raja mani
-
చర్చ లేదు.. తీర్మానం లేదు..
సాక్షి, సంగారెడ్డి: చర్చ లేదు.. తీర్మానం లేదు..ఏదో జరపాలంటే జరపాలన్నట్టు జెడ్పీ స్థాయి సంఘం సమావేశాలు నిర్వహించేశారు. సుదీర్ఘవిరామం అనంతరం నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఈ సమావేశాలకు జిల్లాస్థాయి అధికారులు డుమ్మాకొట్టి సిబ్బందిని పంపడంతో సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు కరువయ్యారు. మొక్కుబడిగా సాగిన ఈ సమావేశాల్లో సభ్యులు ముఖ్యమైన సమస్యలేవీ ప్రస్తావించలేదు. జెడ్పీ చైర్పర్సన్ రాజమణి అధ్యక్షతన గ్రామీణాభివృద్ధి, వైస్‌చైర్మన్ సారయ్య అధ్యక్షత వ్యవసాయం, జి. సుమన అధ్యక్షతన స్త్రీ శిశు సంక్షేమం స్థాయీ సంఘ సమావేశాలు జరిగాయి. మూడు స్థాయీ సంఘ సమావేశాల్లో శాఖల వారీగా సమగ్ర చర్చలు జరగలేదు. ప్రజలు, రైతులు ఇతర వర్గాలు వారు ఎదుర్కొంటున్న కరెంటు కరువు, సామాజిక పింఛన్లు, ఆహారభద్రత కార్డుల జారీ తదితర సమస్యలను లేవనెత్తి వాటిపై లోతుగా చర్చించలేకపోయారు. సమావేశంలో ఎలాంటి తీర్మానాలు సైతం చేయలేదు. కరువు ప్రకటనే లేదు వర్షాభావం, కరెంటు కోతల కారణంగా పంట నష్టాన్ని చవిచూస్తున్న రైతులు, మెతుకు సీమను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నారు. గత జెడ్పీ సర్వసభ్య సమావేశంలోనూ కరువు ప్రకటనపై పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. అయితే మంగళవారం జరిగిన వ్యవసాయ స్థాయీ సంఘం సమావేశంలో సభ్యులు రైతులు సమస్యలను పెద్దగా ప్రస్తావించలేదు. కరువు ప్రకటనపై కనీసం మాట్లాడలేదు. కొల్చారం జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి మాత్రం రైతులకు సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలనీ, రబీలో విత్తనాలు సకాలంలో పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రైతులకు రుణాలు ఇవ్వటం లేదని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వైస్ చైర్మన్ సారయ్య స్పందిస్తూ, ప్రభుత్వంపై విమర్శలు చేయవద్దని, రైతులకు అన్ని చేస్తున్నామని తెలిపారు. దీంతో అసహనానికి గురైన జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి తాను రైతుల సమస్యలు లేవనెత్తానని, వాటిని సద్విమర్శలుగా తీసుకోవాలని హితవు పలికారు. ఇదిలావుంటే స్థాయీ సంఘ సమావేశాలకు జిల్లాస్థాయి అధికారులు పలువురు గైర్హాజరయ్యారు. డీఆర్డీఏ పీడీ, హౌసింగ్ పీడీ, డీఐసీ జీఎం, డీసీఓ, మార్కెటింగ్ ఏడీ ఇలా పలువురు అధికారులకు సమావేశానికి డుమ్మా కొట్టారు. ఆయా శాఖల అధికారులు తమ శాఖల కింది స్థాయి అధికారులను స్థాయీ సంఘ సమావేశాలకు పంపారు. దీంతో వారు సభ్యులు లేవనెత్తిన సందేహాలకు సమాధానాలు ఇవ్వలేకపోయారు. స్త్రీ శిశు సంక్షేమశాఖ సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు ఎవరూ రాలేదు. దీంతో సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం స్పందిస్తూ, స్థాయీ సంఘ సమావేశాలకు ఇకపై జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోండి పటాన్చెరు పారిశ్రామిక వాడలో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని జెడ్పీటీసీ రాములుగౌడ్ కోరారు. జెడ్పీ చైర్పర్సన్ రాజమణి అధ్యక్షతన జరిగిన గ్రామీణాభివృద్ది స్థాయీ సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పటాన్చెరు ప్రాంతంలో పరిశ్రమల కారణంగా జల, వాయు కాలుష్యం అధికమవుతోందని, కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే తాగునీటి పథకాల నిర్వహణకు తమ వాటా కింద విడుదల చేయాల్సిన నిధులు అందేలా చూడాలన్నారు. సమావేశానికి కాలుష్యనియంత్రణ మండలి అధికారులు హాజరు కాకపోవడంతో జెడ్పీసీఈఓ ఆశీర్వాదం మాట్లాడుతూ, జెడ్పీ, సమావేశాలకు కాలుష్యనియంత్రణ మండలి అధికారులు విధిగా హాజరు కావాలని సూచించారు. సమావేశంలో పాల్గొన్న డ్వామా పీడీ, డీపీఓ ఇతర అధికారులు తమశాఖల్లో అమలవుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. విత్తనాలు సరఫరా చేయండి రబీలో రైతులకు అవసరమైన విత్తనాలను సకాలంలో సరఫరా చేయాలని జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి కోరారు. జెడ్పీ వైస్‌చైర్మన్ సారయ్య అధ్యక్షతన జరిగిన వ్యవసాయ స్థాయీ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విత్తనాలతో పాటు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, రుణాలు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలని తాను పలుమార్లు కోరినా అధికారులు స్పందించటం లేదన్నారు. జేడీఏ హుక్యా నాయక్ స్పందిస్తూ, రైతులకు అవసరమైన విత్తనాలు, యూరియా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అనంతరం డీఎఫ్ఓ సోనిబాలదేవి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లాలో 3.50 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. మొక్కల పెంపకానికి 453 నర్సరీలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. మూడేళ్లలో ప్రతి గ్రామంలో లక్ష మొక్కలు నాటనున్నట్లు వివరించారు. స్త్రీ శిశు సంక్షేమం స్థాయీ సంఘం సమావేశంలో సభ్యులు ముక్తార్, సంగమేశ్వర్ మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణం పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
హత్నూర: రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ పధకాన్ని పకడ్బందీగా అమలు చేస్తోందని, ఈ విషయంలో రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు రాజమణి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రమైన హత్నూర సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ సర్టిఫికెట్లను లబ్ధిదారులకు పంపిణీ చశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణమాఫీ కింద మొదటి విడతగా రూ.4వేల కోట్లను మంజూరు చేశారన్నారు. రుణమాఫీ పొందిన రైతులకు 25శాతం రుణాన్ని తిరిగి ఇస్తారన్నారు. రాష్ట్రం మొత్తంలో రూ.18వేల కోట్లను నాలుగు విడతలుగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయంపై ఉన్న మక్కువతో రైతు రుణమాఫీతో పాటు రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలున్నప్పటికీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఆంధ్రలో ఉండడం వల్ల ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ సమస్య ఏర్పడిందన్నారు. మంజీరా నదిపై చెక్‌డ్యాంలు ఏర్పాటు చేసి ఎత్తిపోతల ద్వారా చెరువులను నింపి పంటలకు నీరందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా వారు రైతు రుణమాఫీ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పల్లె జయశ్రీ శ్రావణ్‌కుమార్, సొసైటీ చైర్మన్లు దుర్గారెడ్డి, లింగారెడ్డి, బ్యాంకు మేనేజర్ రమేష్, నాయకులు మురళిధర్‌యాదవ్, జనార్దన్‌రెడ్డి, శివశంకర్‌రావు, దేవేందర్‌రావు, దుర్గంగౌడ్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రక్తమోడిన రోడ్లు
=జిల్లాలో ఐదుగురి మృతి =నుజ్జునుజ్జైన వాహనాలు =అతివేగం, నిర్లక్ష్యమే కారణం =విషాదంలో బాధిత కుటుంబాలు కుప్పం, శ్రీకాళహస్తిరూరల్, కల్లూరు, కలికిరి, న్యూస్‌లైన్ : కుప్పం నుంచి తమిళనాడులోని క్రిష్ణగిరి బీఎస్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరింది. వూర్గవుధ్యంలోని నడువుూరు సమీపంలో ఘాట్ వద్ద అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. ఈ ప్రవూదంలో తమిళనాడులోని కాళియువ్ము కోయిల్ గ్రావూనికి చెందిన అయ్యుప్ప వూల ధరించిన వుునిరాజ్(40) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రయాణికులు 30 మంది గాయపడ్డారు. వీరిలో 17 వుంది కుప్పం వంద పడకల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వురో 13 వుందిని క్రిష్ణగిరి ఆస్పత్రికి తరలించారు. గాయుపడిన వారిలో శాంత(50), రావుూ్మర్తి(73), వలర్మది(53), నీలవ్ము(55), శావుల (17), లక్ష్మి (40), సేతు(35), వలర్మది(50), శ్రీనివాసులు(30), సురేష్(33), జయులక్ష్మి(67), సుబ్రవుణ్యం ఆచారి(44), వుుద్దుక్రిష్ణ(23), రాజవుణి(44), అన్నపూర్ణి(45), రాజవ్ము(45), చంద్ర(40) వంద పడకల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆధారంగా ఉన్న మునిరాజ్ చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కలికిరిలో.. కలికిరి శివారు ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వైఎస్ఆర్ జిల్లా చిన్నమండ్యం మండలం కొత్తపల్లె పంచాయతీ రోడ్డుకాడ కురవపల్లెకు చెందిన ఎ.శ్రీనివాసులు(32) కొంతకాలంగా తిరుపతిలో కాపురం ఉంటున్నారు. అలాగే మదనపల్లె రూరల్ మండలం సీటీఎం మిట్టపల్లెకు చెందిన కరుణాకర్(40), మధుబాబు తిరుపతిలోనే ఆటో తోలుకుంటూ జీవిస్తున్నారు. వీరు తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న అవ్వ సీతమ్మను స్వగ్రామానికి తరలించేందుకు శ్రీనివాసులుకు చెందిన కారును గురువారం రాత్రి మాట్లాడుకున్నారు. రాత్రికిరాత్రే సీతమ్మను స్వగ్రామానికి తీసుకెళ్లారు. అనంతరం తిరుపతికి తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు కలికిరి మండలం బోయపల్లె సబ్స్టాప్ సమీపంలో కారు ముందుటైర్ పంక్చర్ అయింది. దీంతో కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును ఢీకొంది. కారు నడుపుతున్న శ్రీనివాసులు, ముందువైపు కూర్చున్న కరుణాకర్ సంఘటన స్థలంలోనే మృత్యువాత పడ్డారు. వెనుకవైపు కూర్చున్న మధుబాబు తీవ్రంగా గాయపడ్డారు. ఇతన్ని మదనపల్లెకు తరలించారు. సంఘటన స్థలాన్ని ఇన్చార్జ్ సీఐ బి.పార్థసారథి, ఎస్ఐ సోమశేఖర్‌రెడ్డి పరిశీలించారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదిలావుండగా ప్రమాదం జరిగి మూడుగంటలైనా మృతదేహాలను వాహనం నుంచి బయటకు తీయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు సీఐ ప్రత్యేక చొరవతో మృతదేహాలను బయటికి తీశారు. శ్రీకాళహస్తిలో.. తమిళనాడులోని తిరువణ్ణామలైకు చెందిన అబ్దుల్లా, రషీద్, అమీర్ టవేరా కారులో తిరువులకు వెళ్లారు. అక్కడ దర్శనానంతరం శ్రీకాళహస్తికి శుక్రవారం బయులుదేరారు. చెన్నై నుంచి మాక్సీక్యాబ్ వ్యానులో అరుణ్కువూర్, మైథిలి, పావని, గాంధీవుధు, ఊహ, కవిత, వెంకటేశ్, సునీత, అనీల్, ఇంద్రాణి తిరుమలకు బయలుదేరారు. ఈ రెండు వాహనాలు శ్రీకాళహస్తి వుండలంలోని చెర్లోపల్లె సమీపంలో ఢీకొన్నాయి. ఈ ప్రవూదంలో టవేరా కారు నుజ్జునుజ్జు అయింది. కారు డ్రైవర్ కార్తీక్(32), అబ్దుల్లా, రషీద్, అమీర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కార్తీక్ మృతి చెందాడు. మైథిలి, గాంధీవుధు, ఇంద్రాణిలకు తీవ్రంగా గాయపడ్డారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ సంజీవ్కువూర్ తెలిపారు. పులిచెర్లలో.. పులిచెర్ల మండలం వడ్లపల్లె సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్ఆర్సీపీ నేత కొల్లే ప్రభాకర్(51) దుర్మరణం చెందాడు. కల్లూరు ఎస్ఐ వెంకటేష్ కథనం మేరకు.. పులిచెర్ల మండలం కమ్మపల్లె పంచాయతీ కురవపల్లెకు చెందిన వైఎస్ఆర్సీపీ నేత కొల్లే ప్రభాకర్ తన గ్రామానికి చెందిన వీరభద్రయ్యతో కలిసి గురువారం సాయంత్రం మదనపల్లెలో ఓ వివాహానికి హాజరయ్యారు. వీరిద్దరూ శుక్రవారం ఉదయం మదనపల్లె నుంచి పీలేరుకు బస్సులో చేరుకున్నారు. అనంతరం ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి బయలుదేరారు. పీలేరు-పులిచెర్ల మార్గమధ్యంలోని వడ్లపల్లె సమీపంలో ఓ మలుపు వద్ద ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో ప్రభాకర్, వీరభద్రయ్య ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ ప్రమాదంలో కొల్లే ప్రభాకర్ తలకు తీవ్ర గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ వీరభద్రయ్యను ప్రయాణికులు పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని కల్లూరు ఎస్ఐ వెంకటేష్ పరిశీలించారు. బస్సు డ్రైవర్ సెల్వరాజ్ కల్లూరు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. కొల్లే ప్రభాకర్ మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో కురవపల్లెకు చేరకున్నారు.