rainy seasons
-
డిస్కౌంట్ల షికారు!
వానాకాలం వచ్చేసింది. దీనికి తోడు కార్ల కంపెనీల ఆఫర్ల వర్షం కూడా మొదలైపోయింది. అయితే, ఈ ఏడాది డిస్కౌంట్ల మోత మరింతగా మోగుతోంది. సార్వత్రిక ఎన్నికలు, మండుటెండల దెబ్బకు వేసవి సీజన్లో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. షోరూమ్‌లకు కస్టమర్ల రాక కూడా భారీగా తగ్గిపోయింది. మరోపక్క, వర్షాకాలంలో విక్రయాల తగ్గుదల కూడా పరిపాటే. ఈ పరిస్థితిని మార్చేందుకు, ఏదో రకంగా విక్రయాలు పెంచుకునేందుకు కంపెనీలు పలురకాల వ్యూహాలను అమలు చేస్తున్నాయి. భారీ డిస్కౌంట్ ధరలతో ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ప్రారంభ స్థాయి మోడళ్లపై ఎక్కువ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. పాత కార్ల ఎక్సే్ఛంజ్పై మంచి ధర, అదనపు బోనస్, బహుమతులను కూడా అందిస్తున్నాయి.బలహీన సీజన్... పండుగలు పెద్దగా లేకపోవడంతో పాటు, వర్షాలు ఎప్పుడు పడతాయో ఊహించని పరిస్థితులు ఉంటాయి. దీంతో కస్టమర్లు ఈ సీజన్లో కొనుగోళ్ల ప్రణాళికలను వాయిదా వేసుకుని.. దసరా, దీపావళి సమయాల్లో కొనుగోళ్లకు మొగ్గుచూపిస్తుంటారు. అందుకే ఏటా వర్షాకాలంలో అమ్మకాలు పెంచుకునేందుకు దేశవ్యాప్తంగా డీలర్లు డిస్కౌంట్లు, ఇతరత్రా స్కీమ్‌లను అమలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు మోడల్ కార్లపై రూ.20 వేల నుంచి రూ.4 లక్షల వరకు తగ్గింపు ఆఫర్లు అమల్లో ఉన్నాయి. ముఖ్యంగా గతేడాది వర్షాకాలం కంటే ఈ ఏడాది డిస్కౌంట్లు కూడా పెరిగాయి. వేసవిలో విక్రయాలు తగ్గడంతో డీలర్ల వద్ద వాహన నిల్వలు పేరుకుపోయాయి. వీటిని తగ్గించుకోవాలంటే డీలర్లు విక్రయాలు పెంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. డబుల్ బెనిఫిట్... డిమాండ్ పెంచేందుకు కార్ల కంపెనీలు.. స్టాక్‌ను తగ్గించుకునేందుకు డీలర్ల స్థాయిలోనూ డిస్కౌంట్ ఆఫర్లు నడుస్తున్నాయి. ‘గతేడాది ఇదే సీజన్లో కొన్ని కార్ల మోడళ్లకు కొరత నెలకొంది. వెయిటింగ్ వ్యవధి కూడా పెరిగింది. కానీ, ఈ ఏడాది చాలా మోడళ్లు డీలర్ల వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఇదే కస్టమర్లకు ఆఫర్లు పెంచేందుకు కారణం’ అని ఫాడా ప్రెసిడెంట్ మనీ‹Ùరాజ్ సింఘానియా తెలిపారు. మారుతీ ఆల్టో కే10పై రూ.40 వేలు, ఎస్–ప్రెస్సో, వ్యాగన్ఆర్పై రూ.25,000–30,000, స్విఫ్ట్ మోడళ్లపై రూ.15,000–20,000 వరకు తగ్గింపు ఆఫర్లు నడుస్తున్నాయి. బాలెనో పెట్రోల్ ఎంటీ వెర్షన్‌పై రూ.35 వేలు, పెట్రోల్ ఏజీఎస్ వెర్షన్‌పై రూ.40 వేల వరకు, ఎక్స్ఎల్6 పెట్రోల్ వేరియంట్‌పై 20 వేలు, సీఎన్జీ వేరియంట్‌పై రూ.15 వేల వరకు తగ్గింపు లభిస్తోంది.ఉచిత విదేశీ ట్రిప్..! ‘హోండా మ్యాజికల్ మాన్సూన్’ పేరుతో హోండా కార్స్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. అన్ని కార్లపై బహుమతులు, ఇతర ప్రయోజనాలను ఇందులో భాగంగా అందిస్తోంది. ముఖ్యంగా జూలై నెలలో కొనుగోలుదారుల నుంచి విజేతలను ఎంపిక చేసి, వారికి స్విట్జర్లాండ్ ఉచిత పర్యటన, రూ.75,000 వరకు నగదు బహుమతులను ఆఫర్ చేస్తోంది. హోండా కారు కొనుగోలుపై ఈ పరిమిత కాల ఆఫర్ తమ డీలర్లందరి వద్దా అందుబాటులో ఉన్నట్టు హోండా కార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ తెలిపారు.ఆఫర్ సూపర్... → ఎంఅండ్ఎం ఎక్స్‌యూవీ400 (ఈవీ) – రూ. 4 లక్షలు → మారుతి జిమ్నీ ఆల్ఫా వేరియంట్ – రూ. 2 లక్షలు → హోండా అమేజ్, సిటీ, ఎలివేట్, సిటీ ఈ–హెచ్ఈవీ – రూ. 75,000 వరకు → టాటా టియాగో, ఆ్రల్టోజ్, నెక్సాన్, పంచ్, హ్యారియర్, సఫారీ – రూ. 50,000 వరకు → అధిక డిమాండ్ ఉండే ఎస్‌యూవీలపై తగ్గింపు కొంతే → ఆరంభ మోడళ్లు, హ్యాచ్‌బ్యాక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు → ఎక్స్చేంజ్పైనా అదనపు బోనస్ → సాధారణ రోజుల్లో ఎస్‌యూవీలకు 60 రోజుల వెయిటింగ్ → ఈ సీజన్లో 30 రోజుల్లోనే డెలివరీ → పండుగల ముందు వరకు ఇదే ధోరణి -
తొలకరి పులకించె.. భూతల్లి మురిసె
సాక్షి, భీమవరం: తొలకరి పలకరింపుతో వాతావరణం చల్లబడింది. నిన్నటి వరకూ వేడిగాలులు, ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు జల్లులతో సేదతీరారు. సోమవారం వేకువజాము నుంచి ఉమ్మ డి పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఖరీఫ్‌కు ఊరట ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. దాళ్వాలో ఆశాజనకమైన పంట చేతికి రావడం.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ముమ్మరంగా ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులు సార్వా సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు పొలాల్లో పశువుల ఎరువు వేసే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే ఉపాధి హామీ పథకంలో పంట కాలువలు, బోదెల్లో పూడికతీత పనులు జరుగుతుండటంతో సార్వా నారుమడులు వేయడానికి రైతులు కసరత్తు ప్రారంభించారు. 4.50 లక్షల ఎకరాల్లో.