quid sales
-
ఫాంహౌస్‌లో గుట్కా దందా
సాక్షి, ఆదిలాబాద్ : మండలంలోని పూసాయి గ్రామ సమీపంలోని పరేష్ రావ్రానికు చెందిన ఫాంహౌస్‌లో రూ.30 లక్షల విలువగల గుట్కాను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. సీఐ మల్లేశ్, ఎస్సై వెంకన్న వివరాల ప్రకారం... ఆదిలాబాద్ పట్టణానికి చెందిన షమీ ఉల్లాఖాన్ అలియాస్ షమ్మీ రావ్రానికి చెందిన ఫాంహౌస్‌లో గుట్కా నిల్వ ఉంచి అక్కడి నుంచి ఇతర ప్రదేశాలకు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడి నిర్వహించారు. గుట్కాతో పాటు ఇన్నోవా వాహనం (ఏపీ09 సీపీ 1989)ను సీజ్ చేసి అక్కడే ఉన్న భూషన్ త్రిపాఠి, నదీమ్ ఖాన్‌లను అదుపులో తీసుకుని విచారించగా సరుకు షమీ ఉల్లాఖాన్‌కు చెందినదిగా చెప్పారు. దీంతో ఉల్లాఖాన్‌ను ఏ1గా, భూషన్ త్రిపాఠి, నదీమ్‌ఖాన్, పరేష్ రావ్రానిలను ఏ2, ఏ3, ఏ4లుగా చేర్చి కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న గుట్కాను జైనథ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించగా ఏ1, ఏ4లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సంవత్సరకాలంగా దందా సంవత్సరకాలంగా ఫాంహౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా గుట్కా నిల్వ, రవాణా కొనసాగుతున్నట్లు చుట్టుపక్కక రైతులు తెలిపారు. ఇక్కడ తరుచుగా లారీలు, ఐచర్లు, ఇ తర వాహనాలు వస్తూ పోతుంటాయని చెబుతున్నారు. అ యితే ఊరికి దూరంగా, 44వ నంబరు జాతీయ రహదారి కి కూత వేటు దూరంలో ఫాంహౌస్ ఉండటంతో గుట్కా దందా జోరుగా సాగింది. మహారాష్ట్ర సరిహద్దు కూడ పక్కనే ఉండటం ఆదిలాబాద్, జైనథ్, బేల, తాంసి, తలమడుగు ఇతరాత్ర మండలాలకు ఇక్కడి నుంచి గుట్కా సప్లై చేయడానికి అవకాశం ఉండటంతో అడ్డు అదుపు లేకుండా దందా కొనసాగింది. విశ్వసనీయ సమాచారం మేరకు జైనథ్ ఎస్సై వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు దా డి చేయగా, ఫాంహౌస్‌లో భారీ గుట్కా లభించింది. అయితే ఆ ఫాంహౌస్‌లో లోపల మొత్తం బెడ్రూం, హాల్, కిచె న్, బాత్రూంలో సైతం గుట్కా బస్తాలను కుక్కి ఉండటం చూసి పోలీసులు కంగుతిన్నారు. ఇప్పటి వరకు మండలంలో ఇంత పెద్ద ఎత్తున గుట్కా ఎప్పుడు స్వాధీనం కాకపోవడంతో మండలంలో ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మా రింది. పట్టుబడిన గుట్కా ప్రింట్ విలువ రూ.30లక్షల వ రకు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ నిషే ధిత గుట్కా మార్కెట్ విలువ మాత్రం ప్రింట్ రేట్‌కు 3 నుంచి 5 రేట్లు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం గుట్కా అమ్మకాలను నిషేధించడంతో వ్యాపారులు రూపాయి విలువ చేసే గుట్కాను రూ.3 నుంచి రూ.5కు అమ్ముతున్నారు. ఈ లెక్కన దీని విలువ సుమారు కోటి రూపాయలకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా మహారాష్ట్ర పక్కనే ఉండటంతో జైనథ్ మీదుగా జోరుగా గుట్కా దందా కొనసాగుతుందని ఈ ఉదాంతం స్పష్టం చేస్తోంది. చి న్నచిన్న గ్రామాల్లో సైతం ఈ రోజు నిషేధిత గుట్కా విరి విగా లభిస్తుంది. అప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని గుట్కా అక్రమ రవాణా, అమ్మకాలను అరికట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. -
నిషేధం ‘గుట్కా’య స్వాహా
నగరంలో విచ్చలవిడిగా గుట్కా విక్రయాలు రెట్టింపు ధరలతో సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు కొరవడిన సర్కార్ పర్యవేక్షణ పట్టించుకోని అధికారులు విశాఖ రూరల్ : తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టుగా గుట్కా నిషేధం ప్రకటన చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దీంతో నగరంలో ఎక్కడికక్కడ గుట్కాలు విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం, నిషేధ ఉత్తర్వులను అమలు చేయాల్సిన అధికారులు నిద్రమత్తులో జోగుతుండడంతో వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. బ్లాక్ మార్కెట్ పేరుతో రెట్టింపు ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. వీరి ప్రయోజనాల కోసమే సర్కార్ నిషేధ ప్రకటన చేసిందేమో అనే పరిస్థితి దాపురించింది. విశాఖ కేంద్రంగా గుట్కా రవాణా రాష్ట్ర ప్రభుత్వం నిషేధం అమలు చేసిన తర్వాత గుట్కాలకు విశాఖ కేంద్రమైంది. అంతకుముందు జిల్లాల వారీగా గుట్కాల ఉత్పత్తుల కేంద్రాల నుంచి సరకును నేరుగా దిగుమతి చేసుకునేవారు. కానీ నిషేధం అమలు చేసిన తర్వాత గుట్కాల ఎగుమతులు, దిగుమతులకు విశాఖే కేంద్రమైంది. ముఖ్యంగా ఒడిశా నుంచి విచ్చల విడిగా రైళ్ల ద్వారా సరుకును విశాఖకు దిగుమతి చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు ఎగుమతి చేస్తున్నారు. గుట్కాల వ్యాపారంలో ఓ కాంగ్రెస్ నేత విశాఖను కేంద్రంగా చేసుకుని ఎగుమతులు దిగుమతులు చేస్తున్నారు. వారికి పూర్ణా మార్కెట్లో ఉన్న ఓ బడా వ్యాపారి సహకరిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. నిషేధాన్ని సాకుగా చూపి, రిస్క్ చేసుకుని వ్యాపారం చేస్తున్నామంటూ మరింత ఎక్కువ రేట్లుకు విక్రయాలు చేస్తున్నారు. సొమ్ము చేసుకుంటున్న రిటైల్, చిల్లర వర్తకులు బ్లాక్ మార్కెట్ పేరుతో హోల్‌సేల్ వ్యాపారులు రేట్లు పెంచేయడంతో తామేమి తక్కువ కాదన్నట్టు చిల్లర వర్తకులు రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. మూడు రూపాయల ఖైనీని రూ.5కు, రెండు రూపాయల పాన్ పరాగ్‌ను రూ.4కు, రూపాయి ఉండే డీలక్స్, సపారీలు రూ.2కు, రెండు రూపాయలుండే ఫైవ్ థౌజండ్ను రూ.4కు విక్రయిస్తున్నారు. ఈ విధంగా మొత్తం రేటులో 50 శాతాన్ని మధ్యవర్తులే తింటున్నారు. నిషేధం అమల్లో ఉన్నా వ్యాపారమేమి తగ్గలేదు. గతంలో రోజుకి రూ.5 కోట్ల టర్నోవర్ జరగగా ఇప్పుడు కూడా అదే స్థాయిలో వ్యాపారమవుతోంది. పట్టించుకోని అధికారులు నగరంలో ప్రతీ చిల్లర దుకాణంలో గుట్కాలు వేలాడుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. సంబంధిత శాఖలన్నీ తమకేమి పట్టదన్నట్టు వ్యవహరిస్తున్నాయి. సర్కార్ పర్యవేక్షణ కూడా ఎక్కడా కనిపించడంలేదు. అసలు గుట్కాల నిషేధం అమలవుతుందా అనే దానిపై కనీసం సమీక్ష చేసిన దాఖలాలు లేవు. అధికారులకు సైతం ఆ దిశగా ఆదేశాలు జారీ చేయడం లేదు. దీంతో ఏ ఒక్క అధికారి సీరియస్‌గా తీసుకోవడం లేదు. సుప్రీంకోర్టు నిషేధించినా.. పొగాకు సంబంధిత ఉత్పత్తుల ద్వారా నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల తదితర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉందని సుప్రీంకోర్టు గుట్కాలపై నిషేధం విధించింది. పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది జనవరి 5వ తేదీన నిషేధాన్ని అమలు చేస్తున్నట్టు సర్కార్ ప్రకటించింది. అయితే సర్కా ర్ ఆదేశాలను వ్యాపారులు పట్టించుకోలేదు. ఎప్పటిలాగే వ్యాపారం చేసుకుంటున్నారు. నిషేధం పేరుతో బ్లాక్ మార్కెట్లో మరింత ఎక్కువ రేట్లుకు విక్రయిస్తున్నారు. -
యథేచ్ఛగా గుట్కా విక్రయాలు
