ranji cricket
-
కోహ్లి చేసిన తప్పిదే.. ఇకనైనా మారుతాడా?
-
రంజీ క్రికెట్ కింగ్ రషీద్
గుంటూరు వెస్ట్: విజయాలకు అడ్డదారులుండవు. కఠోర సాధనతోపాటు క్రమశిక్షణ ఎంతటి వారినైనా విజయతీరాల వైపు నడిపిస్తాయని గుంటూరుకు చెందిన షేక్ రషీద్ నిరూపిస్తున్నాడు. ఇంతై వటుడింతై అన్నట్లు అండర్–14 చిన్నారుల క్రికెట్ నుంచి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలాంటి వారితో క్రికెట్ ఆడే అవకాశాల్ని దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆంధ్ర రంజీ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కేవలం 21 సంవత్సరాల వయస్సులోనే ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కడం మరో విశేషం. దాదాపు 20 ఏళ్ల తర్వాత గుంటూరు జిల్లాకు రంజీ సారథ్యం లభించడం విశేషం. ఎంఎస్కే ప్రసాద్ తర్వాత రషీదే కావడం గమనార్హం. గల్లీ క్రికెట్ నుంచి ఢిల్లీ క్రికెట్ వరకు లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు ఆడే ప్రతి జట్టుకు నమ్మదగిన బ్యాటర్‌గా చక్కని సేవలందిస్తున్నాడు. రెండేళ్ల నుంచి చైన్నె సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతి సాధారణ కుటుంబంలో పుట్టిన ఈ యువకుడు స్థానిక ఎన్జీఓ కాలనీలో కుటుంబంతో జీవిస్తున్నాడు.జీవితాన్ని మార్చేసిన అండర్–19 భారత జట్టు స్థానం2021లో అండర్–19 భారత జట్టులో రషీద్ స్థానం సంపాదించడంతోపాటు వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. 2022లో భారత జట్టు ప్రపంచ కప్ సాధించడంలో కీలక భూమిక పోషించాడు. దీంతోపాటు చాలెంజర్స్ ట్రోఫీకి ఎంపికవ్వడమే కాకుండా ఇండియా –డి జట్టుకు సారథ్యం వహించి తన జట్టును చాంపియన్‌గా నిలబెట్టాడు. ఈ ట్రోఫీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తోపాటు 274 పరుగులు సాధించాడు. 2022లో కోల్కొత్తాలో జరిగిన ట్రయాంగిల్ సిరీస్, ఏషియన్ పోటీలోనూ చక్కగా రాణించాడు. ఈ ఏడాది దులీప్ ట్రోఫీలో మ్యాచ్‌లు ఆడుతున్నాడు.కొహ్లి ఆటంటే ఎంతో ఇష్టంరషీద్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్. మైదానంలో సొగసైన డ్రైవ్స్‌తో అందరినీ ఆకట్టుకుంటాడు. తడబాటుకు తావులేకుండా ఆడడమే తన విజయ రహస్యమంటాడు. ప్రతి మ్యాచ్‌లోనూ ఔటైన విధానాన్ని నెట్ ప్రాక్టీస్‌లో సరి చేసుకుంటాడు. దీని కోసం బౌలర్లకు కఠిన పరీక్షలు పెడతాడని సహచర క్రికెటర్లు సరదాగా అంటుంటారు. ముఖ్యంగా రషీద్‌కు విరాట్ కోహ్లి ఆరాధ్య క్రికెటర్. కోహ్లి ఆడే విధానం, అతడి దృఢ చిత్తం గొప్పవరమని రషీద్ అంటాడు. కోహ్లి ఆటతోపాటు ఫిట్‌నెస్‌పై తీసుకునే జాగ్రత్తలు ప్రతి క్రికెటర్‌కు మార్గదర్శకాలని కితాబునిస్తాడు. -
జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా శరత్
జాతీయ జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా తమిళనాడు రంజీ క్రికెట్ జట్టు మాజీ కెపె్టన్ శ్రీధరన్ శరత్ బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు జట్టు తరఫున 100 రంజీ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా శరత్ ఘనత వహించాడు. ఈ కమిటీలో కిషన్ మోహన్, రణదేవ్ బోస్, పథీక్ పటేల్, హరీ్వందర్ సింగ్ సోధీ ఇతర సభ్యులు. ఈ కమిటీ వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా జరిగే అండర్–19 ప్రపంచ కప్ కోసం త్వరలోనే భారత జట్టును ఎంపిక చేయనుంది. -
కేటీఆర్ పీఏనంటూ మోసాలు
సాక్షి, హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శినంటూ ఓ ఘరానా నేరగాడు వరుస మోసాలు చేస్తున్నాడు. గతేడాది నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి రూ.3.3 లక్షలు వసూలు చేసి.. మరో రూ.2 లక్షలు దండుకోవడానికి స్కెచ్ వేసి సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. తాజాగా ఓ ఫార్మా కంపెనీకి ఫోన్ చేసిన ఇతగాడు రూ.15 లక్షలు వసూలు చేయడానికి ప్రయత్నించాడు. దీనిపై జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదు కాగా.. నిందితుడు బి.నాగరాజును ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఇతగాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ రంజీ ఆటగాడు కావడం గమనార్హం శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగరాజుపై ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లోనూ ఏడు కేసులు నమోదయ్యాయి. గత ఏడాది నగరానికి చెందిన ఓ రియల్ఎస్టేట్ సంస్థ సీఎండీకి ఫోన్ చేసి మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శి తిరుపతిని మాట్లాడుతున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగరాజు బొడుమూరు అనే యువకుడు క్రికెట్లో ప్రతిభ కనబరుస్తున్నాడని, ఇంగ్లాండ్‌లో జరిగే అండర్– 25 వరల్డ్ కప్‌కు అతడు సెలెక్ట్ అయ్యాడని చెబితే తనను తానే ప్రమోట్ చేసుకున్నాడు. నాగరాజు (తాను) టోర్నీతో పాటు 20–20 సన్‌రైజ్ టీమ్‌కూ ఎంపికయ్యాడని చెబుతూ.. నాగరాజు పేద కుటుంబానికి చెందిన వాడని చెప్పుకొన్నాడు. అతడికి క్రికెట్ కిట్‌తో పాటు లండన్ టూర్ ఖర్చుల స్పాన్సర్ షిప్ అవసరం ఉందని, అందుకు రూ. 3.3 లక్షలు ఖర్చవుతాయన్నాడు. ఇదంతా విన్న సదరు సీఎండీ పూర్తిగా తన మాటల వలలో పడ్డారని మోసగాడు నిర్ధారించుకున్నాడు. దీంతో స్పాన్సర్షిప్ నగదును డిపాజిట్ చేయాలంటూ ఓ బ్యాంకు ఖాతా నంబర్ ఇచ్చాడు. ఈ టోర్నీకి సంబంధించిన క్రికెట్ కిట్‌ను నాగరాజు బెంగళూర్‌లో మీ కంపెనీ పేరుతోనే ప్రింట్ చేయిస్తున్నాడని, దాన్ని కేటీఆర్ చేతుల మీదుగా ఆయ కార్యాలయంలో, మీడియా సమక్షంలో అందుకుంటాడని చెప్పాడు. ఇది మీ కంపెనీకి మంచి పబ్లిసిటీ ఇస్తుందంటూ నమ్మించాడు. ఇతని మాటల్ని అనుమానించిన ఆ సంస్థ ప్రతినిధులు తొలుత సందేహించారు. తమకు కాల్ వచ్చిన ఫోన్ నంబర్‌ను ట్రూ కాలర్ యాప్‌లో తనిఖీ చేయగా అందులో తిరుపతి అనే పేరే కనిపించింది. దీంతో అతడు కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శిగానే నమ్మిన సంస్థ నగదును ఆంధ్రప్రదేశ్‌లోని నర్సన్నపేట్‌లోని కెనరా బ్రాంచ్ శాఖలో ఉన్న ఖాతాకు బదిలీ చేశారు. త్వరలో ఎల్బీస్టేడియంలో కేటీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారనీ నాగరాజు ఆ కంపెనీ వారితో