16న కరీంనగర్‌లో సోనియా సభ: దిగ్విజయ్ | Sonia Gandhi Meeting in Karimnagar on april 16, says digvijay singh | Sakshi

16న కరీంనగర్‌లో సోనియా సభ: దిగ్విజయ్

Apr 12 2014 3:50 AM | Updated on Aug 14 2018 4:21 PM

16న కరీంనగర్‌లో సోనియా సభ: దిగ్విజయ్ - Sakshi

16న కరీంనగర్‌లో సోనియా సభ: దిగ్విజయ్

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 16న కరీంనగర్‌లో సోనియాగాంధీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ తెలిపారు.

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 16న కరీంనగర్‌లో సోనియాగాంధీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన ఢిల్లీలోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ నెల 17న వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో రాహుల్‌గాంధీ పాల్గొంటారని చెప్పారు.

రెండో దఫా పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో సోనియా, రాహుల్ సభలు ఉంటాయన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌పార్టీకి అభ్యర్థుల కొరత ఉందనడం అవాస్తవమన్నారు. ఈనెల 14 లోపు సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయనున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement