నాగ్ పూర్:అయోధ్యలో రామాలయాన్ని నిర్మించే అంశాన్ని తాము వదిలేయలేదని ఆర్ఎస్ఎస్ తాజాగా స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున దానిపై త్వరతగతిన విచారణ చేపట్టాలని కోరుతున్నామని ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ సురేష్ భయ్యాజీ జోషి తెలిపారు. దీనిపై మరోసారి నిరసన కార్యక్రమం చేపట్టే అవసరం ఉన్నా తాము ఎటువంటి ఆందోళన చెందమన్నారు. తమ సభ్యులంతా కూర్చొని చర్చించిన పిదప ఈ అంశంపై ఒక నిర్ణయానికి వస్తామన్నారు.
అయోధ్య రామాలయంపై అలహాబాద్ హైకోర్టులో హిందూవులకు అనుకూలంగా తీర్పు వచ్చిన అనంతరం ఈ కేసు సుప్రీంకు వెళ్లిన సంగతి తెలిసిందే.