quit politics
-
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌పై ఈటల సంచలన వ్యాఖ్యలు
హుజూరాబాద్: ‘హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతా. నేను గెలిస్తే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలి’ అని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ సంచలన సవాల్ విసిరారు. గురువారం హుజూరాబాద్ పట్టణ శివారులోని సిర్సపల్లి రోడ్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు వివేక్‌తో కలిసి పరిశీలించారు. హుజూరాబాద్ శివారులోని సిర్సపల్లి రోడ్లో డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలిస్తున్న ఈటల ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ తీరు మోచేతికి బెల్లంపట్టి అరచేతిని నాకించే విధంగా ఉందని, ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల గురించి చాలా గొప్పగా అనేక ముచ్చట్లు చెప్పాడన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎలా కట్టించాలనే విషయంలో ఉపసంఘం వేసినా, నివేదిక ఇవ్వకముందే కాలనీల రూపంలో కట్టాలని జీవో ఇచ్చాడని తెలిపారు. గ్రామాల్లో స్థలాలు దొరకవని, కాలనీల రూపంలో డబుల్ బెడ్ రూం కట్టడం సాధ్యం కాకపోవచ్చని చెప్పామని, వినకుండా ఊరికి 400 ఇండ్లు కట్టాలని చెప్పారని తెలిపారు. ఇవి ఎవరికీ సరిపోవని చెప్పడంతో మరో వెయ్యి ఇళ్లు ఇచ్చారన్నారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలో వేలాది ఇళ్లు మంజూరు చేస్తే, తాను కూడా హుజూరాబాద్‌కు మరిన్ని ఇళ్లు కావాలని అడిగానని.. దీంతో 3,900 ఇళ్లు ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ మాటాలు కోటలు దాటుతాయి తప్ప, కాళ్లు మాత్రం గడప దాటవని ఎద్దేవా చేశారు. ‘హరీశ్ రావు నా దగ్గరకి వచ్చి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టలేదని చిల్లర ఆరోపణలు చేస్తున్నాడు. నీవు ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మరు. ఎంత పిచ్చి ప్రేలాపనలు పేలినా కర్రు కాల్చి వాతపెడతారని’ హెచ్చరించారు. టీఆర్ఎస్కు దుబ్బాకలో మించిన పరాభవం ఇక్కడ తప్పదని జోస్యం చెప్పారు. -
రాజకీయాలకు రాంరాం: దీప
సాక్షి, చెన్నై: రాజకీయాల నుంచి తప్పు కుంటున్నట్లు తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మేనకోడలు, ‘ఎంజీఆర్ అమ్మ దీప పేరవై’వ్యవస్థాపక అధ్యక్షురాలు దీప ప్రకటించారు. జయలలిత కన్నుమూసిన తర్వాత జయ అన్న కుమార్తెగా రాజకీయాలకు, ఆస్తికి తానే వారసురాలి నంటూ దీప గతంలో తెరపైకి వచ్చారు. అన్నా డీఎంకే ఆహ్వానాన్ని తిరస్కరించి ‘ఎంజీఆర్ అమ్మ దీప పేరవై’ను స్థాపించి రాజకీయ అరం గేట్రం చేశారు. జయ మరణంతో ఖాళీగా మారిన చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమై మధ్యలో విరమించుకున్నారు. పేరవైలో కీలక బాధ్యతలను తన కారు డ్రైవర్‌కు అప్పగించడంతో ఆగ్రహించిన దీప భర్త మాధవన్ ఎంజేడీఎంకే అనే కొత్త పార్టీని స్థాపించారు. దీపను వీడి దూరంగా వేరే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దీప పేరవైకి ఆశించి నంతగా ప్రజల నుంచి ఆదరణ దక్కలేదు. ఈ తరుణంలో దీప మాట్లాడుతూ‘రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నాను. భవిష్యత్‌లో మళ్లీ రాజకీయాలకు వచ్చే ఆలోచన లేదు’ అన్నారు. -
శశికళ నిష్క్రమణ వెనుక..
