Rajanna Badibata
-
సైకిళ్లకు ‘చంద్ర’గ్రహణం
సాక్షి, అనంతపురం ఎడ్యుకేషన్: ‘రాజన్న బడిబాట’లో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 8న ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేసే సైకిళ్లపై ఉన్న లోగో మార్పు ప్రధానోపాధ్యాయులను టెన్షన్‌కు గురి చేస్తోంది. ఆ సైకిళ్లపై గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోతో కూడిన లోగోలే ఉన్నాయి. వాటిని మార్చి ఇదివరకే సైకిళ్లు సరఫరా చేసిన ఏజెన్సీ ద్వారా ‘రాజన్న బడిబాట’ లోగో ఏర్పాటు చేయాలని విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జిల్లాకు మాత్రం ఇప్పటిదాకా కొత్త లోగో ఒక్కటీ రాలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో 2018–19 విద్యా సంవత్సరంలో 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీకి అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లాకు మొత్తం 32,287 సైకిళ్లు రాగా.. 8,762 సైకిళ్లు విద్యార్థినులకు పంపిణీ చేశారు. 23,525 సైకిళ్లు పంపిణీ చేయాల్సి ఉంది. తీరా ఎన్నికల ముందు... గత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల తాయిలాల్లో భాగంగా తీరా ఎన్నికల ముందు సైకిళ్ల పంపిణీకి చర్యలు తీసుకుంది. జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభమైతే ఫిబ్రవరి నెలాఖరులో పంపిణీ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా సైకిళ్లను పాఠశాలలకు చేర్చారు. తీరా బాలికలకు పంపిణీ చేసే సమయానికి కోడ్ అడ్డంకిగా మారి బ్రేక్ పడింది. ఆ తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరడంతో సైకిళ్ల పంపిణీకి చర్యలు తీసుకుంటోంది. కాగా 2018–19 సంవత్సరానికి మంజూరు చేసిన సైకిళ్లు కావడంతో ప్రస్తుతం 9, 10 తరగతులు చదువుతున్న బాలికలకు పంపిణీ చేయనున్నారు. ఆందోళనలో ప్రధానోపాధ్యాయులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోతో కూడిన లోగోను సైకిళ్లపై ముద్రించారు. వాటిస్థానంలో ‘రాజన్న బడిబాట’ లోగోను ముద్రించి సైకిళ్లు సరఫరా చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైకిళ్లు సరఫరా చేసిన ఏజెన్సీ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బాలికలకు సరఫరా చేసేందుకు ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. ఇప్పటిదాకా ఏజెన్సీ నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. బాలికలకు సైకిళ్లు ఎలా సరఫరా చేయాలో అర్థం కావడం లేదంటున్నారు. దీనిపై అధికారులు కూడా స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. చర్యలు తీసుకుంటున్నాం సైకిళ్లపై గత ముఖ్యమంత్రి చంద్రబాబు లోగోను తొలిగించి ‘రాజన్న బడిబాట’ లోగో ముద్రించి సరఫరా చేయాలని కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏజెన్సీ వారితో మాట్లాడాం. వారు జిల్లాలో సబ్ ఏజెన్సీకి ఇచ్చారట. వారితో కూడా మాట్లాడాం. ఆదివారం లోపు కొత్త లోగోలు వస్తాయన్నారు. వాటిని నేరుగా స్కూళ్లకు సరఫరా చేసి అమర్చేలా చర్యలు తీసుకుంటాం. – దేవరాజు, ఇన్చార్జి డీఈఓ -
‘బడిబాట’లో భాషా మాధ్యమం!
ఇంగ్లిష్‌ను పాఠశాలల్లో నిర్బంధ భాషా మాధ్యమం చేయాలని భారత్ విద్యా విధాన రూపకల్పనలో ప్రపంచబ్యాంకు ద్వారా అమెరికా ప్రతిపాదించి అమలులోకి తెప్పించుకుంది. మన గ్రామసీమల దాకా గుత్త పెట్టుబడి సంస్థల ఉత్పత్తులను చేర్చడానికి ఇంగ్లిష్ మాధ్యమం అవసరమైనా, కొనుగోలుదారులు మాత్రం తెలుగుభాషా ప్రజలేనన్న సంగతి మరవరాదు. విద్యావ్యవస్థలో తల్లిభాషకు స్థానం లేనంత దీనస్థితికి గత పాలకులు తెలుగును దిగజార్చివేశారు. దీనిపై ఏపీ నవ యువ సీఎం జగన్మోహన్ స్పష్టమైన అవగాహనతోనే అన్ని స్కూళ్లలో తెలుగును ఒక ‘సబ్జెక్టు’గా బోధించాలని ప్రతిపాదించారు. నీ తల్లిభాషను నీవు ‘శ్వాసించకపోతే గాలి లేనట్టే/ నీవు నడవకపోతే ఈ భూమి లేనట్టే/ నీవు నీ భాషలో మాట్లాడకపోతే ఈ ప్రపంచమూ లేనట్టే’నన్నది ‘యునెస్కో’ శాసనం. ఏ పాలకులైనా ఈ వాస్తవాన్ని మరవరాదు. ‘‘ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్ది, ఆంధ్రప్రదేశ్‌లో చదువుల విప్లవం తెస్తాం. రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేస్తాం. దేశవ్యాప్తంగా చదువురాని వారు సగటున 26 శాతం ఉంటే మన రాష్ట్రంలో 33 శాతం ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశపెడతాం. ప్రతి స్కూల్లోనూ తెలుగును పాఠ్యాంశంగా తప్పనిసరి చేస్తాం. చదువుల విప్లవం ద్వారా సర్కారు స్కూళ్లను మంచి పాఠశాల లుగా తీర్చిదిద్దుతాం’’ – ఏపీ సీఎం వైఎస్ జగన్ ‘రాజన్న బడిబాట’ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ చేసిన విధాన ప్రకటన (14.6.2019) గత దశాబ్దన్నర కాలానికి పైగా, ముఖ్యంగా ప్రపంచబ్యాంక్ ‘ఆర్థిక సంస్కరణల’ పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా విధానంలో కూడా పెనుమార్పులు వచ్చాయి. ఈ ప్రజా వ్యతిరేక సంస్కరణలవల్ల దేశ సామాజిక, ఆర్థిక రంగాలను చుట్టుముట్టిన అనేక అనర్థాలలో ఒకటి.. విద్యావ్యవస్థలో తల్లి (మాతృ) భాషలు బోధనా మాధ్యమాలుగా దెబ్బ తింటూ ‘చదివేస్తే ఉన్న మతి’ కూడా పోతూ, ‘కాకరకాయ అనమంటే కీకరకాయ’ అని ఉచ్చరించే దశకు తెలుగు భాషను దిగజార్చివేశారు. ఉన్నవాడు ఉన్నవాడికే దోచబెట్టాడు, లేనివాడు కూడా ఉన్నవాడికే దోచ బెట్టాడన్నట్టు ఆచరణలో విద్యా వ్యవస్థ తీరుతెన్నులూ మారాయి. ప్రాథమిక మాధ్యమిక విద్యా వ్యవస్థలో బోధనా భాషా మాధ్యమం ఏది ఏ మోతాదుల్లో ఉండాలన్న సమస్యపై నేటికీ చర్చ ముగింపునకు రాక పోవడానికి ప్రధాన కారణం– ఆంగ్లో, అమెరికన్ వలస దోపిడీకి కొన సాగింపుగా, తమ అవసరాల కోసం ఏర్పరచుకున్న ప్రపంచ బ్యాంకు ద్వారా ఇండియా లాంటి వర్ధమాన దేశాల సంతలను (మార్కెట్లను) తమ సరుకులతో నింపేయడం అనివార్యమయింది. ఆధునిక టెక్నాలజీ మార్గాల ద్వారా తమ వస్తూత్పత్తులు అవసరానికి