rajam pet
-
‘బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు’
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్సీపీలో ఎలాంటి గ్రూపులు లేవని రాజంపేట మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. రాజంపేటలో కొంతమంది బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక్కడి ప్రజలు రౌడీయిజం, ఫ్యాక్షనిజాన్ని ఒప్పుకోరని, మంచిని ప్రోత్సహిస్తారని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డితో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మేడా వెల్లడించారు. టీడీపీ నేతలకు రాజంపేటలో నేతలు లేక బయటి నుంచి దిగుమతి చేసుకుంటున్నారని పేర్కొన్నారు. -
సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ తో ప్రయాణికుల ఇక్కట్లు
కడప కార్పొరేషన్ (వైఎస్సార్ జిల్లా) : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం జిల్లా పర్యటనకు రానున్న నేపధ్యంలో పోలీసులు రాజంపేట రోడ్డులో ఆదివారం సాయంత్రం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. దీని కోసం 40 నిముషాలపాటు ట్రాఫిక్‌ను ఆపేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. మండుతున్న ఎండలో వాహనాలు కదలకపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధుల బాధ వర్ణింపనలవి కాదు. పోలీసుల వైఖరితో ఆగ్రహించిన ప్రయాణికులు వాదనకు దిగారు. -
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ముట్టడి
రాజంపేట: సబ్‌రిజిస్ట్రార్ అవినీతికి పాల్పడుతున్నారంటూ వైఎస్సార్ జిల్లా రాజంపేట లో ఆందోళన జరిగింది. సోమవారం ఉదయం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు కార్యాలయం వద్దకు చేరుకుని సబ్ రిజిస్ట్రార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవినీతిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ఆవరణలో బైఠాయించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.