మృత్యువులోనూ వీడని బంధం | car crash leaves two close friends dead in hyderabad | Sakshi
Sakshi News home page

మరణంలోనూ వీడని బంధం

May 10 2017 12:10 PM | Updated on Mar 23 2019 9:03 PM

మృత్యువులోనూ వీడని బంధం - Sakshi

మృత్యువులోనూ వీడని బంధం

మృత్యువులోనూ వారి స్నేహబంధం వీడలేదు. చిన్నప్పటి నుంచి ప్రాణంగా ఉండే మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌, రాజా రవివర్మ.. రోడ్డు ప్రమాదంలో ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు.

హైదరాబాద్‌ :  మృత్యువులోనూ వారి స్నేహబంధం వీడలేదు. చిన్నప్పటి నుంచి ప్రాణంగా ఉండే మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌, రాజా రవివర్మ.. రోడ్డు ప్రమాదంలో ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు. రవివర్మ స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరు. వ్యాపారవేత్త కామని బాల మురళీకృష్ణ కుమారుడే రాజ రవివర్మ.

నిషిత్‌, రవివర్మ క్లాస్‌మేట్స్‌. అదికాస్తా ప్రాణ స్నేహంగా మారింది. మరోవైపు రాజా రవివర్మ కుటుంబం కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుమారుడి మరణవార్త విన్న ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. విగతజీవిగా మారిన రవివర్మ మృతదేహాన్ని చూసి కుటుంబీకులు భోరున విలపించారు. కాగా ఈరోజు తెల్లవారుజామున నిషిత్‌, రవివర్మ ప్రయాణిస్తున్న కారు మెట్రో ఫిల్లర్‌ను బలంగా ఢీకొనటంతో వారిద్దరూ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement