Ramos
-
లాస్ట్ మ్యాచ్ ఆడేసిన మెస్సీ
స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ పారిస్ సెయింట్-జెర్మైన్ (PSG) క్లబ్ తరఫున తన ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. ఈ మ్యాచ్‌లో పీఎస్జీ.. క్లెర్మాంట్ క్లబ్ చేతిలో 2-3 గోల్స్ తేడాతో ఓటమిపాలైంది. మెస్సీతో పాటు సెర్గియో రామోస్‌కు కూడా పీఎస్జీ తరఫున ఇదే చివరి మ్యాచ్. తొలి అర్ధ భాగంలో పీఎస్జీ తరఫున రామోస్, ఎంబపె చెరో గోల్ సాధించగా.. క్లెర్మాంట్ తరఫున జోహన్ గస్టీన్, మెహ్ది జెఫ్ఫానే గోల్స్ చేశారు. అనంతరం సెకెండ్ హాఫ్‌లో (63వ నిమిషం) గ్రెజాన్ కై గోల్ చేసి క్లెర్మాంట్‌కు ఆధిక్యాన్ని అందించాడు. ఇదే లీడ్ చివరి వరకు కొనసాగడంతో క్లెర్మాంట్.. పీఎస్‌జీపై విజయం సాధించింది. సెకెండ్ హాఫ్‌లో మెస్సీకి రెండు గోల్స్ చేసే అవకాశం (ఫ్రీ కిక్) వచ్చినా, అవి వర్కౌట్ కాలేదు. మొత్తంగా ప్రస్తుత తరంలో ఫుట్‌బాల్ దిగ్గజాలుగా చెప్పుకునే మెస్సీ, రామోస్ ఓటమితో పీఎస్జీకి వీడ్కోలు పలికారు. కాగా, మెస్సీ.. సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్ క్లబ్‌తో కళ్లు చెదిరే మొత్తానికి ఒప్పందం చేసుకున్నాడని సమాచారం. కొద్ది రోజుల్లో ఈ విషయాన్ని అల్ హిలాల్ ప్రకటిస్తుందని తెలుస్తోంది. మెస్సీ సహచరుడు, పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో సైతం సౌదీ అరేబియాకు చెందిన ఓ క్లబ్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. చదవండి: జొకోవిచ్ రికార్డు -
కూతుళ్ల కోసం ‘తల్లి’గా మారాడు!
క్విటో(ఈక్వెడార్): కన్న కూతుళ్లంటే ఆ తండ్రి ఎంతో ఇష్టం. విడిపోయిన భార్య వద్ద ఉన్న ఇద్దరు కూతుళ్ల కస్టడీ తనకే ఇవ్వాలంటూ కోర్టులో కేసు వేశాడు. అయితే, తల్లి వద్దే కూతుళ్లు ఉండాలంటుంది చట్టం. అందుకే, కూతుళ్లకు తల్లి ప్రేమను పంచేందుకు దుస్సాహసమే చేశాడు ఆ తండ్రి. ఏకంగా లింగమార్పిడి చేసుకుని మహిళగా మారాడు. ఇప్పుడైనా చట్టం కూతుళ్లను తన వద్దకే పంపిస్తుందని ఆశపడుతున్నాడు..! ఈ ఘటన దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్‌లో చోటుచేసుకుంది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. రెనె సలినాస్ రమోస్(47), అతని భార్య విడిపోయారు. చట్టం ప్రకారం వీరి సంతానం తల్లి సంరక్షణలోనే ఉండాలి. మహిళ మాత్రమే బిడ్డలకు ప్రేమను అందిస్తుందని చట్టం అంటోంది. భార్య ఐదు నెలలుగా కూతుళ్లను కలుసుకునే అవకాశం లేకుండా చేస్తోందని అంటున్నాడు. తనకెంతో ఇష్టమైన కూతుళ్లు దూరం కావడం తట్టుకోలేని రమోస్ మరో మార్గం ఆలోచించాడు. ఏకంగా లింగమార్పిడి చేయించుకుని, మహిళగా మారాడు. అధికార రికార్డుల్లో మహిళగానే ఉన్నా, నిత్య జీవితంలో పురుషుడిగానే చెలామణి అవుతున్నాడు. మహిళగా మారినందున, కోర్టు కేసు గెలుస్తాననే నమ్మకంతో ఉన్నాడు. తల్లి వద్ద ఇబ్బందులు పడుతున్న తన బిడ్డలకు తల్లిగా మారుతానంటున్నాడు. ఈక్వెడార్ ఎల్జీబీటీఐ హక్కుల సంస్థలు మాత్రం రమోస్ చర్యపై మండిపడుతున్నాయి. -
పోర్చు‘గోల్స్’ మోత
