నిషిత్ డ్రైవ్ చేసిన కారు వివరాలు ఇవిగో..
హైదరాబాద్: మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ అతడి స్నేహితుడు రాజా రవివర్మ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. బెంజ్‌కారులో వెళుతున్న వీరు వేగంగా వెళ్లి పిల్లర్‌ను ఢీకొట్టడం వల్లే బలమైన గాయాలయ్యి చనిపోయారు. అయితే ప్రమాదానికి గురైన ఆ కారు వివరాలు ఒకసారి పరిశీలిస్తే అది మెర్సిడెస్ ఏఎంజీ జీ63 మోడల్‌కు చెందిన బెంజ్ కారు. కేవలం 5.4సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ప్రత్యేకత ఈ మెర్సిడెస్ కారు ప్రత్యేకత. మెర్సిడెస్ ఏఎంజీ జీ63 కారు హార్స్‌పవర్ 571గా ఉండి ఇంజిన్ ఎనర్జీ 420 కిలోవాట్స్‌గా ఉంటుంది.
మార్కెట్లో ఈ కారు ధర దాదాపు రెండున్నర కోట్లు. మోస్ట్‌పవర్‌ఫుల్, టఫెస్ట్ సేఫెస్ట్ ఎస్‌యూవీ కారు ఇది. 5.5లీటర్ సూపర్ ఛార్జ్‌డ్ పవర్‌ఫుల్ ఇంజిన్ ఈ కారు సొంతం. దీని గరిష్ట వేగం గంటకు 230 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో ఎనిమిది సిలిండర్లు ఉండి ,6400 ఆర్పీఎంను కలిగి ఉంటుంది. కారు పొడవు 4.6 మీటర్లు, ఎత్తు 1.9 మీటర్లు, బరువు 3200 కిలోలు. యూరో 6 ప్రమాణాలకు అనుగుణంగా ఈ కారును జర్మనీలో తయారు చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కార్లలో మెర్సిడెస్ ఏఎంజీ జీ63ని భావిస్తారు. ఈబీడీ బ్రేకింగ్ సిస్టమ్‌తోపాటు వరల్డ్ బెస్ట్ సేఫ్టి మెజర్స్ ఈ కారుకు ఉంటాయి.