హత్నూర: రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ పధకాన్ని పకడ్బందీగా అమలు చేస్తోందని, ఈ విషయంలో రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు రాజమణి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రమైన హత్నూర సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ సర్టిఫికెట్లను లబ్ధిదారులకు పంపిణీ చశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణమాఫీ కింద మొదటి విడతగా రూ.4వేల కోట్లను మంజూరు చేశారన్నారు. రుణమాఫీ పొందిన రైతులకు 25శాతం రుణాన్ని తిరిగి ఇస్తారన్నారు. రాష్ట్రం మొత్తంలో రూ.18వేల కోట్లను నాలుగు విడతలుగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయంపై ఉన్న మక్కువతో రైతు రుణమాఫీతో పాటు రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలున్నప్పటికీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఆంధ్రలో ఉండడం వల్ల ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ సమస్య ఏర్పడిందన్నారు.
మంజీరా నదిపై చెక్‌డ్యాంలు ఏర్పాటు చేసి ఎత్తిపోతల ద్వారా చెరువులను నింపి పంటలకు నీరందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా వారు రైతు రుణమాఫీ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పల్లె జయశ్రీ శ్రావణ్‌కుమార్, సొసైటీ చైర్మన్లు దుర్గారెడ్డి, లింగారెడ్డి, బ్యాంకు మేనేజర్ రమేష్, నాయకులు మురళిధర్‌యాదవ్, జనార్దన్‌రెడ్డి, శివశంకర్‌రావు, దేవేందర్‌రావు, దుర్గంగౌడ్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
Published Tue, Oct 14 2014 10:58 PM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM
Advertisement
Advertisement