rajasthan chief minister
-
ఎన్నికల్లో కలసికట్టుగా పోరాటం : సచిన్ పైలెట్
న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, అసంతృప్త నేత సచిన్ పైలెట్ మధ్య విభేదాలు రూపుమాప డానికి అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కలసికట్టుగా పోరాటం చేస్తామని సచిన్ పైలెట్ చెప్పారు. రాజస్థాన్‌లో ఎన్నికల సన్నద్ధతపై గురువారం న్యూఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాహుల్‌గాంధీ, ఖర్గే, సచిన్ పైలెట్ ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కాలికి ఫ్రాక్చర్ కావడంతో సీఎం అశోక్ గెహ్లోత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరయ్యారు. -
అధ్యక్ష పదవికి పోటీపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు.. గహ్లోత్ పరిస్థితి ఏంటో?
తిరువనంతపురం: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తాజాగా పార్టీ అధ్యక్ష పదివికి పోటీ విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరికి ఒక పోస్టు మాత్రమే అనే నింబంధనను మరోసారి నొక్కి చెప్పారు.అయితే రాహుల్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ అధ్యక్ష పదివిలో పోటీ చేయాలనుకుంటున్న రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. కాగా 71 ఏళ్ల అశోక్ గహ్లోత్ కాగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆయన సోనియా గాంధీని కూడా కలిశారు. అయితే రాజస్థాన్ సీఎం పదవిని వదులుకునేందుకు ఆయన సిద్ధంగా లేరు. ఒకవేళ సీఎం పోస్టుకు రాజీనామా చేస్తే తన స్థానంలో సచిన్ పైలట్ వస్తాడని గహ్లోత్ భావిస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా గహ్లోత్, పైలట్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో గహ్లోత్ డబుల్ రోల్ ప్లే చేస్తారా అనే సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఈ క్రమంలో దీనిపై రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. చదవండి: రాహుల్‌కే అధ్యక్ష బాధ్యతలు.. టీపీసీసీ ఏకగ్రీవ తీర్మానం భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం రాహుల్ గాంధీ కేరళలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తాము ఉదయ్‌పూర్ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని, ఈ ఒప్పందం ప్రకారం ఒక్కరికి ఒక్క పోస్టు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. కాగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ ఈ ఏడాది ప్రారంభంలో ఒక ‘వ్యక్తి, ఒకే పదవి’ నియమాన్ని ఆమోదించింది. కాంగ్రెస్ అధ్యకుడు అంటే పదవి కాదని.. సైద్దాంతిక వ్యవస్థగా అభివర్ణించారు. కాంగ్రెస్ అధ్యక్షుడి పోటీలో నిలిచే వారు ఎవరైనా.. ఆలోచనల సమితికి, నమ్మకమైన వ్యవస్థకు, ఇండియా విజన్‌కు తాము ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు గుర్తు పెట్టుకోవాలని రాహుల్ గాంధీ సూచించారు. ఇక అధ్యక్ష పదవి కోసం పోటీపడే వారి సంఖ్య పెరుగుతోంది. అశోక్ గహ్లోత్‌తోపాటు తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కూడా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేగాక దిగ్విజయ్ సింగ్ తాను రేసులో ఉన్నానంటూ ముందుకు వచ్చారు. అయితే రాహుల్ నామినేషన్ దాఖలు చేస్తారా లేదా అనే అంశం పైన సస్పెన్స్ కొనసాగుతోంది. రాహుల్ గాంధీ కనుక పోటీ చేయకుంటే వీరు ముగ్గురే ప్రధాన పోటీదారులు అయ్యే అవకాశమూ లేకపోలేదు. కాంగ్రెస్ నోటిఫికేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ నేడు(గురువారం) వెలువడింది. ఈ నెల 24 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ తెలిపారు.. అక్టోబర్ 1న నామినేషన్ పత్రాల పరిశీలన, అక్టోబర్ 8న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్ 17న ఓటింగ్ నిర్వహించి.. రెండు రోజుల తర్వాత అంటే అక్టోబర్ 19న ఫలితాలు ప్రకటిస్తారు. చదవండి: ‘నేను మగవాడిని.. నా శరీరాన్ని ఈడీ, సీబీఐ తాకలేవు’ -