దోహా: ఆరంభం నుంచి సూపర్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోను ఆడించకపోయినా... తమ జట్టులో ప్రతిభావంతులకు కొదవలేదని నిరూపిస్తూ పోర్చుగల్ జట్టు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో కళ్లు చెదిరే ప్రదర్శనతో మెరిసింది. ఆద్యంతం దూకుడుగా ఆడుతూ, పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ రొనాల్డో లేకున్నా పోర్చుగల్ జట్టు భవిష్యత్‌కు ఢోకా లేదని నిరూపించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన చివరి ప్రిక్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ 6–1 గోల్స్ తేడాతో స్విట్జర్లాండ్‌ను చిత్తుగా ఓడించి 16 ఏళ్ల తర్వాత మళ్లీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పోర్చుగల్ తరఫున తొలి ప్రపంచకప్‌లో ఆడుతున్న 21 ఏళ్ల గొన్సాలో రామోస్ (17వ, 51వ, 67వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ నమోదు చేయగా... పెపె (33వ ని.లో), రాఫెల్ గెరెరో (55వ ని.లో), రాఫెల్ లియా (90+2వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. స్విట్జర్లాండ్ జట్టుకు మాన్యుయెల్ అకాంజీ (58వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. చివరిసారి 1954లో ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన స్విట్జర్లాండ్ ఆ తర్వాత ఐదుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. మరోవైపు ఎనిమిదోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న పోర్చుగల్ మూడోసారి క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. 1966లో మూడో స్థానంలో నిలిచిన పోర్చుగల్, 2006లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఈనెల 10న జరిగే క్వార్టర్ ఫైనల్లో మొరాకోతో పోర్చుగల్ తలపడుతుంది. తొలిసారి సబ్‌స్టిట్యూట్‌గా రొనాల్డో... వరుసగా ఐదో ప్రపంచకప్‌లో ఆడుతున్న పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో తొలిసారి తుది 11 మంది జట్టులో చోటు కోల్పోయాడు. రొనాల్డో స్థానంలో గొన్సాలో రామోస్‌ను తొలి నిమిషం నుంచి ఆడించాలని కోచ్ ఫెర్నాండో సాంటోస్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. జాతీయ జట్టుకు ఒక్క మ్యాచ్ ఆడకుండానే నేరుగా ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించిన రామోస్ ఘనా, ఉరుగ్వేలతో మ్యాచ్‌ల్లో సబ్‌స్టిట్యూట్‌గా చివరి నిమిషాల్లో బరిలోకి దిగాడు. అయితే కీలకమైన మ్యాచ్‌లో అత్యంత అనుభవజ్ఞుడు, 37 ఏళ్ల రొనాల్డోను కాదని రామోస్‌ను ఆరంభం నుంచే ఆడించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే తన ఎంపిక సరైనదేనని రామోస్ నిరూపించుకున్నాడు. మూడు గోల్స్ చేయడమే కాకుండా గెరెరో గోల్ చేయడానికి రామోస్ సహాయపడ్డాడు. పోర్చుగల్ ఖాతాలో ఐదు గోల్స్ జమయ్యాక.. 74వ నిమిషంలో రొనాల్డోను జావో ఫెలిక్స్ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి పంపించారు. ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో రొనాల్డో రిజర్వ్ బెంచ్‌కు పరిమితమై మ్యాచ్ మధ్యలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
Texas shooting: ఫేస్బుక్లో ప్రకటించి మరీ...