మించి గుట్టలుగా పేరుకుపోకుండా బడుగు వర్ధమాన దేశాల మార్కెట్లలో కుమ్మరించి తమ లాభాలను పెంచుకోవడం ద్వారా, ప్రపంచ దేశాలపై పెత్తనాన్ని కొనసాగించుకోదలచాయి. ఈ లక్ష్యంతోనే ఇంగ్లిష్‌ను పాఠశాలల్లో నిర్బంధ భాషా మాధ్యమం చేయాలని భారత్ విద్యా విధాన రూప కల్పనలో అమెరికా ప్రతిపాదించి అమలులోకి తెప్పించుకుంది. మన గ్రామసీమల దాకా అమెరికా గుత్త పెట్టుబడి సంస్థల ఉత్ప త్తులను చేర్చడానికి ఇంగ్లిష్ మాధ్యమం అవసరమైనా కొనుగోలు దారులు మాత్రం తెలుగుభాషా ప్రజలేనన్న సంగతి మరవరాదు. ఈ విషయంలో యువ ముఖ్యమంత్రి జగన్మోహన్కు అవగాహన ఉండి ఉంటుంది. కనుకనే అన్ని స్కూళ్లలో తెలుగును ఒక ‘సబ్జెక్టు’గా బోధిం చాలని ఆయన ప్రతిపాదించారు. ఈ సందర్భంగా సుమారు ఇరవై ఏళ్ల నాడే వర్ధమాన దేశాల మాతృభాషల ఉనికికి రానున్న ప్రమాదంపై ఐక్యరాజ్యసమితి విద్యా, సాంస్కృతిక సంస్థ చేసిన హెచ్చరిక జగన్‌కు గుర్తుండే ఉండాలి. నీ తల్లిభాషను నీవు ‘శ్వాసించకపోతే గాలి లేనట్టే/ నీవు నడవకపోతే ఈ భూమి లేనట్టే/ నీవు నీ భాషలో మాట్లాడకపోతే ఈ ప్రపంచమూ లేనట్టే’నన్నది ‘యునెస్కో’ శాసనం. అంతేగాదు, నిత్యం అక్షరాలలో, పదాలలో, భావాల బట్వాడాలో ఆ భాష (తల్లి భాష) తాలూకు భాషీయులు తమ భాషను వాడకంలో పెట్టుకోన ప్పుడు, ఉత్తర ప్రత్యుత్తరాలలో మాతృభాషను వాడేవారి సంఖ్య అధికాధికంగా తగ్గిపోతున్నప్పుడు లేదా తన భాషను ఒక తరం మరొక తరానికి వారసత్వంగా అందించగల స్థితిలో లేనప్పుడూ ఆ భాష ప్రమాదంలో పడిపోయినట్టే లెక్క’ అని రాగల దుర్ముహూర్తాలను గురించి ‘యునెస్కో’ హెచ్చరించిందని జగన్‌కు తెలిసే ఉండాలి. ‘ఆధునిక అవసరాల దృష్ట్యా’ ఇంగ్లిష్ భాషా మాధ్యమాన్ని, దాని అధ్యయనాన్ని కాదనలేముగానీ, మన పాత తరాలలోని పెద్దలు తల్లి భాషలోనూ, ఆంగ్ల మాధ్యమంలోనూ స్కూల్ ఫైనల్ (ఎస్ఎస్ఎల్సీ) దశలోనే విద్యాభ్యాసం చాలించిన వారిలో పెక్కుమంది ఆ రోజుకే కాదు, ఈ రోజుకీ ఉభయ భాషలలోనూ అనర్గళంగా మాట్లాడి, నేటి ఉన్నత విద్యావంతుల్ని సహితం ‘గేలి’ చేస్తున్నవారు ఉన్నారని మరచిపోరాదు. అంతేగాదు, నేడు మనం ఇంతగా అవసరాలకు మించిన అత్యుత్సా హాన్ని ఇంగ్లిష్ భాషపై చూపుతున్నాం గానీ, తమ మాతృభాష అయిన ఇంగ్లిష్ భాషపైన శతాబ్దాలపాటు పెత్తనం చెలాయించిన గ్రీకు, లాటిన్, ఫ్రెంచి వంటి వలస సామ్రాజ్య భాషలను వదిలించుకోడానికి ఇంగ్లండ్ ప్రజలకు సహితం 300 సంవత్సరాలు పట్టిందని గుర్తుంచుకోవాలి. ఈ పర భాషా దాష్టీకాన్ని వదిలించుకోవడానికి ఇంగ్లండ్ 16–17 శతాబ్దా లలో పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరచి తమ తల్లి ఇంగ్లిష్ భాషను జాతీయ భాషగా తీర్మానం చేసుకోవలసిన గతి పట్టింది. కనుక మాతృ భాషా పరిరక్షణలో ఇంగ్లండ్ ప్రజల పోరాట స్ఫూర్తే తిరిగి తెలు గువారికి, పాలకులకు కూడా స్ఫూర్తి కావాలి. తమ ఇంగ్లిష్ పెత్తనం చిరకాలం వర్ధమాన దేశాల ప్రజలపైన, బడుగు దేశాల మార్కెట్లపైన కొనసాగించాలన్న వలసపాలకుల కుట్ర కారణంగానే రెండు దశా బ్దాలలోనే– మన పిల్లలు ‘అమ్మ, నాన్న’ పదాల నుంచి దూరమైపోయి ‘మమ్మీ, డాడీ’ పదాలకే అంటకాగిపోవడం చూస్తున్నాం.. అదేమంటే, ‘పోటీ ప్రపంచంలో, మన పిల్లలు తట్టుకుని నిలబడా లంటే ‘ఉనికి’ కోసం తన భాషను త్యజించి పరాయి భాషకే ‘అంటిల్లా’ కావాలనుకోవడం అత్యాశ. ఎందుకంటే, ఈ రోజుకీ ప్రపంచ భాషగా ‘ఇంగ్లిష్’ పెత్తనం చెలాయించవచ్చుగాక, కానీ మనం ఊహించని నవ చైనా భాష (చైనీస్), శాస్త్ర, సాంకేతిక, ఆర్థిక రంగాలలో శరవేగాన తన ప్రభావాన్ని నిరూపించుకుని ప్రపంచ ఆర్థిక శక్తిగా అమెరికాను తోసి రాజంటూ రేపో మాపో అగ్రస్థానంలోకి చైనా దూసుకువస్తున్నందున– అదే ఇంగ్లిష్‌నూ శాసించబోతోందని నిపుణులు భావిస్తున్నారు. కనుకనే యూరప్, అమెరికాలు రేపు అగ్రగామి ఆర్థిక శక్తిగా చైనా అవతరించ నున్నందున చైనీస్ భాషను (మండారిన్) తమ విద్యాలయాల్లో, విశ్వ విద్యాలయాల్లో నేర్పేందుకు సుమారు 500 చొప్పున ప్రత్యేక అభ్యాస కేంద్రాలను నడుపుతున్నారనిగుర్తించాలి. అలాగని చెప్పి, బలమైన ఆర్థిక శక్తిసంపన్న దేశానికి చెందిన భాషను అవసరమైన ఒక మాధ్యమంగా నేర్చుకుని, వాడుకుంటామే గానీ, ఎవరికి వారు తమ తల్లి భాషను తాకట్టు పెట్టుకోలేరు! ఇంగ్లిష్ గానీ, చైనీస్ గానీ, మరొకటి గానీ మన అవసరాల కొద్దీ అవి మన చాకిరీలో తాకట్టుపదాలే గానీ, తల్లి భాషను కోలుకోలేని ‘రుణబాధ’ల్లోకి నెట్టుకోకూడదు. మొన్నటిదాకా ఈ భాషా‘రుణం’లోనే మన దేశీయుల్ని బాబింగ్టన్ మెకాలే బానిస విద్యావ్యవస్థ అనే ‘కట్టుగొయ్య’ కట్టిపడేసింది (1835)! భారత విద్యాలయాల్లో ఇంగ్లిష్‌ను ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందో మెకాలే చాలా బాహాటంగా ఇలా చాటాడు. ‘‘మన ఇంగ్లిష్ పాలకులకూ, భారత దేశంలోని కోట్లాదిమంది ప్రజలకూ మధ్య దుబాసీలుగా సంధానకర్తలుగా ఉపయోగపడగల ఒక వర్గాన్ని తయారు చేయడానికి మనం చేయగలదంతా చేయాలి. ఈ వర్గం ఎలాంటివారై ఉండాలి? రంగులో, రక్తసంబంధంలో భారతీయు లుగానూ, రుచులలో, వేషంలో, భావజాలంలో, నీతిలో, మేధస్సులో మాత్రం ఇంగ్లిష్ వాళ్లలా ఉండాలి అలా మన భాషకు, మన తిండికీ, మన వేషానికీ అలవాటు పడిన భారతీయుడు బ్రిటిష్ సామ్రాజ్యానికి శాశ్వతంగా బానిసై ఉంటాడు’’! ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకునే వాళ్లకి ఇంగ్లిష్ నేర్పండి గానీ ఇంగ్లిష్ విద్యాభ్యాసం అనేది దేశీయ మాతృభాషల బలమైన పునాదిమీదనే సాధ్యం అని ఇంగ్లిష్ వైస్రాయి లార్డ్ కర్జన్ (1898–1905) అంగీకరిం చక తప్పలేదు. స్వాతంత్య్రానంతరం రాధాకృష్ణన్ కమిషన్, కొఠారీ కమిషన్ నివేదికల సారాంశం కూడా ఇదేనని మరవరాదు. కనుకనే, గౌరవ యువనేత జగన్మోహన్ రెడ్డి భాషా మాధ్యమాల విషయంలో కడు జాగరూకతతో ముందుకు సాగాలి. ఎందుకంటే, తన సుదీర్ఘ పాద యాత్రలో జగన్ విన్న కోట్లాదిమంది కుల, వర్గ, మతాతీత సామాన్య ప్రజలనుంచి గుండె చప్పుళ్లన్నీ తల్లి భాషలోనే, తనకూ విజయమ్మ పేగు బంధంతో సంక్రమించిన తెలుగు తల్లి భాషే, జగన్ నోట అడుగడు గునా ప్రజలను ఉద్దేశించి మీ బాధలు విన్నాను, సమస్యలు తెలుసు కున్నాను, కష్టాలు కళ్లారా చూశాను, విన్నాను అని చెమ్మగిల్లిన ఆర్ద్రమైన కళ్లతో తన భారాన్ని దించుకున్నదీ ఆ తెలుగు తల్లి భాషలోనే సుమా! నా భాషలో బలమైన స్పర్శతో స్పందించాలనుకోవడం ఇతర భాషల్ని ద్వేషించడంగా భావించకూడదు. ఈ మర్మం తెలిసినవాడు కాబట్టే కవి ఛాయారాజ్ ఉత్తరోత్తరా ప్రాచీన చరిత్ర గల తెలుగు భాషా వినియోగా నికి చేటును పసిగట్టి తెలుగువాడికి, వాడి ‘వాడి’కి, వాడి ‘వేడి’కి కొల మానంగా ఇరవై ఏళ్లనాడే ముందస్తు హెచ్చరికగా ఇలా స్పందించాడు. ‘నా ప్రేమ, నా అభిమాన మిత్రులకు అర్థం కావాలి. నా ఆగ్రహం, నా ఆవేశం శత్రువులకు అర్థం కావాలి. నా శ్రమ, నా శక్తీ, నా భాషలోనే వ్యక్తం కావాలి. పుట్టుక దగ్గర, చావుదగ్గర పరభాషలో నవ్వలేను, ఏడ్వలేను!’. మన భాష, మన భావాలు ‘గ్రాంథికాలు’ కావు. ‘వ్యవహారి కాలు’ మాత్రమే. మన భాషా పండితుల నియామకాలు కూడా ఈ ప్రమాణాలపైనే సాగాలి. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
రాజన్న బడిబాటలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
-
మీ పిల్లలకు మామగా అండగా ఉంటా: సీఎం జగన్
సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో చదువుల విప్లవం తీసుకొస్తామని, రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా పెనుమాక జెడ్పీ స్కూల్లో ఏర్పాటు చేసిన రాజన్న బడిబాట–సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. పాదయాత్రలో ప్రతి తల్లికి, చెల్లికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సందర్భంగా ఇవాళ చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ‘మీ పిల్లలను బడికి పంపిస్తే చాలు..వారికి మామగా అండగా ఉంటాను’ అని భరోసా ఇచ్చారు. పిల్లలను బడికి పంపించిన తల్లులకు అమ్మ ఒడి పథకం కింద ప్రతి ఏటా రూ.15 వేలు అందజేస్తామని సీఎం జగన్ ప్రకటన చేశారు. చదవండి: రాజన్న బడిబాటలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..