puskara devotees
-
పుష్కర యాత్ర విషాదాంతం
స్క్రూబ్రిడ్జి మీది నుంచి సర్వీసు రోడ్డులోకి కారు పల్టీ ఇద్దరి దుర్మరణం.. ఆరుగురికి తీవ్ర గాయాలు బాధితులు శ్రీకాకుళంవాసులు విజయవాడ (ఆటోనగర్): పుష్కర స్నానం అయ్యింది, అమ్మవారి దర్శనం ముగిసింది... ఆ సంతోషంతో ఇంటి ముఖం పట్టారు. ఇంతలోనే మృత్యువు ప్రమాదరూపంలో వెంటాడింది. వేగంతో వస్తున్న కారు అదుపు తప్పి బ్రిడ్జి గోడను బద్ధలు కొడుతూ కిందనున్న సర్వీసురోడ్డు మీదకు పడింది. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఆరుగురు గాయలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బెంజ్‌సర్కిల్‌కు సమీపంలో జరిగిన ఘటనతో అందరూ ఉలిక్కిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తొరుపి గ్రామానికి చెందిన అప్పాయమ్మ ఆమె కుమారులు పైడి అప్పలనాయుడు అతని భార్య శారద, వారి పిల్లలు మహేష్, సూర్య, మరో కుమారుడు పైడి వెంటకరమణ, కుమార్తె భూలక్ష్మి, భూలక్ష్మి కుమారుడు హర్షవర్థణŠ మొత్తం కలిపి ఎనిమిది మంది కలిసి మారుతీ స్విప్ట్ కారు(ఏపి30 పి4789)లో విజయవాడకు మంగళవారం తెల్లవారుజామున వచ్చారు. పుష్కర స్నానం ముగించుకుని తిరుగుపయ్రాణమై స్క్రూ బ్రిడ్జి సెంటర్‌కు చేరుకోగానే కారు వేగంతో ఉండటంతో అదుపు తప్పింది. దీంతో బ్రిడ్జి గోడను ధ్వంసం చేసుకొని దాదాపు ఆరు అడుగుల కిందనున్న సర్వీస్ రోడ్లోకి బోల్తాకొట్టింది. దీంతో డ్రైవింగ్ సీట్లో ఉన్న వెంకటరమణ (40), పక్క సీటులో ఉన్న హర్షవర్థన్ (11) కారులోనే తీవ్రగాయాలతో దుర్మరణం పాలయ్యారు. మిగతా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారిబాబు ఉన్నారు. మరో చిన్నబ్బాయి సురక్షితంగా బయటపడ్డాడు. సహయచర్యల్లో స్థానికులు.. ఘటన చూసిన స్థానికులు వెంటనే కారు డోర్లు లాగి రక్షించే ప్రయత్నం చేశారు. అయితే డోర్లు లాక్ కావడంతో కారు అద్దాలు పగలకొట్టి ఒక్కొక్కరినే బయటకు తీశారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ప్రైవేట్, ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి రెండు మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సబ్‌కలెక్టర్ సృజన, డీటీసీ మీరా ప్రసాద్ సంఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యల్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన చోట ఉన్న సీసీ కెమెరాల్లో కారు ప్రమాదం చిత్రాలను సేకరించారు. కారు అతి వేగంతో రావటం వల్లే ప్రమాదం జరిగిందని నిర్ధరించారు. మృతి చెందిన వెంటక రమణ కాంట్రాక్టర్ కాగా, అతని సోదరుడు అప్పలనాయుడు సిఆర్‌పిఎఫ్‌లో జవాను. కారు కింద పడ్డ సమయంలో అక్కడ ఇతర వాహనాలు, మనుషులు ఉంటే మరో పెద్ద ప్రమాదం సంభవించి ఉండేది. ట్రాఫిక్ పోలీసులను వేరే ఇతర కార్యక్రమాలకు మళ్లించడంతో స్కూబ్రిడ్జి వద్ద పర్యవేక్షణ లేకపోవడం దుర్ఘటనకు ఒక కారణమని స్థానికులు చెబుతున్నారు. మంత్రుల పరామర్శ ఘటనలో తీవ్రంగా గాయపడిన అపాయమ్మ పరిస్థితి విషయంగా ఉంది. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సంఘనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రుల్లో క్షతగాత్రులను రవాణా శాఖ మంత్రి సిద్దా రాఘవరావు పరామర్శించారు. -
పుష్కర స్నానానికి వెళ్లి తిరిగొస్తూ..