హూస్టన్: హంతకుడు రామోస్ ఫేస్బుక్లో ముందుగా ప్రకటించి మరీ నరమేధానికి పాల్పడ్డాడు! ‘నానమ్మను కాల్చబోతున్నా’ అని మంగళవారం 11 గంటలప్పుడు ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఆమెను కాల్చాక, ‘ఇప్పుడు స్కూల్లో షూటౌట్‌కు బయల్దేరుతున్నా’’ అంటూ మరో పోస్ట్ చేశాడు. అరగంటకే దారుణానికి తెగబడ్డాడు. దీనిపై ఉదయం నుంచీ పలు సంకేతాలిస్తూ వచ్చాడు. ‘ఓ చిన్న రహస్యం చెప్పాలనుకుంటున్నా’ అంటూ లాస్‌ఏంజెలెస్‌కు చెందిన ఓ యువతికి ఇన్‌స్టాగ్రాంలో మంగళవారం ఉదయమే మెసేజ్ చేశాడు. ‘‘ఇంకాసేపట్లో నేను...’’ అంటూ 9.16కు ఓ స్మైలీ ఎమోజీ పెట్టాడు. ‘‘11 గంటల లోపు చెప్తా’’ అంటూ ముగించాడు. 11.30కు నరమేధం సృష్టించాడు. తన టిక్‌టాక్ పేజీ పరిచయంలో ‘పిల్లలూ! నిజ జీవితంలో కూడా భయపడేందుకు రెడీగా ఉండండి’’ అని కూడా రాసుకున్నాడు! కాల్పులకు వాడిన తుపాకులను, మేగజైన్లను రామోస్ తన 18వ పుట్టిన రోజు సందర్భంగా గత వారమే కొన్నాడు. వాటితో పోజిస్తూ ఫొటోలు దిగడమే గాక ఇన్‌స్టాగ్రాంలో అప్లోడ్ చేశాడు. టెక్సాస్‌లో 18 ఏళ్లు నిండితే లైసెన్సుతో పని లేకుండా తుపాకులు కొనుక్కోవచ్చు. నానమ్మతో నిత్యం గొడవలే డిగ్రీ చదవలేకపోయానంటూ రామోస్ నిత్యం బాధపడేవాడని పొరుగువారు చెప్పారు. ఈ విషయమై నిత్యం నానమ్మతో గొడవ కూడా పడేవాడన్నారు. స్థానిక విండీస్ సరుకుల దుకాణంలో పని చేసే అతనిది దూకుడు మనస్తత్వమని సహోద్యోగులు చెబుతున్నారు. ‘‘ఎప్పుడూ మౌనంగా ఉండేవాడు. మహిళా ఉద్యోగులకు అసభ్య మెసేజీలు పంపేవాడు. వాళ్లతో చాలా దురుసుగా ప్రవర్తించేవాడు. స్థానిక పార్కులో పలువురితో బాక్సింగ్ చేసేవాడు’’ అన్నారు. అతనికి తల్లితోనూ సరిపడేది కాదని, అందుకే కొద్ది నెలల క్రితమే నానమ్మ ఇంటికి వచ్చాడని చెప్పారు. రామోస్ స్కూల్ మేట్స్ సోమవారం డిగ్రీ పూర్తి చేసి పట్టాలు తీసుకున్నారని సమాచారం. ఆ ఆక్రోశంతోనే దారుణానికి ఒడిగట్టాడని భావిస్తున్నారు. నానమ్మపై కాల్పులు జరిపి, ‘నన్ను కాల్చేస్తున్నాడు’ అని ఆమె అరుస్తుండగానే కారెక్కి స్కూలుకేసి దూసుకెళ్లాడు. నత్తితో బాధపడేవాడు రామోస్‌కు నత్తి ఉండేదని, దాంతో బాల్యంలో స్కూళ్లో తోటి పిల్లల చేతిలో చాలా అవమానాలకు గురయ్యాడని అతని సహ విద్యార్థి చెప్పాడు. ‘‘రామోస్ నత్తిని, అతను వేసుకునే నాసిరకం బట్టలను పిల్లలంతా బాగా వెక్కిరించేవారు. అతని పేదరికాన్ని కూడా హేళన చేసేవారు. చూట్టానికి గే మాదిరిగా కన్పిస్తున్నావంటూ ఆటపట్టించేవారు. అది భరించలేక అతను స్కూలు ఎగ్గొట్టేవాడు. చివరికి మొత్తానికే మానేశాడు’’ అని చెప్పుకొచ్చాడు. తర్వాత షూటింగ్ అంటే ఇష్టం పెంచుకున్నాడని, కాల్ ఆఫ్ డ్యూటీ అనే ఫైటింగ్ గేమ్‌కు వీరాభిమానిగా మారాడని వివరించాడు. -
16 ఏళ్ల తర్వాత...
ఫ్రెంచ్ ఓపెన్‌కు వర్షం దెబ్బ సోమవారం మ్యాచ్‌లన్నీ రద్దు పారిస్: వారం రోజులుగా సంచలన ఫలితాలతో సాగుతోన్న టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో సోమవారం షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన అన్ని మ్యాచ్‌లను రద్దు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఒక రోజు ఒక్క మ్యాచ్ కూడా సాధ్యపడకపోవడం 16 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారి సరిగ్గా 16 ఏళ్ల క్రితం 2000లో మే 30వ తేదీన ఫ్రెంచ్ ఓపెన్‌లో వర్షం కారణంగా ఒక్క మ్యాచ్ జరగలేదు. నిషికోరి కూడా అవుట్: ఆదివారం ఆలస్యంగా ముగిసిన మ్యాచ్‌ల్లో మరో సంచలనం నమోదైంది. ఐదో సీడ్ కీ నిషికోరి పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. తొమ్మిదో సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 6-4, 6-2, 4-6, 6-2తో నిషికోరిని బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)తో గాస్కే; రామోస్ (స్పెయిన్)తో వావ్రింకా తలపడతారు.