rajyasaba discussion
-
‘నదుల అనుసంధానానికి నిధులివ్వండి’
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలో చేపట్టబోయే కృష్ణా, గోదావరి నదుల అనుసంధాన ప్రాజెక్టుకి తగిన నిధులు మంజూరు చేయాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో మంగళవారం ఈ అంశంపై ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాలు, వరదలు భారీగా వచ్చినప్పటికీ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కరువు ముప్పు తప్పేలా లేదని తెలిపారు. గత 52 ఏళ్లుగా శ్రీశైలం రిజర్వాయర్‌కు ప్రతి ఏటా వచ్చే వరద 1230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు తగ్గిపోతున్నా ఏ ప్రభుత్వం కూడా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే ప్రయత్నం చేయలేదని వ్యాఖ్యానించారు. మరోవైపు గోదావరిలో ఏటా 2,780 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కృష్ణా డెల్టా, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కరువు బారిన పడుతున్నాయని విశ్లేషించారు. ఈ నేపథ్యంలో గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తే తప్ప ప్రతి ఏటా ఈ దుస్థితి అనివార్యమని గ్రహించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారన్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకు తగినంత ఆర్ధిక సాయం చేయాలని నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీతో జరిగిన భేటీలో కోరిన విషయం గుర్తు చేశారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణనలోకి తీసుకొని నిధులు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
ప్రత్యేక హోదాపై చర్చ: రాజ్యసభ రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో గురువారం జరిగిన స్వల్పకాలిక చర్చ వాడీవేడీగా కొనసాగింది. ప్రత్యేక హోదాపై చర్చలో పాల్గొన్న సభ్యులంతా తమ వాదనలను బలంగా వినిపించారు. ఏపీ విభజన చట్టం అమలుపై స్వల్పకాలిక చర్చ అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ ఉపఛైర్మన్ కురియన్ ప్రకటించారు. గురువారం ప్రత్యేక హోదాపై జరిగిన స్వల్పకాలిక చర్చను రేపు కొనసాగిద్దామంటూ సభను వాయిదా వేశారు. దాంతో శుక్రవారం కూడా ఏపీ ప్రత్యేక హోదాపై చర్చ కొనసాగనుంది. మధ్యాహ్నం 2.30 లేదా సాయంత్రం 5 గంటలకు చర్చ ప్రారంభం కానుంది. రాజ్యసభ ఛైర్మన్ నేతృత్వంలో జరిగే సమావేశంలో ఏపీ ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాపై మరో ముగ్గురు ఎంపీలు మాట్లాడనున్నారు. అనంతరం ప్రభుత్వం తరపున కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇవ్వనున్నారు. -
ఏపీ ప్రత్యేక హోదాపై బిల్లు పెట్టలేం: వెంకయ్య
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై మీ వాదనలను సమర్థిస్తున్నాననీ, కానీ ఇప్పుడు హోదాపై బిల్లు పెట్టలేమని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం గురువారం రాజ్యసభలో ప్రైవేటు బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీ ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో డిమాండ్లు ఉన్నాయని అన్నారు. ఎందరో సీఎంలు ఎన్నో అడుగుతున్నారన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తున్నట్టు వెంకయ్య పేర్కొన్నారు. సీపీఎం తప్ప అన్ని పార్టీలు రాష్ట్ర విభజన కోరుకున్నాయనీ అన్నారు. రెండేళ్లైన ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఏపీ నుంచి తాను ఎన్నిక కాకున్నా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నానని వెంకయ్య తెలిపారు. వెనకబడ్డ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నామని తెలిపారు. కేంద్రంలో ఆర్థిక పరిస్థితిని బట్టి నిధుల కేటాయింపు జరుగుతుందన్నారు. చట్టంలో ఇచ్చిన హామీలన్నంటీనీ నేరవేరుస్తామని చెప్పారు. ప్రత్యేక హోదాతో కొంత సహాయపడుతుంది అంతేనని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అన్ని సమస్యలకు పరిష్కారం కాదన్నారు.