ప్రమాదానికి గురైన ప్రయాణికుల కారు ఒకరు మృతి .. ముగ్గురికి తీవ్ర గాయాలు పెదనందిపాడు (వరగాని) : కారు చెట్టును ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా చినగంజాంకు చెందిన మోటుమర్రి రామసుబ్బారావు.. అతని భార్య రాజ్యలక్ష్మి, కుమార్తె బబిత, స్నేహితుడు శంకరమంచి మధుబాబు కారులో విజయవాడ పుష్కర స్నానానికి వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో పెదనందిపాడు మీదుగా చినగంజాం వెళ్తున్నారు. మండలంలోని వరగాని వద్ద కాటన్ మిల్ సమీపంలోకి రాగానే కారు ఎదురుగా ఉన్న చెట్టును వేగంగా ఢీకొట్టి పక్కనే ఉన్న మేకలవాగులోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో డ్రై వరు ఎం. సుబ్బారెడ్డి (45) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న శంకరమంచి మధుబాబు, రామ సుబ్బారావులకు తల, కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. రాజ్యలక్ష్మి కుడి కాలుకు, చేతికి గాయాలయ్యాయి. ప్రమాదం చూసిన స్థానికులు కాల్వలోకి దూకి క్షత్రగాత్రులను ఒడ్డుకు తీసుకొచ్చారు. స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ అలీ ప్రమాద స్థలికి చేరుకుని క్షత్రగాత్రులకు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం 108 వాహనంలో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. డ్రై వరు నిద్రమత్తు వల్లనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సుబ్బారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దడ పుట్టిస్తున్న డయేరియా
* రోజురోజుకు పెరిగిపోతున్న బాధితులు * కలుషిత నీరు, ఆహారం తీసుకోవడమే కారణం * ఇప్పటివరకు 486మందికి వైద్యం * అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు గుంటూరు మెడికల్ : పుష్కరాల్లో డయేరియా దడపుట్టిస్తోంది. ప్రారంభ రోజు నుంచి డయేరియా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తొలిరోజు 52 మంది, 13వతేదీ 104 మంది, 14వ తేదీ 113 మంది, 15వ తేదీ 97 మంది, 16వ తేదీ మంగళవారం 120 మంది డయేరియాతో బాధపడుతూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్యశిబిరాల్లో చికిత్స పొందారు. కలుషితమైన మంచినీరు తాగటం, శుభ్రంగా లేని ఆహారం భుజించటం వల్లే డయేరియా కేసులు నమోదవుతున్నాయి. డయేరియా సోకినప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాపాయం సంభవించే అవకాశాలున్నాయని తెలిపారు. పిల్లల విషయంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పిల్లల వైద్యుల సంఘం జిల్లా సెక్రటరీ డాక్టర్ టి. చంద్రశేఖరరెడ్డి తెలిపారు. డయేరియా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో వైద్యులు, ౖవైద్యాధికారులు అప్రమత్తమవ్వటంతో పాటుగా పుష్కరాలకు వచ్చే భక్తులు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు. 13,297 మందికి వైద్యసేవలు.... జిల్లాలో వివిధ పుష్కరఘాట్లలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరాల్లో మొత్తం 13,297 మంది వివిధ రోగాలతో వైద్యసేవలను పొందారు. జ్వరంతో బాధపడుతున్న 403 మందికి, వివిధ రకాల అలర్జీలతో బాధపడుతున్న 871 మందికి, శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 3783 మందికి, ఆస్తమాతో బాధపడుతున్న 210 మందికి, కన్ను, చెవి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 541 మందికి, డయేరియాతో బాధపడుతున్న 120 మందికి వైద్యసేవలను అందించినట్లు జిల్లా ౖÐð ద్య ఆరోగ్యశాకాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి వెల్లడించారు. పుష్కరాల్లో 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు 54,239 మందికి వైద్యసేవలను అందించామని ఆమె వెల్లడించారు. -
పుష్కర భక్తులకు ‘ఓల్డ్ గన్నీస్‘ అన్నదానం
గుణదల : వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం తాను అన్నసమారాధన నిర్వహిస్తున్నామని ది విజయవాడ ఓల్డ్ గన్నీస్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేఉషన్ ఆద్యులు గూడెల త్రినా«ద్ అన్నారు. సోమవారం సంస్థ ఆధ్వర్యంలో కెనాల్‌రోడ్డులో వినాయకుని గుడి సమీపంలోని బ్రహ్మచారి బావాజీమఠంలో పుష్కరయాత్రికులకు అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుసగా 5 పుష్కరాల్లోనూ తాము భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం చేస్తున్నామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిత్యం రెండు వేల మందికి అన్నదానం చేస్తున్నామన్నారు. సోమవారం నుంచి పుష్కరాలు ముగింపు రోజు వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్నసమారాధన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బెవర నాయుడు, కార్యదర్శి బొల్లి సాంబశివరావు, కోశాధికారి శంభాన సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు మజ్జి పెద్ద సత్యనారాయణ, సహాయ కార్యదర్శి మజ్జి ఈశ్వరరావు, సభ్యులు పులపా గోవిందు, గూడెల గంగాధరరావు, బేవర గంగాధర రావు, వూటకూరి సుబ్బారావు, షేక్‌మస్తాన్, అడ్డూరి రాము తదితరులు పాల్గొన్నారు. -
కాసుల కోసం కక్కుర్తి
* సాధారణ భక్తులకు చుక్కలు * అమరేశ్వరాలయంలో ఉచిత దర్శనానికి వెళ్తే పాట్లే * టికెట్ కొనుగోలు దర్శనానికే ప్రాధాన్యం అమరావతి (పట్నంబజారు): కృష్ణా పుష్కరాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగనివ్వం.. దేవాదాయ ధర్మదాయ శాఖ ఉన్నతాధికారులు గత ఆరు నెలలుగా సమీక్షలు, సమావేశా ల్లో చెప్పిన మాటలివి. అయితే అందుకు పూర్తి భిన్నంగా అమరావతిలో పరిస్థితులు నడుస్తున్నాయి. సామాన్య భక్తులు అమరేశ్వరుని దర్శనం అంటనే భయపడాల్సి వస్తోంది. అమరావతిలో ఫుష్కర స్నానాలు ఆచరించేందుకు ఆదివారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్నా నాలు చేసిన అనంతరం అమరేశ్వరుని దర్శనం కోసం ఆలయ ప్రాంగణానికి రా గానే కష్టాలు ప్రారంభమవుతున్నాయి. ఉచిత దర్శనం క్యూలైను వద్ద దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు, సిబ్బందే స్వయంగా ఈ దర్శనం ఆలస్యమవుతోం దని చెబుతున్నారు. త్వరగా దర్శనం అవ్వాలంటే రూ.100, రూ.300 టికెట్లు కొనుగోలు చేయాలని సూచించటం గమనార్హం. అయినా ఉచిత దర్శనానికి వెళితే ఇక అంతే సంగతులు. కనీసం మూడు గంటలకు పైగా క్యూలైనులో పడిగాపులు కాయాల్సిందే. డబ్బులు చెల్లించే వారికి మాత్రమే త్వరగా దర్శనం చేయిస్తూ...