రాజ్యసభ ఓటుకు రూ.25 కోట్లు ఆఫర్ చేశారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే
జైపూర్: తన రాజ్యసభ ఓటుకు రూ.25 కోట్లు ఆఫర్ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర సింగ్ గుఢా. కొద్ది రోజుల క్రితం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తాము చెప్పిన అభ్యర్థికి ఓటు వేయాలని, అందుకు తనకు రూ.25 కోట్లు ఇవ్వజూపారని పేర్కొన్నారు సైనికుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి గుఢా. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు రాజస్థాన్‌లో రాజకీయ దుమారానికి దారి తీశాయి. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) నుంచి 2019లో కాంగ్రెస్‌లో చేరారు రాజేంద్ర. 2020లో సీఎం అశోక్ గెహ్లోత్‌పై తిరుగుబాటు చేయాలంటూ.. రూ.60 కోట్ల ఆఫర్ వచ్చిందన్నారు. అయితే.. ఆ రెండు ఆఫర్లను తాను తిరస్కరించానని పేర్కొన్నారు మంత్రి రాజేంద్ర సింగ్ గూఢా. కానీ, ఏ నేత, పార్టీ పేరును ప్రస్తావించకుండానే ఈ ఆరోపణలు చేశారు. ఝుంఝునులో సోమవారం ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు..‘ఓ వ్యక్తికి ఓటు వేసేందుకు నాకు రూ.25 కోట్ల ఆఫర్ ఇచ్చారు. అప్పుడు నా భార్యను అడిగాను. డబ్బులు వద్దు మంచి పేరుంటేచాలని నాతో ఆమె చెప్పింది. అలాగే.. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడు.. నాకు రూ.60 కోట్ల ఆఫర్ వచ్చింది. అప్పుడు నా కుటుంబం, నా భార్య, కుమారుడు, కూతురిని అడిగాను. వారు డబ్బులు వద్దని చెప్పారు. అలా ఆలోచించే వారు మీతో ఉంటే అంతా మంచే జరుగుతుంది.’ అని సమాధానమిచ్చారు మంత్రి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరపున గెలిచిన ఆరుగులు ఎమ్మెల్యేల్లో రాజేంద్ర గుఢా ఒకరు. 2019లో కాంగ్రెస్‌లో చేరారు. 2020, జులైలో సచిన్ పైలట్ సహా మరో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినప్పుడు.. గెహ్లోత్ క్యాంప్‌లోనే ఉన్నారు గుఢా. 2021లో మంత్రివర్గ విస్తరణలో గుఢాకు సహాయ మంత్రి పదవి దక్కింది. తమ ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయలు ఆఫర్ ఇస్తూ తమ ప్రభుత్వాన్ని బీజేపీ అస్తిరపరచాలని చూస్తోందని పలు వేదికల మీదుగా ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్. ఈ ఏడాది జూన్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. స్వతంత్ర అభ్యర్థి సుభాశ్ చంద్రకు బీజేపీ మద్దతు తెలిపింది. ముగ్గురు కాంగ్రెస్, ఒకరు బీజేపీ నుంచి ఎన్నికయ్యారు. ఇదీ చదవండి: తెరపైకి ‘పౌరసత్వ’ చట్టం.. బూస్టర్ డోస్ పంపిణీ పూర్తవగానే అమలులోకి! -
విశ్వాస పరీక్షలో గహ్లోత్ గెలుపు
జైపూర్: లాంఛనం ముగిసింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను విజయవంతంగా ఎదుర్కొంది. సచిన్ పైలట్ నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి పార్టీ గూటికి చేరడంతో బల నిరూపణ సునాయాసమైంది. దాంతో, ఎట్టకేలకు దాదాపు నెల రోజులుగా సాగుతున్న రాజస్తాన్ డ్రామా సుఖాంతమైంది. శాసనసభ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్ విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం, సభ ఆ తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించింది. చర్చకు ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సమాధానమిస్తూ విపక్ష బీజేపీపై విరుచుకుపడ్డారు. ‘మీరెన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నా ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటాను’ అని స్పష్టం చేశారు. ఈ సంక్షోభానికి అద్భుతమైన రీతిలో ముగింపు లభించిందని, బీజేపీ ఓడిపోయిందని పేర్కొన్నారు. ‘అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవాల్లో ఏం జరిగింది? ప్రజా ప్రభుత్వాలను కూల్చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’ అని వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో స్వయంగా ఒక కేంద్రమంత్రి పాల్గొన్నారని గహ్లోత్ ఆరోపించారు. సచిన్ పైలట్ తిరుగుబాటు నేపథ్యంలో.. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ, మధ్యవర్తి సంజయ్ జైన్ల గొంతులతో సంభాషణలున్న ఆడియో టేప్‌లను కాంగ్రెస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘మెజారిటీ ఉంటే ముందే విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలి. నెల రోజుల పాటు ఎమ్మెల్యేలను హోటల్లో నిర్బంధించాల్సిన అవసరం ఏంటి?’ అని అసెంబ్లీలో విపక్ష నేత గులాబ్ చంద్ కటారియా గహ్లోత్‌ను ప్రశ్నించారు. పైలట్‌పై స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ పెట్టిన దేశద్రోహం కేసు విషయాన్ని కూడా కటారియా ప్రస్తావించారు. ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని గెలిచిన అనంతరం సభను వచ్చే శుక్రవారానికి వాయిదా వేశారు. 200 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 107. మిత్రపక్షాలు బీటీపీ(2), సీపీఎం(2), ఆరెల్డీ(1), స్వతంత్రులు(13)తో కలిసి కాంగ్రెస్‌కు మద్దతిచ్చే వారి సంఖ్య 125 వరకు ఉంటుంది. బీజేపీ సభ్యుల సంఖ్య 72. మిత్రపక్షం(ఆర్ఎల్పీ 3)తో కలుపుకుని బీజేపీకి 75 మంది సభ్యుల మద్దతుంది. ఇప్పుడు బోర్డర్లో ఉన్నా: పైలట్ చర్చలో సచిన్ పైలట్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో తన స్థానం ఇప్పుడు బోర్డర్లో ఉందని వ్యాఖ్యానించారు. పార్టీలో తాను శక్తిమంతమైన యోధుడినని పేర్కొన్నారు. గతంలో సీఎం గహ్లోత్ పక్కన కూర్చొనే పైలట్ స్థానం తాజా సమావేశాల సందర్భంగా మారింది. దీన్ని పైలట్ ప్రస్తావిస్తూ.. ఇప్పుడు తాను తన పార్టీ, విపక్షం మధ్య సరిహద్దులో యోధుడిలా ఉన్నానని పేర్కొన్నారు. ‘సరిహద్దులకు ఎవరిని పంపిస్తారు? అత్యంత బలమైనవాడినే పంపిస్తారు’ అని వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా పార్టీ ప్రయోజనాలను కాపాడుతానన్నారు. ‘నా సీట్ మారేముందు నేను సేఫ్. ప్రభుత్వంలో భాగంగా ఉండేవాడిని. ఇప్పుడు నా స్థానం స్పీకర్, చీఫ్ విప్ ఎందుకు మార్చారా అని రెండు నిమిషాలు ఆలోచించాను. ఇది విపక్షంతో పోరాటంలో కీలకమైన బోర్డర్ స్థానం అని అర్థం చేసుకున్నా. నాకు ఒకవైపు అధికార పక్షం. మరోవైపు ప్రతిపక్షం. సరిహద్దులకు ఎవరిని పంపిస్తారు? శక్తిమంతుడైన యోధుడినే కదా!’ అన్నారు. ‘మా సమస్యలను డాక్టర్‌కు వివరించాం. చికిత్స తరువాత ఇప్పుడు మొత్తం 125 మంది సభ్యులం ఇక్కడ సభలో ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. తిరుగుబాటు అనంతరం, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పైలట్ సమావేశమై రాష్ట్ర నాయకత్వంపై తన ఫిర్యాదులను వివరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత సయోధ్య కుదిరి తిరిగి ఆయన పార్టీ గూటికి వచ్చారు. అదే విషయాన్ని ఆయన డాక్టర్‌ను కన్సల్ట్ అయినట్లుగా నర్మగర్భంగా వెల్లడించారు. -
సత్యం పక్షాన నిలబడండి
జైపూర్: ఆగస్టు 14 నుంచి రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలు జరగునున్న నేపథ్యంలో రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ‘సత్యం పక్షాన నిలవండి–ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’అంటూ లేఖ ద్వారా శాసనసభ్యులకు విజ్ఞప్తి చేశారు. సచిన్ పైలెట్ తనకు అనుకూలమైన ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయటంతో రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. విశ్వాస పరీక్ష కోసం ఈనెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి పార్టీ చేసిన వాగ్దానాలను పరిపూర్తి చేయడానికి ఎమ్మెల్యేలంతా సహకరించాలని ఆ లేఖలో గహ్లోత్ కోరారు. మీరు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ, మీరంతా ప్రజాపక్షం వహించాలని, తప్పుడు సాంప్రదాయాలను తిరస్కరించాలని, ప్రజల విశ్వాసాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆయన ఆ లేఖలో కోరారు. ‘‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేయడానికి, ఓటర్ల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోండి’’అని లేఖలో వ్యాఖ్యానించారు. రాష్ట్రప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి జరిగే ప్రయత్నాలేవీ సఫలం కావని కూడా ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని, ఎమ్మెల్యేలు వ్యవహరిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సచిన్ పైలెట్ తిరుగుబాటు చేసిన అనంతరం ఆయనను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి, పీసీసీ అధ్యక్ష పీఠం నుంచి తొలగించారు. ఇప్పటికీ గహ్లోత్‌కే నంబర్ గేమ్‌లో మెజారిటీ ఉంటుందని కొందరి బలమైన విశ్వాసం. 11న బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ 11న భేటీ కానుంది. ఈ సమావేశానికి రావాల్సిందిగా ఎమ్మెల్యేలందరికీ ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా లేఖ రాశారు. 11న సాయంత్రం 4 గంటలకు జైపూర్‌లోని హోటల్ క్రౌన్ ప్లాజాలో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. బీజేపీ ఇప్పటికే 18 మంది ఎమ్మెల్యేలను గుజరాత్‌కి తరలించింది. శనివారం ఆరుగురు శాసనసభ్యులు పోరుబందర్‌కి తరలివెళ్ళగా, మరో 12 మంది ఎమ్మెల్యేలు అహ్మదాబాద్ తరలి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలందర్నీ ఒకచోట ఉంచినట్లే, బీజేపీ కూడా తరలించిందని భావిస్తున్నారు. -
‘ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర’
జైపూర్: రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, బీజేపీ తన ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమ శాసనసభ్యులకు 15 కోట్లరూపాయలు ఆశచూపి, వారిని డబ్బుతో కొనేయాలని చూస్తోందని ప్రతిపక్ష బీజేపీపై తీవ్ర విమర్శల వర్షం కురిపించారు. అయితే తమ ప్రభుత్వం స్థిరంగా ఉండడం మాత్రమే కాదనీ, తమ ప్రభుత్వం ఐదేళ్ళ కాలాన్ని పూర్తి చేసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా తన ప్రభుత్వాన్ని సహించలేకపోతున్నారనీ, అందుకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నుతున్నారని గహ్లోత్ ఆరోపించారు. కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకే బీజేపీ నాయకులు గేమ్ ఆడుతున్నారన్నారు. అడ్వాన్స్‌గా రూ.10 కోట్లను, ప్రభుత్వాన్ని కూల్చాక మరో రూ.15 కోట్లు ఇస్తామని చెప్పి తమ శాసనసభ్యులను కొనేయత్నం చేశారని గహ్లోత్ అన్నారు. బీజేపీ నాయకులు రాజకీయాలను ‘మేకల మండీ’లా భావిస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడు గులాబ్ చంద్ కటారియా, రాజేంద్ర రాథోడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పునియాలు కేంద్ర నాయకత్వ ఎజెండాను అమలు చేస్తున్నారంటూ గహ్లోత్ ఆరోపించారు. -
కాంగ్రెస్ పగ్గాలు గహ్లోత్‌కు?
