rangareddy cistrict
-
‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరార య్యాయి. ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు కేటాయిస్తూ అధికారులు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే, జెడ్పీ చైర్మన్ స్థానానికి ఇంకా రిజర్వేషన్ ఖరారు కాలేదు. ఇది రాష్ట్ర స్థాయిలో ప్రకటించాల్సి ఉండడంతో మరికొంత సమయం పట్టవచ్చని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా, బీసీ ఓటర్ల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని రిజర్వేషన్లు కేటాయించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన 2011 నాటి జనాభాను పరిగణనలోకి తీసుకున్నారు. ఎంపీపీలకు రాష్ట్రం, జెడ్పీటీసీలకు జిల్లా, ఎంపీటీసీలకు మండలం జనాభా యూనిట్‌గా తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బీసీలకు రెండు ఎంపీపీలే.. జిల్లాలో 21 ఎంపీపీలకుగాను 10 స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించగా, మిగతావి అన్ రిజర్వ్డ్ కోటాలోకి వెళ్లాయి. రిజర్వ్ చేసిన స్థానాల్లో ఎస్టీకి మూడు, ఎస్సీకి ఐదు, బీసీలకు రెండు స్థానాలు దక్కాయి. మిగిలిన 11 అన్‌రిజర్‌డ్డŠవ్ స్థానాల్లో ఐదు మహిళల ఖాతాల్లోకి వెళ్లాయి. మొత్తం ఎంపీపీల్లో 9 స్త్రీలకు దక్కాయి. ఎస్సీలకు రెండు జెడ్పీటీసీలు మొత్తం 21 జెడ్పీటీసీల్లో 10 స్థానాలకు రిజర్వేష్లను వర్తింపజేశారు. వీటిలో ఎస్టీలకు రెండు, ఎస్సీలకు, బీసీలకు నాలుగు చొప్పున దక్కాయి. అన్‌రిజర్‌డ్డŠవ్ 11 స్థానాల్లో ఐదు మహిళా కోటా కింద వెళ్లాయి. మొత్తం జెడ్పీటీసీల్లో 10 స్థానాలు మహిళలకు దక్కాయి. మహిళలకు 123 ఎంపీటీసీలు స్థానిక సంస్థల్లో మహిళలకు తప్పనిసరిగా 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. ఈ మేరకు మొత్తం 257 ఎంపీటీసీల్లో 123 మహిళలకు దక్కాయి. ఒక్కో మండలంలో కేటగిరీల వారీగా ఎంపీటీసీలు బేసి సంఖ్యలో ఉండటంతో 50 శాతం చేయడం సాధ్యం కాదు. 50 శాతం చేయగా వచ్చిన ఫలితాన్ని.. తదుపరి అంకెకు రౌండప్ చేస్తారు. ఇందులో ఎక్కువ సంఖ్యను మహిళలకు, తక్కువ సంఖ్యను జనరల్‌గా పరిగణిస్తారు. మహిళా కోటాకు ఈ సూత్రాన్ని అనుసరిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. -
గజిబిజి.. గందరగోళం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సీట్ల పంపకాలు.. అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ సాచివేత ధోరణి మిత్రపక్షాలను డోలాయమానంలో పడేస్తోంది. నామినేషన్ల పర్వం దగ్గర పడుతున్నా సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో టీడీపీ, టీజేఎస్ పార్టీల్లో సస్పెన్స్ నెలకొంది. సీట్ల సంఖ్యపై స్పష్టత వచ్చినట్లు ప్రచారం జరుగుతునప్పటికీ, ఏయే స్థానాలు కేటాయించారనేది తేలకపోవడంతో మహాకూటమిలో గందరగోళం నెలకొంది. మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాలను గురువారం కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించినా.. ఇందులో మన జిల్లాలో ఆ పార్టీలకు ఇచ్చే సీట్లు ఏవీ అనేది ప్రకటించలేదు. ఒకవైపు అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో కాంగ్రెస్‌లో ప్రతిష్టంభన నెలకొంది. దీనికితోడు భాగస్వామ్య పక్షాలకే కేటాయించేస్థానాలపైనా ఉత్కంఠ కొనసాగిస్తోంది. దీంతో మొత్తంగా సీట్ల కేటాయింపు ప్రక్రియ గందరగోళంగా మారింది. రోజుకో మాట.. గురువారం లోపు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని మొదట ప్రకటించిన కాంగ్రెస్.. తాజాగా మరో రెండు రోజుల గడువు తీసుకుంది. శనివారం నాడు తొలి జాబితాను విడుదల చేస్తామని స్పష్టం చేసింది. దీంతో ఆ పార్టీ ఆశావహుల్లో నరాలు తెగే ఉత్కంఠకు తెరలేపింది. ఇదిలావుండగా, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాతోపాటు మహాకూటమి అభ్యర్థులను ఒకేసారి ప్రకటిస్తారనే ప్రచారంతో ఎవరెవరికి ఏ సీటు కేటాయిస్తారో తేలిపోతుందని అంతా భావించారు. కానీ, అభ్యర్థుల వడపోతలో కాంగ్రెస్ చేస్తున్న జాప్యం మిత్రపక్షాలను కలవరపరుస్తోంది. దీనికితోడు పొత్తులపై జరుగుతున్న రోజుకో ప్రచారం.. ఎవరి సీటుకు ఎసరు తెస్తుందోననే ఆందోళన కలుగుతోంది. టీడీపీకి ఉప్పల్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి ఇవ్వనున్నట్లు ఇరుపార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీటిపై అధికారికంగా ప్రకటన చేస్తే తప్ప స్పష్టత రాదు. అయితే, ఆ లోపు ఈ సీటుపై కన్నేసిన కాంగ్రెస్ ఆశావహుల్లో టెన్షన్ పెరగడమేగాకుండా సీటు దక్కకపోతే అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా రచిస్తున్నారు. ఒకవేళ వీటిని టీడీపీకి కేటాయించాలని భావిస్తే ముందుగానే ఆశావహులను బుజ్జగించడం ద్వారా నష్టనివారణ చర్యలకు దిగే ఆస్కారముంది. కానీ, ఇప్పటివరకు అభ్యర్థుల ఖరారు క్రతువు మొదలు పెట్టకపోవడం.. మిత్రపక్షాలకిచ్చే సీట్లను ప్రకటించకపోవడంతో గందరగోళం తలెత్తింది. ఇదిలావుండగా, రాజేంద్రనగర్ స్థానంపై కూడా అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే కుటుంబానికి ఒక టికెట్టు అంక్ష ఈ సీటును ఆశిస్తున్న కార్తీక్‌రెడ్డికి ప్రతిబంధకంగా మారగా.. తాజాగా టీడీపీ జాబితాలో ఈ స్థానం కూడా ఉందని ప్రచారం జరుగుతుండడం గమనార్హం. -
గుడుంబా రహిత జిల్లా!
► 21న ప్రకటన చేసే అవకాశం సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాను గుడుంబా రహిత ప్రాంతంగా ప్రకటించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈ నెల 21న దీనిపై ప్రకటన చేయాలని కలెక్టర్ రఘునందన్‌రావు నిర్ణయించారు. గుడుంబా తయారీ, వినియోగం, నష్టాలపై ఎక్సైజ్ శాఖ చేపట్టిన అవగాహన, చైతన్య కార్యక్రమాలతో సత్ఫలితాలు వచ్చాయని, దీంతో ఇప్పటికే 95శాతం గుడుంబా రహిత ప్రాంతంగా గుర్తించినట్లు చెప్పారు. గుడుంబా విక్రయాలను కూడా పూర్తిగా అరికట్టినట్లు చెప్పారు. ఈ క్రమంలో ఈనెల 21న వికారాబాద్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో బహిరంగ సభ నిర్వహించి గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించనున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
ఎమ్మెల్యే సంజీవరావుకు తప్పిన ప్రమాదం
హైదరాబాద్: ఎమ్మెల్యే సంజీవరావుకు పెను ప్రమాదం తప్పింది. శనివార రాత్రి ఎమ్మెల్యే వెళ్తున్న కారు రంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుల పోలీస్ వాహనాన్ని ఢీకొంది. అయితే ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడ్డాడు. ఆయన వాహనం మాత్రం స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.