ఉచిత దర్శనం క్యూను మాత్రం నిలిపివేయటంపై భక్తులు మండిపడుతున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చామని, అంతంత చెల్లించి టికెట్లు కొనుగోలు చేయలేమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మ్యాట్లు లేవు... ఉచిత క్యూలైనులో వచ్చే భక్తులపై అధికారులు చిన్నచూపుతో వ్యవహరిస్తున్నారు. భక్తులు వెళ్లే క్యూలైనులో రాళ్లు, రప్పలు ఉన్నా.. కనీసం మ్యాట్లు కూడా వేయకపోవటం శోచనీయం. అదే టికెట్ కొనుగోలు చేసినవారి క్యూలైన్లలో మాత్రం సకల సౌకర్యాలు కల్పించారు. అధికారుల తీరుపై పేద భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లేనిపోని ఆర్భాటపు ప్రకటనలు చేసి, తీరా ఇక్కడికి వచ్చిన తరువాత ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. -
దుర్గగుడిపై రద్దీ అంతంతే
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : ఒకవైపు పవిత్ర పుష్కరాలు, చెంతనే ఉన్న దుర్గమ్మ దర్శనానికి భక్తజనం పోటెత్తుతుందని అంచనా. అయితే ఆలయ ఉన్నతాధికారుల నిర్వాకం వల్ల వేలమంది భక్తజనం అమ్మవారి దర్శనానికి రాకుండానే వెనుదిరిగారు. తొలిరోజునే భారీ గందరగోళం చోటుచేసుకుంది. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం రద్దీ సాధారణమే. శ్రావణ మాసం రెండో శుక్రవారం, పుష్కర రద్దీ అయినప్పటికీ 50 వేల లోపే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మరో వైపున పుష్కరాలలో 22 గంటలు అమ్మవారి దర్శనం కల్పిస్తామని చెప్పినప్పటికీ అది ఆచరణలో సాధ్య పడలేదు. గురువారం రాత్రి 9 గంటలకే అమ్మవారి దర్శనం నిలిపివేసినప్పటికీ శుక్రవారం తెల్లవారుజామున 1 గంటలకు దర్శనం కల్పించాల్సి ఉండగా , అలంకరణలో ఇబ్బందుల కారణంగా తెల్లవారుజామున 5 గంటల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. సర్వ దర్శనంలో క్యూలైన్లోనే భక్తుల తాకిడి కనిపించగా, శీఘ్రదర్శనం, రూ. 5 వందల దర్శనం క్యూలైన్లలో రద్దీ నామమాత్రం. బుద్ధా సొంత వాహనంలో బాలకృష్ణ ఇక వీఐపీలను దేవస్థాన వాహనాలపైనే దుర్గగుడి పైకి తీసుకువచ్చి దర్శనం అయిన తర్వాత అదే వాహనంపై సాగనంపుతామని చెప్పారు. అయితే దీనిని ఉల్లంఘిస్తూ సీఎం చంద్రబాబు బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణను స్థానిక ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తన వాహనంపై కొండపైకి తీసుకువెళ్లడంతో టోల్గేట్ వద్ద డ్యూటీలో ఉన్న ఆర్డీఓపై దుర్గగుడి ఈవోసూర్యకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై ప్రతాపం మీడియా ప్రతినిధులకు పాస్‌లు లేవనే కారణంతో పోలీసు అధికారులు వారిని పైకి వెళ్లకుండా అడ్డుకున్నారు. మీడియాకు దేవస్థానం నుంచి ఎటువంటి డ్యూటీ పాస్‌లు ఇవ్వలేదని చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు.ఈవోకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. తొలి రోజు ఆదాయం రూ.8.38 లక్షలు పుష్కరాల తొలి రోజున దుర్గగుడికి ప్రసాదాలు, టికెట్ల విక్రయాల ద్వారా రూ. 8,38,818ల ఆదాయం సమకూరింది. వీఐపీ దర్శనం టికెట్లు కేవలం 96 మాత్రమే విక్రయించారు. ఇక 68,400 లడ్డూలను విక్రయించగా రూ. 6.84 లక్షల ఆదాయం సమకూరింది. భవానీ ప్రసాదం విక్రయాల ద్వారా రూ. 71,850ల ఆదాయం సమకూరింది.