raja ravichandra varma
-
నిషిత్ కేసు:బెంజ్ ప్రతినిధుల వితండ వాదన
హైదరాబాద్: బెంజ్ కంపెనీ ప్రతినిధుల వితండ వాదనపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత నెల 10వ తేదీన తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లో బెంజ్‌కారు నడుపుతూ మితిమీరిన వేగంతో వెళ్లి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కేడ మృతి చెందిన ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ ఘటనలో బెంజ్ కంపెనీ ఇంత వరకు నివేదిక ఇవ్వలేదు. అయితే దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారం క్రితం బెంజ్ ప్రతినిధులకు రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా మెయిల్ పంపారు. ఇందుకు స్పందించిన పూణేలోని బెంజ్ కంపెనీ ప్రధాన కార్యాలయం జూబ్లీహిల్స్ పోలీసులకు తిరుగు సమాధానం ఇస్తూ నిశిత్ నారాయణ పోస్టుమార్టం నివేదికలతో పాటు అక్కడి సీసీ పుటేజీలు, పిల్లర్ వద్ద నుంచి కారును తొలగించినప్పుడు ఏమైనా వీడియో తీశారా? తదితర వివరాలు ఇస్తేనే తాము నివేదిక ఇస్తామంటూ వెల్లడించారు. నిషిత్ నారాయణ కారు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులు బెంజ్ కంపెనీకి లేఖ రాస్తూ సీటు బెల్టు పెట్టుకుంటేనే బెలూన్లు ఓపెన్ అవుతాయా, పెట్టుకోకున్నా ఓపెన్ అవుతాయా అన్న వివరాలతో పాటు ఎంత స్పీడ్‌లో వెళ్తే మృతి చెందే అవకాశాలున్నాయో చెప్పాలంటూ కోరగా గత నెల 16వ తేదీన బెంజ్ ప్రతినిధులు ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. కారును కూడా పరిశీలించారు. అయితే ఇప్పటివరకూ నివేదిక మాత్రం ఇవ్వలేదు. కాగా ఈ రోడ్డు ప్రమాదంలో నిషిత్‌తో పాటు అతడి స్నేహితుడు రాజా రవిచంద్ర వర్మ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. -
నిషిత్ డ్రైవ్ చేసిన కారు వివరాలు ఇవిగో..
హైదరాబాద్: మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ అతడి స్నేహితుడు రాజా రవివర్మ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. బెంజ్‌కారులో వెళుతున్న వీరు వేగంగా వెళ్లి పిల్లర్‌ను ఢీకొట్టడం వల్లే బలమైన గాయాలయ్యి చనిపోయారు. అయితే ప్రమాదానికి గురైన ఆ కారు వివరాలు ఒకసారి పరిశీలిస్తే అది మెర్సిడెస్ ఏఎంజీ జీ63 మోడల్‌కు చెందిన బెంజ్ కారు. కేవలం 5.4సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ప్రత్యేకత ఈ మెర్సిడెస్ కారు ప్రత్యేకత. మెర్సిడెస్ ఏఎంజీ జీ63 కారు హార్స్పవర్ 571గా ఉండి ఇంజిన్ ఎనర్జీ 420 కిలోవాట్స్‌గా ఉంటుంది. మార్కెట్లో ఈ కారు ధర దాదాపు రెండున్నర కోట్లు. మోస్ట్పవర్ఫుల్, టఫెస్ట్ సేఫెస్ట్ ఎస్యూవీ కారు ఇది. 5.5లీటర్ సూపర్ ఛార్జ్డ్ పవర్ఫుల్ ఇంజిన్ ఈ కారు సొంతం. దీని గరిష్ట వేగం గంటకు 230 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో ఎనిమిది సిలిండర్లు ఉండి ,6400 ఆర్పీఎంను కలిగి ఉంటుంది. కారు పొడవు 4.6 మీటర్లు, ఎత్తు 1.9 మీటర్లు, బరువు 3200 కిలోలు. యూరో 6 ప్రమాణాలకు అనుగుణంగా ఈ కారును జర్మనీలో తయారు చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కార్లలో మెర్సిడెస్ ఏఎంజీ జీ63ని భావిస్తారు. ఈబీడీ బ్రేకింగ్ సిస్టమ్తోపాటు వరల్డ్ బెస్ట్ సేఫ్టి మెజర్స్ ఈ కారుకు ఉంటాయి. -
మితిమీరిన అతివేగమే నిషిత్ ప్రాణాలు తీసింది
-
మృత్యువులోనూ వీడని బంధం
హైదరాబాద్ : మృత్యువులోనూ వారి స్నేహబంధం వీడలేదు. చిన్నప్పటి నుంచి ప్రాణంగా ఉండే మంత్రి నారాయణ కుమారుడు నిషిత్, రాజా రవివర్మ.. రోడ్డు ప్రమాదంలో ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు. రవివర్మ స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరు. వ్యాపారవేత్త కామని బాల మురళీకృష్ణ కుమారుడే రాజ రవివర్మ. నిషిత్, రవివర్మ క్లాస్మేట్స్. అదికాస్తా ప్రాణ స్నేహంగా మారింది. మరోవైపు రాజా రవివర్మ కుటుంబం కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుమారుడి మరణవార్త విన్న ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. విగతజీవిగా మారిన రవివర్మ మృతదేహాన్ని చూసి కుటుంబీకులు భోరున విలపించారు. కాగా ఈరోజు తెల్లవారుజామున నిషిత్, రవివర్మ ప్రయాణిస్తున్న కారు మెట్రో ఫిల్లర్‌ను బలంగా ఢీకొనటంతో వారిద్దరూ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. -
శత్రువుకు కూడా ఈ కష్టం రాకూడదు: చిరంజీవి
హైదరాబాద్ : మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మృతి పట్ల ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సంతాపం తెలిపారు. ఆ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ శత్రువులకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారు. మంత్రి నారాయణ ఎదిగివచ్చిన కొడుకును పోగొట్టుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ విషాదం నుంచి మంత్రి నారాయణ త్వరగా కోలుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు. కాగా అంతకు ముందు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా నారాయణ కుటుంబసభ్యుల్ని ఓదార్చారు. అపోలో ఆస్పత్రికి వెళ్లిన ఆయన ఘటనకు సంబంధించిన వివరాలను కుటుంబసభ్యుల్ని అడిగి తెలుసుకున్నారు. నిషిత్ మృతిపట్ల కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. అలాగే తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కేంద్రమంత్రి సుజనా చౌదరి, చినరాజప్ప, బోండా ఉమా, టీఆర్ఎస్ ఎంపీ డీ శ్రీనివాస్, హరీశ్‌రావు, పొన్నాల లక్ష్మయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు కూడా మంత్రి కుటుంబాన్ని పరామర్శించారు. -
మితిమీరిన అతివేగమే నిషిత్ ప్రాణాలు తీసింది
చిన్ని నిర్లక్ష్యమే నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేస్తున్నాయి. కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకునే విషయంలో చూపుతున్న అశ్రద్ధ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ విషయంలోనూ అదే జరిగింది. కారులో ప్రయాణిస్తున్నప్పుడు అతడు సీట్ బెల్ట్ ధరించలేదని తెలుస్తోంది. కేవలం కిలోమీటర్ దూరంలో ఉన్న ఇంటికి చేరుకునే లోపే మృత్యువు కబళించింది. ఖరీదైన కారులో అత్యంత ఉత్తమమైన భద్రతా ప్రామాణికాలు. ప్రమాద సమయంలో ట్రాఫిక్ కూడా లేదు, ఎంతోకాలంగా కారు నడిపిన అనుభవంతో పాటు పక్కన మిత్రుడు... ఎన్ని ఉన్నా లాభం లేకపోయింది. ప్రాణాన్ని కాపాడలేనంత వేగం, సీట్ బెల్టు పెట్టుకోలేని కారణంగా నిషిత్ కూడా సెలబ్రిటీ దుర్మరణాల జాబితాలో చేరిపోయాడు. పోస్ట్‌మార్టం నివేదికలో కూడా అదే వెల్లడి అయింది. బుధవారం తెల్లవారుజాము రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిషిత్, రవివర్మ మృతదేహాలకు పోస్ట్‌మార్టం అనంతరం... మితిమీరిన అతివేగం వల్లే మృతి చెందినట్లు ఫోరెన్సిక్ వైద్యులు వెల్లడించారు. అయితే వారు మద్యం తాగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని వైద్యులు తెలిపారు. రవివర్మ కన్నా...నిషిత్‌కే ఎక్కువగా గాయాలు అయ్యాయని, అతడి పక్కటెముకల విరిగాయని తెలిపారు. కారు బలంగా మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో స్టీరింగ్ నిషిత్ ఛాతి భాగంలోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే వారు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా పోస్ట్‌మార్టం అనంతరం అపోలో మెడికల్ కళాశాల నుంచి నిషిత్ మృతదేహాన్ని నెల్లూరు తరలించారు. -
నిషిత్ వెలికితీతకు 2గంటల సమయం!
-
నిషిత్ వెలికితీతకు 2గంటల సమయం!
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి నారాయణ కుమారుడి నిషిత్ మృతికి అతివేగమే కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. నిషిత్ తన స్నేహితుడు రాజా రవిచంద్ర వర్మతో కలిసి గతరాత్రి బెంజ్ కారులో రైడ్‌కు వెళ్లాడు. అయితే హైదరాబాద్‌లో గతరాత్రి ఈదురు గాలులతో భారీవర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దాంతో వారిద్దరూ వర్షం తెరిపి ఇచ్చేవరకూ కొద్దిసేపు ఓ స్నేహితుడి ఇంట్లో వేచి ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం స్నేహితులు ఇద్దరూ కారులో బయల్దేరారని, అయితే జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టినట్లు సమాచారం. తెల్లవారుజామున రెండు, రెండున్నర సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో అక్కడ ఉన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అతివేగంగా పిల్లర్‌ను ఢీకొనడంతో కారు ముందుభాగం మధ్యలోకి వచ్చేయడంతో పాటు బెలూన్స్ కూడా పగిలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. దాంతో వారిద్దరూ చిక్కకుపోవడంతో ఛాతీ, పొట్ట భాగంగా చిధ్రమైనట్లు తెలిపారు. వారిని కారులో నుంచి బయటకు తీయడానికి సుమారు రెండు గంటల సమయం పట్టినట్లు చెబుతున్నారు. అలాగే ప్రమాద సమయంలో వీరిద్దరూ సీటు బెల్టు పెట్టుకోలేదని కూడా చెబుతున్నారు. దుర్ఘటన జరిగిన గంట తర్వాత పోలీసులు అక్కడకు చేరుకున్నట్లు తెలిపారు. నిషిత్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా, అతని స్నేహితుడు రాజా రవిచంద్ర వర్మలో కొద్దిగా కదలికలు కనిపించాయని, దీంతో 108కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. వారిద్దర్ని అపోలో ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అనంతరం ఉస్మానియా వైద్యులు మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు అప్పగించారు.