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసినదగ్గర నుంచి కొత్త అధ్యక్షుడెవరన్నది చర్చనీయాంశమయింది. రాజీనామాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తిరస్కరించినా, పదవిలో కొనసాగాల్సిందిగా పలువురు సీనియర్లు బతిమాలినా రాహుల్ గాంధీ ససేమిరా అంటున్నారు. దాంతో సోనియా గాంధీ, అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్‌తో కూడిన కమిటీ కొత్త అధ్యక్షుడి కోసం వెదుకులాట మొదలు పెట్టింది. ఈ ప్రక్రియలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పేరు తెరపైకి వచ్చింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, పార్టీతో అనుబంధం ఉన్న గహ్లోత్ అధ్యక్ష పదవికి సరైన వారని నాయకత్వం భావిస్తోందని తెలిసింది. గెహ్లాట్‌కు పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా కాంగ్రెస్‌లో కుటుంబ పాలన నడుస్తోందన్న విపక్షాల విమర్శకు తెరదించవచ్చని కాంగ్రెస్ నాయకత్వం ఆలోచిస్తోందని సమాచారం. అందుకు గహ్లోత్‌ను ఒప్పించిందని సీనియర్ నాయకుడొకరు ధ్రువీకరించారు. గహ్లోత్‌కు అధ్యక్ష పదవి ఖరారయిందని నవభారత్ టైమ్స్ పత్రిక పేర్కొంది. జూన్ 19న రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న గహ్లోత్ కొద్దిసేపు రాహుల్‌తో ఏకాంతంగా సమావేశమవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. రాహుల్ అధ్యక్ష పదవిలో కొనసాగేలా చూసేందుకు నేతలు విఫలయత్నం చేశారు. రాహుల్ నిర్ణయాన్ని సోనియా వ్యతిరేకించారు. రాజీనామా చేస్తే దక్షిణాదిన పార్టీ దెబ్బతింటుందని చిదంబరం హెచ్చరించారు. అయినా రాహుల్ పట్టు వీడలేదు. పార్టీ పగ్గాలు స్వీకరించడానికి ప్రియాంక కూడా సుముఖంగా లేరు. దాంతో కొత్త నేత ఎంపిక అనివార్యమయింది. గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా పేరున్న 68 ఏళ్ల గహ్లోత్‌కు పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. గతంలో రెండు సార్లు సీఎంగా పని చేసిన ఆయన మూడోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. గహ్లోత్‌ను పార్టీ అధ్యక్షుడిని చేసి సీఎం పదవిని సచిన్ పైలట్‌కు ఇవ్వాలని తద్వారా ఆ ఇద్దరి మధ్య విభేదాలకు తెరదించాలని అధిష్టానం ఆలోచిస్తోందని సమాచారం. గహ్లోత్ ఒప్పుకోకపోతే ముకుల్ వాస్నిక్, మనీష్ తివారీ, శశి థరూర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని ఆ పత్రిక తెలిపింది. కాగా, ఈ వార్తలను గహ్లోత్ తోసిపుచ్చారు. ఇదిలా ఉండగా, పార్టీకి నలుగురు వరకు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే విషయం కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది. -
నా భార్య కిడ్నాపయ్యింది.. సీఎంగారూ సాయం చేయండి
హైదరాబాద్: తెలంగాణకు చెందిన ఓ యువకుడు తన భార్య ఆచూకీ తెలుసుకునేందుకు సాయం చేయాల్సిందిగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెను అభ్యర్థిస్తున్నాడు. నెల రోజుల నుంచి తన భార్య కనిపించడం లేదంటూ, ఆమె కుటుంబ సభ్యులే కిడ్నాప్ చేశాడని ఆరోపించాడు. వివరాలిలా ఉన్నాయి. బి వినయ్ బాబు (28) హైదరాబాద్‌లోని ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. అతను రాజస్థాన్‌కు చెందిన మమత (23) అనే యువతిని ప్రేమించాడు. రెండు నెలల క్రితం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే తమ పెళ్లికి మమత తల్లిదండ్రులు అంగీకరించలేదని చెప్పాడు. పెళ్లయిన తర్వాత మమత తల్లిదండ్రుల నుంచి తమకు ముప్పు ఉందని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. తన కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాల్సిందిగా మమత కూడా ఫిర్యాదు చేసింది. దీంతో కౌన్సిలింగ్‌కు రావాల్సిందిగా మమత కుటుంబ సభ్యులకు పోలీసులు సమన్లు పంపారు. ఈ సంఘటన