సాక్షి ప్రతినిధి, చెన్నై: జింకను వేటాడేటప్పుడు పులి రెండు మూడు అడుగులు వెనక్కి వేసి, ఒక్కసారిగా ముందుకు లంఘించి నోట కరుచుకుంటుందట! తమిళనాడులో అన్నాడీఎంకేను కైవసం చేసుకోవడానికి శశికళ ఇదే సూత్రం పాటిస్తున్నారేమో! రాజకీయాల నుంచి ఆమె నిష్క్రమణ వెనుక పెద్ద ఎత్తుగడ ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జైలు నుంచి శశికళ విడుదల తమిళనాడు రాజకీయాలను కుదిపేస్తుందని భావించారు. అలాంటిదేమీ జరగలేదు. అక్క కుమారుడు దినకరన్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న అమ్మ ముక్కల్ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) ద్వారా జనంలోకి వెళ్లాలని ఆమె నిర్ణయానికొచ్చారు. ఇంతలో అన్నాడీఎంకే కూటమిలో చేరాలన్న ఆఫర్ బీజేపీ నుంచి వచ్చింది. దీన్ని అన్నాడీఎంకే అడ్డుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కమలం గుర్తుపైనే పోటీ చేయాలన్న బీజేపీ షరతును దినకరన్ అంగీకరించలేదు. దినకరన్ వల్లనే అన్నాడీఎంకే నేతలు తనకు దూరమయ్యారన్న సమాచారం అందడంతో శశికళ అతడిని దూరం పెట్టడం ప్రారంభించారు. న్నికల్లో చురుకైన పాత్ర పోషించేందుకు అనుకూల వాతావరణం లేకపోవడంతో పునరాలోచనలో పడ్డారు. వ్యూహం అదే.. శశికళ ఏఎంఎంకేలో క్రియాశీలకంగా వ్యవహరించి, అన్నాడీఎంకే, డీఎంకే కూటములను ఎదుర్కొని, అధికారంలోకి వచ్చే అవకాశాలు కనుచూపుమేరలో కనిపించడం లేదు. ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోతే ఓట్లను చీల్చి, ఆ పార్టీకి ద్రోహం చేశారన్న అపవాదు తప్పదు. అందుకే తాత్కాలికంగా వెనక్కి తగ్గడమే మంచిదని శశికళ తీర్మానించుకున్నట్లు సమాచారం. అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తే.. తనను ఆ పార్టీ నుంచి వెళ్లగొట్టిన వ్యక్తులను క్షమించి, తన ఓటు బ్యాంకును వారికి అనుకూలంగా మళ్లించిన ఖ్యాతిని పొందవచ్చు. చిన్నమ్మ సహకారం వల్లనే గెలుపు అనే క్రెడిట్ కొట్టేయవచ్చు. ఒకవేళ అన్నాడీఎంకే ఓడిపోతే అది పళనిస్వామి, పన్నీర్‌సెల్వం ఖాతాలో పడిపోతుంది. దాంతో భవిష్యత్తులో అన్నాడీఎంకే పగ్గాలు శశికళ చేతికి రావొచ్చు. అన్నాడీఎంకే గెలిచినా, ఓడినా శశికళకు రాజకీయంగా లాభమే. అలాగే ప్రతిపక్ష డీఎంకేను నిలువరించేందుకు సహకరించానంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సంబంధాలు మెరుగుపర్చుకోవచ్చు. ఈ వ్యూహంతోనే శశికళ తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దినకరన్ ఒంటరి పోరు! శశికళ ప్రోద్బలంతోనే ఏఎంఎంకే ఆవిర్భవించింది. బీజేపీతో సఖ్యత కుదరకుంటే తమిళనాడులోని మొత్తం అసెంబ్లీ 234 స్థానాల్లో ఒంటరిగా బరిలో దిగేందుకు టీటీవీ దినకరన్ సన్నద్ధమవుతున్నారు. అన్నాడీఎంకే– బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు ముగిసే వరకు వేచి ఉండాలని ఆయన భావిస్తున్నారు. మరోవైపు.. శశికళ రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేస్తూ శశికళ పేరవై పేరిట మద్దతుదారులు చెన్నైలో ఆమె బస చేసిన ఇంటి ముందు గురువారం ధర్నా చేపట్టారు. -
రాజకీయాలకు చిన్నమ్మ గుడ్‌బై.. కారణాలు ఇవే
-
