puttaparhi
-
సత్యసాయిజిల్లా: బాలికపై టీడీపీ నేత దాష్టీకం
సాక్షి,సత్యసాయి జిల్లా:పుట్టపర్తి మండలం బత్తలపల్లిలో టీడీపీ నేత సూర్యనారాయణ దాష్టీకం వెలుగు చూసింది. బహిర్భూమికి వెళ్లిన బాలికపై సూర్యనారాయణ అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది.అత్యాచారం విషయం బయటకు పొక్కితే చంపుతామని బాలికను టీడీపీ నేతలు బెదిరించినట్లు తెలుస్తోంది. అయినా బాలిక తల్లిదండ్రులు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూర్యనారాయణపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. -
తండ్రితో తాగుడు మాన్పించలేక.. యువకుడి విషాదం!
పుట్టపర్తి అర్బన్: మద్యానికి బానిసైన తండ్రిని మార్చుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... పుట్టపర్తి మండలం వీరాంజనేయపల్లికి చెందిన వడ్డే రాజేష్, రేవతి దంపతులకు ఓ కుమార్తెతో పాటు కుమారుడు విష్ణువర్దన్(19) ఉన్నారు. బేల్దారి పనులతో పాటు వ్యవసాయ కూలి పనులు చేస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. ప్రస్తుతం విష్ణువర్దన్ అనంతపురంలోని ఓ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు.చాలా కాలంగా రాజేష్‌కు మద్యం సేవించడం అలవాటుగా ఉండేది. ఇటీవల అది శ్రుతిమించి మోతాదుకు మించి మద్యం తాగి మత్తులో ఎక్కడపడితే అక్కడే పడిపోయేవాడు. గమనించిన చుట్టుపక్కల వారు రాజేష్ ఆచూకీ తెలపడంతో కుటుంబసభ్యులు వెళ్లి ఇంటికి పిలుచుకువచ్చేవారు. ఈ నేపథ్యంలోనే తెలిసిన వారు పలుమార్లు రాజేష్‌తో మద్యం అలవాటు మాన్పించాలని కుటుంబసభ్యులకు చెబుతూ వచ్చారు. అయితే తమ మాట తండ్రి వినకపోవడం... తరచూ చుట్టుపక్కల వారు హితబోధనలు చేయడం వంటి చర్యలతో సమాజంలో తలెత్తుకుని తిరగలేని స్థితికి చేరుకున్నామని కుటుంబసభ్యులు లోలోన మదనపడేవారు.ఆదివారం సాయంత్రం అమగొండపాళ్యం రోడ్డు పక్కన మద్యం మత్తులో రాజేష్ పడి ఉన్నాడని తెలుసుకున్న విష్ణువర్దన్ అక్కడకు చేరుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి చేర్చాడు. ఆ సమయంలో తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేనప్పుడు తాగుడు ఎందుకు అంటూ కుమారుడు నిలదీశాడు. కుమారుడి వాదనలతో తండ్రి ఏకీభవించకుండా తనదైన శైలిలోనే సమాధానమిస్తూ వచ్చాడు. దీంతో ఇక తండ్రిలో మార్పు రాదని గ్రహించిన విష్ణువర్దన్... ఆదివారం రాత్రి ఇటీవల నిర్మించిన ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా పాత ఇంటికి చేరుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం విష్ణు అవ్వ పాలు పితకడానికి పాత ఇంటి వద్ద ఉన్న పశువుల పాక వద్దకు వెళ్లింది. ఆ సమయంలో ఉరికి విగతజీవిగా వేలాడుతున్న మనవడిని చూసి గట్టిగా కేకలు వేసి అప్రమత్తం చేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ కృష్ణమూర్తి అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, కుటుంబాన్ని నిలబెడతాడనుకున్న కుమారుడు చనిపోవడంతో కుటుంబసభ్యుల రోదనలకు అంతులేకుండా పోయింది. -
దొంగకు ఖాకీ మద్దతు.. తొమ్మిది నెలలుగా కేసు చేధించకుండా..
సాక్షి, పుట్టపర్తి: ‘నా ఇంట్లో చోరీ జరిగి 9 నెలల వుతోంది. 20 తులాల బంగారాన్ని అపహరించుకెళ్లారు. ఈ సొత్తు రికవరీలో ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న హోంగార్డు నాగరాజు నాయక్.. పుట్టపర్తి సీఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నేను ఎన్నిసార్లు స్టేషన్‌కెళ్లి సీఐను కలిసినా ఫలితం లేకుండా పోతోంది. పైగా నన్నే దుర్భాషలాడుతూ కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి. నాకు న్యాయం చేయాలి’ అంటూ ఏఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఎదుట హోంగార్డు లక్ష్మణ నాయక్ వాపోయాడు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఏఎస్పీని కలసి అర్జీ అందజేసి, మాట్లాడారు. పుట్టపర్తిలోని శిల్పారామం సమీపంలో నివాసముంటున్న లక్ష్మణ నాయక్ ఇంట్లో 2022, జూన్ 14న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు చోరీ జరిగింది. 20 తులాల బంగారం, రూ.11 వేలను అపహరించుకెళ్లారు. గోకులం ప్రాంతానికి చెందిన కాటమయ్య, హోంగార్డు నాగరాజు నాయక్‌ను అనుమానితులగా పేర్కొంటూ అప్పట్లో పుట్టపర్తి అర్బన్ పోలీసులకు లక్ష్మణ నాయక్ ఫిర్యాదు చేశాడు. నాగరాజు నాయక్‌పై గతంలోనూ చోరీ కేసులున్నాయని అందులో గుర్తు చేశాడు. బైక్ చోరీ కేసులో పట్టుబడి జైలు జీవితం అనుభవించి వచ్చిన నాగరాజు నాయక్‌ను పుట్టపర్తి సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి చేరదీసి డ్రైవర్‌గా పెట్టుకున్నారని వివరించాడు. ఈ క్రమంలో కేసు దర్యాప్తులో అంతులేని నిరక్ష్యం కనబరుస్తున్నారని బాధితుడు వాపోయాడు. చోరీ సొత్తు రికవరీ చేసివ్వాలంటూ స్టేషన్‌కెళ్లి అడిగితే దుర్భాషలాడుతున్నారని వాపోయాడు. పైగా ‘ఎమ్మెల్యేతో ఫోన్‌చేయిస్తే బంగారాన్ని రికవరీ చేయాలా? నా దగ్గర పనిచేసే డ్రైవర్ దొంగతనం ఎందుకు చేస్తాడు? ఇంకోసారి స్టేషన్‌కు వస్తే బాగుండదు. నీ ఉద్యోగం ఊడగొట్టిస్తా’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయాడు. ఉన్నతాధికారులైనా న్యాయం చేయాలని కోరాడు. 63 వినతులు.. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వివిధ సమస్యలపై 63 వినతులు అందాయి. తొలుత ఏఎస్పీ రామకృష్ణ ప్రసాద్ అర్జీలు స్వీకరించి, పరిశీలించారు. అనంతరం ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ చేరుకుని అర్జీదారులతో మాట్లాడి సమస్య తీవ్రతపై ఆరా తీశారు. చట్ట పరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. (చదవండి: కనుమరుగవుతున్న కష్టజీవి..) -
పేదల సొంతింటి కల సాకారం..ఉగాదికి సాముహిక గృహ ప్రవేశాలు
పేదల సొంతింటి కల సాకారమవుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి మెటీరియల్, సకాలంలో బిల్లులను కూడా చెల్లిస్తూ అండగా నిలుస్తోంది. ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులు సొంతిళ్లలోకి చేరిపోయారు. తుదిదశకు చేరిన వాటిని ఉగాది పండుగ నాటికి పూర్తి చేయించి సామూహిక గృహ ప్రవేశాలు చేయించాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. సాక్షి, పుట్టపర్తి: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ వేగం పెరిగింది. పేదలు తమకు కేటాయించిన స్థలాల్లో గృహ నిర్మాణాలను చేపట్టి వేగంగా పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లల్లో పడ్డ అవస్థలు తీరుతుండటంతో సంబరపడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి పేదల సొంతింటి కల సాకారం దిశగా పాలన సాగిస్తున్నారని లబ్ధిదారులు కొనియాడుతున్నారు. అవసరమైన నిధులు కేటాయింపులు జరిగేలా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి సమీపంలో బ్రాహ్మణపల్లి, బీడుపల్లి, జగరాజుపల్లి, ఎనుములపల్లి వద్ద జగనన్న కాలనీలు వెలిశాయి. అలాగే ధర్మవరం పట్టణ సమీపంలోని కాలనీలో చాలా ఇళ్లు నిర్మాణం పూర్తి దశకు చేరుకున్నాయి. పనుల పరుగులు.. ప్రభుత్వ మార్గదర్శకాలతో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 168 జగనన్న లేఅవుట్లలో 24,643 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పేదలకు నివాసయోగ్యం కింద ఇల్లు మంజూరు చేశారు. జిల్లాకు సంబంధించి మొత్తం 62,716 ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పటికే