నైట్ ట్రైన్స్లో ఎస్కార్ట్ పెంచాలి: జీఎం
సాక్షి, హైదరాబాద్: రాత్రి పూట నడిచే రైళ్లలో ప్రయాణికుల భద్రత కోసం ఎస్కార్ట్ సిబ్బందిని పెంచాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా అధికారులను ఆదేశించారు. సోమవారం రైల్ నిలయం లో డివిజినల్ రైల్వే మేనేజర్లు, ఉన్న తాధికారులతో ప్రయాణికుల భద్రతపై సమీక్షించారు. ఇటీవల బెంగళూరు–గుంతకల్ సెక్షన్లో జరిగిన దొంగతనాలను దృష్టిలో ఉంచు కుని సూచనలు చేశారు.
ఈ మార్గంలో రాత్రిపూట నడిచే అన్ని రైళ్లలో భద్రతను పెంచాలని చెప్పారు. రైళ్లు సకాలంలో రాకపోకలు సాగిం చేలా శ్రద్ధ తీసుకోవాలని, సిగ్నల్ వైఫల్యాలు, లోకో వైఫల్యాలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమావేశంలో అదనపు జీఎం బీబీ సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.