- లోపించిన అధికారుల నిఘా - రెట్టింపు ధరలతో విక్రయం బాన్సువాడ : ప్రాణాంతకంగా మారిన గుట్కా, పాన్‌మసాల విక్రయాన్ని ప్రభుత్వం నిషేధించినప్పటికీ, గుట్టుచప్పుడుకాకుండా యథేచ్ఛగా గుట్కా విక్రయాలు సాగుతున్నాయి. గుట్కా నిర్ణీత ధరకు రెండింతలు పెంచి విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికార యంత్రాంగం విఫలమవుతుండడంతో బ్లాక్ మార్కెట్ విస్తరించింది. జిల్లాలో గుట్కా, పాన్ మసాలా బ్లాక్ మార్కెటింగ్ నిత్యం రూ. 5 లక్షలకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. వాణి జ్య పన్నుల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుట్కా విక్రయాలను అరికట్టాల్సి ఉంది. అలాగే మున్సిపాలిటీల్లో మున్సిపల్ హెల్త్ అధికారులు దాడి చేయాలి. కానీ ఈ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. గుట్కా హోల్‌సెల్ వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు అధికారులకు అందుతున్నాట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుట్కా, పాన్‌మసాలా లాంటి పొగాకు ఉత్పత్తులు క్యాన్సర్‌తోపాటు పలు రకాల రోగాలకు కారణమవుతున్నాయని భావించి ప్రభుత్వం గతేడాది జనవరి 15 నుంచి వీటి విక్రయాలను నిషేధించింది. అయితే ఉన్న గుట్కా స్టాకును విక్రయించుకొనే పేరుతో వ్యాపారులు అక్రమ అమ్మకాలు చేస్తున్నారు. గుట్కా, పాన్ మసాలాకు అలవాటుపడిన వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని అసలు ధర కంటే రెండు, మూడు రేట్లు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గుట్కా, పాన్ మసాలాలను హైదరాబాద్‌తోపాటు మహారాష్ట్రాలోని నాందేడ్, దెగ్లూర్, కర్ణాటకలోని ఔరాద్ తదితర ప్రాంతాల నుంచి స్థానికంగా కొంత మంది హోల్‌సేల్ వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. వీరి నుంచి జిల్లాలోని మండల కేంద్రాలు, గ్రామాల్లోని పాన్ షాపులకు సరఫరా అవుతోంది. బాన్సువాడ, బోధన్ పట్టణాల్లో నిలువ చేస్తూ పరిసర మండలాలకు ఆటోలు, మోటర్ సైకిళ్లపై అతి రహస్యంగా చేరవేస్తున్నారు. రాత్రి వేళ నల్ల ప్లాస్టిక్ కవర్లలో గుట్కాలు వేసుకొని వారికి చేరవేస్తారు. పాన్ షాపుల్లో గుట్కాలను బయటవారి కంట పడనీయకుండా రహస్యంగా విక్రయిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని అహ్మదీ బజార్లో రహస్యంగా హోల్ సెల్ విక్రయాలు సాగుతున్నట్లు సమాచారం. అక్రమంగా దిగుమతి చేసుకున్న నిషేధిత కంపెనీల గుట్కాలు, పాన్‌మసాలా ప్యాకెట్లను అసలు ధరకన్నా రెండు మూడు రేట్లు అధిక ధరకు విక్రయిస్తున్నారు. గతంలో రూ. 1.50 ధర ఉన్న గుట్కా ప్రస్తుతం రూ. 5, రూ. 3 ఉన్న గుట్కా ప్యాకెట్‌ను ప్రస్తుతం రూ. 8, రూ. 4 విలువ గల గుట్కా రూ. 10, రూ. 10 ఉండే రకం రూ. 20కు విక్రయిస్తున్నారు. కాగా గుట్కాకు అలవాటు పడిన వారు ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తున్నారు. దీన్ని అసరాగా చేసుకొని హోల్‌సెల్ వ్యాపారులు, పాన్‌షాపుల యజమానులు యథేచ్ఛగా దోచుకొంటున్నారు. గుట్కా విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నా, సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా యువత గుట్కా వ్యసనానికి అలవాటు పడి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. వాటిలో ఉండే పలు రసాయనాల ప్రభావంతో క్యాన్సర్‌తోపాటు ఇతర ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుట్కా విక్రయాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.