు సేవలు అందించారు. సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్స్ సొసైటీలో ఆయన సభ్యుడు. హిందీ సాహిత్య సమ్మేళన్‌లో కీలకంగా ఉండేవారు. రాష్ట్ర భాషా ప్రచార సమితికి కూడా సేవలందించారు. వీటికి తోడు ‘అభ్యుదయ’ అనే హిందీ పత్రికకు సంపాదక బాధ్యతలు కూడా నిర్వర్తించారు. టాండన్ మతం పట్ల గట్టి విశ్వాసం కలిగి ఉండేవారు. ఆయన రాధా సత్సంగ్ అనే చిన్న మత విశ్వాస వర్గానికి చెందినవారాయన. కానీ భారతదేశంలో హిందూ ముస్లిం ఆవశ్యకతను కూడా ఆయన గ్రహించారు. అలాగే బడుగు వర్గాలను సమాజంలో ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని దృఢంగా ఆకాంక్షించారు. లక్నోలో జరిగిన 49వ జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో సంస్థ అన్ని వర్గాల దగ్గరకు వెళ్లవలసిన అవసరం గురించి చెప్పారు. టాండన్ అభిప్రాయాలను, నిర్భీకతను నాటి కాంగ్రెస్‌లో నెహ్రూ అనుకూలురు ఆయన మీద వ్యతిరేక ప్రచారానికి ఉపయోగించుకున్నారని అనిపిస్తుంది. టాండన్ మదన్మోహన మాలవీయ, లాలా లజపతిరాయ్ల అభిప్రాయాలకు చాలా దగ్గరవాడని ఒకప్రచారం ఉండేది. అలాగే ఆయన హిందుస్తానీని కాకుండా హిందీనే జాతీయ భాషగా ప్రవేశపెట్టాలని రాజ్యాంగ పరిషత్‌లో వాదించినప్పుడు కూడా ద్రవిడ పార్టీల నుంచి, కొందరు ఇంతరుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. గాంధీ అభిప్రాయాలను మనసావాచా గౌరవించారు టాండన్. అహింసా సిద్ధాంతాన్ని ఎంతగానో మన్నించారు. పశువుల చర్మంతో కుట్టిన పాదరక్షలను వదిలి, రబ్బరు చెప్పులు వేసుకునేవారు. ఆయన పార్లమెంట్ సభ్యుడైన తరువాత ఒక సంఘటన జరిగింది. ఆ రోజుల్లో పార్లమెంట్ సభ్యుని వేతనం నెలకు నాలుగు వందల రూపాయలు. ఒకసారి టాండన్ తన జీతం చెక్కు పని మీద పార్లమెంటు కార్యాలయానికి వెళ్లారు. ఇకపై తన వేతనం మొత్తం నాలుగు వందల రూపాయలు కూడా పబ్లిక్ సర్వీస్ ఫండ్‌కు బదలీ చేయవలసిందని అక్కడి ఉద్యోగిని కోరారు. ఇది విన్న మరొక పార్లమెంటు సభ్యుడు టాండన్‌ను అడిగాడు. ‘మీకు ఇచ్చేదే కేవలం నాలుగు వందలు. ఈ భత్యం మొత్తం నెలకు సంబంధించినది. కానీ మీరు మొత్తం డబ్బును ప్రజా సేవకు ఇచ్చేస్తున్నారు, ఎందుకు?’ అన్నాడతడు. అందుకు టాండన్ సమాధానం ఇది– ‘నాకు ఏడుగురు కొడుకులు. అంతా చాలినంత సంపాదించుకుంటూ కుటుంబాలని పోషించుకుంటున్నారు. నెల తిరిగేసరికి ఒక్కొక్క అబ్బాయి వంద రూపాయల వంతును పంపుతారు. ఆ ఏడు వందల రూపాయలలో నేను మూడు లేదా నాలుగు వందలు ఖర్చు చేస్తాను. ఆ మిగిలిన మొత్తం కూడా ఏదో ఒక సంస్థకు ఇస్తాను. నాకు ఎక్కువైనప్పుడు అది ఇంకొకరికి ఉపయోగపడాలి.’భారత స్వరాజ్య సమరంలో కొందరు మహానుభావులను చూస్తుంటే, వారి నిబద్ధతను, అందులో భాగంగా వారు ఎంచుకున్న జీవన విధానాన్ని చూస్తే గాంధీ అంతేవాసిత్వంలోని దివ్యత్వాన్ని మించిన దివ్యత్వం వారిలో దర్శనమిస్తుంది. గాంధీ సిద్ధాంతంలో ఒదగడానికి వీలుగా అలాంటి వారంతా ఆ మించిన దివ్యత్వాన్ని తమకు తాము తగ్గించుకున్నారని కూడా అనిపిస్తుంది. అలాంటివారిలో పురుషోత్తమదాస్ టాండన్ ఒకరు. - ∙డా. గోపరాజు నారాయణరావు -
అంతిమ యాత్ర
ఒంటరితనంతో సహవాసం చేసేవాడికి సమాజంపై విపరీతమైన అసహ్యమైనా ఉంటుంది. లేదా జాలితో కూడిన ప్రేమైనా కలుగుతుంది. పురుషోత్తం ఎప్పట్నుంచో ఒంటరి. అరవైకి దగ్గరవుతోన్న ఒంటరి. సమాజాన్ని ప్రేమించడం అతనికి ఈ ఒంటరితనమే ఎలాగో అలవాటు చేసింది. జీవితాన్ని అతను ఇష్టపడతాడు. నాగేశం కూడా ఒంటరివాడే. పెళ్లైన ఒంటరివాడు. పెంచిన కూతురు ప్రేమ పేరుతో వెళ్లిపోవడం, పై చదువులకని వెళ్లిన కొడుకు పరదేశంలోనే స్థిరపడిపోవడం, అతని దురదృష్టమో, ఆమె అదృష్టమో అతని భార్య ఏకంగా పరలోకానికే వెళ్లిపోవడం అతణ్ని ఒంటరివాడ్ని చేశాయి. పురుషోత్తం, నాగేశం ఇంచుమించు ఒకే వయస్సు వారు. ఒకే కాలనీలో ఉంటారు. చాలాసార్లు ఎదురుపడి ఉంటారు ఒకరికొకరు. ఇద్దరి జీవితాల్లోకి ఒకరోజు... ఆరింటికి అలారం మోగగానే పురుషోత్తం నిద్రలేస్తాడు. ఇవ్వాళ ఆరుకు ముందే ఎవరో తలుపు తడుతున్న చప్పుడు. లేచి తలుపు తెరిచాడు. రమేశ్. ఏదో టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ‘‘రమేశ్.. ఇంత పొద్దున్నే ఏంటి? ముందు లోపలికి రా! ఎందుకలా టెన్షన్ పడుతున్నావ్?’’ అన్నాడు పురుషోత్తం.‘‘సార్ అదీ,’’ రమేశ్ లోపలికి వచ్చి కూర్చున్నాడు. పురుషోత్తం రమేశ్‌ను శాంతపరిచాడు. ‘‘సర్! ఒక పన్నెండు వేలు కావాలి. మళ్లీ రేపు ఉదయం ఆరింటికల్లా ఇచ్చేస్తాను,’’ అడిగాడు రమేశ్. మళ్లీ అతనే కొనసాగిస్తూ – ‘‘బాబుకి యాక్సిడెంట్ అయింది. చాలా క్రిటికల్‌గా ఉంది. నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోలేదు,’’ రమేశ్ ముఖంలో టెన్షన్ ఏమాత్రం తగ్గలేదు. పురుషోత్తం మారు మాట్లాడకుండా వెళ్లి బీరువాలోంచి డబ్బు తీశాడు.