చెప్పాడు. ఆ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా మీ సంస్థనే సార్ ఎంపిక చేశారంటూ మరో ఎర వేశాడు. ఆపై మా బంధువు ఒకరు రాజమండ్రిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, బిల్లుల కోసం రూ.2 లక్షలు సహాయం చేయాలని కోరాడు. రాజమండ్రిలోని ఎస్బీఐ శాఖలో అప్పలనాయుడు పేరుతో ఉన్న ఖాతా వివరాలను పంపాడు. దీంతో అనుమానం వచ్చిన సంస్థ ప్రతినిధులు ఆరా తీయగా తాము మోసపోయామని తేలింది. బాధ్యుల్ని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు నాగరాజును అరెస్టు చేశారు. తాజాగా నగరానికి చెందని ఓ ఫార్మా కంపెనీకి కేటీఆర్ పీఏగా పని చేస్తున్న తిరుపతిరెడ్డి పేరుతో నాగరాజు కాల్ చేశాడు. కాలుష్య నియంత్రణ మండలి మీ సంస్థను మూసేస్తోందని, అలా కాకుండా చేయాలంటే రూ.15 లక్షలు చెల్లించాలని చెప్పాడు. దీనిపై జూబ్లీహిల్స్‌లో కేసు నమోదు కాగా.. రంగంలోకి దిగిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు తన బృందంలో వల పన్నారు. సోమవారం నాగరాజు కదలికల్ని గుర్తించి అరెస్టు చేశారు. 2014– 16 మధ్య ఆంధ్రప్రదేశ్ తరఫున రంజీ జట్టులో ఎంపికైన బుడుమూరు నాగరాజు గతంలోనూ అనేక మంది ప్రముఖుల పేర్లు చెప్పుకొని మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. బీసీసీఐ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్‌గా పలువురికి ఫోన్లు చేసి వసూళ్లు, మరో ప్రముఖ రాజకీయ నాయకుడి వ్యక్తిగత సహాయకుడిగా పేర్కొంటూ ఢిల్లీలోని ఓ ఆస్పత్రి నిర్వాహకుడి నుంచి డబ్బు డిమాండ్ చేసి అరెస్టు అయినట్లు పోలీసులు చెబుతున్నారు. -
ఆంధ్ర అదరహో
సాక్షి, ఒంగోలు: ఈ సీజన్లో మరోసారి ఆంధ్ర రంజీ క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. కేరళతో మూడు రోజుల్లోనే ముగిసిన రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆంధ్ర నాలుగు విజయాలు సాధించి, రెండింటిని ‘డ్రా’గా ముగించింది. 18 జట్లున్న ఎలైట్ ‘ఎ అండ్ బి’ గ్రూప్‌లో ప్రస్తుతం ఆంధ్ర 27 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 93 పరుగులతో వెనుకబడి ఆట మూడో రోజు బుధవారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ జట్టును ఆంధ్ర పేస్ బౌలర్లు మొహమ్మద్ రఫీ, యెర్రా పృథ్విరాజ్, శశికాంత్ హడలెత్తించారు. ఫలితంగా కేరళ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన రఫీ రెండో ఇన్నింగ్స్‌లో 29 పరుగులిచ్చి 3 వికెట్లు... పృథీ్వరాజ్ 26 పరుగులిచ్చి 3 వికెట్లు, శశికాంత్ 47 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి కేరళ పతనాన్ని శాసించారు. అనంతరం 43 పరుగుల విజయలక్ష్యాన్ని ఆంధ్ర జట్టు 15.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హైదరా బాద్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ చేతిలో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. -
హడలెత్తించిన శశికాంత్
