'తక్కువ అంచనా వద్దు, మేం పుంజుకోవడం ఖాయం'
'తక్కువ అంచనా వద్దు, మేం పుంజుకోవడం ఖాయం'
Published Wed, May 14 2014 10:23 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
బెంగళూరు: సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంటుందని తమ పార్టీని తక్కువ అంచనా వేయవద్దని మీడియాకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సూచించారు. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ మట్టికరవడం ఖాయమని మీడియా చేస్తున్న ప్రచారాన్ని దిగ్విజయ్ ఖండించారు.
గతంలో కాంగ్రెస్ పార్టీపై ఇలాంటి ప్రచారమే చేశారని.. అయితే మీడియా ప్రచారాన్ని, ఒపినియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతిని దిగ్విజయ్ సింగ్ గుర్తు చేశారు. ఒకవేళ ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తే.. బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
కాంగ్రెస్ తక్కువ అంచనావేయడాన్ని మానుకోవాలని.. మీడియా అంచనాలను పక్కనపెట్టి 1977, 1989, 1999 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చామని దిగ్విజయ్ తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీకి ఒడిదుడుకులు తప్పవని దిగ్విజయ్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ నమ్మకూడదని దిగ్విజయ్ తెలిపారు. 2004, 2009లో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం జరిగినా.. యూపీఏ అధికారంలోకి వచ్చిందన్నారు.
Advertisement