‘‘రేపు బాబు బాగున్నాడనే మాట చెప్పి డబ్బు తిరిగిస్తావు కదూ!’’ అంటూ రమేశ్ అడిగిన డబ్బును అతని చేతిలో పెట్టాడు. రమేశ్ ఆ డబ్బును అందుకొని కృతజ్ఞతగా పురుషోత్తం వైపు చూస్తూ, అక్కణ్నుంచి వేగంగా వెళ్లిపోయాడు. ముందురోజు డాక్టర్ రాసిచ్చిన మందులు కొనాలనే తన అవసరం కంటే రమేశ్ కొడుక్కి అత్యవసరమైన వైద్యానికి తన డబ్బు ఉపయోగపడుతున్నందుకు పురుషోత్తం చిన్న ఆత్మసంతృప్తి పొందాడు. వాతావరణం వర్షానుకూలంగా తోచడంతో వర్షం రావడం కంటే ముందు తనే ఆఫీస్కెళ్లాలని డైలీ రొటీన్లో పడిపోయాడు. నాగేశం నిద్ర లేవగానే అతని మనసంతా చిరాకుగా, చిందరవందరగా ఉంది. పక్కనే బల్లపై ఉన్న చీటీపాట పుస్తకాన్ని అందుకుని, తనకు డబ్బు ఇవ్వాల్సిన వారి చిట్టాని రాస్కుని లెక్క సరిగ్గా చూసుకోవడంతో మనసులోని చిరాకు తగ్గటంతో పాటు తనరోజు కూడా మొదలైంది. వర్షం మొదలైంది. గొడుగు తీస్కొని ఆఫీస్‌కి బయల్దేరిన పురుషోత్తానికి ఇంటిముందు రోడ్డు మీద ఒక చిన్న బుజ్జి కుక్కపిల్ల చలికి వణుకుతూ కనిపించింది. ఆగిపోయాడు. పదుల సంఖ్యలో వాహనాలు పరిగెత్తుతున్నా కుక్కపిల్ల అదృష్టమో, లేక వాహనాలు నడిపేవారు చాకచక్యంగా ఉన్నారో ఆ కుక్కపిల్లను మాత్రం తప్పించి నడుపుతున్నారు. ఆ కుక్కపిల్లను రోడ్డు మధ్యలో చూస్తుంటే పురుషోత్తం మనసు చలించిపోయింది. ఆలస్యం చేయకుండా రోడ్డు మధ్యలోకి వెళ్లి దాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఇంటి వరండాలోని బల్లకింద పాత మసిగుడ్డల మధ్యలో ఉంచాడు. ఇప్పుడది ప్రశాంతంగా ఒకదగ్గర కూర్చుంది. ఆఫీస్ చేరుకున్న నాగేశం అడుగు లోపల పెట్టగానే ప్యూన్ వేణు, చేతిలో ఒక డబ్బాతో ఆఫీస్‌లోని ఒక్కో క్యాబిన్కూ తిరుగుతుండటం చూశాడు. విషయమేంటో లాగటానికి పక్క క్యాబిన్ లింగరాజును కదిలించాడు నాగేశం. ‘‘ఏమోయ్ లింగరాజు! వేణు ఏదో డబ్బా పట్టుకొని అంతలా తిరుగుతున్నాడు! ఏంటి అతగాని సంగతి?’’ ‘‘మీకు ఇంకా విషయం తెలీదా? మన పక్క బిల్డింగ్ అకౌంట్ సెక్షన్‌లోని విశ్వనాథం నిన్న సాయంత్రం చనిపోయాడు. అతని కుటుంబానికి ఆర్థిక సాయంగా మన ఆఫీస్ స్టాఫ్ తోచినంత డబ్బు ఇవ్వమని మేనేజ్మెంట్ సూచన....’’ ఇంకా ఏదో చెప్తోన్న లింగరాజు మాటలు నాగేశం చెవులను చేరట్లేదు. ముఖం దీనంగా పెట్టడానికి ప్రయత్నిస్తూ లోపల విపరీతమైన ఆనందాన్ని పొందుతున్నాడు. నెలరోజుల ముందు తన కూతురి పెళ్లికని దాచిన డబ్బుని వడ్డీకి విశ్వనాథం నాగేశానికివ్వటం, ఆ డబ్బుని అంతకంటే ఎక్కువ వడ్డీకి బయట వేరేవాళ్లకు ఇవ్వడం, విశ్వనాథం దురదృష్టం కొద్దీ ఈ విషయం వీరిద్దరికీ తప్ప ఎవ్వరికీ తెలియకుండటం జరిగాయి. నాగేశం ఆనందానికి అవధుల్లేవు. వేణు చేతిలోని ఫండ్ డబ్బాలో తన తరఫున వంద రూపాయలు వేశాడు. తన మాటలు వింటున్నాడో లేదో పట్టించుకోకుండా విశ్వనాథం గురించి చెప్పుకుపోతున్న లింగరాజు, నాగేశం డబ్బాలో వంద వేయడం చూసి ఆశ్చర్యపోయాడు.మధ్యాహ్నం భోజనం ముగించుకొని తన కుర్చీ వద్దకు చేరుకున్న పురుషోత్తానికి నాలుగు కుర్చీల ఆవల ఒక ముసలావిడ కనిపించింది. రెండు గంటల నుంచి అక్కడే ఉందని స్ఫురణలోకి వచ్చి ఆమెను గమనించాడు. ఆ ముసలావిడ అభ్యర్థనను పట్టించుకోకుండా బల్లకింద తన చేతిని తృప్తి పరుస్తున్న వారి పత్రాలను మాత్రమే పరిశీలిస్తూ పనిలో నిమగ్నతను నటిస్తున్న వరుణ్ని ఏమనాలో పురుషోత్తానికి అర్థంకాలేదు. ముసలావిడని తన బల్ల వద్దకు పిలిపించుకొని రెండొందల రూపాయలు ఆమె చేతిలో ఉంచి చెవిలో ఏదో చెప్పి మళ్లీ వరుణ్ దగ్గరకు పంపాడు పురుషోత్తం. వరుణ్ బల్ల ముందుకు చేరిన ముసలావిడ బల్ల కింద చేయి ఉంచింది. ‘‘ఇదిగో మీరడిగిన డబ్బులు సారూ!’’ ఆశ్చర్యపోయాడు వరుణ్. ‘‘ఇప్పటివరకూ లేని డబ్బు ఇప్పుడెలా వచ్చింది?’’ ‘‘ఎలాగో అలా.. నా పని మాత్రం చేసి పెట్టండి సారూ!’’ ఆమె మాటలు అతణ్ని తప్పునైనా సరిగ్గా చేయమని ఆదేశిస్తున్నట్లుగా అనిపించింది. అప్పుడే అక్కడికి వచ్చిన పురుషోత్తాన్ని చూసిన వరుణ్ నిల్చున్నాడు. కూర్చోమని సైగ చేస్తూ పక్కనే తనూ కూర్చున్నాడు పురుషోత్తం.‘‘ఆ రెండొందలు ఇచ్చింది నేనే! దొంగనోట్లేం కాదయ్యా. ఆమె ఇస్తే తీసుకునే డబ్బుకి ఎంత విలువుందో నేనిచ్చే డబ్బుక్కూడా అంతే విలువుంటుంది.’’ ‘‘సార్! సారీ సర్..’’ ఒక్కక్షణం ఆగాడు పురుషోత్తం. ‘‘ఇప్పుడు బల్లకింద తీస్కునే డబ్బుతో ఏది కొన్నా ఆలోచించో, అవసరమయ్యో కొనవు. కొన్నాక అది నీ జీవితంలో ఎక్కువ రోజులు ఉండదు కూడా. కానీ ఇలా వచ్చే డబ్బు కోసం డెబ్భై ఏళ్ల ముసలావిడని ఇన్ని గంటలపాటు నిల్చోబెట్టి పట్టించుకోకపోవడం మాత్రం ఆమెకి మిగిలిన జీవితం మొత్తం గుర్తుంటుంది..’’ ‘‘ఒకరికి మంచి చేయమని నేను చెప్పట్లేదు. వరుణ్! నీ పని నిన్ను చేయమంటున్నానంతే’’. తన కుర్చీ వద్దకు వెళ్లిపోయాడు పురుషోత్తం. వరుణ్ కళ్లలో సన్నటి నీటి చెమ్మ. సాయంత్రం నాలుగ్గంటలకే ఆఫీసు నుంచి బయల్దేరిన నాగేశం తనకు ఇవ్వాల్సిన వారి నుంచి చీటీ డబ్బుల్ని ముక్కు పిండి మరీ వసూలు చేస్కొని అటునుంచి అటే మద్యం దుకాణానికి వెళ్లాడు. ఒంటరిగా కూర్చుని తన ఒంటరితనాన్ని తనే పంచుకుంటున్నాడు. గ్లాసులో మందు ఖాళీ అయ్యేకొద్దీ మత్తు ఎక్కుతూ ఉంది. చివరి గ్లాసు తాగేసి బయటకి వచ్చిన నాగేశానికి తన బైక్‌కు అడ్డంగా పడుకున్న ఒక కుక్క కనిపించింది. విచక్షణని మత్తు కమ్మేయడంతో ఆ కుక్కని బలంగా ఒక్క తన్ను తన్నాడు. అది నాలుగు అడుగుల దూరంలో ఎగిరిపడింది. దాని మూలుగు శబ్దాన్ని కూడా పట్టించుకోకుండా బండిపై వెళ్లిపోయాడు నాగేశం. ఆకాశాన్ని విపరీతంగా కమ్మిన మబ్బులు వర్షం తీవ్రతని సూచిస్తుండటంతో పాటు వెలుగును తొందరగా సన్నబరుస్తున్నాయి. ఆఫీస్ నుంచి ఇంటికి బయల్దేరిన పురుషోత్తం ఈరోజుకి హోటల్లో బిర్యానీ పొట్లాన్ని కొని ఇంటికెళ్లాడు. పురుషోత్తం వెళ్లిన రెండు నిమిషాలకు అదే హోటల్లోని చివరి బిర్యానీ పొట్లాన్ని నాగేశం కొనుక్కొని ఇంటికి బయల్దేరాడు. వర్షం క్షణక్షణానికీ ఉధృతంగా మారిపోతోంది. ఇంటికి చేరుకున్న పురుషోత్తం స్నానం చేసి తినడానికి కూర్చున్నాడు. పొట్లం విప్పి తినబోతున్న అతనికి ఒక్కసారిగా వరండాలో బల్లకింది కుక్కపిల్ల గుర్తొచ్చింది. హడావుడిగా అక్కడికెళ్లి చూశాడు. చలికి వణుకుతూ, ఆకలికి మూల్గుతున్న బుజ్జి కుక్కను చూసి వెంటనే తాను తెచ్చుకున్న పొట్లాన్ని దాని మూతికి అందించాడు. ముక్కుతూ మూల్గుతూ తింటున్న దాన్ని చూసి చిన్న నవ్వు నవ్వుకుని టీవీ ముందుకొచ్చాడు. ‘ఓ నిండు చందమామ’ అంటూ వస్తున్న పాటను వింటూ వెనక్కి ఒరిగి కళ్లు మూసుకున్నాడు. ఎప్పటిలాగే తన లక్ష్మి గుర్తొచ్చింది. చిన్ని చిరునవ్వు నోటి మీదకొచ్చింది. సహారా ఎడారిలో ఉన్నా కూడా మనసును మంచుతో నింపే ఆమె జ్ఞాపకాలంటే పురుషోత్తానికి ప్రాణం. ప్రాణంగా ప్రేమించిన లక్ష్మి తనని కాదనడానికి ఎన్నైనా కారణాలుండొచ్చు. కానీ ఇన్నేళ్ల తన ఒంటరితనాన్ని ఆమె జ్ఞాపకాలు ఎంత మధురంగా చేశాయో తనకు తెలుసు. అందుకే ఆమెంటే ఎప్పటికీ ప్రేమే. కానీ ఎందుకో తెలీదు ఈరోజు తను ఎక్కువగా గుర్తొస్తోంది. ఆలోచిస్తూనే పురుషోత్తం మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. మరోవైపు అదే వీధిలో పురుషోత్తం ఇంటికి నాలుగు ఇళ్ల ఆవల ఉన్న తన ఇంట్లోకి చేరాడు నాగేశం. హోటల్ నుంచి తెచ్చుకున్న చివరి బిర్యానీ పొట్లం అవ్వడం వలన మసాలా బాగా ఎక్కువ మోతాదులో ఉన్నా ఆకలి నకనకలాడుతుండటంతో ఫుల్లుగా లాగించేశాడు. భుక్తాయాసంతో మంచం పైకి చేరి ఒక్కసారి తనకు రావాల్సిన చీటీ పద్దులు లెక్క చూసుకొని అలాగే మంచం పైకి ఒరిగాడు. భార్య చనిపోయి ఇన్నేళ్లయినా మామ తనకు ఇవ్వాల్సిన కట్నాన్ని సగానికి పైగా ఎగ్గొట్టినందుకు ఆయన్ను, తన డబ్బుతో చదువుకొని విదేశాలకు వెళ్లి ఒక్కపైసా కూడా పంపనందుకు కొడుకునీ, తన ఇష్టంతో సంబంధం లేకుండా వేరేవాణ్ని చేసుకున్నందుకు కూతుర్నీ.. ఇలా అందర్నీ తిట్టుకుంటూ మెల్లిగా నిద్రలోకి జారిపోయాడు నాగేశం. అర్ధరాత్రి పన్నెండు అవుతోంది. ఆరిపోయే దీపపు వెలుగులా వర్షం తన ప్రతాపాన్ని పెంచింది. గాఢ నిద్రలో ఉన్న పురుషోత్తం, నాగేశంల గుండెల్లో ఏదో చిన్న రాయి కదిలినట్టు సన్నని నొప్పి. ఆ నొప్పి పెరుగుతూ పెరుగుతూ నిద్ర గాఢతను తగ్గిస్తోంది. ఇద్దరూ పూర్తిగా మేల్కొనేసరికి వారి ఎడమ చేయి గుండెపై, కుడి చేయి పక్కన దొరికిన వస్తువును బలంగా పట్టుకున్నాయి. ఆ అర్ధరాత్రి వారి శరీరాన్ని ప్రకృతికి అప్పగించి వెళ్లిపోవడం తప్ప చేసేదేమీ లేదని వారి మెదడు సూచిస్తూనే ఉంది. కుంభవృష్టిలా కురిసిన వర్షం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టి ఆగిపోయింది. అప్పటివరకూ వేగంగా కొట్టుకున్న శరీరాలు కదలడం ఆగిపోయి మెల్లగా చల్లబడటానికి సిద్ధమయ్యాయి. సెంచరీ కొట్టడానికి ఉపయోగపడే చివరి పరుగు ఎంత అమూల్యమైందో రమేశ్‌కి తెలుసు. అందుకే తన కొడుకు వైద్యానికి కావాల్సిన చివరి చిన్న మొత్తాన్ని సర్దిన పురుషోత్తం ఇంటి తలుపును చెప్పిన సమయానికి తట్టాడు. ఉదయం ఆరు గంటలకు ఠంచనుగా నిద్రలేచే అలవాటున్న పురుషోత్తం ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో అనుమానంతో కిటికీలోకి చూసిన రమేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కాసేపటికి ఆ వీధి, ఇంకాసేపటికి ఆ కాలనీ కూడా ఉలిక్కిపడ్డాయి. మరోవైపు సమాజం అవసరాలతో సంబంధం లేకుండా బతికే నాగేశం ఇంటివైపు ఎప్పట్లానే ఎవ్వరూ వెళ్లలేదు. వెళ్లరు కూడా. రక్త సంబంధీకుల రాకపోకలు కూడా ఉండకపోవటంతో అతని ఇల్లు కిటికీలు, తలుపులున్న అతిపెద్ద సమాధిలా ఉంది. చూస్తుండగానే పురుషోత్తం ఇంటిముందు చేరిన జనం సంఖ్య ముందురోజు పడిన వర్షపు చినుకుల సంఖ్యను తలపిస్తోంది. ఒకరికి తెలియకుండా ఒకరికి అతను చేసిన సహాయాలను ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఒక సంఘజీవి చనిపోయాడంటూ మనస్ఫూర్తిగా బాధ పడుతున్నారు. అంతిమ యాత్ర మొదలైంది. పురుషోత్తం శరీరాన్ని ఒకరితర్వాత ఒకరు పోటీ పడుతూ శ్మశానానికి కదులుతున్న జనాల్ని చూస్తుంటే అంతిమ యాత్ర కూడా ఒక అద్భుతంగా కనిపిస్తోంది. ఆ జనాలతో పాటే తనకు తెలిసో తెలీకో ఒక చిన్న కుక్కపిల్ల ముందురోజు రాత్రి సగం తిన్న బిర్యానీ పొట్లాన్ని వదిలేసి వారితో పాటు వెళ్తూ ఉంది. ఆ కుక్కపిల్లతో పాటు అంతిమ యాత్రలో పాల్గొన్న చాలామందికి తెలియదు, పురుషోత్తం ఏదో ఒక సమయంలో వారికి సాయం చేశాడని. పురుషోత్తం, నాగేశం చనిపోయి పన్నెండు గంటలయింది. పురుషోత్తం శరీరం శ్మశానంలో నిశ్శబ్దంగా కాలిపోతోంది. నాగేశం శరీరం ఎవ్వరి పట్టింపూ లేక అంతే నిశ్శబ్దంగా, భయంకరంగా కుళ్లిపోతోంది. -
దర్జాగా.. దౌర్జన్యంగా.. ఏం మగాళ్లండీ వీళ్లు?!
పురుషోత్తములు రైళ్లలో, సిటీ బస్సుల్లో ‘స్త్రీలకు మాత్రమే’ అని ఉన్నచోట ఈ మగాళ్లెలా ధైర్యంగా కూర్చోగలరో ఎప్పటికీ అర్థం కాని విషయం. పైగా దబాయింపు చూపొకటి... ‘లేవం, ఏం చేసుకుంటావో చేస్కో ఫో’ అన్నట్లు! ఎందుకిలా ప్రవర్తిస్తారు వీళ్లు? ఆ... ఆడవాళ్లే కదా అన్న తేలిక భావమా? సంస్కారం లేకపోవడమా? కారణాలు ఏవైనా ఇలాంటి మగాళ్లకు బుద్ధి చెప్పడం కోసం మహిళాప్రయాణికులతోపాటు, ఇప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్సులూ ఫైట్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు ఢిల్లీ మెట్రో రైళ్లు. వీటిల్లో మొదటి కంపార్ట్మెంట్ పూర్తిగా మహిళలది. మగాళ్లు కూర్చోకూడదు. అయినా కూడా ఈ ఏడాది ఆరంభం నుండి ఇప్పటి వరకు ఈ కంపార్ట్మెంట్లలో పట్టుబడిన ‘పురుషోత్తముల’ సంఖ్య 3,500. ఈ సంఖ్య గతేడాది ఇలా లేడీస్ కంపార్ట్మెంట్లలో దర్జాగా కూర్చొని దొరికిపోయినవారి సంఖ్య కన్నా తక్కువేనట. అంటే మగాళ్లలో మార్పు వచ్చిందనా? కాదు కాదు, ‘సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (మెట్రో) నిఘా పెరిగింది. ఈ ఫోర్సు మెల్లగా వస్తుంది. మామూలు దుస్తులలో వస్తుంది. లేడీస్ సీట్లలో కూర్చొని ఉన్న మగాళ్లను మెరుపులా పట్టేస్తుంది. కొందరు ‘తెలియక ఎక్కాం’ అంటారు. కొందరు ‘పెహ్లీ బార్ థా, జానేదో ప్లీజ్’ అంటారు. కొందరు ‘ఐ వాజ్ జస్ట్ చార్జింగ్ మై మొబైల్’ అంటారు. కొందరు ‘సారీ’ చెప్పి స్టేషన్ రాగానే దిగి పోతారు. ఇలాంటివి మినహాయించినా కూడా ఇన్ని వేల మంది దొరకడమే విశేషం. పట్టుకున్న వారిని సెక్యూరిటీ ఫోర్స్ ఊరికే వదిలి పెట్టదు. ఫైన్ వేస్తుంది. ఇంకా ఏమైనా ఎక్స్‌ట్రాలు చేస్తుంటే పోలీసులకు అప్పజెబుతుంది. ప్లాట్‌ఫారమ్ మీద, ఉమన్ కంపార్ట్మెంట్ లోపల స్త్రీలకు మాత్రమే అని గమనికలు ఉంటాయి. ‘స్త్రీల కంపార్ట్మెంట్లో స్త్రీలనే కూర్చోనివ్వండి’ అనే అనౌన్స్మెంట్లు నిరంతరం వినిపిస్తూనే ఉంటాయి. అయినా సరే, మగాళ్లు కనిపిస్తూనే ఉండడం సెక్యూరిటీ సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘‘రోజుకి సుమారు 50 మంది మగాళ్లు లేడీస్ కోచ్‌లో మాకు పట్టుబడతారు. వాళ్లను మా సిబ్బంది... స్టేషన్ కంట్రోల్ రూమ్‌కి తరలిస్తారు. అక్కడే వాళ్లు ఫైన్ కూడా కట్టాలి. మహిళలను వేధించడానికే వాళ్లంతా ఆ కోచ్‌లో కూర్చున్నారు అనేందుకు లేదు. కానీ కొందరు అందుకోసమే ఎక్కుతారు. ఏ ఉద్దేశంతో ఎక్కినా, తమ తప్పు ఒప్పుకుని లేచిపోతే పర్వాలేదు కానీ, వాదనకు దిగితే మాత్రం వారికి ఫైన్ తప్పదు’’ అని సీఐఎస్ఎఫ్ డెరైక్టర్ జనరల్ అరవింద్ రంజన్ అంటారు. ఒక్క ఢిల్లీ మెట్రోలోనే కాదు, మెట్రో వ్యవస్థ ఉన్న ప్రతి నగరంలోనూ, సిటీ బస్సులలోను మహిళా ప్రయాణికులకు మగవాళ్ల బెడద తప్పడం లేదు. అంతదాకా ఎందుకు... మన హైదరాబాద్ సిటీ బస్సులలోనే చూడండి. లేడీస్ సీట్లలో మగాళ్లొచ్చి కూర్చుంటారు. లేవమంటే కోపంగా చూస్తారు. లేదంటే మాట వినిపించుకోనట్లు కిటికీల్లోచి బయటికి చూస్తుంటారు. చాలాసార్లు కండక్టర్ కూడా వాళ్లను లేపలేని అసహాయ స్థితిలో పడిపోవడం కనిపిస్తుంది. టికెట్ చెకింగ్‌కి ఉన్న విధంగా... లేడీస్ సీట్లలో ధీమాగా, దర్జాగా, ధైర్యంగా, దౌర్జన్యంగా కూర్చున్న మగాళ్లను లేపడానికి సిటీ బస్సులలో కూడా సెక్యూరిటీ ఫోర్స్లాంటి మెరుపు దాడులుండాలి. అప్పుడుగానీ లేడీస్ సీట్లు లేడీస్‌కి దక్కవేమో!