కొన్ని నిర్మాణాలు పూర్తి కాగా.. మిగిలిన వాటి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇబ్బందుల్లేకుండా చర్యలు.. ఒక్కో ఇంటికి ఇచ్చే రూ.1.80 లక్షలకు తోడు డీఆర్డీఏ ద్వారా డ్వాక్రా సంఘ సభ్యులకు ఇంటి నిర్మాణానికి రూ.35 వేల రుణం బ్యాంకుల ద్వారా అందేలా చర్యలు చేపట్టారు. ఈ రుణంతో లబి్ధదారులు బయటి వ్యక్తుల ద్వారా అప్పులు చేయకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. దీనికితోడు ఇబ్బందిలేకుండా ఇసుక, మెటీరియల్ అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మౌలిక వసతుల కల్పన.. జిల్లా వ్యాప్తంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 168 లేఅవుట్లు ఏర్పాటు చేశారు. ఆయా లేఅవుట్లలో విద్యుత్ లైన్లు, రహదారులు, కరెంటు మీటర్లు, తాగునీటి వసతుల కల్పన వంటి పనులు చేపట్టారు. ఫలితంగా కాలనీలు కొత్తరూపు సంతరించుకున్నాయి. చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు షహీనా. హిందూపురం పట్టణ సమీపంలోని మణేసముద్రం. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరు అయింది. మెటీరియల్ దగ్గరి నుంచి బిల్లుల దాకా అన్ని విధాలా సహకారం లభించడంతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి గృహప్రవేశం చేశామని షహీనా హర్షం వ్యక్తం చేశారు. ఈమె మల్లీశ్వరి. ధర్మవరం పట్టణం శాంతినగర్ వాసి. ఎన్నో ఏళ్లుగా సొంతిల్లు లేక ఇబ్బందులు పడేవారు. ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయడంతో పాటు సకాలంలో బిల్లులు చెల్లించడంతో ఇంటి నిర్మాణం పూర్తయిందని మల్లీశ్వరి తెలిపారు. జగనన్న ప్రభుత్వంలోనే తమ సొంతింటి కల సాకారమైందని సంతోషం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణాల పురోగతి ఇలా.. జిల్లాకు మంజూరైన ఇళ్లు 62,716 జగనన్న లేఅవుట్లు 168 నిర్మాణాలు పూర్తి చేసుకున్నవి 5,750 పైకప్పు పూర్తయినవి 3,713 పైకప్పు వరకు 2,742 పునాది వరకు 12,403 పునాది పనుల్లో.. 22,230 ప్రారంభం కానివి 15,878 (చదవండి: స్నేహితులని హామీ ఉన్నందుకు..చివరకు సెల్ఫీ వీడియో తీసుకుని..) -
వైఎస్ఆర్ లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డ్: శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్
-
రేపు గవర్నర్ నరసింహన్ పుట్టపర్తి రాక
పుట్టపర్తి టౌన్ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ శనివారం పుట్టపర్తికి రానున్నట్లు రెవెన్యూ అధికారులు గురువారం తెలిపారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన ప్రత్యేక కాన్వాయ్‌లో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన పుట్టపర్తికి చేరుకుంటారన్నారు. మూడు గంటల పాటు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గడిపి సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఇక్కడి నుంచి ఆయన బయలు దేరుతాయని వారు తెలిపారు. -
ఇద్దరిని బలిగొన్న విద్యుదాఘాతం
పుట్టపర్తి అర్బన్/ఓడీచెరువు/ బుక్కపట్నం : పుట్టపర్తి నియోజక వర్గంలో ఆదివారం ఇద్దరు వ్యక్తులు విద్యుదాఘాతంతో మృతి చెందారు. పుట్టపర్తి మండలం బొంతలపల్లికి చెందిన కొంతమంది అడవిలోని ట్రాన్స్పార్మర్ నుంచి ఇనుప తీగలను కిలోమీటర్ల మేర పొడవునా వేసి వేటాడేవారు. అందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున అడవి జంతువులను వేటాడం కోసం ఓడీసీ మండలం శేషయ్యగారిపల్లికి వలస వెళ్లిన కంబాలపర్తి వేమనారాయణనాయక్(35) కరెంటు తీగలపై కాలు వేయడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ రాఘవరెడ్డి కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ఆసుపత్రికి తరలించారు. పండుగ పూట విషాదం నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుక్కపట్నం మండలం జానకంపల్లిలో గ్రామస్తులు స్థానిక పెద్దమ్మ గుడి వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో గుడి వద్ద విద్యుత్ దీపాలంకరణ చేశారు. రాత్రి 9 గంటల సమయంలో విద్యుత్ దీపాలకు కరెంటు సరఫరా కావడంతో గ్రామానికి చెందిన కురబ నాగభూషణ(46) షాక్‌కు గురైయ్యాడు. వెంటనే అతడికి పుట్టపర్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు బంధువు తెలిపారు.