రాజకీయాలకు చిన్నమ్మ గుడ్‌బై..రాజీకి షా ప్రయత్నాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో మరి కొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు దివంగత అన్నాడీఎంకే నేత జయలలితకు సన్నిహితురాలైన శశికళ బుధవారం సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో పార్టీ అధినేత్రి జయలలిత బంగారు పాలన కొనసాగాలని దేవుడిని ప్రార్థిస్తానన్నారు. అమ్మ అభిమానులంతా సహోదరుల్లా ఐకమత్యంతో పనిచేసి జయలలిత బంగారు పాలన కొనసాగేలా చూడాలని అభ్యర్థించారు.‘రాజకీయాలకు దూరంగా ఉంటాను. నా సోదరి, నేను దైవంగా పరిగణించే పురచ్చితలైవి (జయలలిత) బంగారు పాలన కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తాను’ అని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్ 6న జరగనున్న ఎన్నికల్లో ఉమ్మడి శత్రువైన డీఎంకేను ఓడించాలని, డీఎంకే మళ్లీ అధికారంలోకి రాకుండా చూడాలని అభిమానులకు పిలుపునిచ్చారు. అధినేత్రికి సన్నిహితురాలిగా.. జయలలిత నెచ్చెలిగా నీడలా వెన్నంటి ఉండి పార్టీ రాజకీయాల్లో శశికళ తనదైన ముద్రవేశారు. పార్టీపై పెత్తనం జయలలితదైనా శశికళకు చెప్పకుండా ఆమె ఏ నిర్ణయం తీసుకునేవారు కాదని ఆపార్టీ నేతలే చెబుతుంటారు. అందుకే అమ్మ మరణం తరువాత శశికళ చిన్నమ్మగా మారారు. ప్రధాన కార్యదర్శిగా మారి పార్టీని తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నారు. నాటి సీఎం పన్నీర్‌సెల్వం చేత రాజీనామా చేయించి శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తీర్పు తెరపైకి రావడంతో పళనిస్వామిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి నాలుగేళ్ల శిక్ష అనుభవించి రెండు నెలల క్రితమే విడుదలయ్యారు. రాజీకి అమిత్ షా ప్రయత్నాలు అన్నాడీఎంకేలో కీచులాటలు డీఎంకేకు లాభదాయకమనే కారణంతో ఇరువర్గాలకు రాజీచేసేందుకు అమిత్‌షా ప్రయత్నాలు ప్రారంభించారు. తమకు 60 సీట్లు కేటాయిస్తే అందులో 50 శాతం శశికళ వర్గానికి ఇస్తామని బీజేపీ బేరం పెట్టింది. అదే జరిగితే పార్టీ పగ్గాలు మెల్లమెల్లగా ఆమె చేతుల్లోకి వెళ్లడం ఖాయమని భావించిన అన్నాడీఎంకే అందుకు ససేమిరా అంది. అదే సమయంలో బీజేపీ ద్వారా పొందే సీట్లలో కమలం గుర్తుపై పోటీచేయాలన్న అమిత్‌షా షరతును దినకరన్ తోసిపుచ్చారు. అన్నాడీఎంకే అంత అయిష్టతను కనబరుస్తున్నపుడు ఆ కూటమి నుంచి పోటీకై బీజేపీ వద్ద సాగిలపడాల్సిన అవసరం లేదని దినకరన్‌ను శశికళ గట్టిగా మందలించారు. ఎడపాడి, శశికళ తీరుతో అన్నాడీఎంకే–బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటులో ప్రతిష్టంభన నెలకొంది. డీఎంకే లాభపడకుండా.. శశికళ చేత బీజేపీనే రాజకీయ అస్త్రసన్యాసం చేయించినట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అన్నాడీఎంకేలో కుమ్ములాటలు డీఎంకేకు లాభించి అధికారంలోకి వస్తే తమకు నష్టమని బీజేపీ భావించింది. రాజకీయ క్రీడ నుంచి శశికళను డ్రాప్ చేయించడం ద్వారా అన్నాడీఎంకే ఓటు బ్యాంకు చీలకుండా కాపాడుకోవచ్చని, డీఎంకే దూకుడుకు కళ్లెం వేయవచ్చని వ్యూహం పన్నింది. శశికళ నిర్ణయం తనకే ఆశ్చర్యం కలిగించిందని టీటీవీ దినకరన్ అన్నారు. రాజకీయాల నుంచి వైదొలగినంత మాత్రాన ఆమె వెనకడుగు వేసినట్లు భావించరాదని వ్యాఖ్యానించారు. -
రాజకీయాలకు రాయపాటి గుడ్ బై
తెలంగాణ ఏర్పాటు కేంద్ర కేబినెట్ నోట్ ఆమోదించడంతో సీమాంధ్ర కాంగ్రెస్ రాజకీయాలపై పెను ప్రభావం చూపుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందినగుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివ రావు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు శుక్రవారం ప్రకటించారు. మరికొందరు కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే యోచనలో ఉన్నట్టు సమాచారం. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని రాయపాటి అన్నారు. సొంత పార్టీ నాయకుల్ని మభ్యపెట్టి రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్నారని ఆయన నిందించారు. -
రాష్ట్ర విభజన జరిగితే రాజికీయాల నుంచి తప్పుకుంటా - లగడపాటి