Ranker
-
భర్త, అత్త వేధింపులను తట్టుకుని.. ‘శివాంగి గోయల్’ సక్సెస్ స్టోరి
న్యూఢిల్లీ: కట్నం వేధింపులతో అత్తింటి నుంచి పుట్టింటికి చేరుకున్న ఆమె తన కల సాకారం చేసుకోవడమే కాక గృహహింస బాధితురాళ్లకు ఆదర్శంగా నిలిచారు. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాకు చెందిన శివాంగి గోయల్ తాజాగా వెలువడిన యూపీఎస్సీ ఫలితాల్లో ఆలిండియా 177వ ర్యాంకు సాధించారు. ఆమెకు పెళ్లై, ఏడేళ్ల వయసు కుమార్తె ఉంది. భర్త, అత్తింటి వారు కట్నం కోసం పెడుతున్న వేధింపులతో విసిగి పుట్టింటికి చేరుకున్నారు. ప్రస్తుతం విడాకుల కేసు నడుస్తోంది. ‘‘నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి అంటూ నాన్న అభయహస్తమిచ్చారు. యూపీఎస్సీకి మరోసారి ఎందుకు సిద్ధం కాకూడదని అప్పుడే ఆలోచించా’’ అని శివాంగి చెప్పారు. ‘‘స్కూల్లో చదివే రోజుల్లోనే యూపీఎస్సీకి ప్రిపేర్ కావాలంటూ ప్రిన్సిపాల్ సలహా ఇచ్చారు. అప్పటి నుంచే ఐఏఎస్ కావాలని కలలుగనేదాన్ని. అదే నా లక్ష్యంగా ఉండేది’’ అని అన్నారు. ‘‘రెండుసార్లు యూపీఎస్సీ పరీక్ష రాశాక పెళ్లయింది. అత్తింటి వారి వేధింపులతో కూతురితో పుట్టింటికి వచ్చేశా’’ అని అన్నారు. ‘‘చిన్ననాటి కల నిజం చేసుకోవాలనే పట్టుదలతో ఎన్ని అవాంతరాలున్నా ప్రిపరేషన్‌పైనే దృష్టిపెట్టా. సోషియాలజీ సబ్జెక్టుగా సొంతంగా చదువుకుని పరీక్షకు ప్రిపేరయ్యా. అనుకున్నది సాధించా’’ అన్నారు. ‘‘నా తల్లిదండ్రులు, కుమార్తె రైనా సహకారం వల్లే ఈ విజయం సాధ్యమైంది. నేటి మహిళలు అత్తింట్లో జరగరానిది జరిగితే, భయపడకూడదు. ధైర్యంగా నిలబడి సొంత కాళ్లపై నిలబడాలి. ఇదే వారికి నేనిచ్చే సలహా. కావాలనుకుంటే ఏదైనా చేయగలరు. కష్టపడి చదువుకుంటే ఐఏఎస్ కూడా అసాధ్యమేమీ కాదు’’ అన్నారామె. శివాంగి తండ్రి రాజేశ్ గోయెల్ వ్యాపారి కాగా, తల్లి సామాన్య గృహిణి. -
సైకిల్‌పై దుస్తులమ్ముకునే వ్యక్తి కుమారుడు..
