16న కరీంనగర్లో సోనియా సభ: దిగ్విజయ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 16న కరీంనగర్లో సోనియాగాంధీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన ఢిల్లీలోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ నెల 17న వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో రాహుల్‌గాంధీ పాల్గొంటారని చెప్పారు.
రెండో దఫా పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో సోనియా, రాహుల్ సభలు ఉంటాయన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌పార్టీకి అభ్యర్థుల కొరత ఉందనడం అవాస్తవమన్నారు. ఈనెల 14 లోపు సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయనున్నట్టు పేర్కొన్నారు.