railway reservation forms
-
రైల్వే టికెట్ బుకింగ్‌లో కొత్త ఆప్షన్?
సాక్షి, న్యూఢిల్లీ: థర్డ్ జెండర్ కోసం భారతీయ రైల్వే కొత్త ఆప్షన్ ను పరిచయం చేస్తోంది. రైల్వే టికెట్ రిజర్వేషన్లో ట్రాన్స్ జెండర్లకు అవకాశం కల్పించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ట్రాన్స్‌జెండర్ (మేల్ / ఫిమేల్) ఆప్షన్‌కు బదులుగా కేవలం ‘టి’ అనే ఆప్షన్‌ను పొందు పర్చనుంది. రిజర్వేషన్ ఫాంలో ట్రాన్స్ జెండర్ల కోసం టీ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఈ మేరకు రిజర్వేషన్ ఫాంలో సవరణలు చేయాలని అక్టోబరు 17న జోనల్ అధికారులకు ఒక లేఖలో రైల్వే బోర్డు తెలిపింది. మేల్, ఫీమేల్.. ఆప్షన్లతో పాటుగా ట్రాన్స్ జెండర్ (టి) ఆప్షన్ చేర్చాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. దీనికి సాఫ్ట్వేర్ లో కూడా మార్పులు తేవాలని సూచించింది. అలాగే టికెట్ బుకింగ్ తో పాటు.. కాన్సిల్ చేసుకునే ఫాంలో కూడా ట్రాన్స్ జెండర్ ఆప్షన్ చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది. ట్రాన్స్‌జెండర్ హక్కుల చట్టం 2016పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసులపై విమర్శలు వెల్లువెత్తడంతో 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ మార్పులు చేస్తోంది. -
వారి కోసం రైల్వే రిజర్వేషన్లో ప్రత్యేక కాలమ్
న్యూఢిల్లీ: లింగమార్పిడి వ్యక్తుల్ని భారతీయ రైల్వే థర్డ్ జెండర్‌గా గుర్తిస్తూ వారి కోసం రైల్వే రిజర్వేషన్, క్యాన్సిలేషన్ దరఖాస్తుల్లో స్త్రీ, పురుషులతో పాటు మూడో కాలమ్ కేటాయించింది. టికెట్ కౌంటర్లతో పాటు ఆన్లైన్ విధానంలోనూ త్వరలో ఇది అమలుకానుంది. హిజ్రాలు, లింగమార్పిడి వ్యక్తుల హక్కుల్ని కాపాడేందుకు వారిని థర్డ్ జెండర్‌గా గుర్తించాలంటూ 2014లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, దీంతో వారికోసం కాలమ్ కేటాయిస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.