Q1 GDP
-
ఎకానమీ జోరుకు బ్రేకులు!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్–జూన్ త్రైమాసికం (క్యూ1)లో 6.7 శాతంగా నమోదయ్యింది. గడచిన 15 నెలల కాలంలో ఇంత తక్కువ వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. 2023 జనవరి–మార్చి త్రైమాసికంలో ఎకానమీ 6.2 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. వ్యవసాయం, సేవా రంగాల పేలవ పనితీరు తాజా లెక్కలపై ప్రభావం చూపినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) డేటా పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 8.2 శాతం. తాజా సమీక్షా కాలానికి ముందు త్రైమాసికంలో (జనవరి–మార్చి) రేటు 7.8 శాతం. 6.7 శాతం వృద్ధి ఎలా అంటే.. 2024–25 తొలి త్రైమాసికంలో 2011–12 స్థిర ధరల ప్రాతిపదికన ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని మదింపుచేసే జీడీపీ విలువ రూ.43.64 లక్షల కోట్లు. 2023–24 ఇదే కాలంలో ఇది రూ.40.91 లక్షల కోట్లు. అంటే వృద్ధి రేటు 6.7 శాతమన్నమాట. ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికకాకుండా, ప్రస్తుత ధరల ప్రకారం పరిశీలిస్తే, 2023 ఏప్రిల్–జూన్ మధ్య జీడీపీ విలువ 9.7 శాతం వృద్ధితో రూ.70.50 లక్షల కోట్ల నుంచి రూ.77.31 లక్షల కోట్లకు ఎగసింది. ‘వృద్ధి వేగంలో టాప్’ ట్యాగ్ యథాతథం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 4.7 శాతంగా నమోదయ్యింది. ఈ కాలంలో ప్రపంచంలోనే మరేదేశమూ 6.7 శాతం వృద్ధి రేటును అందుకోలేకపోవడంతో, ప్రపంచంలో వేగవంతమైన వృద్ధి రేటు విషయంలో భారత్ తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నట్లయ్యింది. జీవీఏ వృద్ధి 6.8 శాతం ఉత్పత్తికి సంబంధించిన వ్యయాలను పరిగణనలోకి తీసుకోకుండా లెక్కించే స్థూల విలువ జోడింపు (జీవీఏ) వృద్ధి రేటు 2023–24 చివరి త్రైమాసికంలో 6.3 శాతంగా నమోదయితే, 2024–25 మొదటి త్రైమాసికంలో అరశాతం పెరిగి 6.8 శాతంగా నమోదయ్యింది. వార్షికంగా చూస్తే జీవీఏ విలువ రూ.38.12 లక్షల కోట్ల నుంచి రూ.40.73 లక్షల కోట్లకు ఎగసింది. ఇది 6.8 శాతం వృద్ధి రేటుకాగా, గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 8.3 శాతం. వివిధ రంగాల వృద్ధి తీరును స్థూలంగా జీవీఏ ప్రాతిపదికన పరిశీలిస్తారు. -
చైనాకు మరోసారి గట్టిషాకిచ్చిన కోవిడ్-19..!
బీజింగ్: చైనా ఎకానమీ వృద్ధి రేటు ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (జనవరి, ఫిబ్రవరి, మార్చి) 4.8 శాతంగా నమోదయ్యింది. ఈ ఏడాదిలో 5.5 శాతం పురోగతి సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న కమ్యూనిస్టు దేశం, తొలి క్వార్టర్లో మాత్రం ఈ అంకెను అందుకోలేకపోవడం గమనార్హం. దీనికి కోవిడ్–19 తాజా కేసుల తీవ్రత, భౌగోళిక ఉద్రిక్తతలు కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కోవిడ్–19 కేసుల తాజా విజృంభన నేపథ్యంలో షాంఘైసహా పలు కీలక వ్యాపార పట్టణాల్లో లాక్డౌన్ విధించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో వాణిజ్య కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్లు సమాచారం. కాగా, త్రైమాసికం పరంగా చూస్తే, (2021 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 4 శాతం పురోగతి) ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు పుంజుకున్నట్లు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గణాంకాల ప్రకారం, 2021 ఇదే కాలంతో పోల్చిచూస్తే, పారిశ్రామిక ఉత్పత్తి 6.5 శాతంగా ఉంది. పెట్టుబడుల్లో వృద్ధి 9.3 శాతం. కన్జూమర్ గూడ్స్ రిటైల్ అమ్మకాలు 3.3 శాతం పెరిగాయి. చదవండి: భారత్‌కు పొంచి ఉన్న ముప్పు..! ఎకానమీపై తీవ్ర ప్రభావం..! -
మళ్లీ పడిపోయిన జీడీపీ వృద్ధి రేటు
సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో దిగజారిన వృద్ధి రేటు, కొత్త పన్ను విధానం జీఎస్టీతో మరింత కిందకి పడిపోయింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు మూడేళ్ల కనిష్టంలో 5.7 శాతంగా నమోదైంది. కేంద్ర గణాంకాల అధికారి నేడు(గురువారం) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం తెలిసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.9 శాతంగా ఉంది. డీమానిటైజేషన్ ప్రభావంతో గత త్రైమాసికంలో కూడా జీడీపీ 6.1 శాతానికి పడిపోయింది. అయితే ఈ ఏడాది తొలి క్వార్టర్లో ఈ ప్రభావం కొంత తగ్గుముఖం పడుతుందని, జీడీపీ వృద్ధి రేటు పుంజుకోవచ్చని పలువురు భావించారు. కానీ అటు నోట్ బ్యాన్‌తో పాటు, ఇటు జీఎస్టీ ప్రభావం కూడా ఈ సారి జీడీపీ వృద్ధి రేటు పడి, మరింత కిందకి దిగజారింది. జూలై 1 నుంచి జీఎస్టీ అమలుకాకముందు కూడా ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం అనిశ్చితిగా, గందరగోళంగా ఉంది. ప్రీ-జీఎస్టీ సేల్‌తో రిటైలర్లు తమ ఇన్వెంటరీని పూర్తిగా ఖాళీ చేసుకోవాలని చూశారు. అంతేకాక జూలై 1 తర్వాత ధరలు ప్రభావం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందిన రిటైలర్లు, వచ్చే నెలకు ఎలాంటి స్టాక్ ఉండకూడదని ప్రీ-జీఎస్టీ సేల్, డిస్కౌంట్లతో స్టాక్‌ను విక్రయించేశారు. ఇది వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపింది. 2016 మార్చి నుంచి జీడీపీ వృద్ధి తగ్గుతూ వస్తోంది. దీంతో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ట్యాగ్‌ను కూడా భారత్ కోల్పోయింది.