వేములవాడ చేరుకున్న చిన్నజీయర్‌స్వామి
వేములవాడ అర్బన్: చిన్నజీయర్ స్వామి ఆదివారం కరీంనగర్ జిల్లా వేములవాడకు చేరుకున్నారు. రాజరాజేశ్వరస్వామి ఆలయ మాజీ చైర్మన్, బీజేపీ రాష్ట్ర నాయకుడు అది శ్రీనివాస్ ఇంట్లో జరగనున్న ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొంటారు.
చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వేములవాడలో శోభాయాత్ర జరగనుంది. సోమవారం ఉదయం గుడిచెరువుకట్ట వద్ద శ్రీరామ పాదుకా పట్టాభిషేకం నిర్వహించనున్నారు.