radha krishna murthy
-
సినిమా విడుదల పేరుతో మోసం చేశారు, కత్తితో బెదిరించారు: నిర్మాత ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఏఎన్నార్, జయసుధ ప్రధాన పాత్రధారులుగా ప్రతిబింబాలు పేరుతో తాను నిర్మించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు రవీంద్ర కళ్యాణ్, రామకృష్ణ రూ.13 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ సినీ నిర్మాత జె.రాధాకృష్ణమూర్తి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 9వ తేదీన ఈ విషయం చర్చించేందుకు తాను రవీంద్ర కళ్యాణ్, రామకృష్ణలకు ఫోన్ చేయగా వారు అందుబాటులోకి రాలేదన్నారు. వారి డ్రైవర్ బాలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని తనను దుర్భాషలాడారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల విషయంలో, తన వద్ద తీసుకున్న డబ్బుల విషయంలో ప్రశ్నించినందుకు తనను బెదిరించారని, కత్తి తీసుకొని పొడిచేందుకు ప్రయత్నించారని వారి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కుర్చీలో నుంచి కిందపడేసి గాయపరిచారన్నారు. బలవంతంగా తన ఆఫీస్‌లోని పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు తీసుకొని వెళ్లారని వాటిని తిరిగి ఇవ్వలేదని అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సినీ నిర్మాత జె.రాధాకృష్ణ మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు డిస్ట్రిబ్యూటర్లు రవీంద్ర కళ్యాణ్, రామకృష్ణ, డ్రైవర్ బాలుపై ఐపీసీ సెక్షన్ 448, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాహిత్య దర్జీలు
బీ.ఏ.సుబ్బారావు దర్శకత్వం వహించి నిర్మించిన ‘భీష్మ’ చలనచిత్రం 1962లో విడుదలైంది. ఆ సినిమాకు మాటలను తాపీ ధర్మారావు, పాటలను ఆరుద్ర రచించారు. తాపీవారిని ఆరుద్ర గురుభావంతో గౌరవిస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉండేవారు. ఒకరోజున కుంతీ– కర్ణ సంవాదం షూటింగ్ మొదలు కాబోతూ ఉన్నది. జి.వరలక్ష్మి – కుంతి. గుమ్మడి వేంకటేశ్వరరావు – కర్ణుడు. సెట్లో తాపీవారు లేరు. ఏదో పని మీద బయటకు వెళ్లారు. ఆరుద్ర ఉన్నారు. వరలక్ష్మి డైలాగ్ పేపరును చూసి ‘డైలాగ్ పెద్దదైంది. తగ్గిస్తే బాగుంటుంది’ అన్నారు. ఆరుద్ర ‘వీల్లేదండి. అది తాపీవారి స్క్రిప్టు. దానికి తిరుగు లేదు’ అన్నారు. ‘తగ్గించవలసిందే’ అని ఆవిడ. ‘వీలు లేదు’ అని ఈయన. ఇంతలో తాపీవారు వచ్చారు. విషయాన్ని తెలుసుకొన్నారు. ఆరుద్రను ఇవతలకు పిలిచారు. ‘నాయనా! దర్జీ ఏమి చేస్తాడు? చొక్కా వదులైతే బిర్రు చేస్తాడు. బిర్రయితే వదులు చేస్తాడు కదా! మనం సాహిత్య దర్జీలం. అవతలివారు డైలాగు పెద్దదైందంటే రెండు వాక్యాలు తీసివేసి చిన్నదిగా చేస్తాం. చిన్నదైందంటే రెండు వాక్యాలు కలిపి పెద్దదిగా చేస్తాం. వరలక్ష్మిగారు గొప్పనటి. వారి మాటను మనం కాదనట మెందుకు? డైలాగును తగ్గించు’ అన్నారు. ఆరుద్ర ‘సరే!’ అన్నారు. -డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి -
ఉత్తమ లేఖకుడు
ఆంధ్రమహాభారతంలోని 18 పర్వాలలో 15 పర్వాలను రచించిన ‘కవిబ్రహ్మ’ తిక్కన సోమయాజికి గురునాథుడు లేఖకుడు. తిక్కన ఆశువుగా పద్యాలను చెప్తూవుంటే గురునాథుడు తాటాకుల మీద రాస్తూ ఉంటాడన్నమాట. ఒక సందర్భంలో తొమ్మిదవ పర్వమైన శల్యపర్వ రచన జరుగుతున్నది. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల పక్షాన ఉన్న వీరులు చాలామంది మరణించారు. దుర్యోధనుడు ఒంటరివాడైనాడు. ధృతరాష్ట్రుడికి సంజయుడు ఈ విషయాన్ని చెప్తూ– పలపలని మూకలో కాల్/ నిలువక గుర్రంబు డిగ్గి నీ కొడుకు గదా/ కలిత భుజుండై ఒక్కడు/ తొలగి చనియె’(నీ కుమారుడైన దుర్యోధనుడు పల్చబడిపోయిన సైన్యంలో నిలిచి ఉండలేక తన గుర్రం నుండి దిగి, గదను భుజాన పెట్టుకొని రణరంగం నుండి బయటకు వెళ్లిపోయాడు) అంటాడు. ఇది కంద పద్యం. మూడు పాదాలు ఐపోయినై. నాలుగవ పాదంలో ఉండవలసిన ఐదు గణాలలో ఇంకా మూడు గణాలు రావలసి ఉన్నది. వాక్యం మాత్రం పూర్తి ఐంది కనుక ‘ఏమి చెబుదామా?’ అని ఆలోచిస్తూ– ‘ఏమి చెప్పుదుం గురునాథా’ అన్నాడు తిక్కన పరాకుగా. ‘బాగుంది. తర్వాత పద్యం చెప్పండి’ అన్నాడు గురునాథుడు. ‘పద్యం పూర్తి కాకుండానేనా?’ అన్నాడు తిక్కన. గురునాథుడు విస్తుబోయి ‘కురునాథా (ఓ ధృతరాష్ట్ర మహారాజా)! ఏమి చెప్పుదున్ (ఏమని చెప్పేది?) అని మీరే చెప్పారు కదా! నాలుగవ పాదం పూర్తి ఐంది. యతి కూడా సరిపోయింది’ అన్నాడు. లేఖకోత్తముడైన గురునాథుడి తెలివిని మెచ్చుకొంటూ తర్వాతి వచనాన్ని ప్రారంభించాడు తిక్కన. కురునాథుడు సంధి వలన గురునాథుడు కావటమూ, అది లేఖకుడి పేరు కావటమూ ఈ సందర్భంలోని విశేషం! -డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి -
అన్నంభట్టును ఇవతలకు తెండి!
సాహిత్య మరమరాలు తర్కసంగ్రహం అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించిన ‘మహామహోపాధ్యాయ’ అన్నంభట్టు క్రీ.శ. 17వ శతాబ్దం ఉత్తరార్థంలో జీవించాడు. ఆయన గొప్ప శాస్త్రకారుడు మాత్రమే కాదు, ఆచారపరుడు కూడా! ఆయన ఆ గ్రంథం మొత్తాన్నీ మడి కట్టుకొనే రచించాడు. ఒకరోజున గ్రంథరచన పూర్తి ఐంది. కవి వివరాలను తెలిపే ముగింపు శ్లోకాన్ని వ్రాయవలసి ఉన్నది. ఆయనకు ‘విదుషాన్నంభట్టేన’– పండితుడైన అన్నంభట్టుచే రచించబడిన అనే ఆలోచన వచ్చింది. బాగానే ఉన్నది కానీ అది అనుష్టుప్పు శ్లోకం కనుక, ప్రతి పాదంలోనూ ఎనిమిది అక్షరాలు ఉండాలి. అన్నంభట్టు వ్రాయాలనుకొన్న పాదంలో ఏడు అక్షరాలు మాత్రమే ఉన్నై. ఆ ఎనిమిదవ అక్షరం కోసం నానా తంటాలు పడుతున్నాడు. అంతటి మహాకవికి కూడా గంటలు గడుస్తున్నై కానీ సరియైన రీతి దొరకటం లేదు. ఇంట్లో ఆ పని మీద, ఈ పని మీద అటుగా వచ్చి వెళుతున్న అతని భార్య ఈ పరిస్థితిని చూసింది. ‘సంగతేమిటండీ?’ అని అడిగింది. చెప్పాడు. ఆమె చిరునవ్వు నవ్వింది. ‘దీని కింత ఆలోచన ఎందుకండి? ఆ వైపున ఉన్న అన్నంభట్టును ఈ వైపునకు తీసుకొనిరండి!’ అన్నది. అన్నంభట్టు చూశాడు. తను వ్రాయాలనుకొన్న ‘విదుషాన్నంభట్టేన’ ఇప్పుడు ‘అన్నంభట్టేన విదుషా’ ఐంది. ఎనిమిది అక్షరాలూ సరిపోయినై. భార్య వైపు కృతజ్ఞతగా చూశాడు. - డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి -
మరో జడ్జీపై ఏసీబీ కేసు
సాక్షి, హైదరాబాద్: న్యాయశాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జీలపై ఏసీబీ దూకుడు పెంచింది. గడిచిన నెల రోజుల్లో ఇద్దరు జడ్జీలపై కేసులు నమోదు చేసిన ఏసీబీ.. శుక్రవారం మరో సెషన్స్ జడ్జీపై కేసు నమోదు చేసింది. నాంపల్లి మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎస్ రాధాకృష్ణమూర్తిపై అవినీతి ఆరోపణల కింద కేసు నమోదు చేసి, అల్వాల్‌లోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించింది. ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రమణకుమార్ మీడియాతో మాట్లాడుతూ విలువైన ఆస్తుల పత్రాలు లభించాయని, వాటి వివరాలను పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత వివరాలు వెల్లడిస్తామన్నారు. మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన దత్తు అనే విద్యార్థి బెయిల్ కోసం రూ.7.5 లక్షల లంచం తీసుకున్నట్టు హైకోర్టుకు ఫిర్యాదు అందింది. దీంతో అంతర్గతంగా న్యాయశాఖ విచారణ జరిపి, వాస్తవం అని తేలడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని అవినీతి నిరోధక శాఖను హైకోర్టు ఆదేశించింది. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగగా విషయం మొత్తం బయటపడింది. ఎక్సైజ్ కేసు (ఎన్‌డీపీఎస్‌యాక్ట్)లో పట్టుబడ్డ ఎంటెక్ విద్యార్థి దత్తు నుంచి అడ్వొకేట్లు కె. శ్రీనివాస్‌రావు, జి. సతీశ్‌కుమార్ ద్వారా జడ్జి రాధాకృష్ణమూర్తి రూ.7.5 లక్షలు లంచం తీసుకున్నట్టు తేలిందని ఏసీబీ డీజీ పూర్ణచందర్రావు తెలిపారు. రెండు వాయిదాల ద్వారా ఈ లంచాన్ని దత్తు తల్లి తన బంగారం తాకట్టు పెట్టి ఇచ్చినట్టు దర్యాప్తులో వివరించారు. జడ్జితో పాటు ఇద్దరు అడ్వొకేట్లను అరెస్ట్ చేసినట్టు ఏసీబీ డీజీ తెలిపారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, మిగతా వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. అడ్వొకేట్ శ్రీరంగారావు ఫిర్యాదుతో... నాంపల్లి మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రాధాకృష్ణమూర్తి వ్యవహారంపై గతేడాది నవంబర్‌లో అడ్వొకేట్ శ్రీరంగారావు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. దత్తు కేసులో జడ్జి రూ.10 లక్షల లంచాన్ని న్యాయవాదుల ద్వారా డిమాండ్ చేసి, రూ.7.5 లక్షలు తీసుకున్నట్టు ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు. ఇలాంటి వ్యవహారాల వల్ల ప్రజల్లో న్యాయశాఖపై నమ్మకం పోతోందని, దీనికి అడ్డుకట్ట వేసి న్యాయదేవతను రక్షించాలంటూ ఆయన న్యాయమూర్తిని వేడుకున్నారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన హైకోర్టు అంతర్గత విచారణ జరిపి ఏసీబీకి ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. జడ్జి వ్యవహారం వెలుగులోకి రావడంతో న్యాయవాద సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. -
కండక్టర్ తనయుడు ఆర్టీసీ ఎండీ
బాధ్యతలు స్వీకరించిన పూర్ణచంద్రరావు ఏసీబీ డీజీగా బాధ్యతలు చేపట్టిన ఎ.కె. ఖాన్ సాక్షి, హైదరాబాద్: ‘మా నాన్న రాధాకృష్ణమూర్తి కండక్టర్‌గా పనిచేశారు. చిన్నప్పటి నుంచి ఆర్టీసీతో అనుబంధం ఉంది. సంస్థకు రుణపడి ఉన్నా. ఇంత కాలానికి నాకు సంస్థ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది’ అని ఆర్టీసీ నూతన ఎండీ జె.పూర్ణచంద్రరావు అన్నారు. శనివారం ఎ.కె.ఖాన్ నుంచి బాధ్యతలు స్వీకరించాక పూర్ణచంద్రరావు విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు సంస్థ బాగోగులపై దృష్టి పెడతానని చెప్పారు. ప్రజలకు ఆర్టీసీ మెరుగైన సేవలు అందించే దిశగా పనిచేస్తానన్నారు. ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. పోలీసు ఉద్యోగమే అత్యంత క్లిష్టమైందని, ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించడం అంతకంటే క్లిష్టం కాదని తాను భావిస్తున్నానని చెప్పారు. ఆర్టీసీ ఎండీగా ఏడాదిన్నర కాలం పనిచేయడం సంతోషంగా ఉందని ఎ.కె.ఖాన్ అన్నారు. ఆర్టీసీ ఎండీగా పూర్ణచంద్రరావుకు బాధ్యతలు అప్పగించిన తర్వాత అనినీతి నిరోధక విభాగం(ఏసీబీ) డీజీగా ఎ.కె. ఖాన్ బాధ్యతలు చేపట్టారు.