Ram Temple issue
-
‘రాజీ రాకుంటే కోర్టే పరిష్కరించాలి’
లక్నో: అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై ముస్లింలు రాజీకి రాకుంటే, సుప్రీంకోర్టు పరిష్కరించాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో గురువారం భేటీ అయిన స్వామి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత వివాదాస్పద ప్రదేశంలో రామ మందిర నిర్మాణం ఉన్నట్లు 2010లో అలహాబాద్ హైకోర్టు పేర్కొందని గుర్తు చేశారు. న్యాయపరంగా కూడా మందిర నిర్మాణంపై విజయం సాధిస్తామన్నారు. స్వామి వ్యాఖ్యలను బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ (బీఎంఏసీ) కన్వీనర్ జాఫర్యాబ్ జిలానీ ఖండించారు. స్వామి ముస్లింలను బెదిరించడం సరికాదన్నారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకముందన్నారు. ‘ఈ విషయం సామరస్యంగా పరిష్కారమైతే సరి. లేకుంటే రాజ్యసభలో 2018 ఏప్రిల్‌లో తమకు పూర్తి మెజారీటీ వచ్చిన తర్వాత రామమందిర నిర్మాణానికి సంబంధిచి చట్టాన్ని తీసుకొస్తాం’ అని గతంలో స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
బీజేపీలో కలకలం రేపుతున్న ’రామమందిరం’
-
'రామమందిరం': మళ్లీ కలకలం రేపుతున్న బీజేపీ!
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 11 నుంచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీజేపీ మళ్లీ వివాదాస్పద అయోధ్యలో 'రామమందిరం' నిర్మాణం అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నది. యూపీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే రామమందిరాన్ని గొప్పగా నిర్మిస్తామని తాజాగా ప్రకటించింది. 'రామమందిరం విశ్వాసానికి సంబంధించిన అంశం. రెండునెలల్లో దీనిని నిర్మించలేం. ఎన్నికలు పూర్తయిన తర్వాత మందిరాన్ని కడతాం. బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుంది' అని యూపీ బీజేపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య విలేకరులకు తెలిపారు. యూపీ సీఎం అఖిలేశ్ ఇటు దళితులను, అటు వెనుకబడిన వర్గాలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీల జాబితాలో 17 ఓబీసీ కులాలను చేర్చేందుకు అఖిలేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు నిలిపివేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
రాజ్యసభలో రామమందిరం కలకలం
అయోధ్యలో రామ మందిరం అంశం మరోసారి రాజ్యసభలో కలకలం రేపింది. బీజేపీ సభ్యుడు సుబ్రమణ్యం స్వామి ఈ అంశాన్ని గురువారం నాటి సభలో ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో ఈ అంశంపై రోజంతా విచారణ జరుగుతోంది కాబట్టి ప్రభుత్వం ఈ అంశంపై ప్రకటన చేయాలని, దీని గురించి ఇప్పటికే అందరూ బాగా విసుగెత్తిపోయారని ఆయన అన్నారు. ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి కూడా సుప్రీంకోర్టులో కేసులు పెండింగులో ఉండిపోవడాన్ని ప్రస్తావించారని, అయితే రామమందిరం అంశం చాలా కష్టమైన సమస్య అని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ఏం చెబితే అది చేయడానికి రెండు వర్గాలూ అంగీకరించాయని, అందువల్ల సుప్రీం నిర్ణయం వస్తే వెంటనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. దీనిపై ప్రతిపక్షాలు ఒక్కసారిగా గగ్గోలు పెట్టాయి. సభ ఏమనుకుంటోందన్న విషయం తెలియాలని, రామమందిర అంశాన్ని గురించి నిర్ణయించాలని ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్యే స్వామి తెలిపారు. సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణపై ప్రభుత్వం ప్రకటన చేయాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పి.జె. కురియన్ అన్నారు. -
'అయోధ్య అంశాన్నివదిలేయలేదు'
నాగ్ పూర్:అయోధ్యలో రామాలయాన్ని నిర్మించే అంశాన్ని తాము వదిలేయలేదని ఆర్ఎస్ఎస్ తాజాగా స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున దానిపై త్వరతగతిన విచారణ చేపట్టాలని కోరుతున్నామని ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ సురేష్ భయ్యాజీ జోషి తెలిపారు. దీనిపై మరోసారి నిరసన కార్యక్రమం చేపట్టే అవసరం ఉన్నా తాము ఎటువంటి ఆందోళన చెందమన్నారు. తమ సభ్యులంతా కూర్చొని చర్చించిన పిదప ఈ అంశంపై ఒక నిర్ణయానికి వస్తామన్నారు. అయోధ్య రామాలయంపై అలహాబాద్ హైకోర్టులో హిందూవులకు అనుకూలంగా తీర్పు వచ్చిన అనంతరం ఈ కేసు సుప్రీంకు వెళ్లిన సంగతి తెలిసిందే.