ముంబై, తిరువనంతపురం టాప్
న్యూఢిల్లీ: దేశంలోని నగరాల్లో ముంబై, తిరువనంతపురం పాలనలో, మెరుగైన జీవనంలో ఉమ్మడిగా అత్యున్నత స్థానంలో నిలిచాయి. 21 నగరాల్లో సర్వే చేయగా చండీగఢ్, జైపూర్లు అట్టడుగున ఉన్నట్లు సర్వేలో తేలింది. పట్టణ ప్రణాళిక, డిజైన్, సామర్థ్యం, వనరులు), పారదర్శకత తదితర అంశాల ఆధారంగా జనాగ్రహ సెంటర్ ఫర్ సిటిజన్‌షిప్ అండ్ డెమోక్రసీ (జేసీసీడీ) సర్వే నిర్వహించింది.
0-10 రేటింగ్ స్కేల్‌పై లండన్, న్యూయార్క్‌లు 9.4, 9.7 రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉండగా, భారత నగరాలు 2 నుంచి 4.2 రేటింగ్తోనే ఉన్నాయి. తిరువనంతపురం, ముంబైలు 4.2 రేటింగ్‌ను, ఢిల్లీ 3.7, చెన్నై, హైదరాబాద్, కాన్పూర్‌లు 3.6, జైపూర్ 2.8, చండీగఢ్‌లు 2 రేటింగ్‌ను సాధించాయి.