తర్వాత వినయ్, మమత దంపతులు కొత్త ఇంటికి మారారు. నెల రోజుల క్రితం తాను డ్యూటీకి వెళ్లిన సమయంలో మమతను కిడ్నాప్ చేశారని వినయ్ చెప్పాడు. ఆమెను బలవంతంగా తీసుకుపోయినట్టు ఇరుగుపొరుగువారు చెప్పారని వెల్లడించాడు. ఆమె కుటుంబ సభ్యులు సొంతూరు జోధ్‌పూర్‌కు తీసుకెళ్లారని ఆరోపించాడు. వినయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని జోధ్‌పూర్ బృందాన్ని పంపారు. కాగా మమత ఆచూకీ ఇంకా లభించలేదని, ఆమె కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఇదిలావుండగా, పెళ్లి అనంతరం మమత 5 కిలోల బంగారం తీసుకుని పారిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు జోధ్‌పూర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'నా భార్య ఆచూకీ తెలుసుకునేందుకు సాయం చేయాల్సిందిగా రాజస్థాన్ ముఖ్యమంత్రిని వేడుకుంటున్నా. ఆమె భద్రతపై ఆందోళనగా ఉంది. నా భార్య క్షేమంగా ఉన్నట్టయితే కచ్చితంగా నాకు ఫోన్ చేసేది' అని వినయ్ అన్నాడు. -
సుష్మకు వసుంధరా హామీ
న్యూఢిల్లీ : స్పానిష్ పర్యాటకులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే స్పష్టం చేశారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఇద్దరు స్పానిష్ పర్యాటకులపై సోమవారం రాత్రి దాడి జరిగింది. ఈ దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరారాజేతో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడారు. దీంతో వసుంధరా రాజే పై విధంగా స్పందించారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ మంగళవారం వెల్లడించారు. -
ఆ ముఖ్యమంత్రి తప్పుకోవాల్సిందే: కాంగ్రెస్
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాజస్థాన్‌లోని దోల్పూర్ ప్యాలెస్ ప్రభుత్వ ఆస్తి అని, రాజె కుటుంబం దీన్ని అక్రమంగా పొందారని పునరుద్ఘాటించింది. ఈ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. దోల్పూర్ ప్యాలెస్‌కు సంబంధించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కొత్త డాక్యుమెంట్లను విడుదల చేశారు. దోల్పూర్ ప్యాలెస్‌లోని చరాస్థులపై మాత్రమే రాజె కొడుకు దుష్యంత్ సింగ్, ఆయన తండ్రి హేమంత్ సింగ్ ఓ అంగీకారానికి వచ్చినట్టు దస్తావేజుల్లో ఉందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ప్యాలెస్ ప్రభుత్వానికి సంబంధించినదేనని చెప్పారు. -
అసెంబ్లీకి ఆలస్యంగా వస్తే.. 500 జరిమానా
రాజస్థాన్‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆలస్యంగా వెళ్లినందుకు దాదాపు 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 500 రూపాయల చొప్పున జరిమానా చెల్లించుకోవాల్సి వచ్చింది. వీళ్లంతా లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఈ జరిమానా చెల్లించారు. ఇలా జరిమానా విధించడం మంచిదేనని, దీనివల్ల ప్రతి ఒక్కళ్లూ సరైన సమయానికి హాజరు కావాలన్న స్పృహ పెరుగుతుందని ఇలాగే ఆలస్యంగా వచ్చి జరిమానా కట్టిన భవానీ సింగ్ రజావత్ అనే ఎమ్మెల్యే చెప్పారు. ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి సరైన సమయానికే హాజరు కావాలని, అలా రాని వాళ్లపై చర్యలు తప్పవని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె ఇంతకుముందే హెచ్చరించారు. తాను అన్నట్లే ఆమె జరిమానా విధించారు. గతంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసిన రజావత్ ఈ చర్యను ఎంతగానో సమర్థించారు. సర్వసాధారణంగా ఏ కార్యక్రమానికైనా ఆలస్యంగానే వెళ్లే అలవాటున్న ఎమ్మెల్యేలు.. ఇప్పటికైనా సమయపాలన విలువ తెలుసుకుంటారని ఆయన అన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలయితే.. రెట్టింపు జరిమానా, అంటే వెయ్యి రూపాయలు కట్టడమే కాక, తాము ఇక మీదట ఎప్పుడూ ఆలస్యంగా రాబోమని కూడా చెప్పారట.