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 4.50 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తుండగా నూతన పశ్చిమగోదావరి జిల్లాలో 2.55 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయనున్నారు. సార్వా సీజన్‌కు ఎంటీయూ 1061, 1064, 7029, 1121 వంగడాలు అనువుగా ఉంటాయని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు. ఈ మేరకు రైతులు విత్తనాలు సిద్ధం చేసుకుంటున్నారు. విత్తనాలు, ఎరువులు సిద్ధం సార్వా వరి విత్తనాల్లో దాదాపు 90 శాతానికిపైగా పైగా రైతులు సమకూర్చుకోనుండగా మిగిలిన విత్తనాల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పశ్చి మగోదావరి జిల్లాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా 351 కింట్వాళ్ల విత్తనాలను విక్రయానికి సిద్ధం చేశా రు. సార్వా పంటకు సుమారు 68 వేల టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేశారు. వీటిని రైతులకు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో రైతులు ఉత్సాహంగా మందస్తు సాగుకు సిద్ధమవుతున్నారు. త్వరితగతిన నారుమడులు వర్షాలు ప్రారంభమైనందున రైతులు సార్వా నారుమడులు సిద్ధం చేసుకోవాలి. ఇప్పటికే కాలువలకు కొన్నిచోట్ల పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేశారు. వెంటనే సాగు ప్రారంభిస్తే మూడో పంటగా అపరాల సాగుకు వీలుంటుంది. శివారు భూములకు నీరు అందడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో రైతులు విత్తనాలు సిద్ధం చేసుకోవాలి. – పి.ఉషారాజకుమారి, ఏడీఏ, భీమవరం -
ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, పిడుగుల నుంచి రక్షణ పొందండి
వర్షాకాలం ప్రారంభమవుతోందంటే ఒక్కపక్క సంతోషం..మరోపక్క భయం కూడా వెంటాడుతోంది. వర్షాలు సమృద్ధిగా కురిస్తే భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయి. నీటి వనరులు చేకూరుతాయి. అయితే అదే సమయంలో పడే పిడుగులు ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంటున్న సందర్భాలున్నాయి. ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చునని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. పిడుగుల నుంచి తప్పించుకోవాలంటే వజ్రపాత్ యాప్ అందుబాటులో ఉంచుకుంటే సరిపోతుందంటున్నారు. సాక్షి,రాజాం: వర్షా కాలంలో ఏదో ఒక చోట పిడుగుపాటు మరణాలు సంభవిస్తున్నాయి. పొలాల్లో ఉండే రైతులు, ప్రయాణాల్లో ఉండేవారు పిడుగుపాటుకు గురై మృత్యుఒడిలోకి చేరుతున్నారు. మూగజీవాలు కూడా పిడుగులబారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఓ వైపు భారత ప్రభుత్వం టెక్నాలజీ ద్వారా మొబైల్ ఫోన్లకు టెక్ట్సు మెసేజ్‌లు పెడుతున్నా, హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ప్రమాదాలు తప్పడంలేదు. ఇలాంటి ఘటనల నుంచి గట్టెక్కాలంటే అరచేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నవారందరూ వజ్రాయాప్ డౌన్లోడ్ చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో ఏడాదికి 120 మందికిపైగా మృతి ప్రతీ ఏడాది జిల్లాలో సుమారు 120 మంది పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. పదుల సంఖ్యలో జీవాలు కూడా చనిపోతున్నాయి. రైతులే ఎక్కువ మంది పిడుగుపాటుకు గురౌతున్నారు. పిడుగుపాటుకు గురై మృతి చెందిన వారికి ప్రకృతి వైపరీత్యాల విభాగంలో రూ. 4 లక్షల నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం అందించాల్సి ఉంది. పాక్షికంగా అంగవైకల్యం సంభవిస్తే రూ. 59 వేలు, 60 శాతం అంగవైకల్యం దాటితే రూ. 2 లక్షలు నష్టపరిహారం అందించాలి. అయితే సాయం అందడంలో ప్రస్తు తం జాప్యం జరుగుతుంది. వైఎస్సార్ బీమాలో ఉన్నవారికి మాత్రమే పరిహారం అందుతుంది. జాగ్రత్తలు తప్పనిసరి ►పిడుగు పడే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ►వర్షం, ఉరుములు వచ్చే సమయంలో చెట్ల కింద ఉండరాదు. ►సురక్షిత ప్రాంతాలు వైపు వెళ్లిపోవాలి. ►పెద్దగా వచ్చే ఉరుముల శబ్దం వినబడగానే రెండు చెవులు మూసుకొని మొకాళ్లపై నిల్చోవాలి. ►పిడుగుపాటుకు గురైన వ్యక్తిని ప్రాథమికి చికిత్సలో భాగంగా సంఘటనా స్థలం నుంచి తీసుకొచ్చి ఊపిరి అందించే ఏర్పాటు చేయాలి. ►చేతులు, కాలిని గట్టిగా చేతులతో రాపిడి చేయడం ద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చు. ►వర్షం పడే సమయంలో మూగజీవాలను సురక్షితమైన షెడ్లలో మాత్రమే ఉంచాలి. వజ్రపాత్ యాప్ యాప్ డౌన్లోడ్ ఇలా.. ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నవారంతా ప్లేస్టోర్‌లో వజ్రపాత్ యాప్‌ని డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేయగానే భాష అడుగుతుంది. అనంతరం మొబైల్ నంబర్ నమోదు చేయాలి. ఆ నంబర్ ఆధారంగా లొకేషన్‌ను చూపించి ఎరుపు, ఆరెంజ్, పసుపు రంగులతో కూడిన వలయాలు వస్తాయి. ఈ వలయాలులో అంకెలు కనిపిస్తాయి. వాటి ఆధారంగా ఎంత సేపట్లో పిడుగుపడే అవకాశం ఉందో సమాచారం వస్తోంది. సురక్షిత ప్రాంతాన్ని చూపిస్తుంది. పిడుగులు పడే ప్రమాదం లేకుంటే ఆ విషయాన్ని కూడా తెలియజేస్తుంది. అంతేకాకుండా మరో వైపు ఉన్న ఆప్షన్లో పిడుగు ఎప్పుడు పడుతుందో అనే విషయాన్ని కూడా సూచిస్తుంది. ఈ యాప్ ద్వారా చుట్టుపక్కల ఉన్నవారిని కూడా అప్రమత్తం చేసేందుకు అవకాశం ఉంది. -
వానాకాలం.. జర భద్రం
మెదక్ రూరల్: తొలకరి చినుకుల పలకరింపుతో కోరలుచాచిన మృత్యువు విషం జిమ్ముతోంది. వానాకాలం ప్రారంభమైందంటే చాలు బుసలు కొడుతున్న పాములు కాటేసేందుకు మాటేస్తున్నాయి. ఆదమరిచి అడుగు వేస్తే పాముకాటుకు బలయ్యే ప్రమాదం పొంచి ఉంది. విషసర్పాల కాటుకు ఎంతో మంది అభాగ్యులు అర్ధాంతరంగా తనువు చాలిస్తుండటంతో బాధిత కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. దీనిపై సాక్షి కథనం... జిల్లాలో ప్రతి ఏటా పాముకాటుకు గురై పదుల సంఖ్యలో మృతి చెందుతున్నారు. ఇందులో రైతులు, చిన్నారుల సంఖ్యనే అధికంగా ఉంది. వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు బుసలు కొడుతున్న పాములు చల్లదనాన్ని వెతుక్కుంటూ భయటకు వస్తుంటాయి. తొలకరి చినుకులకు ఎక్కువగా పెరిగిన చెట్ల పొదలు, పాత నివాస గృహాలలోకి, కప్పలు, ఎలుకలు, క్రిమిసంహారకాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాముల సంచరిస్తుంటాయి. ఈ క్రమంలో పొలాల్లో వ్యవసాయ పనులు చేస్తూ కొందరు, ఇంటి పరిసరాల్లో మరికొందరు, రాత్రి సమయంలో ఇంట్లో నిద్రపోతుండగా ఇంకొందరు పాముకాటుకు బలవుతున్నారు. ఖరీఫ్ ప్రారంభమవడంతో పంటసాగు కోసం రాత్రింబవళ్లు తేడా లేకుండా రైతులు వ్యవసాయ పనులు చేసేందుకు పొలాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో చల్లదనానికి భయటకు వచ్చే పాములు కాటేసే అవకాశముంది. అలాగే మైదానాలలో ఆడుకునే చిన్నపిల్లలకు, రాత్రి వేళల్లో నివాస పూరిగుడిసెల్లో నిద్రపోతున్న సమయాల్లో విషసర్పాలు కాటువేసే ప్రమాదం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాముకాటుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని నాటువైద్యులను ఆశ్రయించి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. కాగా పాముకాటుకు గురవకుండా ముందుజాగ్రత్త చర్యలుగా ప్రజలకు అర్థమయ్యో విధంగా నాటు వైద్యాన్ని ఆశ్రయించొద్దని, ప్రభుత్వ ఆసుపత్రులలో పాముకాటుకు నివారణ వ్యాక్సిన్లు ఉన్నాయని గ్రామాలల్లో వాల్‌పోస్టర్లు, కరపత్రాల ద్వారా అధికారులు విసృత్త ప్రచారం నిర్వహించాల్సి ఉండగా, అది ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాముకాటు పై విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసనరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ⇔ పొలం పనులు చేసే రైతులు, అడవుల్లో కట్టెలు, ఆకుల కోసం తిరిగే వ్యక్తులు, పూరి గుడిసెల్లో నివసించే వ్యక్తులు విషసర్పాల బారినపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ⇔ రైతులు రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా టార్చిలైట్‌ను వెంట తీసుకెళ్లాలి. ⇔ కప్పలు, ఎలుకలు ఎక్కువగా ఉండే చోట పాములు సంచరిస్తుంటాయి. అది దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండి పనులను చేసుకోవాలి. ⇔ పాములు ఎక్కువగా మోకాల కింది భాగంలోనే కాటువేస్తాయి. కాబట్టి కాళ్లు పూర్తిగా కప్పినట్లుగా ఉండే చెప్పులను ధరించి, కాళ్ల కిందికి ఉండేలా బట్టలను వేసుకోవాలి. ⇔ పాముకాటుకు గురైతే ఆందోళనకు గురికాకుండా వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి. ప్రథమ చికిత్స: ⇔ పాముకాటుకు గురైన వ్యక్తికి ప్రమాదం లేదని ధైర్యం చెప్పాలి. ⇔ కాటువేసిన చోట సబ్బుతో శుభ్రంగా కడగాలి. ⇔ పాముకాటుకు గురైన వెంటనే కంగారుపడి నాటు వైద్యులను ఆశ్రయించకూడదు. ⇔ పాముకాటు వేసినప్పుడు నోటితో కాని బ్లేడుతో కాని గాట్లు పెట్టకూడదు. ⇔ కాటువేసిన చోటుకు మూడు అంగులాల పై భాగాన బట్టతో కట్టాలి. ⇔ ప్రథమ చికిత్స అందించిన వెంటనే ఏరియా ఆస్పత్రికి, లేదా దగ్గరలోని అర్హులైన వైద్యులను సంప్రదించాలి. నాటు వైద్యం ప్రమాదకరం పాములు అన్నీ విషపూరితమైనవి కాకున్నా అప్రమత్తంగా ఉండాలి. పాముకాటుకు గురైన చాలా మంది అవగాహనలేమితో నాటు వైద్యులను ఆశ్రయించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీ సెంటర్లలో పాముకాటుకు సంబంధించిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. పాముకాటుకు గురైనప్పుడు అనవసరంగా కంగారుపడి కాటువేసిన చోట నోటితో కాని బ్లేడుతో కాని గాట్లు వేయకూడదు. పాముకాటుకు గురైన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి. ముఖ్యంగా చిన్నారులు, రైతులు జాగ్రత్తగా ఉండే విధంగా చూసుకోవాలి. గ్రామాల్లో వైద్యారోగ్య సిబ్బందిచే పాముకాటు పై అవగాహన కల్పిస్తున్నాం. –వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి, మెదక్ -
ఈ‘సారీ’అంతే.. వానొస్తే చింతే!
సాక్షి, సిటీబ్యూరో: నగర ప్రజలకు ప్రతిసారీ వర్షాకాలపు కష్టాలు తీరడం లేదు. ప్రతియేటా వర్షాకాలంలోపునే సమస్యలు లేకుండా చేస్తామని హామీనిస్తున్న బల్దియా యంత్రాంగం వివిధ కారణాలతో ఆ పనుల్ని పూర్తిచేయలేకపోతోంది. దీంతో వర్షం వచ్చిన ప్రతిసారీ అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడం, వాహనాలు, ప్రజలు ముందుకు కదల్లేక గంటల తరబడి ఆగిపోవాల్సి వస్తోంది. ఈ సారి కూడా అవే దృశ్యాలు పునరావృతం కానున్నాయి. ఈ వారంలో రెండు రోజులు కొద్దిసేపు కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమై పరిస్థితిని హెచ్చరించాయి. నగరంలో దాదాపు 150 నీటిముంపు ప్రాంతాలుండగా వాటి శాశ్వత పరిష్కారం కోసం దశలవారీగా పనులు చేపడుతున్నారు. అయితే చాలాచోట్ల పూర్తికాని పనుల వల్ల సమస్యలు పునరావృతమవుతున్నాయి. గతంలో దీప్తిశ్రీనగర్ వంటి ప్రాంతాల్లో రోజుల తరబడి ఇళ్లు నీళ్లలోనే మునిగి ఉండటాన్ని దృష్టిలో ఉంచుకొని అలాంటి ప్రాంతాలకు ప్రథమ ప్రాధాన్యమిచ్చారు. దీప్తిశ్రీనగర్తోపాటు పీజేఎన్ ఎన్క్లేవ్, గంగారం చెరువు ప్రాంతాల్లో దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు పేర్కొన్నారు. నాలాలకు సంబంధించి 47 బాటిల్‌నెక్ ప్రాంతాల్లో 840 ఆక్రమణల్ని తొలగించాల్సి ఉండగా, దాదాపు 500 వరకు తొలగించారు. నగరం ముంపునకు ప్రధాన కారణం నాలాల విస్తరణ జరగకపోవడం. అందుకు ఆస్తుల సేకరణ, ఆక్రమణల తొలగింపు వంటివి ఆటంకాలుగా మారాయి. నగరంలో జూలై తర్వాతే వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తూ, అప్పటిలోగా మేజర్ పనుల్ని పూర్తిచేస్తామని చెబుతున్నారు. కానీ పూర్తయ్యే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికీ ఖైరతాబాద్, పంజగుట్ట మోడల్‌హౌస్, మెహదీపట్నం, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, రాణిగంజ్, ఎస్పీరోడ్, హిమాయత్‌నగర్, చే నెంబర్, మహబూబ్‌మాన్షన్ వంటి తీవ్ర సమస్యలున్న ప్రాంతాల్లో సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదు. వివిధ ప్రాంతాల్లో అక్కడి పరిస్థితుల్ని బట్టి బాక్స్డ్రెయిన్లు తదితర ప్రత్యామ్నాయాలతో సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. వివిధ అవసరాల కోసం జరిపిన రోడ్‌కటింగ్ పనులు పూర్తికాకపోవడం వల్ల కూడా వర్షం వచ్చినప్పుడు సమస్యలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. బాటిల్‌నెక్స్.. నాలాల బాటిల్‌నెక్స్‌లో వానముంపు సమస్యల పరిష్కారానికి రూ.98 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. కానీ వాటిల్లో రూ.4.5 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. పనులు పూర్తి కావాల్సిన ప్రాంతాల్లో కాప్రా–నాగారం చెరువు, పటేల్‌కుంట–పెద్దచెరువు, కాటేదాన్ పారిశ్రామికవాడ నుంచి శివరాంపల్లి మీదుగా మీరాలం ట్యాంక్, నిజాం కాలనీ– టోలిచౌకి, బర్లకుంట– ఖాజాగూడచెరువు, హఫీజ్‌పేట చెరువు– పటేల్‌చెరువు, మదీనగూడ–గంగారం చెరువు పరికి చెరువు– «ఆల్విన్‌కాలనీ, వాజ్పేయినగర్– ఆర్కేపురం చెరువు తదితర ప్రాంతాలున్నాయి. మేజర్ నీటినిల్వ ప్రాంతాల్లో.. మేజర్ నీటి నిల్వ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన బాక్స్డ్రెయిన్ల పనులు పూర్తికాని ప్రాంతాల్లో బయోడైవర్సిటీ జంక్షన్, నాగోల్ – మూసీ తదితరమైనవి ఉన్నాయి. మేజర్ నీటినిల్వ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి రూ. 27 కోట్ల పనులు చేపట్టగా పూర్తయినవి రూ. 2కోట్ల పనులే. అలాగే ఇతర పనుల్లో ముర్కినాలా, కళాసిగూడ నాలాలకు సంబంధించిన పనులు పూర్తికావాల్సి ఉంది. వీటితోసహ ఇతరత్రా పనులు వెరసి మొత్తం రూ. 39 కోట్ల పనులకుగాను రూ. 33 కోట్ల మేర పూర్తయ్యాయి. మిగతావి పూర్తికావాల్సి ఉంది. ఆ పనులన్నీ పూర్తయితేనే ఎక్కడికక్కడ వాననీరు వరదకాల్వల గుండా ప్రవహించి రోడ్లపైకి చేరదు. అవి పూర్తికాకపోవడంతో నీరు పారే దారిలేక ప్రధాన రహదారులన్నీ నీటమునుగుతున్నాయి. పూడికతో.. వీటితోపాటు నాలాల్లో పూడికతీత పనులు పూర్తికాకపోవడం వల్ల కూడా వరదనీరు సాఫీగా వెళ్లే పరిస్థితి లేదు. 800 కి.మీ.ల మేర పూడికతీత పూర్తికావాల్సి ఉండగా, 500 కి.మీ.ల మేర మాత్రమే పూడికతీత జరిగింది. దీంతో కొద్దిచినుకులకే నాలాలు పొంగిపొర్లుతున్నాయి. డీఆర్ఎఫ్ టీమ్స్ ఇవి కాక డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్ఎఫ్)టీమ్స్ కూడా తక్షణమే రంగంలోకి దిగి తమ సేవలందిస్తాయి. 13 డీఆర్ఎఫ్ టీమ్స్‌లో మొత్తం 240 మంది సుశిక్షితులైన సిబ్బంది ఉన్నారు. షిఫ్ట్‌కు 80 మంది వంతున మూడు షిప్టుల్లో 24 గంటలపాటు విధుల్లో ఉంటారు. మాన్సూన్యాక్షన్ టీమ్స్ రెడీ..– అంచనా వ్యయం రూ. 23 కోట్లు ఈ సమస్యలు పరిష్కారం కాని నేపథ్యంలో వానొస్తే రోడ్లన్నీ నీట మునుగుతుండటంతో తక్షణ చర్యల కోసం వెనువెంటనే సమస్యల పరిష్కారం కోసం ఈ సంవత్సరానికి గాను 291 ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్‌ను జీహెచ్ఎంసీ సిద్ధం చేసింది. వీటిల్లో 76 మినీ మొబైల్ మాన్సూన్ టీమ్స్, 75 మొబైల్ మాన్సూన్ టీమ్స్, 2 జోనల్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉన్నాయి. ఇవికాక స్థానికంగా ఉండేలా 138 స్టాటిక్ లేబర్ టీమ్స్ ఉన్నాయి. మినీ మొబైల్ టీమ్స్‌లో జీపుతోపాటు కార్మికులు, మొబైల్ టీమ్‌లో డీసీఎం లేదా జేసీబీలతోపాటు కార్మికులు ఉంటారు. వీటన్నింటి అంచనా వ్యయం రూ.23 కోట్లు. -
గ్రేటర్‌కు ముంపు ముప్పు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌కు ముంపు ముప్పు పొంచి ఉంది. నాలాలు, మురుగు నీటి కాల్వల్లో పూడిక తొలగింపువిషయంలో జీహెచ్ఎంసీ, జలమండలినిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రతివేసవిలో వీటిలో పేరుకుపోయే పూడికను తొలగించాల్సి ఉండగా... పనులుఅరకొరగా చేపడుతూ మమఅనిపిస్తున్నాయి. గ్రేటర్లో దాదాపు 5వేలకిలోమీటర్ల పరిధిలో మురుగునీటి కాల్వలు, మరో 1,200 కిలోమీటర్ల మేర నాలాలు అందుబాటులో ఉన్నాయి. వరద, మురుగు నీరు సాఫీగా వెళ్లేందుకు వీటి ప్రక్షాళన చేపట్టాల్సి ఉండగా... అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా రానున్న వర్షాకాలంలో ముంపు తప్పదన్న సంకేతాలు సిటీజనులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వరద సాఫీగా వెళ్లేందుకు నాలాలను అభివృద్ధి చేయాలని కిర్లోస్కర్ కమిటీ 2003లో సూచించింది. అయితే 2007లో శివార్లలోని 12 మున్సిపాలిటీల విలీనంతో గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటు కావడంతో విస్తీర్ణం 625 చ.కి.మీలకు పెరిగింది. దీంతో గ్రేటర్ మొత్తానికీ ‘సమగ్ర మాస్టర్‌ప్లాన్, సూక్ష్మస్థాయి వరదనీటి పారుదల నెట్వర్క్ ప్లాన్, మేజర్, మైనర్ వరద కాలువల ఆధునికీకరణకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)’ బాధ్యతను ఓయంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. దాని ప్రాథమిక అంచనా మేరకు గ్రేటర్లో వరదనీటి సమస్య పరిష్కారానికి సుమారు రూ.10వేల కోట్లుఅవసరమవుతాయి. ఈ నిధులతో బుల్కాపూర్, కూకట్పల్లి, ముర్కి, పికెట్, ఎర్రమంజిల్, బంజారాహిల్స్, ఎల్లారెడ్డిగూడ, పంజగుట్ట, యూసుఫ్‌గూడ, నాగమయ్యకుంట, కళాసీగూడ, ఇందిరాపార్కు నాలాలను ప్రక్షాళన చేసి ఆక్రమణలు నిరోధించాలి. ప్రభుత్వం తక్షణం చేయాల్సిన పనులివీ... ♦ మురుగునీటి కాల్వలు, నాలాల్లో పేరుకుపోయిన పూడికను తొలగించాలి. ♦ 1,200 కి.మీ మేర విస్తరించిన ప్రధాన నాలాలపై ఉన్న సుమారు 8వేల ఆక్రమణలను తొలగించాలి. బీపీఎల్, ఏపీఎల్ కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించాలి. ♦ నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి కావాలంటే టౌన్‌ప్లానింగ్ విభాగంతో పాటు మరో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ♦ నాలాల ఆధునికీకరణ ఆవశ్యకతను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. ఇందుకుగాను రాజకీయ పార్టీలు, ఎన్జీఓల సహకారం తీసుకోవాలి. ♦ వరదనీటి కాలువల్లో మురుగునీరు పారకుండా చూడాలి. మురుగునీటి పారుదలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలి. ♦ అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు, ప్రజలకు తగిన అవగాహనకు ప్రభుత్వం, రాజకీయపార్టీల సహకారం తప్పనిసరి. లేని పక్షంలో కార్యక్రమం ముందుకు కదలదు. ♦ స్టార్మ్ వాటర్ డ్రైనేజీ (వరదనీటి కాలువల) మాస్టర్‌ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకొని టౌన్‌ప్లానింగ్ విభాగం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను అనుమతించరాదు. ♦ ఆయా పనులు చేపట్టే వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం అవసరం. ♦ చెరువుల పునరుద్ధరణ జరగాలి. తద్వారా వర్షపునీరు చెరువుల్లోకి చేరి జలకళ సంతరించుకుంటాయి. ♦ నాలాల ఆధునికీకరణ పనులకు రూ.10 వేల కోట్లు ఖర్చు కాగలవని జీహెచ్ఎంసీ అధికారులు గతంలో ప్రతిపాదించినా నిధుల విడుదల విషయంలో సర్కారు నిర్లక్ష్యంతో నగరం నిండా మునుగుతోంది. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలి. అటకెక్కిన డ్రైనేజీ మాస్టర్‌ప్లాన్... గ్రేటర్ పరిధిలో సుమారు 5వేల కి.మీ పరిధిలో మురుగునీటి పారుదలకు సంబంధించిన పైపులైన్లు ఉన్నాయి. వీటిపై 1.85 లక్షల మ్యాన్‌హోళ్లు ఉన్నాయి. కానీ గ్రేటర్ జనాభా కోటికి చేరువ కావడంతో నివాస, వాణిజ్య, పారిశ్రామికవాడల నుంచి వెలువడుతున్న మురుగునీరు ప్రవహించేందుకు అవసరమైన పైపులైన్లు లేకపోవడంతో డ్రైనేజీ రహదారులు, కాలనీలను ముంచెత్తుతోంది. వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే సమస్య. గ్రేటర్లో విలీనమైన 12 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలోని సుమారు వెయ్యి కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో ఇళ్లలోని సెప్టిక్ ట్యాంకుల్లోనే మురుగు మగ్గుతోంది. మరికొన్ని చోట్ల కాలనీలు, బస్తీలను ముంచెత్తుతోంది. ఆయా కాలనీలు, బస్తీల్లో రూ.3,800 కోట్లతో రూపొందించిన డ్రైనేజీ మాస్టర్‌ప్లాన్ అమలుకు నోచుకోకపోవడంతో పరిస్థితి విషమిస్తోంది. -
వర్షాకాల మృతులు 1,276
న్యూఢిల్లీ: ఈ సంవత్సరం వర్షాకాలంలో ఇప్పటివరకు వరదలు, కొండచరియలు విరిగిపడటం తదితర వర్ష సంబంధిత కారణాల వల్ల 8 రాష్ట్రాల్లో 1,276 మంది మృత్యువాత పడ్డారని, వారిలో అత్యధికంగా 443 మంది కేరళలోనే చనిపోయారని సోమవారం కేంద్ర హోంశాఖ ప్రకటించింది. కేరళలో 54.11 లక్షల మంది వరద బాధితులుగా మారారని, 47,727 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని వెల్లడించింది. వరదల కారణంగా ఉత్తరప్రదేశ్‌లో 218, పశ్చిమబెంగాల్లో 198 మంది, కర్ణాటకలో 166, మహారాష్ట్రలో 139 మంది, గుజరాత్, అస్సాం, నాగాలాండ్‌ల్లో వరుసగా 52, 49, 11 మంది మరణించారని తెలిపింది. -
వానల్లో హాయ్ హాయ్
వేసవి వేడి పరారయ్యింది. చల్లటి గాలులు.. అవి మోసుకువచ్చే వాన చినుకులు హాయిగాఉన్నా చిత్తడి నేలలో సరైన ఔట్ఫిట్ లేకపోతేమాత్రం చిరాకుగా ఉంటుంది. మబ్బులతో చిరుచీకట్లు కమ్మేసే వానకాలం ఎలాంటి దుస్తులుధరించాలి అనేది పెద్ద సమస్యగా ఉంటుంది.వేసవి వార్డ్‌రోబ్‌ని క్లోజ్ చేసి వానకాలానికే ప్రత్యేక మైన దుస్తులు ఎంచుకోవాల్సిన సమయం ఇది. సింథటిక్ కప్రీస్ వీటిలో పొట్టి, పొడుగు కప్రీస్ ఉన్నాయి. వేసవిలో వాడిన కాటన్, డెనిమ్ కప్రీస్ను ఈ సీజన్లోనూ ధరించవచ్చు. అయితే ఇవి తడిస్తే ఆరాలంటే ఎక్కువ టైమ్ పడుతుంది. దీనికి బదులుగా సింథటిక్ కప్రీస్, పలాజో, నీ లెంగ్త్ ట్రౌజర్స్ ఈ కాలానికి అనువైనవి. వాటర్‌ప్రూఫ్ బ్యాగ్స్ ఏ కాలమైన వెంట హ్యాండ్ బ్యాగ్ ఉండాల్సిందే. అయితే, మిగతాకాలాలలో వాడినట్టు కాటన్, లెదర్ బ్యాగులు వాడితే లోపల ఉండే వస్తువులను తడవకుండా ఉంచలేం. పైగా బ్యాగ్ కూడా పాడైపోతుంది. ఈ సమస్య రాకుండా వాటర్‌ప్రూఫ్ బ్యాగ్స్, బ్యాగ్–ప్యాక్స్ సరైన ఎంపిక. మొబైల్ కవర్స్, వాలెట్ వంటివి వాటర్‌ప్రూఫ్‌వి ఎంచుకోవాలి. ఇవి కూడా మంచి బ్రైట్‌కలర్స్, ఫ్లోరల్ డిజైన్స్ అయితే కాలానుగుణంగా ఉంటాయి. నైలాన్ లేదా ప్లాస్టిక్ బ్యాగ్‌లు వాడితే ట్రెండ్‌లో ఉన్నారనే కితాబులే పొందుతారు. వస్తువులూ సురక్షితం, రెయిన్‌కోట్స్ ఈ సీజన్‌కి 3డి గ్రాఫిక్ ఎఫెక్ట్ ఉన్న రెయిన్ కోట్స్ లభిస్తున్నాయి. ఇవి ట్రాన్స్పరెంట్గా ఉండటం వల్ల మీరేం దుస్తులు ధరించారో బయటకు కనిపిస్తుంది. ప్లాస్టిక్ ట్రెంచ్ కోట్స్ కూడా మంచి ఎంపిక. ఇవి మీ ఫ్యాషన్ స్టేట్మెంట్ని దాచిపెట్టవు. బెలూన్ రెయిన్ కోట్స్, రెయిన్ పాంచోస్ కూడా నియాన్ షేడ్స్‌లో లభిస్తున్నాయి. రెయిన్ బూట్స్/ఫ్లిప్‌ఫ్లాప్స్ ఇవి ఎప్పటి నుంచో వాడుకలో ఉన్నవే. కానీ, రెయిన్ సీజన్‌కి ఎవర్గ్రీన్ కూడా ఇవే! ఎక్కువ కాలం మన్నుతాయి. బురద, నీటి నుంచి రక్షణగా ఉంటాయి. వీటి గురించి మరో ఆలోచన చేయకుండా ఈ సీజన్లో ధరించవచ్చు. అలాగే, జెల్లీ ఫ్లాట్స్, ఫంకీ ఫ్లిప్ ఫ్లాప్స్ ఈ కాలం మీ పాదాలు మెచ్చే స్నేహితులు. రంగు రంగుల మడతల గొడుగులు ఈ కాలం తప్పనిసరి అవసరంమున్న వస్తువు గొడుగు. అది అవసరం మాత్రమే కాదు, ఫ్యాషన్ యాక్ససరీ కూడా! గొడుగు అనగానే మనకు నల్లని రంగులో ఉండేదే కనిపిస్తుంది. కానీ, వీటిలో ఎన్నో మోడల్స్, కలర్స్, ప్రింట్లు అందుబాటులో ఉన్నాయి. ట్రాన్సపరెంట్, చూడముచ్చటైన ప్రింట్లు, ముదురు రంగులు, మూడు మడతలుగా ఉండే గొడుగులు ఈ సీజన్లో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఫంకీ యాక్ససరీస్ రంగు రంగుల ప్లాస్టిక్ బ్యాంగిల్స్, పూసల బ్రేస్లెట్లు, గొలుసులు డల్‌గా ఉండే వాతావరణాన్ని బ్రైట్‌గా మార్చేస్తాయి. మోడ్రన్ దుస్తుల మీదకు ఫంకీగా ఉండే ఈ అలంకరణ ఆభరణాలు మరింత అందాన్ని పెంచుతాయి. మెటల్ స్టికర్స్ నీళ్లలో తడిచినా ఇబ్బంది ఉండదు. వాటర్ మేకప్ నీళ్లలో పదే పదే తడిచే అవకాశం ఉండే ఈ కాలం మేకప్‌కి దూరంగా ఉండటం బెస్ట్. మేకప్ తప్పనిసరి అనుకుంటే మాత్రం వాటర్‌ఫ్రూఫ్ మేకప్ బ్రాండ్స్‌ని ఎంచుకోవాలి. ఫేస్‌వైప్స్ వేసవిలో చెమట అద్దడానికి వీటిని ఉపయోగించి ఉంటారు. ఈ కాలం ముఖం మీద పడిన నీటి తుంపరలను తొలగించడానికి వాడాలి. మేకప్‌లో ఉన్నప్పుడు వీటి అవసరం ఎక్కువ. మొబైల్ కవర్స్ నీటిలో తడిచినా పాడవకుండా ఫోన్‌కి కూడా రెయిన్ గేర్ అవసరం. అయితే, ఈ కవర్స్ కూడా ధరించిన డ్రెస్‌కు కాంబినేషన్ కవర్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. -
తవ్వకాల్లేవ్..
సాక్షి, సిటీబ్యూరో : రోడ్ల కటింగ్‌పై బల్దియా నిషేధం విధించింది. శనివారం నుంచే దీన్ని అమల్లోకి తెచ్చింది. ఈ సంవత్సరం కొత్తగా ఎవరికీ రోడ్ల కటింగ్‌కు అనుమతివ్వలేదు. కానీ, గతంలో టీఎస్ ట్రాన్స్‌కో, టీఎస్ఎస్పీడీసీఎల్, వాటర్బోర్డుతో పాటు కొన్ని టెలికాం సంస్థలకు ఆయా అవసరాల కోసం రోడ్ల కటింగ్‌కు అనుమతులిచ్చింది. అనుమతించిన సంస్థలు సైతం ఇకనుంచి తవ్వకాలు జరపరాదని జీహెచ్ఎంసీ ఆదేశించింది. అనుమతి పొందిన సంస్థలు మే 25వ తేదీలోగానే తమ పనులు పూర్తిచేసుకోవాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 26వ తేదీ(శనివారం) నుంచి నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది. వర్షాకాల సీజన్ ముగిసేంత వరకు అంటే అక్టోబర్ 15 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ (మెయింటనెన్స్) జియావుద్దీన్ తెలిపారు. రోడ్డు తవ్వకాలతో నరకమే.. నగరంలో ఎక్కడపడితే అక్కడ అడ్డగోలుగా తవ్విన రోడ్లతో ప్రజలు నరకం చూస్తున్నారు. అనేక ప్రాంతాల్లో తవ్విన గుంతల్లో పడి సిటీజనులు ప్రమాదాలకు గురవుతున్నారు. వేసవిలోనే పరిస్థితి ప్రమాదకరంగా ఉండగా.. ఇక వర్షాలొస్తే చెరువులను తలపించే రోడ్లపై కోతలంటే మరిన్ని తీవ్రమైన ప్రమాదాలు జరిగే అవకాశముంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బల్దియా ఈ సంవత్సరం కొత్తగా ఎవరికీ రోడ్ల కటింగ్‌లకు అనుమతివ్వలేదు. గతంలో అనుమతించిన సంస్థలు సైతం తమ పనులు పూర్తి చేసుకునే గడువు కూడా ముగిసింది. నిషేధాన్ని ఉల్లంఘించిన సంస్థలపై తగిన చర్యలు తీసుకుంటామని జియావుద్దీన్ హెచ్చరించారు. త్వరగా పూడ్చివేయాలి.. ఇప్పటికే రోడ్లను తవ్విన సంస్థలు ఈనెల 31వ తేదీలోగా వాటిని పూడ్చివేయాలని గ్రేటర్ అధికారులు ఆదేశించారు. ఏదైనా అత్యవసరం దృష్ట్యా రోడ్డు తవ్వాల్సి వస్తే అందుకు ప్రభుత్వం నుంచి, జీహెచ్ఎంసీ కమిషనర్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలన్నారు. అలా ప్రత్యేక అనుమతి పొందిన ఏజెన్సీ ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వాటిని కచ్చితంగా పాటించాలని జియావుద్దీన్ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే సంబంధిత ప్రాంతాల్లోని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిషేధం అమలయ్యేలా సూపరింటెండింగ్ ఇంజినీర్లు పర్యవేక్షించాలన్నారు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న రోడ్డ కటింగ్ల పనుల్ని కూడా వెంటనే నిలిపివేసి పూడ్చివేత పనులు చేపట్టాలని, వాటినీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సంవత్సరం అనుమతుల్లేవ్.. గతంలో అనుమతులిచ్చిన పనులే పూర్తి కాకపోవడంతో ఈ సంవత్సరం కొత్తగా ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని చీఫ్ ఇంజినీర్ తెలిపారు. దాదాపు 1900 కి.మీ. మేర రోడ్ల తవ్వకాల కోసం విజ్ఞాపనలు రాగా అన్నింటినీ తిరస్కరించినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక అనుమతులతో వివిధ ప్రభుత్వ సంస్థలకు ఇప్పటికే దాదాపు 40 కి.మీ. అనుమతులిచ్చామని, పనులు పూర్తికాకున్నా వారు సైతం నిషేధం పరిధిలోకే వస్తారని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. -
జూలై 21 నుంచి పార్లమెంటు
ఆగస్టు 13 వరకు జరగనున్న వర్షాకాల సమావేశాలు పార్లమెంటును కుదిపేయనున్న లలిత్‌మోదీ వివాదం, భూసేకరణ బిల్లు న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జూలై 21న ప్రారంభమై ఆగస్టు 13 వరకు సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) బుధవారం సమావేశమై ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, ఇతర సీనియర్ మంత్రులు సభ్యులుగా ఉన్నారు. దాదాపు నాలుగు వారాలపాటు సాగనున్న ఈ సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశముంది. కొద్దిరోజులుగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసిన లలిత్ మోదీ వివాదం ఈసారి పార్లమెంటును కుదిపేయనుంది. ఇద్దరు బీజేపీ సీనియర్ నేతల పాత్ర ఉన్న ఈ అంశంపై కాంగ్రెస్ నుంచి ముప్పేట దాడి తప్పదని సర్కారు భావిస్తోంది. ఈ వివాదంపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేలు రాజీనామా చేయకపోతే సభను సజావుగా సాగనీయబోమని కాంగ్రెస్ ఇప్పటికే హెచ్చరించింది. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఇబ్బందులు తప్పవని పేర్కొంది. అయితే ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ డిమాండ్‌ను తోసిపుచ్చింది. మరోవైపు, భూసేకరణ బిల్లు కూడా పార్లమెంటులో ప్రకంపనలు సృష్టించనుంది. ఈ బిల్లును ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీకి ప్రతిపాదించారు. తొలుత వర్షాకాల సమావేశాలను జూలై 20న ప్రారంభించాలని ప్రతిపాదించినప్పటికీ 18 లేదా 19 తేదీల్లో రంజాన్ పర్వదినం రానున్నందున సమావేశాలను 21వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. వర్షాకాల సమావేశాలు సాధారణంగా నాలుగువారాలు జరుగుతాయి. లోక్‌పాల్, లోకాయుక్త చట్టానికి సవరణలు, రైల్వే (సవరణ) బిల్లు, జలమార్గాల బిల్లు, జీఎస్టీ బిల్లు, భూసేకరణ బిల్లు, అటవీకరణ పరిహార నిధి బిల్లు, బినామీ లావాదేవీల (నిషేధ) సవరణ బిల్లు-2015 తదితర కీలక బిల్లులు పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశముంది. గత బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభ 35సార్లు, రాజ్యసభ 32 సార్లు సిట్టింగ్‌లు జరిపాయి. గత ఐదేళ్లలో బడ్జెట్ భేటీ ఇదే అత్యధికం.