పట్నా(బిహార్): యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో బిహార్‌లోని కిషన్ గంజ్ జిల్లా నిరుపేద కుటుంబానికి చెందిన అనిల్ బొసక్ తన మూడో ప్రయత్నంలో 45వ ర్యాంక్ సాధించారు. ఆయన ఢిల్లీ ఐఐటీ 2018 బ్యాచ్ విద్యార్థి. అనిల్ తండ్రి వినోద్ సైకిల్‌పై గ్రామాల్లో తిరుగుతూ దుస్తులు అమ్ముతుంటారు. ప్రతిష్టాత్మక యూపీఎస్సీ ఫలితాల్లో అనిల్ జాతీయ స్థాయి ర్యాంకు సాధించడంతో ఆ కుటుంబం పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. తండ్రి వినోద్ కుమారుడి సక్సెస్‌పై స్పందిస్తూ.. ‘ఐఐటీకి అనిల్ ఎంపికైనప్పుడు చాలా సంతోషపడ్డాం. యూపీఎస్సీ ప్రిపరేషన్లో అతని టీచర్ చాలా సాయం చేశారు. కష్టసాధ్యమైన యూపీఎస్సీకి అనిల్ బోసక్ ఎంపిక కావడం కలగా ఉంది. ఐఐటీ తర్వాత అనిల్ ఉద్యోగంలో చేరతాడని అనుకున్నాను. తను.. యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధం అవుతానని చెప్పాడు. మా అబ్బాయికి ఉపాధ్యాయులు కూడా ఎంతో చేయుతనందించారు. తొలుత కష్టతరమని భావించిన అనిల్ పడుతున్న కష్టం చూసి నా వంతుగా నేను కూడా.. సహాకారం అందించాను. ఇప్పుడు నా కొడుకు విజయంచూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. గతేడాది యూపీఎస్సీ పరీక్షలో 616 ర్యాంకు సాధించిన అనిల్ ఈసారి మరింత కష్టపడి 45వ ర్యాంక్ సాధించి తన కలను సాకారం చేసుకున్నాడని వినోద్ ఆనందం వ్యక్తం చేశాడు. చదవండి: మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల సంఖ్య పెరగాలి -
ఊరంతా తీపి
రవంత పిల్ల ర్యాంకర్ అయింది! ఆ సైకిల్ మీద వెళ్లొచ్చే అమ్మాయేనా! మన పురుషోత్తం కూతురు కదా. ప్రెస్సోళ్లు కూడా వచ్చిపోతున్నారు. ఊరికి ఎప్పుడూ ఇంత పేరు లేదు. ఊళ్లోవాళ్లంతా కూడలికి చేరారు. ఊరి నోరంతా తీపి చేశారు. ఒక తునక రోష్నీ నోటికీ అందించారు. మధ్యప్రదేశ్, భింద్ జిల్లాలోని అజ్నోల్ గ్రామంలో అంతా కలిపి 1200 మంది వరకు ఉంటారు. శనివారం సాయంత్రం ఆ ఊరికి ఉన్న ఒకే ఒక కూడలిలో గ్రామస్థులలోని కొందరు.. పనుల మధ్యలో తమ దుకాణాల బయటికి వచ్చి, ఒక కుర్రాడి చేతిలో ఉన్న స్వీట్ బాక్సులోని తమ వంతు లడ్డూలు తీసుకున్నారు. అందరికి కన్నా ఎక్కువ లడ్డూలు తిన్నది రోష్నీ. తీసుకున్న లడ్డూలోంచి ప్రతి ఒక్కరూ చిన్న తునక తీసి మొదట రోష్నీకి పెట్టి తర్వాత తాము తిన్నారు మరి. ఆమె ఇక చాలంటున్నా, గ్రామానికి ఆమె సాధించిన పెట్టిన గొప్ప ప్రతిష్టను వారంతా దాదాపు ఒక ఉత్సవంగా జరుపుకున్నారు. ఆ మధ్యాహ్నమే వచ్చిన టెన్త్ ఫలితాలలో 98.5 శాతం మార్కులు సంపాదించి, స్టేట్‌లోనే 8 వ ర్యాంకులో నిలబడింది రోష్నీ. ఆమె నిలబడటం కాదు. ఊరిని నిలబెట్టింది. అజ్నోల్లోనే కాదు, భింద్ జిల్లాలో కూడా ఏ ఆడపిల్లా ఇప్పటి వరకు ఇంతటి ఘనతను స్కూల్ నుంచి మోసుకురాలేదు. రోష్నీకి మేథ్స్‌లో, సైన్స్‌లో వందకు వంద మార్కులు వచ్చాయి! స్వీట్లు పంచిన కుర్రాడు రోష్నీ అన్న. ఇంటర్ చదువుతున్నాడు. పక్కనే రోష్నీ తమ్ముడూ ఉన్నాడు. అతడు నాలుగో తరగతి. గ్రామస్థులంతా మెచ్చుకుంటూ ఉంటే తమ ముగ్గురు పిల్లల్ని చూసుకుని మురిసిపోయారు రోష్నీ తండ్రి పురుషోత్తం, తల్లి సరితాదేవి. నిజానికిది భింద్ జిల్లా మొత్తం మురిసిపోవలసిన సందర్భం. ఆ జిల్లాలో ఒక్కేడాదైనా ‘బాలికలే ముందంజ’ అనే మాట వినిపించలేదు. జనాభా నిష్పత్తిలోనూ ఆడవాళ్లు తక్కువ ఉన్న జిల్లా భింద్. 2011 లెక్కల ప్రకారం బాలురు వెయ్యిమంది ఉంటే బాలికలు 837 మందే ఉన్నారు. మహిళల్లో అక్షరాస్యత 64 శాతం మాత్రమే. రోష్ని తల్లి సరితాదేవి ఇంటర్ వరకు చదివారు. ఆమె చదువుకునే రోజుల్లోనైతే ఈ శాతం 55 మాత్రమే. ఆడపిల్లలు మధ్యలోనే బడి మానవలసిన పరిస్థితులు అత్యధికంగా ఉన్న భింద్ జిల్లాలో రోష్నీ విజయం ఇక ముందు స్ఫూర్తిగా పనిచేయవచ్చు. అయితే రోష్నీని మరొకందుకు కూడా.. ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం కూడా ప్రేరణగా తీసుకోవాలి. ఆ అమ్మాయి చదువు అంత తేలిగ్గా ఏమీ సాగలేదు. రోష్నీ వాళ్లండే అజ్నోల్ గ్రామం నుంచి ఆమె స్కూల్ ఉన్న మెగావ్ గ్రామం 12 కి.మీ.లు. రానూపోను 24 కి.మీ. రోజూ సైకిల్ మీద స్కూల్‌కి వెళ్లొచ్చేది. ఎర్రటి ఎండల్లో, ఎడతెరిపి లేని వానల్లో కూడా ఏ రోజూ రోష్నీ స్కూలు మానలేదు. వరదల్లో దారి మూసుకుపోయినప్పుడు మోగావ్లోని చుట్టాల ఇంట్లో ఉండి స్కూలుకు వెళ్లొచ్చింది. ఇంటికి రాకుండా మెగావ్లోనే ఉండిపోయిన రోజులూ ఉన్నాయి. గ్రామాల్లో ఇది మామూలే అయినా.. ఎండకు, వానకు, గడువు తేదీలోపు ఫీజు కట్టలేని పరిస్థితులకు, స్కూలుకు వెళ్లలేని శారీరక అననుకూలతలకు చదువును వదిలేయకపోవడం మామూలు సంగతైతే కాదు. రాక్షసిలా చదువును పట్టేసుకుంది రోష్నీ. ఆ రాక్షసి ఇప్పుడు రోష్నీని పట్టేసుకుంది. ఐ.ఎ.ఎస్. చదువుతాను అంటోంది రోష్నీ. కలెక్టర్ అవాలని తను చిన్నప్పుడే నిర్ణయించుకుంది. ఎవరో చెప్పారట.. కలెక్టర్ అయితే పేద వాళ్లందరికీ మంచి చెయ్యొచ్చని. ఇంటర్లో మేథ్స్ తీసుకోబోతోంది. మెగావ్లో కాలేజ్ కూడా ఉంది. రోష్నీని రోజూ మేమే కాలేజ్ దగ్గర దింపి వస్తాం అని బంధువులు ఇప్పటినుంచే పోటీలు పడి మాట ఇస్తున్నారు. రోష్నీ తండ్రి రైతు. నాలుగెకరాల పొలం ఉంది. పొలంతోనే కుటుంబ పోషణ. రోష్నీకి ర్యాంకు రావడంతో ఆయనకు పట్టలేనంత సంతోషంగా ఉంది. ఊరి మొత్తం మీద ఇప్పుడాయన ప్రయోజకుడైన తండ్రి! ‘‘నా ముగ్గురు పిల్లల చదువుల గురించి గర్వంగా చెప్పుకోగలను. రోష్నీ ఇప్పుడు ఊరికే గర్వ కారణం అయింది’’ అంటున్నారు ఆయన. ‘‘నా కూతురు పెద్ద డిగ్రీలు చదవాలి. పెద్ద కంపెనీల్లో పని చేయాలి. పెద్ద నగరాలలో తిరగాలి’’ అని కూడా. -
కసి ఉంటే కష్టమేం కాదు
- ఇంగ్లిషు నేర్చుకోండి...మోజును తగ్గించుకోండి - తెలుగుకే పరిమితమైతే అవకాశాలు రావనేది అపోహ - సివిల్స్ రాసే విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలన్నదే ఆకాంక్ష - అందుకే విద్యార్థులను కలుసుకుంటున్నా... - తెలుగు అకాడమీ అనువాదాలు విసృ్తతంగా చేపట్టాలి – ‘సాక్షి’తో... సివిల్స్‌లో అఖిల భారత స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాల కృష్ణ రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం: సివిల్స్‌లో అఖిల భారత