Quinnipiac University
-
ట్రంప్ పరిపాలనపై తొలి సర్వే: షాకింగ్ రిజల్ట్స్
-
ట్రంప్ పరిపాలనపై తొలి సర్వే: షాకింగ్ రిజల్ట్స్
వాషింగ్టన్: అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ జాన్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసి నేటికి సరిగ్గా వారం రోజులైంది. ఈ సందర్భంగా ఆయన పరిపాలన తీరుపై ప్రఖ్యాత క్విన్నిపియాక్ యూనివర్సిటీ ఒక పోల్ సర్వే నిర్వహించింది. ప్రెసిడెంట్ హోదాలో తొలి(వివాదాస్పద) ప్రసంగం మొదలు, మొదటి ఐదు రోజులు ట్రంప్ పరిపాలన ఎలా ఉంది? ట్రంప్ సంతకాలు చేసిన ఫైళ్లలోని అంశాలు, వాటిని ఏమేరకు అమలు చేస్తారు? తదితర ప్రశ్నలతో నిర్వహించిన పోల్ సర్వే ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. పోల్ సర్వేలో.. ‘ట్రంప్ సమర్థుడు, తెలివైనవాడే కానీ.. అవివేకి(కామన్సెన్స్లెస్)’అని జనం తీర్పు చెప్పడం గమానర్హం. సర్వేలో అడిగిన ప్రశ్నలకు.. 68 శాతం మంది ట్రంప్ సమర్థుడని, 65 శాతం మంది ఆయనను ఇంటెలిజెంట్ అని అన్నారు. అదేసమయంలో 62 శాతంమంది ట్రంప్ అవివేకిఅని తేల్చిపారేశారు. మొత్తంగా వందలో 36 శాతం మంది ‘ట్రప్ ఐదు రోజుల పరిపాల’కు మద్దతు పలకగా, 44 శాతం మంది వ్యతిరేకించారు. ‘కీలకమైన ఫైళ్లపై సంతకాలు చేశారు తప్ప,ఆ విధానాలను అమలు చేసే దిశగా ఆయన సర్కారు నడుం కట్టడంలేదు’ అని మెజారిటీ ఓటర్లు అభిప్రాయపడ్డారు. జాతి వివక్ష, లింగ వివక్ష సంబంధింత అంశాలపై ఆయన దృష్టిపెట్టనేలేదని విమర్శించారు. కాగా, రిపబ్లికన్లలో 81 శాతం మంది ట్రంప్ పరిపాలనా విధానాన్ని సమర్థించగా, 3 శాతం మంది పెదవి విరిచారు. అదే డెమోక్రాట్లలో కేవలం 4 శాతం మందే ట్రంప్ రూలింగ్ బాగుందని మెచ్చుకోగా, 77 శాతం మంది చెత్తగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక మహిళల్లో 50 శాతంమంది ట్రంప్ ఐదురోజుల పాలలను తిరస్కరించగా, 33 శాతం మంది అంగీకరించారు. శ్వేతజాతీయుల్లో 43 శాతంమందే ట్రంప్‌కు మద్దతుపలకగా, నల్లజాతీయుల్లో 43 శాతం మంది వ్యతిరేకత వెలిబుచ్చారు. ఈ సర్వేలో మొత్తం 1,190 ఓటర్లు పాల్గొన్నట్లు క్విన్నిపియాక్ యూనివర్సిటీ తెలిపింది. -
అమెరికా అధ్యక్ష పదవిపై ఒబామా జోస్యం
అమెరికా అధ్యక్ష పదవిని మహిళ చేపట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయా అంటే అవుననే అంటున్నారు సాక్షాత్తూ ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా. దేశాధ్యక్ష పదవిని మహిళ చేపడుతుందని ఒబామా జోస్యం చెప్పారు. ఆ పదని ఆమె అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తుందని తెలిపారు. శుక్రవారం మీడియా సంస్థ ఏబీసీ బ్రాడ్ కాస్టర్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఒబామా మాట్లాడారు. యూఎస్‌లో దేశవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటూ కొనియాడారు. అలాగే మహిళలు రాజకీయ రంగంలో వివిధ పదవులను చేపట్టి ఆ పదవులకే వన్నె తెస్తున్నారంటు ప్రశంసించారు. మహిళలు దేశ రాజకీయాల్లో ముందుకు దూసుకువెళ్తున్న తీరును ఈ సందర్బంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒబామా వ్యాఖ్యలు దేశంలో సంచలనాత్మకం రేకెత్తించాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్లు క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ ఉద్దేశించి ఒబామా పై విధంగా స్పందించి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడ్డుతున్నారు. గతంలో ఒబామా ప్రభుత్వంలో హిల్లరి క్లింటన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. 2016 ఏడాదిలో యూఎస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఆ పదవికి కోసం హిల్లరీ ఎన్నికల బరిలోకి దిగుతారని ఊహగానాలు ఊపందుకున్నాయి. అయితే న్యూజెర్సీ గవర్నర్ రిపబ్లికన్ పార్టీ చెందిన చరీస్ క్రిస్టీతో హిల్లరీ క్లింటన్ ఓ ఒప్పందం చేసుకున్నట్లు క్వీన్పియక్ యూనివర్శిటీ ఇటీవల నిర్వహించిన సర్వే నివేదిక వెల్లడించింది. రిపబ్లికన్ ప్రత్యర్థులు సెనెటర్లు అయిన రాండ్ పాల్, టెడ్ క్రూజ్లతోపాటు కాంగ్రెస్‌మెన్ పాల్ రయన్ కంటే హిల్లరీ క్లింటన్ 9 పాయింట్లు అధిక్యంగా ఉన్నట్లు ఆ సర్వే నివేదిక ఈ నెల 13న ప్రచురించిన నివేదికలో పేర్కొంది.