హోరెత్తిన ర్యాలీలు | general elections campaign | Sakshi
Sakshi News home page

హోరెత్తిన ర్యాలీలు

Published Tue, Apr 29 2014 3:14 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

హోరెత్తిన ర్యాలీలు - Sakshi

హోరెత్తిన ర్యాలీలు

ముగిసిన సార్వత్రిక ప్రచారం... ప్రలోభాలకు శ్రీకారం
 సాక్షి, నల్లగొండ : సార్వత్రిక ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారం సాయంత్రంతో ముగి సింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు తెరలేచింది. బుధవారం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులపాటు హోరాహోరీగా సాగిన ప్రచారం పరిసమాప్తమైంది.

 ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్‌సింగ్‌తో కాంగ్రెస్ నాయకులు ప్రచారాన్ని కోదాడలో ముగించారు. అలాగే టీడీపీ, బీజేపీలు జన సేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్  సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో సోమవారం జిల్లావ్యాప్తంగా ర్యాలీలు హోరెత్తాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ, బీజేపీ, సీపీఎం తదితర పార్టీల నాయకులు భారీగా జనసమీకరణ చేసి ప్రధాన పట్టణాల్లో బైక్‌ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించారు. గెలుపు తమదంటే తమదే అని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement