puskara snam
-
పుణ్యం కోసం.. ఒంటికాలితో...
నాగాయలంక: నాగాయలంక శ్రీరామపాదక్షేత్రం పుష్కరఘాట్లో ఉవరి సహాయం లేకుండానే ఒంటికాలితో వికలాంగుడు కృష్ణానదిలో మంగళవారం పుణ్యస్నానం చేసి వెళ్లడం ఇలా కనిపించింది, సమీపంలోని మర్రిపాలెం గ్రామానికి చెందిన తాపీమేస్త్రి వెంకటేశ్వర్రావు నిత్యం ఇలాగే స్నానమాచరించి కృష్ణవేణీమాతను ప్రసన్నం చేసుకుంటున్నట్లు చుప్పాడు. -
కోటి లింగాలలో సినీ నటుడు నవీన్ పూజలు
ముక్త్యాల(జగ్గయ్యపేట) : గ్రామ సమీపంలోని కోటిలింగ హరిహర మహాక్షేత్రంలోని అమృతలింగేశ్వరస్వామిని సినీ నటుడు వడ్డే నవీన్ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో ధూళిపాళ్ల సుబ్రహ్మణ్యంస్వామి శేష వస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు. అంతకు ముందు ఆలయ సమీపంలోని అలకనంద రియల్ ఎస్టేట్లోని ప్రైవేట్ ఘాట్లో పుష్కర స్నానం చేశారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, హైకోర్టు న్యాయవాదులు ఉన్నారు. -
పుణ్యస్నానానికి వస్తే.. ప్రాణాలే పోయాయి
విజయవాడ (లబ్బీపేట) : కృష్ణ పుష్కరాల్లో స్నానం చేసే పుణ్యఫలాలు దక్కుతాయని ఉత్సాహంగా కుటుంబ సమేతంగా వస్తే.. తీవ్రమైన గుండెపోటుతో ప్రాణాలేపోయాయి. కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం తీవ్ర విషాదానికి గురైంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన వై భాస్కరరావు (55), భార్య పిల్లలు, ఇతర బంధువులతో కలిసి పుష్కర స్నానాల కోసం గురువారం సాయంత్రానికే నగరానికి చేరుకున్నారు. రైల్వే స్టేషన్లో దిగి అర్ధరాత్రి సమయంలో దుర్ఘా ఘాట్ వద్దకు వచ్చారు. ఇంతలో ఛాతీలో నొప్పి రావడంతో పాటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తగా, సమీపంలోని వైద్య శిబిరంలో పరీక్షలు చేయించి, 108లో పాత ప్రభుత్వాస్పత్రిలోని పుష్కర వార్డుకు తరలించారు. కాగా భాస్కరరావు అక్కడకు చేరుకునే సమయానికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని కొత్త ఆస్పత్రిలోని మార్చురీకి తరలించగా, వేకువ జామున బంధువులు విశాఖకు తీసుకెళ్లారు. పుష్కర స్నానం కోసం వస్తే ప్రాణాలే కోల్పోవాల్సి వచ్చిందని బంధువులు విలపించారు.