స్థాయిలో మూడో ర్యాంకు సాధించడం జీవితంలో మరచిపోలేని రోజని రోణంకి గోపాలకృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం సివిల్స్ రాస్తున్న విద్యార్థులను కలిసి సలహాలు, సూచనలిస్తూ వారిలో స్ఫూర్తిని రగిలించి ఏపీ నుంచి మరింతమంది సివిల్ ర్యాంకులను చూడాలన్నదే నా ఆకాంక్షని అన్నారు. అందుకే తనకున్న ఖాళీ సమయంలో ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి విద్యార్థులను కలుసుకుంటున్నానని పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరానికి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ... . సాక్షి: సివిల్స్ రాయాలంటే ఆర్థికబలం ఉండాలా? గోపాలకృష్ణ: ఆర్థికంగా కొంతైనా నిలదొక్కుకోవాలి. సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేయడం వల్ల శిక్షణకు, ఇతరత్రా మెటీరియల్, పుస్తుకాల కొనుగోలుకు ఆర్థిక ఇబ్బందులేమీ ఎదుర్కోలేదు. సాక్షి: కోచింగ్ సెంటర్లు మీ ఫొటోలతో ప్రచారం చేసుకుంటున్నాయని, దీనిపై మీ స్పందన? గోపాల కృష్ణ: నేనైతే ప్రత్యేకంగా ఏ శిక్షణా సంస్థలో కోచింగ్ తీసుకోలేదు. అయితే అన్ని కోచింగ్ సెంటర్లు నిర్వహించే మాక్ టర్వ్యూకు, మ్యూనికేషన్స్కు మాత్రమే హాజరయ్యాను. ఇక వారు నా ఫొటోను వాడుకుంటే అది వారి విచక్షణకే వదిలేస్తున్నాను. సాక్షి: సివిల్స్ తెలుగు మాధ్యంలో రాస్తే లక్ష్యాన్ని సాధించవచ్చా? గోపాలకృష్ణ: అందుకు నేనే ఉదాహరణ. ప్రిలిమనరీ, మెయిన్స్, ఇంటర్వ్యూలో ఎలా నెగ్గుకు రాగలిగాను. మూడో ర్యాంకు ఎలా సాధింగలిగాను. భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. సాక్షి: తెలుగు మాధ్యంలో మెటీరియల్ లభ్యం కావడం కష్టమంటారే? గోపాలకృష్ణ: నిజమే. ఇంగ్లిషు మెటీరియల్‌ను సంపాదించి తెలుగులో తర్జుమా చేసుకుని అధ్యయనం చేశాను. సాక్షి: మీరిచ్చే సూచనలేమిటి...? గోపాలకృష్ణ: మనకు ప్రత్యేకంగా తెలుగు అకాడమీ ఉంది. వీరు చేయాల్సింది ఎంతో ఉంది. సివిల్ సర్వీసుకు సంబంధించిన ఎథిక్స్, ఎకనామిక్స్, ఆప్టిట్యూడ్, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర పుస్తకాలు ఇంగ్లిషులో ఉన్నాయి. వీటిని తెలుగులో అనువదించేందుకు చర్యలు తీసుకోవాలి. ఆ పని నేను చేయాలనుకుంటున్నాను. ఎంత వరకు సాధ్యపడుతుందో చూడాలి. సాక్షి: సివిల్స్ రాసేవారికి మీరిచ్చే సూచనలు? గోపాలకృష్ణ: సిలబస్ పట్ల కసితో కూడిన లక్ష్య నిర్దేశం ఉండాలి. పాత సివిల్ పరీక్షా పేపర్లను చదువుతూ ఉండాలి. వర్తమాన అంశాలపై బాగా అవగాహన ఉండాలి. సాక్షి: ప్రజలకు ఏవిధమైన సేవలందిస్తారు? గోపాలకృష్ణ: పేదప్రజలకు, అణగారిన వర్గాలకు సేవలందిస్తూ మంచిపేరు తెచ్చుకోవాలన్నది తన ఆకాంక్ష. సాక్షి: మీ స్వగ్రామంలో మీ కుటుంబాన్ని వెలి వేశారు, భూమిని కబ్జా చేశారన్నారు కదా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? గోపాలకృష్ణ: సివిల్స్ సాధించగానే గ్రామంలో సమస్యలన్నీ సమసిపోయాయి. అందరూ బాగానే ఉంటున్నాం. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతాం. -
నాన్న కోరిక, నా లక్ష్యం నెరవేరింది..
సివిల్ సర్వీస్‌లో 3వ ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ నన్నయ్య వర్సిటీ, లెనోరా దంత వైద్య కళాశాలలో ఘన సత్కారం ‘నీ జేబులో గ్రీనింకు పెన్ను ఉండాలిరా, నీ ద్వారా మనలాంటి పేదలెందరికో సేవలందాలిరా’ అన్న నాన్న మాటలే... సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణకు ప్రేరణ. నాన్న కోరికను లక్ష్యంగా చేసుకున్న అతడు 11 ఏళ్లపాటు కఠోరంగా శ్రమించాడు. కొంతమంది మిత్రులు, సహచరులు, బంధువులు నిరుత్సాహపరిచినా.. పేదరికం అడ్డంకిగా మారిన.. అతడి గురి లక్ష్యంపైనే ఉంది. ఇంతవరకూ తెలుగు రాష్ట్రంలోనే ఎవరూ సాధించలేని ఈ ర్యాంకును... తెలుగు మీడియంలో పరీక్ష రాసిన ఇతడు సాధించి కొత్త రికార్డును నెలకొల్పాడు. అందుకే తెలుగు ప్రజలు ఇతడికి నీరాజనాలు పడుతున్నారు. మంగళవారం రాజమహేంద్రవరం వచ్చిన ఇతడిపై విద్యార్థులతో సమానంగా అధ్యాపకులు, అచార్యులు కూడా ప్రేమాభిమానాలు కురిపించారు. వారి అభిమాన వర్షానికి తడిచి ముద్దైన గోపాలకృష్ణ వారందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. రాజానగరం : ‘తెలుగు మీడియంలో చదువుకున్నా, పేదరికం అడ్డంకిగా ఉన్నా.. నాన్న కోరికను తీర్చడంతోపాటు నా లక్ష్యాన్ని కూడా సాధించాలనే తపనతో 11 సంవత్సరాలపాటు కఠోరంగా శ్రమించాను’ అంటూ... అంటూ సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణ చేసిన ప్రసంగం అటు విద్యార్థులను ఇటు అధ్యాపకులు, ఆచార్యులను మంత్రముగ్ధులను చేసింది. నగరానికి వచ్చిన మంగళవారం అతడిని ఆదికవి నన్నయ యూనివర్సిటీ, రాజానగరంలోని కేఎల్ఆర్ లెనోరా దంతవైద్య కళాశాలలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రోణంకి మాట్లాడుతూ లక్ష్యసాధనకు కష్టపడుతుంటే కొంతమంది మిత్రులు, సహచరులు, బంధువులు కాస్త నిరుత్సాహపరిచినా వెనుకంజవేయలేదన్నారు. అప్పటికే చేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగం ఆత్మస్ధైర్యాన్నిచ్చిందన్నారు. ఇంత ర్యాంకు సాధించడంలో ఎదురైన కష్టాలు, ఇబ్బందులు, లక్ష్యాన్ని సాధించేందుకు చేసిన కృషిని వివరించారు. ప్రభుత్వ బడులలోనే ఉన్నత విద్య సాగిందని, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంటర్ తరువాత టీటీసీ చేసి డీఎస్సీ రాయడంతో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చిందన్నారు. అయితే సివిల్స్ కోసం డిగ్రీ ప్రైవేటుగా చదివానన్నారు. ఇలా 11 ఏళ్లు కఠోర శ్రమతో మూడుసార్లు విఫలమై..నాలుగో ప్రయత్నంలో ఈ ర్యాంకు సాధించినట్టు చెప్పారు. ఇంతవరకూ పడిన కష్టమే రేపు మంచి పరిపాలనాధికారిగా తీర్చిదిద్దుతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పరీక్షకు ప్రివేర్ అయిన తీరు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్స్ పరీక్షకు ఏవిధంగా ప్రిపేర్ కావాలి, ఏ పేపర్లు ఉంటాయి, ఎన్ని మార్కులు సాధించాలనే విషయాలను కూలకషంగా వివరించారు. ఇంటర్య్వూతోపాటు 2,025 మార్కులకు 1,104 