pv express high way
-
రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్ వే వద్ద కారు బీభత్సం.. ఒకరి మృతి
సాక్షి, రంగారెడ్డి: రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్ వే వద్ద సోమవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. పిల్లర్ నెంబర్ 296 వద్ద థార్ కారు వేగంగా దూసుకొచ్చి ఢీ వైడర్ను ఢీ కొట్టింది. అధికవేగంతో ఉండటంతో ఆ కారు.. ఐదు, ఆరు పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న గణేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు.ప్రమాదం కారణంగా అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హుటాహుటిన ఘటన స్థలానికి ట్రాఫిక్ పోలీసులు చేరుకున్నారు. ట్రాఫిక్‌ను మరలించిన పోలీసలు ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. అయితే మితిమీరిన వేగమా?. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఎంత మంది ప్రయాణిస్తున్నారనే అనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. అయితే ప్రమాదానికి గురైన కారు.. రేసింగ్‌లో పాల్గొని ఇలా వేగంగా దూసుకువచ్చినట్లు తెలుస్తోంది. -
హైదరాబాద్ లో సంచలనం రేపిన కిరాతక హత్య
శంషాబాద్ : తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమనడంతో పాటు హోటల్‌ను రాసివ్వమ్మని వడ్డీ వ్యాపారి చేసిన ఒత్తిడి అతడి హత్యకు కారణమైంది. రాజేంద్రనగర్ సర్కిల్ పిల్లర్ నంబరు 248 వద్ద ఆదివారం రాత్రి జరిగిన దారుణ హత్య వివరాలను శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాజేంద్రనగర్ సర్కిల్ ఎంఎంపహాడిలో నివాసముండే షేక్ రషీద్(29) స్థానికంగా గరీబ్‌నవాజ్ హోటల్ నడిపిస్తున్నాడు. లాక్‌డౌన్‌కు ముందు హోటల్‌ను బాగు చేయడానికి ఎంఎంపహాడిలోనే నివాసముండే రియల్ఎస్టేట్, వడ్డీ వ్యాపారి మహ్మద్ ఖలీల్ (33) నుంచి రూ.15 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. లాక్డౌన్ కారణంగా హోటల్ మూసివేయడంతో స్థానికంగా మరిన్ని అప్పులు చేశాడు. ఈ క్రమంలో ఇటీవల ఖలీల్ వద్దకు వెళ్లిన రషీద్ మరో రూ.50 లక్షల అప్పుగా ఇవ్వమని కోరాడు. అందుకు ఖలీల్ నిరాకరించడంతో పాటు ముందుగా తీసుకున్న అప్పును వెంటనే చెల్లించడమో..లేదా హోటల్‌ను తన పేరుమీద రాయడమో చేయాలని ఒత్తిడి చేశాడు.. పక్కా పథకంతోనే.. ఖలీల్ ఒత్తిడి పెరుగుతుండటంతో షేక్ రషీద్ తన హోటల్లో వంటవాళ్లుగా పనిచేస్తున్న ఎంఎంపహాడికి చెందిన మహ్మద్ అజ్మత్(28), సయ్యద్ ఇమ్రాన్(28)తో కలిసి ఖలీల్‌ను అంతమొందించాలని పథకం వేశాడు. ఇందుకోసం రషీద్, ఇమ్రాన్లు చార్మినార్‌కు వెళ్లి రెండు కత్తులు కొనుగోలు చేశారు. వడ్డీవ్యాపారి ఖలీల్ ఆదివారం మధ్యాహ్నం షేక్‌రషీద్ నడిపిస్తున్న హోటల్ వద్దకు వెళ్లి వడ్డీ డబ్బులు ఇవ్వమని అడిగాడు. సాయంత్రం వరకు సర్దుతానని రషీద్ అతనికి చెప్పి పంపాడు. రాత్రి 10 గంటల సమయంలో రషీద్, అజ్మత్ ఓ ఆటోను మాట్లాడుకుని అందులో సిమెంట్ ఇటుకలు సిద్దం చేసుకుని పిల్లర్ నంబరు 248 వద్దకు చేరుకున్నారు. అక్కడికే సయ్యద్ ఇమ్రాన్‌ను రప్పించుకున్నారు. డబ్బుల కోసంఖలీల్ను పిల్లర్‌నంబరు 248 హెచ్ఎఫ్ కన్వెన్షన్ వద్దకు రావాలని రషీద్ ఫోన్ చేయడంతో అతడు హోండా యాక్టివా వాహనంపై అక్కడకి చేరుకున్నాడు. రాత్రి 11.15 గంటల సమయంలో అక్కడికి చేరుకుని రషీద్‌తో మాట్లాడుతున్న సమయంలో వెనక్కి నుంచి అజ్మత్, ఇమ్రాన్ సిమెంట్ ఇటుకలతో దాడి చేశారు. గాయపడిన స్థితిలో పరుగులు పెడుతున్న అతడిని వెంటాడి మరోసారి కత్తులతో దాడి చేయడంతో పాటు సిమెంట్ ఇటుకలతో బాది అంతమొందించారు. అక్కడే ఉన్న మృతుడి వాహనం తీసుకుని పరారయ్యారు. అక్కడ దుస్తులు మార్చుకున్న వాళ్లు రక్తంతో ఉన్న దుస్తులను తీసుకొచ్చి వ్యవసాయ కళాశాల వద్ద పారేశారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్‌కుమార్, సీఐ సురేష్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మంట కలిసిన మానవత్వం కాగా ఖలీల్‌ను నడిరోడ్డుపై వెంబడిస్తూ హత్య చేస్తున్నా అక్కడున్న వారు ఏ ఒక్కరు నిందితులను ఆపే ప్రయత్నం చేయలేదు. సంఘటన జరుగుతున్న సమయంలో వాహనాలపై రాకపోకలు సాగించారే తప్ప ఏ ఒక్కరు ప్రతిఘటించలేదు. ఘటన మొత్తం పది నిమిషాల పాటు జరిగిన స్థానికులు మాత్రం సెల్ఫోన్లలో చిత్రీకరించేందుకే ఆసక్తి చూపారు. మరిన్ని వార్తలు ముక్కలైన ట్రాక్టర్.. ఒళ్లు గగుర్పుడిచే ప్రమాదం 'స్నేహం చేయకపోతే అశ్లీల ఫోటోలను షేర్ చేస్తా' -
పీవీ ఎక్స్‌ప్రెస్ వన్ వే మూసివేత
సాక్షి, హైదరాబాద్ : పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే శనివారం నుంచి వన్‌వేగా మారనుంది. దీనికి నిర్వహిస్తున్న మరమ్మతుల నేపథ్యంలో కేవలం విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలనే అనుమతించనున్నట్లు అదనపు సీపీ (ట్రాఫిక్) అనిల్ కుమార్ తెలిపారు. విమానాశ్రయం వైపు నుంచి వచ్చే వాహనాలను అనుమతించబోమని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాహనాలు ఆరాంఘర్, శివరాంపల్లి, పీడీపీ ఎక్స్‌రోడ్, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్, రేతిబౌలి, మోహదీపట్నం మీదగా వెళ్లాలని, అలాగే చాంద్రాయణగుట్ట, జూపార్క్ల వైపు నుంచి వచ్చే వాహనాలు అదే మార్గంలో ప్రయాణించాలని సూచించారు. దాదాపు 3 నెలల పాటు ఈ పనులు జరిగే అవకాశం ఉండటంతో వాహనదారులకు కొంత ఇబ్బంది ఉంటుందని హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ విభాగ అధికారులు చెబుతున్నారు. వాహనదారుల భద్రత కోసమే... 11.6 కిలోమీటర్లు ఉన్న పీవీఎక్స్‌ప్రెస్ వేపై రోడ్డు కొంతమేర దెబ్బతినడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్ధారిత వేగంతో వెళ్లినా రోడ్డు బాగా లేక ప్రాణాలు కోల్పోతున్నారు. 2009, అక్టోబర్ 19 నుంచి వాహనదారులకు అందుబాటులోకి వచ్చిన ఈ ఎక్స్‌ప్రెస్ వే రోడ్ల మరమ్మతులు ఇప్పటివరకు చేయకపోవడం కూడా ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. దీంతో ఎక్స్‌ప్రెస్ వేలోని పాత బీటీ రోడ్డు తొలగించి మిల్లింగ్‌తో కొత్త బీటీ రోడ్డు సోమవారం నుంచి వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సరోజినీదేవి కంటి ఆసుపత్రి నుంచి ఈ పనులను వన్‌వేలో పూర్తయ్యాక మళ్లీ మరో వన్‌వేలో వేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రకారం ఈ 3 నెలల పాటు వన్‌వేలోనే శంషాబాద్ విమానాశ్రయానికి వాహనదారులను అనుమతించనున్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా... శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే కింది నుంచి ఆరాంఘర్, శివరాంపల్లి, పీడీపీ ఎక్స్‌రోడ్డు, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్, రేతిబౌలి, మెహదీపట్నం మీదుగా రావాల్సి ఉంటుంది. చాంద్రాయణగుట్ట, జూపార్క్ రోడ్డు, శివరాంపల్లి నుంచి మెహదీపట్నం వచ్చే వాహనదారులు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే కింది నుంచి శివరాంపల్లి, పీడీపీ ఎక్స్‌రోడ్డు, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్, రేతిబౌలి నుంచి మెహదీపట్నానికి చేరుకోవాలి. -
ఎక్స్‌ప్రెస్ హైవే.. నేటి నుంచి వన్ వే
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రయాణికులకు దాదాపు దశాబ్దకాలం నుంచి సేవలు అందిస్తున్న పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే రహదారి మళ్లీ కొత్తరూపు సంతరించుకోనుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే మొదలైన నాడు వేసిన బీటీ రోడ్డు తొలగించి కొత్త బీటీ రోడ్డు వేయనున్నారు. అయితే ఈ పనులతో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం పీవీ ఎక్స్‌ప్రెస్ వే నుంచి వన్‌వేలో అనుమతిస్తారు. ఎయిర్‌పోర్టు నుంచి నగరానికి వచ్చే వారు మాత్రం ఎక్స్‌ప్రెస్ వే కింది నుం చి రావల్సి ఉంటుంది. దాదాపు 3 నెలల పాటు ఈ పనులు జరిగే అవకాశం ఉండటంతో వాహనదారులకు కొంత ఇబ్బంది ఉంటుందని హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ విభాగ అధికారులు చెబుతున్నారు. వాహనదారుల భద్రత కోసమే... 11.6 కిలోమీటర్లు ఉన్న పీవీఎక్స్‌ప్రెస్ వేపై రోడ్డు కొంతమేర దెబ్బతినడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్ధారిత వేగంతో వెళ్లినా రోడ్డు బాగా లేక ప్రాణాలు కోల్పోతున్నారు. 2009, అక్టోబర్ 19 నుంచి వాహనదారులకు అందుబాటులోకి వచ్చిన ఈ ఎక్స్‌ప్రెస్ వే రోడ్ల మరమ్మతులు ఇప్పటివరకు చేయకపోవడం కూడా ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. దీంతో ఎక్స్‌ప్రెస్ వేలోని పాత బీటీ రోడ్డు తొలగించి మిల్లింగ్‌తో కొత్త బీటీ రోడ్డు సోమవారం నుంచి వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సరోజినీదేవి కంటి ఆసుపత్రి నుంచి ఈ పనులను వన్‌వేలో పూర్తయ్యాక మళ్లీ మరో వన్‌వేలో వేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రకారం ఈ 3 నెలల పాటు వన్‌వేలోనే శంషాబాద్ విమానాశ్రయానికి వాహనదారులను అనుమతించనున్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా... శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే కింది నుంచి ఆరాంఘర్, శివరాంపల్లి, పీడీపీ ఎక్స్‌రోడ్డు, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్, రేతిబౌలి, మెహదీపట్నం మీదుగా రావాల్సి ఉంటుంది. చాంద్రాయణగుట్ట, జూపార్క్ రోడ్డు, శివరాంపల్లి నుంచి మెహదీపట్నం వచ్చే వాహనదారులు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే కింది నుంచి శివరాంపల్లి, పీడీపీ ఎక్స్‌రోడ్డు, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్, రేతిబౌలి నుంచి మెహదీపట్నానికి చేరుకోవాలి. -
పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే వద్ద ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్స్‌ప్రెస్ హైవే పిల్లర్ నంబర్ 219 వద్ద ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే వద్ద ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ హైవే వద్ద బుధవారం ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్‌లోని పిల్లర్ నంబర్ 284 వద్ద ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. శంషాబాద్ నుంచి మెహదీపట్నం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి వచ్చి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. -
పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే పై ప్రమాదం
రంగారెడ్డి : రాజేంద్ర నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 245వ నెంబర్ పిల్లర్ వద్ద పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ హైవే పైన ప్రమాదం జరిగింది. జ్యోతి నగర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన వంశీ అనే ఉద్యోగికి గాయాలు అయ్యాయి. వెంటనే పెట్రోలింగ్ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని బాధితుడిని బయటికి తీశారు. అనంతరం ఆ మార్గంలో ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. -
పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై కార్లు ఢీ
హైదరాబాద్: పీవీ నరసింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవేపై 164 నెంబర్ పిల్లర్ వద్ద రెండు కార్లు ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.