‘ఇవాళ చాలా సంతోషంగా ఉంది. కారణం ఏమిటంటే ఈరోజు నా మనసుకు అన్నింటికన్నా నచ్చిన కార్యక్రమం చేస్తున్నాను కాబట్టి. నా కోరిక ఒక్కటే. పిల్లలు బడికి వెళ్లాలి. బడుల నుంచి కాలేజీలకు వెళ్లాలి. కాలేజీ నుంచి వాళ్లు డాక్టర్లు, ఇంజినీర్లు కావాలి. ఉన్నత విద్యావంతులు కావాలి. అయితే ఆ చదువుల కోసం ఏ తల్లి, తండ్రి కూడా అప్పులు పాలు కాకూడదనే నా ఆశ. నా పాదయాత్ర సందర్భంగా పేదల కష్టాలను చూశాను. వారు పడుతున్న బాధలు విన్నా.బిడ్డలను చదివించాలన్న ఆరాటం ఉన్నా...చదవించలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను చూశాను. పిల్లలను ఇంజినీరింగ్ చదవించాలని, ఆ చదువుల కోసం ఖర్చులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి చూశాం. ఈ విద్యా వ్యవస్థలో సంపూర్ణమైన మార్పులు తెస్తామని ప్రతి తల్లికి, చెల్లికి హామీ ఇచ్చాను. మీ పిల్లల చదువును ఇకపై నేను తీసుకుంటానని మాటిచ్చా. ఇవాళ ఆ మాట నిలబెట్టుకునే రోజు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ప్రతి తల్లికి, చెల్లికి, ఒకే ఒకమాట చెబుతున్నా. మీ పిల్లలను బడులకు పంపించండి. మీరు చేయాల్సిందల్లా కేవలం బడులకు పంపించడమే. బడికి పంపించినందుకు జనవరి 26 తేదీకల్లా... రాష్ట్రవ్యాప్తంగా ఒక పండుగ దినం చేస్తాం. ఏ తల్లి అయితే తమ పిల్లలను బడులకు పంపిస్తుందో...వాళ్లకు రూ.15 వేలు డబ్బులు చేతిలో పెడతాం. ఏ తల్లి కూడా తన పిల్లలను చదవించడానికి అవస్థ పడకూడదనే ఈ కార్యక్రమం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా నిరక్షరాస్యత 26 శాతం ఉంటే... మన రాష్ట్రంలో 33శాతం ఉంది. ఇలాంటి దారుణ పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారు. ఆ పరిస్థితిలో మార్పు రావాలి. మన పిల్లలు దేశంలో ఎవరితో అయినా పోటీ పడేలా ఉండాలి. ఈ పరిస్థితిలో ఎందుకు ఉన్నామని నా పాదయాత్రలో చూశాను. పిల్లలకు సకాలంలో పుస్తకాలు అందడం లేదు. ఏప్రిల్, మే మాసంలో పుస్తకాలు అందాలి. స్కూల్ తెరిచిన వెంటనే పుస్తకాలు, మూడు జతల యూనిఫాం అందజేయాలి. మన ఖర్మ ఏంటంటే..నా పాదయాత్రలో గమనించా..పిల్లలకు సెప్టెంబర్ దాటిన కూడా పుస్తకాలు అందలేదు. యూనిఫాం కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. టీచర్ల ఉద్యోగాల కొరత ఉన్నా రిక్రూట్మెంట్ చేయలేదు. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్తే ఆ పాఠశాలల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. మరుగుదొడ్లు ఉండవు. నీళ్లు ఉండదు. ఫ్యాన్ లేదు. కాంపౌండు వాల్ ఉండదు. ఇక పిల్లలను చదివించాలంటే ఏ తల్లైనా భయపడాల్సిందే. ప్రైవేట్ రంగంలో స్కూళ్లలో ఫీజులు షాక్ కొడుతున్నాయి. నారాయణ, శ్రీ చైతన్య వంటి స్కూళ్లలో ఫీజులు విఫరీతంగా వసూలు చేస్తున్నారు. ఇటువంటి అన్యాయమైన పరిస్థితి ఉన్నప్పుడు మన పిల్లలను చదివించాలంటే తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. ఇవన్నీ కూడా మార్చేస్తానని మాటిస్తున్నాను. ఇవాళ ప్రతి స్కూల్‌ను కూడా ఫోటో తీయండి. రాష్ట్రంలో 40 వేల స్కూళ్లు ఉన్నాయి. రెండేళ్లలో అదే స్కూళ్లు ఎలా ఉన్నాయో చేసి చూపిస్తాం. పాఠశాలలకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తాం. ప్రైవేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా తీర్చిదిద్దుతామని మాట ఇస్తున్నాను. ప్రతి స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతాం. ప్రతి స్కూల్లోనూ తెలుగు సబ్జెక్ట్‌ను తప్పని సరి చేస్తాం. ఈ రోజు చదువుల విప్లవాన్ని తీసుకువచ్చి, మంచి స్కూళ్లుగా తీర్చిదిద్దుతాం. ఏ తల్లి కూడా అవస్థలు పడకుండా చేస్తాం. ప్రతి తల్లికి అన్నగా తోడుంటాను. మీ పిల్లలను బడికి పంపించండి. నేనున్నాను.. ఆ పిల్లలకు మామగా ఉంటాను. ఈ స్కూళ్ల పరిస్థితి మారాలి. కాబట్టి ప్రతి పిల్లాడికి స్కూళ్ల బాట పట్టమని అందరికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ముగిస్తున్నాను.’ అని అన్నారు. -
రాజన్న బడిబాటలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తాడేపల్లి మండలం పెనమాకలోని వందేమాతరం హైసూల్క్‌లో ఒకేసారి 2వేలమంది విద్యార్థుల సామూహిక అక్షరాభాస్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ముందుగా వేదికపై ఏర్పాటు చేసిన సరస్వతి దేవి పటానికి అంజలి ఘటించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పలువురు చిన్నారులను తన ఒడిలో కూర్చోపెట్టుకుని అక్షరాభ్యాసం చేయించి, అమ్మ ఒడిని చల్లగా దీవించారు. ఆ తర్వాత విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, హోంమంత్రి సుచరిత, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, జిల్లా కలెక్టర్ శామ్యూల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ... సర్కార్ పాఠశాలల్లో అనేక వసతులు కల్పించడంతో తల్లిదండ్రులు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా రాజన్న బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నారు. ప్రాథమిక విద్య 5వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులను వారి తల్లిదండ్రులు ప్రభుత్వ హైస్కూల్‌కు పంపిస్తున్నారు. ఈ ఏడాది స్కూల్ ప్రారంభించేనాటికే విద్యార్థులకు సంబంధించి 19.85 లక్షల పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు యూనిఫాం అన్ని పాఠశాలలకు చేరింది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో భాగంగా విద్యార్థులకు మూడు జతల యూనిఫాం, 2,51,601 మంది బూట్లు, రెండు జతల సాక్సులు అందిస్తున్నారు. 8, 9 తరగతులు చదివే బాలికలకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు.