Ramanujam
-
రెడ్ బుక్ రాజ్యాంగం VS భారత రాజ్యాంగం.. ఇది కేవలం భయభ్రాంతులకు గురి చేయడానికి మాత్రమే..
-
ముద్రగడ కూతురు వీడియోపై సంచలన నిజాలు బయటపెట్టిన అడ్వకేట్ రామానుజం
-
మెగా ఫ్యామిలీపై రామానుజం సంచలన విషయాలు..!
-
దాశరథి వారసుడు రామానుజం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితీవేత్త తిరునగరి రామానుజం అని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. మహాకవి దాశరథి సాహితీ వారసుడిగా రామానుజం నిలుస్తారని అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహాకవి దాశరథి పురస్కారం–2020ని సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో రామానుజానికి అందజేశారు. శాలువా కప్పి సన్మానించడంతో పాటు జ్ఞాపిక, రూ.1,01,116 నగదు పురస్కారం అందించారు. దాశరథి పురస్కారానికి రామానుజం వందకు వంద శాతం అర్హుడని సీఎం అన్నారు. రామానుజం రాసిన బాలవీర శతకం, అక్షరధార, తిరునగరీయం లాంటి రచనలు ఎంతో ఆదరణ పొందాయని చెప్పారు. సంప్రదాయ, సంస్కృత భాష పరిజ్ఞానం కలిగి ఉండటంతో పాటు ఆధునిక సాహిత్య అవగాహన కలిగిన సాహితీవేత్తగా రామానుజం నిలుస్తారని కొనియాడారు. రామానుజం మరిన్ని రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, డైరెక్టర్ మామిడి హరికృష్ణ , సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, రామానుజం కుమారుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై రామానుజం ఓ పద్యం రాసి, పాడి వినిపించారు. ‘‘శ్రీ తెలంగాణమును శ్రీ ఖండమును సేయ అవతరించిన యెట్టి అపర విష్ణుడవీవు.. తెలంగాణమున కోటి ఎకరాలు పారించి పంట భూమిగ మార్చ ప్రతిన బూనిన యట్టి రైతు స్వామివి నీవు జాతి నేతవు నీవు శ్రీ కల్వకుంట్ల క్షీరాబ్ధి చంద్రమా శ్రీ రస్తు శ్రీ చంద్రశేఖరా తెలంగాణ దీపమా విజయోస్తు’’ -
కాల్పులకుగ్రీన్ సిగ్నల్
చెన్నై, సాక్షి ప్రతినిధి: కాల్పులకు డీజీపీ రామానుజం పచ్చ జెండా ఊపారు. నేరాలను అరికట్టే సమయంలో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపవచ్చని ఆయన స్పష్టం చేశారు. అయి తే ఈ ప్రతాపాన్ని అమాయక ప్రజలపై చూపరాదని షరతు విధించారు. తుపాకీ కాల్పులపై తమిళనాడు పోలీసుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు పోటీలు నిర్వహించారు. విజేతలకు డీజీపీ రామానుజం శుక్రవారం బహుమతులను అందజేశారు. అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నేర పరిశోధనలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం పనితీరును జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయాలని కోరారు. కాల్పుల పోటీల్లో విజేతలుగా నిలిచివారిని జాతీయస్థాయి పోటీలకు పంపనున్నట్లు చెప్పారు. తీవ్రవాదులు, రౌడీషీటర్లను అరెస్ట్‌చేసే సమయంలో వారు తిరగబడిన సందర్భాలు అనే కం ఉన్నాయని గుర్తుచేశారు. ఇటువంటి సమయాల్లో పోలీసు అధికారులు తమ ఆత్మరక్షణ కోసం నేరగాళ్లపై కాల్పులు జరిపితే తప్పులేదని అన్నారు. అయితే తుపాకీ వినియోగంలో తమ నైపుణ్యాన్ని ప్రజల వద్ద ప్రదర్శించరాదని హెచ్చరించారు. కాల్పుల పోటీల్లో విజేతలకు గతంలో రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20వేలు అందజేసేవారని, ప్రస్తుత ముఖ్యమంత్రి జయలిత ఈ మొత్తాన్ని పదింతలకు పెంచారని తెలిపారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం రూ.2.8 కోట్ల మొత్తాన్ని పోలీసులకు పంచిపెట్టారని ఆయన వెల్లడించారు. చాంపియన్‌గా సాయుధ పోలీస్ దళం తుపాకీ కాల్పుల పోటీల్లో రాష్ట్ర సాయుధ పోలీస్ దళం చాంపియన్ షిప్‌ను కైవసం చేసుకుంది. చెన్నై పోలీస్ ద్వితీయ, సెంట్రల్ రిజర్వు పోలీస్ తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి. వ్యక్తిగత విజేతలుగా పులియంతోపు సహాయ పోలీస్ కమిషనర్ సుధాకర్ 60 మార్కులతో ప్రథమ స్థానం పొందారు. సీబీసీఐడీ ఎస్పీ అన్బు, దక్షిణ చెన్నై రవాణాశాఖ సహాయ కమిషనర్ దినకరన్, ఈ రోడ్డు ఎస్పీ చక్రవర్తిలు 59 మార్కులతో ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ పోటీల్లో మొత్తం 210 మంది అధికారులు పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన 52 మంది అధికారులకు పతకాలు, కప్పులు బహూకరించారు. -
డీఎండీకే అభ్యర్థి మార్పు
సాక్షి, చెన్నై: కడలూరు అభ్యర్థిని మారుస్తూ డీఎండీకే అధినేత విజయకాంత్ నిర్ణయం తీసుకున్నారు. రామానుజంకు బదులుగా జయ శంకర్ పోటీ చేస్తారని గురువారం ప్రకటించారు. బీజేపీ కూటమితోకలసి లోక్‌సభ ఎన్నికలను డీఎండీకే ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి 14 సీట్లను కేటాయించారు. అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విజయకాంత్ తమ కూటమికి మద్దతుగా ప్రచార బాటలో పయనిస్తున్నారు. రాష్ట్రంలో సుడిగాలి పర్యటన సాగిస్తున్న విజయకాంత్ రెండు రోజుల క్రితం కడలూరులో ప్రచారం చేపట్టాల్సి ఉంది. అయితే, ఆయనకు ఊహించని రీతిలో షాక్ ఎదురు అయింది. ఇప్పటికే నామక్కల్‌లో తనకు సీటు వద్దు బాబోయ్ అంటూ మహేశ్వరన్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోని విజయకాంత్‌కు తాజాగా మరో సమస్య ఎదురైంది. కడలూరు అభ్యర్థి స్థానికుడే కాదన్నది తేలింది. దీంతో అక్కడ పర్యటనను వాయిదా వేసుకుని, పార్టీ నాయకులతో మంతనాలు, చర్చల అనంతరం కొత్త అభ్యర్థిని ప్రకటించే పనిలో పడ్డారు. షాక్: కడలూరు అభ్యర్థిగా రామానుజం పేరును విజయకాంత్ తొలుత ప్రకటించారు. రిటైర్డ్ ప్రొఫెసర్‌గా ఉన్న రామానుజం స్వగ్రామం దిట్టకుడి. పార్టీకి చెన్నై నుంచి ఆయన సేవలను అందిస్తూ వస్తున్నారు. ఆవడి సమీపంలో నివాసం ఉంటున్నారు. అయితే, ఆయన చెన్నైలోనే స్థిర పడ్డ దృష్ట్యా, కడలూరు గురించి తెలిసింది శూన్యం. అక్కడ పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంది లేదు. కడలూరు ప్రచారానికి ముందు రోజు తన దృష్టికి ఈ విషయం రావడంతో విజయకాంత్ విస్మయంలో పడ్డారు. హుటాహుటిన పార్టీ నాయకుల్ని చెన్నైకు పిలిపించి చర్చించారు. వారి నుంచి కూడా అదే సమాధానం రావడంతో ఇక అభ్యర్థిని మార్చాల్సిన సంకట పరిస్థితి విజయకాంత్‌కు ఏర్పడింది. ఇక, నియోజకవర్గంలో ప్రచారం చేపట్టొద్దంటూ రామానుజంను వెనక్కు పంపించేశారు. బరిలో జయ శంకర్: ఎట్టకేలకు కొత్త అభ్యర్థిగా సీఆర్ జయశంకర్‌ను గురువారం విజయకాంత్ ఎంపిక చేశారు. కడలూరు జిల్లా నైవేలికి చెందిన జయ శంకర్ ఫైనాన్సియర్, ఆ జిల్లా పరిధిలో 25కు పైగా ఫైనాన్స్ కార్యాలయ శాఖలు ఉండడంతోపాటు సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి. ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థినే విజయకాంత్ ఎంపిక చేశారు. జయ శంకర్ వద్ద 30 వేల మందికి పైగా పని చేస్తుండటంతో సరైన అభ్యర్థిని రంగంలోకి దించారన్న ప్రచారం మొదలైంది. ఇన్నాళ్లు అభ్యర్థులను మార్చే అలవాటు అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మాత్రమే ఉండేది. దీనిపై పలు మార్లు విజయకాంత్ విమర్శలు గుప్పించి ఉన్నారు. అయితే, తాజాగా అదే పరిస్థితి ఆయనకు రావడం గమనార్హం. -
అమెరికా ‘అక్రమ’ ఓడపై ఐబీ, రా విచారణ
చెన్నై/న్యూఢిల్లీ: ఆయుధాలు, పేలుడు సామగ్రి తీసుకెళ్తూ భారత జలాల్లోకి ప్రవేశించిన అమెరికా నౌక ‘ఎంవీ సీమేన్ గార్డ్ ఓహియో’పై కేంద్ర విచారణ సంస్థలు పరిశోధన, విశ్లేషణ విభాగం (రా), ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబీ) విచారణ చేపట్టాయి. అంతకుముందు ఓడను నిర్భందించిన సంఘటనపై తమిళనాడు ప్రభుత్వం ప్రాథమిక విచారణ నివేదికను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపింది. ఈ కేసును తదుపరి విచారణ కోసం తమిళనాడు ప్రభుత్వం మెరైన్ పోలీసుల నుంచి క్యూ బ్రాంచ్‌కు బదిలీ చేసిందని ఆ విభాగం డీజీపీ రామానుజం వెల్లడించారు. అయితే ఓడలో తీసుకువెళుతున్న ఆయుధాలకు సంబంధించి పూర్తి వివరాలు ఓడ సిబ్బంది వద్ద ఉన్నాయో, లేవో నిగ్గు తేల్చి కేంద్రానికి రా, ఐబీ సమగ్ర నివేదిక ఇస్తాయని అధికార వర్గాలు చెప్పాయి. శనివారం ట్యుటికోరిన్‌కు 15 నాటికల్ మైళ్ల దూరంలోకి సియర్రా లియోన్‌లో నమోదైన అమెరికా నౌక భారత జలాల్లోకి వచ్చినపుడు జాతీయ కోస్ట్ గార్డులు నిర్భందించిన సంగతి తెలిసిందే. ఆ ఓడకు డీజిల్ అక్రమంగా సరఫరా చేసిన ఇద్దరు తమిళనాడు పౌరులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారు డీజిల్ మాత్రమే సరఫరా చేశారా లేక ఆయుధాల కోసం వెళ్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓడ సిబ్బంది 10, గార్డులు 25 మందిపై ఆయుధాల చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.