సాక్షి, ఒంగోలు: ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆంధ్ర రంజీ క్రికెట్ జట్టు బౌలర్ కేవీ శశికాంత్ తన పేస్ పదును మరోసారి ప్రదర్శించాడు. హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. ఫలితంగా ఆంధ్ర జట్టుతో ఇక్కడి సీఎస్ఆర్ శర్మ కాలేజీ మైదానంలో మొదలైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి రోజు తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులకే ఆలౌటైంది. శశికాంత్ 60 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. తన్మయ్, అక్షత్ రెడ్డి, మల్లికార్జున్, సీవీ మిలింద్, హిమాలయ్ అగర్వాల్‌లను శశికాంత్ అవుట్ చేశాడు. మరో బౌలర్ యెర్రా పృద్విరాజ్ మూడు వికెట్లు తీయగా... పైడికాల్వ విజయ్ కుమార్, బండారు అయ్యప్ప ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ సీజన్లో ఓ ఇన్నింగ్స్‌లో నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం శశికాంత్‌కిది ఐదోసారి. ఇందులో మూడుసార్లు ఐదేసి వికెట్ల చొప్పున, రెండుసార్లు నాలుగేసి వికెట్ల చొప్పున తీశాడు. హైదరాబాద్ జట్టులో జావీద్ అలీ (161 బంతుల్లో 98; 16 ఫోర్లు) తప్ప మిగతా ప్లేయర్లు చేతులెత్తేశారు. జావీద్ రెండు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. అనంతరం ఆంధ్ర తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. జ్ఞానేశ్వర్ (4 బ్యాటింగ్; ఫోరు), ప్రశాంత్ (9 బ్యాటింగ్; ఫోరు) క్రీజులో ఉన్నారు. విజయ్ రికార్డు... ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తీయడం ద్వారా విజయ్ కుమార్ రంజీల్లో ఆంధ్ర తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. కెరీర్లో 71వ రంజీ మ్యాచ్ ఆడుతున్న విజయ్ 243 వికెట్లు తీశాడు. షాబుద్దీన్ (75 మ్యాచ్‌ల్లో 242 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును విజయ్ బద్దలు కొట్టాడు. -
అదరగొట్టిన ఆంధ్ర
సాక్షి, ఒంగోలు టౌన్: సొంత మైదానంలో ఆంధ్ర జట్టు సత్తా చాటింది. శుక్రవారం ముగిసిన గ్రూప్–‘ఎ’ రంజీ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన ఆంధ్ర 9 వికెట్ల తేడాతో ఏడు సార్లు రంజీ చాంపియన్ అయిన ఢిల్లీని చిత్తు చేసింది. ఆంధ్ర బౌలర్లు శశికాంత్ (5/41), స్టీఫెన్ (5/91) చెలరేగడంతో ఢిల్లీ తన రెండో ఇన్నింగ్స్‌లో 72.2 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది 16 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 2.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి 20 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ జ్ఞానేశ్వర్ (0) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా... సారథి హనుమ విహారి (4) త్వరగా అవుట్ అయ్యాడు. మనీశ్ (15 నాటౌట్; 3 ఫోర్లు), ప్రశాంత్ కుమార్ (1 నాటౌట్) లాంఛనం పూర్తి చేశారు. ఓవర్‌నైట్ స్కోరు 89/6తో చివరి రోజు ఆటను కొనసాగించిన ఢిల్లీని లలిత్ యాదవ్ (145 బంతుల్లో 55; 11 ఫోర్లు), వికాశ్ మిశ్రా (151 బంతుల్లో 36; 5 ఫోర్లు) ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరు ఏడో వికెట్‌కు 61 పరుగులు జోడించి ఢిల్లీకి ఇన్నింగ్స్ పరాభవాన్ని తప్పించారు. అర్ధ శతకంతో నిలకడగా ఆడుతున్న లలిత్ యాదవ్‌ను శశికాంత్ పెవిలియన్‌కు పంపగా... వికాశ్ మిశ్రాను స్టీఫెన్ వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాడు. తర్వాత ఢిల్లీ ఇన్నింగ్స్‌కు తెరపడటానికి ఎంతో సేపు పట్టలేదు. ఈ విజయంతో ఆంధ్ర ఖాతాలో 4 పాయింట్లు చేరాయి. -
అదరగొట్టిన అక్షత్ రెడ్డి
తిరునల్వేలి: హైదరాబాద్ ఓపెనర్ ప్రొద్దుటూరి అక్షత్ రెడ్డి రంజీ మ్యాచ్‌లో రెండో రోజు కూడా తన జోరు కొనసాగించాడు. తమిళనాడుతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో అక్షత్ (477 బంతుల్లో 248 బ్యాటింగ్; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. అతని కెరీర్లో ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. ఫలితంగా రెండో రోజు మంగళవారం ఆట ముగిసేసరికి హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 523 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అక్షత్‌కు అండగా నిలిచిన బావనక సందీప్ (221 బంతుల్లో 130; 15 ఫోర్లు, 1 సిక్స్) కూడా శతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం అక్షత్‌తో పాటు సీవీ మిలింద్ (9 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. తమిళనాడు బౌలర్లలో విఘ్నేశ్, మొహమ్మద్, రాహిల్ షా తలా 2 వికెట్లు పడగొట్టారు. ఓవర్‌నైట్ స్కోరు 249/3తో ఆట కొనసాగించిన హైదరాబాద్‌ను తమిళనాడు బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ఈ క్రమంలో ముందుగా 174 బంతుల్లో సందీప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 316 బంతుల్లో అక్షత్ 150 పరుగుల మైలురాయిని దాటాడు. చివరకు లంచ్‌కు ముందు సందీప్‌ను మొహమ్మద్ ఔట్ చేయడంతో 246 పరుగులు భారీ భాగస్వామ్యానికి తెర పడింది. కొల్లా సుమంత్ (5), ఆకాశ్ భండారి (17) తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగారు. అయితే సాకేత్ సాయిరామ్ (42) కెప్టెన్‌కు సహకరించాడు. టీ విరామ సమయానికి 199 పరుగుల వద్ద ఉన్న అక్షత్... చివరి సెషన్ ఆరంభం కాగానే ఫోర్ కొట్టి 413 బంతుల్లో డబుల్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. అక్షత్, సాయిరామ్ ఏడో వికెట్‌కు 109 పరుగులు జత చేశారు. రెండు రోజుల ఆట తర్వాత కూడా హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయలేదు. కాబట్టి ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశాలే ఎక్కువ. -
వ్యక్తిగత కారణాలతోనే...
► ఆంధ్రకు మారానన్న విహారి ► హైదరాబాద్ జట్టుకు గుడ్‌బై సాక్షి, హైదరాబాద్: రంజీ క్రికెట్లో అడుగు పెట్టిననాటి నుంచి హైదరాబాద్ తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచిన గాదె హనుమ విహారి ఆంధ్రకు మారుతున్నట్లు ప్రకటించాడు. వచ్చే సీజన్ నుంచి తాను ఆంధ్ర జట్టు తరఫునే బరిలోకి దిగుతానని వెల్లడించాడు. ఈ నెల 25 నుంచి జరగనున్న ఏసీఏ సెలక్షన్స్ టోర్నీలో ఆడనున్నట్లు అతను చెప్పాడు. ‘నేను పుట్టింది కాకినాడలోనే. కుటుంబ కారణాలతో మేమంతా అక్కడికి వెళ్లిపోతున్నాం. ఇలాంటి సమయంలో జట్టు మారడం కూడా తప్పనిసరి అనిపించింది. అందుకే హైదరాబాద్‌ను వదలాలని నిర్ణయించుకున్నా. అక్కడ కూడా మెరుగ్గా రాణిస్తాననే నమ్మకం ఉంది’ అని విహారి అన్నాడు. క్రికెట్లో ప్రాధమిక శిక్షణ నుంచి రంజీ జట్టు కెప్టెన్‌గా ఎదిగే వరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తనకు ఎన్నో అవకాశాలిచ్చిందని, హెచ్‌సీతో విభేదాల కారణంగా జట్టు మారుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అతను స్పష్టం చేశాడు. హెచ్‌సీఏ కార్యదర్శి జాన్ మనోజ్‌తో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతను పేర్కొన్నాడు. హైదరాబాద్, సౌత్‌జోన్ జట్ల తరఫున కలిపి ఆరు సీజన్లలో 40 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన విహారి 55.74 సగటుతో 3066 పరుగులు చేశాడు. 30 వన్డేల్లో 955 పరుగులు చేసిన అతను.. 52 టి20ల్లో 106.93 స్ట్రైక్‌రేట్‌తో 925 పరుగులు సాధించాడు. -
కష్టపడితేనే విజయం
మా అమ్మ ఇంటింటికి వెళ్లి కూరగాయలు అమ్మేది. ఆ డబ్బులో రోజూ రూ.10 ఇచ్చేది. టికెట్ కొంటే డబ్బు అయిపోతుందని ఇసుక ట్రాక్టర్ల వారిని బతిమాలి కడపకు వెళ్లేవాడిని. కొద్దిసేపు జాగింగ్, మరికొద్దిసేపు నడకతో స్టేడియం చేరుకునేవాడిని. అలా కఠోర శ్రమ చేసి 2004లో అండర్-22 జట్టుకు ఎంపికయ్యా. ఆ తరువాత రంజీతో పాటు ఐపీఎల్ పోటీలలో పాల్గొన్నా. -నందలూరులో శిక్షణ పొందుతున్న క్రీడాకారులతో క్రికెటర్ పైడికాల్వ విజయకుమార్ అన్న మాటలు ఇవి. నందలూరు, న్యూస్‌లైన్ :తపన ఉంటే ఏరంగంలోనైనా రాణించవచ్చని క్రీడాకారుడు పైడికాల్వ విజయ్‌కుమార్ అన్నారు. కూలిపనులు చేసుకునే తాను క్రమశిక్షణతో, పట్టుదలతో కష్టపడి రంజీ క్రికెట్లో స్థానం సంపాదించానని తెలిపారు. నందలూరులోని రైల్వే టెన్నిస్ కోర్టులో శుక్రవారం క్రికెట్ శిక్షణ పొందుతున్న వారికి ఆయన క్రికెట్లో మెలకువలు, సూచనలు , సలహాలు ఇచ్చారు. మొదటగా తనగూర్చి క్రీడాకారులకు పరిచయం చేసుకుంటూ తన తల్లి ఇంటింటికి వెళ్లి కూరగాయలు అమ్మేదని.. అందులో వచ్చిన డబ్బులో రోజుకు 10 రూపాయలు ఇచ్చేదన్నారు. ఆ డబ్బుతో టికెట్‌కొని కడపకు వెళితే డబ్బు అయిపోతుందని.. తమ గ్రామంనుంచి కడపకు వెళ్లే ఇసుకట్రాక్టర్ వద్దకు వె ళ్లి వారిని బతిమాలి ఆట్రాక్టర్లో కడపలోని బిల్టప్ వద్ద దిగి, అక్కడినుంచి కొద్దిసేపు జాగింగ్ మరికొద్దిసేపు నడక ద్వారా స్టేడియంకు చేరుకునేవాన్నని తెలిపారు. అలా ప్రతిరోజూ కఠోర శ్రమ, సాధన వల్ల 2004 సంవత్సరంలో అండర్ 22కి కడప జట్టుకు ఎంపికయ్యానన్నారు. ఆ తరువాత 2006 లో బరోడాలో జరిగే రంజీ క్రికెట్ పోటీలకు ఆడానని.. 2008 మొదటి ఐపీఎల్ లో తన ప్రతిభ చాటానని పేర్కొన్నారు. నేటికీ రంజీలో రాణిస్తున్నాని తెలిపారు. ఈ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నిబద్ధత గురించి ఆయన వివరించారు. సమయం దొరికితే నందలూరుకు వచ్చి క్రీడాకారులకు శిక్షణ ఇస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సీనియర్ క్రికెటర్ జవహార్ బాష, ట్రైనర్ ఫైరోజ్ఖాన్లోడి, గౌస్‌మొహిద్దీన్, అబుబకర్ తదితరులు విజయ్‌కుమార్‌ను ఘనంగా సత్కరించారు.