మార్కులే తనకు వచ్చాయన్నారు. తన ప్రసంగం వింటున్న విద్యార్థులలో కనీసం ఒకరిద్దరైనా సివిల్స్ లక్ష్యం వస్తే ఇక్కడకు వచ్చినందుకు ఫలితం ఉంటుందన్నారు. ఇంగ్లిష్‌లో చదువుకున్న వారే విజయం సాధిస్తారనే భావాన్ని విడనాడాలని, భాష ఏదైనా భావం ఉండాలనే వాస్తవాన్ని గ్రహించాలన్నారు. ఈ సందర్భంగా దంత వైద్య కళాశాలలో విద్యాభ్యాసంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ఆయన అందజేశారు. నాడు బుర్రా, నేడు రోణంకి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సివిల్ సర్వీసులో 1993లో బుర్రా వెంకటేష్ 12వ ర్యాంకును సాధిస్తే నేడు రోణంకి గోపాలకృష్ణ మూడో ర్యాంకును పొందారని నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. ఈ నేపథ్యంలో, భవిష్యత్తులో మొదటి ర్యాంకును సాధించేవారెవ్వరని విద్యార్థులను ప్రశ్నించారు. తెలుగులో మాట్లాడటమే నామోషీ అనుకునే ఈ రోజుల్లో తెలుగులో పరీక్ష రాసి ఈ ర్యాంకును పొందడం సా«ధారణ విషయం కాదన్నారు. సాధారణ కుటుంబం నుండి వచ్చినవాడు కావడం మరీ విశేషమన్నారు. కేఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాల కార్యదర్శి వై.మధుసూదనరెడ్డి మట్లాడుతూ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం లోపం ఉండకూడదన్న విషయాన్ని గోపాలకృష్ణ నిరూపించారన్నారు. ఘన సత్కారం అనంతరం గోపాలకృష్ణను కళాశాల యాజమాన్యం గజమాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసింది. నన్నయ యూనివర్సిటీలో ఉపకులపతి ఆచార్య ముత్యాలునాయుడు ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు కూడా ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో నన్నయ అధ్యాపక బృందం ఆచార్య ఎస్.టేకి, ఆచార్య మట్టారెడ్డి, ఆచార్య పి.సురేష్‌వర్మ, డాక్టర్ కె.సుబ్బారావు, డాక్టర్ టి.సత్యనారాయణ, డాక్టర్ ఆలీషాబాబు, ఈసీ మెంబర్ విజయనిర్మల, డీఎస్పీ రమేష్‌బాబు, సింగపూర్ సిటీ బ్యాంకు ఉపాధ్యక్షులు అనుమోలు సారథి, దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విశ్వప్రకాష్రెడి, వైస్ ప్రిన్సిపాల్ ధల్‌సింగ్, డైరెక్టర్లు లక్ష్మణరావు, నాగార్జనరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మెడిసిన్ ర్యాంకర్‌కు సన్మానం
కోదాడఅర్బన్: ఎంసెట్–3 మెడిసిన్ విభాగంలో 252 ర్యాంకు సాధించిన పట్టణానికి చెందిన వెంపటి సత్యనారాయణ కుమార్తె గాయత్రిని శుక్రవారం కోదాడ వాసవీవనితాక్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ర్యాంక్ సాధించేందుకు గాయత్రి చేసిన కృషిని వారు ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ డిస్ట్రిక్ గవర్నర్ పబ్బా గీత, క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు బొగ్గారపు రేఖారాణి, యాదా రాణి, క్రాంతికుమారి, శ్రీదేవి, గీత, రాధిక, సుశీల, ఉమ, అనురాధ, నళినిశ్రీ, మణి, శిరీష, నాగమణి, పందిరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.